ఎవరయినా పెద్ద ఆర్టిస్ట్ చనిపోగానే తెల్లారి కాగితపు పేపర్లకు కార్టూనిస్టులు వేసే బొమ్మలలో ఆ సదరు చిత్రకారుడు ఒక సంచి తగిలించుకుని మేఘాల మధ్య స్వర్గమో ఇంకే శ్రాద్ధమో అనే ఒక పిండాకూడు ద్వారం దగ్గరికి వెడుతుంటాడు కదా, అటువంటి బొమ్మలని చూసినపుడల్లా మాకిరువురికి ఎక్కడ కాలాలో అక్కడ కాలేది.

బోద్‌లేర్ అసాధారణకవి. అతడికి ఖ్యాతి అపఖ్యాతి కూడా అమితంగా లభించాయి. అపఖ్యాతిలో కొంత అతడు కోరి తెచ్చుకున్నదే. అతని అపఖ్యాతికి ప్రధానకారణం అతడి అద్భుత కవితా శిల్పాన్ని అర్థం చేసుకొనే ప్రయత్నం చేయకపోవడం వల్లనే. ఆ రచనా శిల్పాన్ని కొంతైనా ఆవిష్కరించే ప్రయత్నమే యీ వ్యాఖ్య.

మేరీ ఉల్‌స్టన్‌క్రాఫ్ట్ నవలల కంటే ముందు రాసిన నాలుగు గ్రంథాలూ స్త్రీల విద్యకు పెద్ద పీట వెయ్యడంతో పాటు, సామాజిక, రాజకీయ వ్యవస్థల్లో ఆధిపత్యాన్ని ప్రశ్నించేవే. వ్యక్తి స్వాతంత్ర్యాన్నీ, సమానత్వాన్నీ సమర్ధించేవే. ఒక్క ఫ్రెంచి విప్లవం నేపథ్యంగా ఆమె రాసిన మూడు రచనలూ పెద్ద ప్రకంపనలకు దారి తీశాయి.

ఈ కవర్ నా ముందు లేకపోతే అతను నా జీవితంలో ఉన్నాడని గుర్తులేనట్లు గడిపేదాన్ని. అది బావుండేది. ఆ కవర్ గుడారంలోకి తలదూర్చిన ఒంటెలా టేబుల్ మీద వెక్కిరిస్తుంది. వచ్చి వారమైంది. చిరాగ్గా ఉంది. ఏడేళ్ళ తరువాత రామలక్ష్మి రాసిన ఉత్తరం. ‘మధూ, నా పరిస్థితేమి బాగాలేదు. నీతో మాట్లాడాలి. ఇప్పుడు స్థిరంగా నమ్మగలిగే వ్యక్తులు ఎవరూ లేరిక్కడ. ఒక్కసారి రా.’

ఏ కళైతే మనిషిని తేలికపరుస్తుందనుకుంటామో అదే మళ్ళీ నెత్తిన బరువు కూడా మోపుతోంది. ఏ నీటివల్లయితే బురద అవుతున్నదో అదే నీటివల్ల అది శుభ్రమూ అవుతుందన్నాడు వేమన్న. దీనికి విరుద్ధంగా ఏ కళ అయితే శుభ్రం చేస్తుందనుకుంటున్నామో అదే కళ ఆ కళాకారుడిని మురికిలోకి కూడా జారుస్తోంది. మరి దీనికి ఉన్న మార్గం ఏమిటి?

యుద్ధం మొదలైన తొలి రోజుల్లో తన ప్రేమ కరీమ్‌తో యూనివర్సిటీలో ఎలా మొదలైందో నాకు గుర్తుంది. ఆ రోజుల్లో ఇబ్తిసామ్ ఎంతగా మారిపోయిందంటే, ఈ కొత్త పిల్ల అప్పుడే నా కళ్ళ ముందే పుట్టి పెరిగిందనిపించేది. ఆమె కళ్ళు, స్వరం, శరీరం పూర్తిగా స్త్రీత్వాన్ని సంతరించుకున్నాయి. నీలి రంగు జీన్స్ మీద, తెల్ల షర్టు, భుజాల మీదుగా వేలాడేసుకున్న నల్ల కార్డిగన్ వేసుకుని తిరిగే ఇబ్తిసామ్ నాకింకా కళ్ళ ముందే మెదులుతోంది.

కథ చదివేప్పుడు పాఠకుడికి ట్రెజర్ హంట్ లాంటి అనుభవం కలిగిస్తాడు రచయిత. కొన్ని క్లూలు అక్కడక్కడా ఉంటాయి. వాటిని వెతికి పట్టుకోవటం పాఠకుడి పని. పట్టుకున్నాక వాటితో కథను మళ్ళీ పునర్నిర్మించుకోవాల్సి వస్తుంది. కొందరికది ఇష్టమయితే మరికొందరికి కష్టం.

దప్పిగొన్నప్పటి ఫోటో వేళ్ళాడేస్కుని
దీనంగా ఆవులించినా
కంటి చివర్ల నుంచి చూస్తూ
పట్టాలని బెదిరించడం తప్ప
రైలేనాడేనా ఎక్కించుకుందా
నిన్ను దక్కించుకుందా!

వరరుచి అన్న పేరు నన్ను ఎప్పటి నుండో వెన్నాడుతోంది. ముఖ్యంగా పగటిపూట సూర్యుడున్నప్పుడు మననీడ ప్రమాణాన్ని బట్టి, రాత్రిపూట నడి నెత్తిన ఉన్న నక్షత్రాన్ని బట్టీ సమయాన్ని తెలుసుకుందుకు అతను కొన్ని గణితవాక్యాలు చెప్పాడని తెలుసుకున్న దగ్గరనుండీ ఈ వరరుచి మీద మరింత కుతూహలం కలిగింది.

ప్రతి మనిషీ
రెండు దుఃఖసంద్రాలమధ్య
ఒక నావికుడిగానో
ఒక యాత్రికుడిగానో
ఒక అన్వేషకుడిగానో సాగిపోవడం చూశాక
తేల్చుకున్నాను
దుఃఖమే పరమ సత్యమని.

సందర్భమేమైనా కానీ
ఇష్టమైన ద్రవమేదో ప్రతిబిందువూ త్రాగినట్టు
దానిని ఆస్వాదించినపుడు,
హాయినిచ్చే సంగీతం విన్నట్లు
శ్రద్ధగా దానిలోకి మునిగినపుడు,
ప్రియమైన వ్యక్తి స్పర్శలోకి నిన్ను కోల్పోయినట్లు
దానిలో ఊరట పొందినపుడు

వ్యాకరణ రచనల్లో సంజ్ఞ (వర్ణాక్షరాల, పదాల పరిచయం), సంధి తర్వాత చెప్పే అంశం ‘విభక్తి’, ‘విభక్తి’ నామాలకు సంబంధించింది. వాక్యాలలో అర్థం బోధపడేందుకై పదాల మధ్య సంబంధాన్ని తెలుపుతూ దోహదపడేవి విభక్తులు.

గాలి కొన్ని పొదలను
చిన్నగా కదిలిస్తుంది
కాసేపటికి అంతా సద్దుమణుగుతుంది
తలెత్తి పైకి ఎగసి
తనను తాను మర్చిపోతూ
నిలబడ్డ కెరటం
తన పనిలో మళ్ళీ నిమగ్నమవుతూ
తీరం వైపు పరుగులు తీస్తుంది

ఈలోపు ఘాజీయుద్దీనుగారు ఢిల్లీ దర్బారు చక్రవర్తిగారి వజీరు మొదలయినవారి వలన దక్కనుసుబేదారీకి తానొక అధికారపత్రమును సంపాదించి తరలివచ్చుచున్నారని వార్తయొకటి వ్యాపించెను. అంతట సలాబతుజంగుగారు గోలకొండనుండి తక్షణమే బయలుదేరి ఔరంగాబాదు నగరమునకు పోయి అక్కడనుండుటకు నిశ్చయించిరి.

ప్రతి వృత్తమునకు ఒక విలోమ వృత్తము గలదు. అవి రెండు ఆ ఛందపు సంపూర్ణత్వమును సూచిస్తాయి. సంస్కృతములో పద్యపు పాదము గుర్వంతము. కాని ద్రావిడ భాషలలో దేశి ఛందస్సులో పాదములు ఎక్కువగా లఘ్వంతములు. ఇది విలోమ గీతులలో ప్రస్ఫుటము.

మనకు వాస్తవంలో వీలుకాని విషయాలు కాల్పనిక జగత్తులో సాధ్యపడతాయి. సత్యానికీ, సౌందర్యానికీ మధ్య ఎంపిక తలెత్తినప్పుడు కవి మరో ఆలోచన లేకుండా సత్యాన్ని త్యజించి సౌందర్యం వైపు మొగ్గు చూపుతాడు. విషాదాన్నీ గతపు చేదునీ మనిషి తన జ్ఞాపకాల్లోంచి చెరిపెయ్యడానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటాడు.

విప్పారిన కళ్ళతో, వికసించిన మనసుతో, శ్రుతి అయిన సర్వాంగాలతో అడవిని తమలోకి ఆవాహన చేసుకొని కాలపు ప్రమేయమూ స్పృహా లేకుండా ఏనాడో వదిలివచ్చిన మనల్ని మనం వెదుక్కుంటూ, తిరిగి ఆవిష్కరించుకొంటూ తిరుగాడే వ్యక్తులు అత్యంత అరుదు.

క్రితం సంచికలోని గడినుడి-54కి మొదటి ఇరవై రోజుల్లో పదిహేను మంది దగ్గరినుండి సరైన సమాధానాలు వచ్చాయి. విజేతలకందరికీ మా అభినందనలు.

గడి నుడి-54 సమాధానాలు.

జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.