రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

డయాస్పోరా రచనలకి ఆహ్వానం

రచన: వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా
ఏప్రిల్ 2021

వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా & నెచ్చెలి అంతర్జాల వనితా మాసపత్రిక సంయుక్త ఆధ్వర్యంలో డయాస్పోరా తెలుగు కథ-మొదటి సంకలనం & డయాస్పోరా తెలుగు కవిత-మొదటి సంకలనం-రచనలకి ఆహ్వానం!

మిత్రులారా,

భారతదేశం నుంచి ఉత్తర అమెరికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సింగపూర్, దక్షిణ ఆఫ్రికా, సౌదీ అరేబియా, యునైటెడ్ ఆరబ్ ఎమిరేట్స్ మొదలైన అనేక పరాయి దేశాలకి వెళ్ళి, స్థిరపడిన తెలుగువారిలో మంచి రచయిత(త్రు)లు చెప్పుకోదగ్గ సాహిత్య సృష్టి చేస్తున్నారు. అటువంటి వారి కృషిని గుర్తిస్తూ, గౌరవిస్తూ ఆయా దేశాల డయాస్పోరా కథా సంకలనం, కవితా సంకలనం ప్రచురిద్దామని వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా & నెచ్చెలి అంతర్జాల మాసపత్రిక వారు సంకల్పించారు. ఈ సంవత్సరం, అంటే 2021లో విడుదల కానున్న “డయాస్పోరా తెలుగు కథ-మొదటి సంకలనం”, “డయాస్పోరా తెలుగు కవిత-మొదటి సంకలనం” అనే ఈ రెండు గ్రంథాలలోనూ ప్రచురణకి విదేశాల రచయితల కథలూ, కవితలూ ఆహ్వానిస్తున్నాం.

భారతదేశం ఎల్లలు దాటి విదేశాలలో నివసిస్తున్న లేదా ఇదివరలో నివసించిన రచయిత(త్రు)లకి మా విన్నపం, సూచనలు, నిబంధనలు.

1. భారతదేశానికి వెలుపల నివసించే ప్రవాసాంధ్రులందరూ రచనలు పంపడానికి అర్హులే.

2. ఒక్కొక్కరు ఒక కథ, ఒక కవిత మాత్రమే పంపాలి.

3. రచన సొంతమని, మరి దేనికి అనువాదం, అనుసరణ కాదని హామీ పత్రం జతపరచాలి. హామీ పత్రంలో తమ ప్రస్తుత నివాసం పోస్టల్ చిరునామా (ఇంటి నెంబర్, వీధి పేరు, నగరం, దేశం) వివరాలు విధిగా పేర్కొనాలి.

4. రచనతోబాటూ ఒక ఫోటో, ఐదు-పది పంక్తులకి లోబడి క్లుప్తంగా తమ జీవిత వివరాలు పంపాలి.

5. నాస్టాల్జియా రచనలు…అంటే మాతృదేశ జ్ఞాపకాల మూస కథలూ, కవితలూ ఆమోదించబడవు.

6. రచనా వస్తువు నాస్టాల్జియా కాకుండా ఆయా దేశాల్లోని స్థానిక జీవితాల్ని, సంస్కృతుల్ని, సంప్రదాయాల్ని, సమస్యల్ని ప్రతిబింబించేదిగా ఉండాలి. స్థానికులు అంటే ఆ దేశ జాతీయులు కానీ, అక్కడ నివసిస్తున్న భారతీయులు, తెలుగు వారి సమాజం, ఇతర దేశాల నుంచి అక్కడకి వలస వచ్చినవారు… ఇలా ఆ దేశంలో నివసిస్తున్న వారు ఏ జాతికి చెందినవారు అయినా కావచ్చును.

6. రచన అప్రచురితం మాత్రమే కానవసరం లేదు. ఇదివరకు ప్రచురితమైనా స్వీకరించబడుతుంది. ప్రచురణ వివరాలు కథ/కవిత చివర తెలియబరచాలి. కొత్త రచనలు కూడా స్వాగతిస్తున్నాం.

7. రచనలు వర్డ్/గూగుల్ డాక్యుమెంటుగా యూనికోడ్‌లో మాత్రమే పంపాలి.

8. కథల నిడివి వర్డ్‌లో 10 పేజీలకు మించకుండా, కవితలు 30 లైన్లకు మించకుండా ఉండాలి.

9. రచనలు చేరవలసిన చివరి తేదీ: ఏప్రిల్ 30,2021.

10. ఎంపికైన రచనలు నెచ్చెలి అంతర్జాల మాసపత్రికలో ప్రత్యేకంగా ప్రచురింపబడతాయి.

11. ఈ ఏడు (2021) నిర్వహించబడే 12వ అమెరికా తెలుగు సాహితీ సదస్సులో ఈ రెండు గ్రంథాలూ ఆవిష్కరించబడతాయి. వివరాలు త్వరలోనే తెలియజేస్తాం.

12. ఎంపిక అయిన రచనలలో అన్నింటికీ కాని, కొన్నింటికి కాని సముచితమైన పారితోషికం ఆయా దేశాల నగదులో బహూకరించబడుతుంది.

13. ఈ గ్రంథాలకి డా. కె. గీత, శాయి రాచకొండ, వంగూరి చిట్టెన్ రాజు సంపాదకులుగా వ్యవహరిస్తారు. కథలు, కవితల ఎంపిక, నగదు బహుమతి మొదలైన అన్ని విషయాలలోనూ సంపాదకులదే అంతిమ నిర్ణయం.

14. రచనలు పంపించవలసిన సంపాదకుల ఈ-మెయిల్ చిరునామాలు: ఈ-మెయిల్ సబ్జెక్ట్ లో “డయాస్పోరా కథ/కవిత సంకలనం- 2021- వంగూరి ఫౌండేషన్ & నెచ్చెలి పత్రిక” అని తప్పని సరిగా వ్రాయాలి.

vangurifoundation@gmail.com

editor.neccheli@gmail.com

sairacha@gmail.com

ప్రపంచవ్యాప్తంగా తెలుగు సాహిత్య పురోభివృద్ధికి కృషి చేస్తున్న రచయితలకి అభినందనలతో-

భవదీయులు,

వంగూరి చిట్టెన్ రాజు (అధ్యక్షులు), శాయి రాచకొండ (గౌరవ సంపాదకులు)
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా.

డా. కె. గీత
వ్యవస్థాపక సంపాదకులు, నెచ్చెలి అంతర్జాల వనితా మాసపత్రిక (California, USA).

    
   

0There are no comments

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • రచయితలకు ఆహ్వానం: డయస్పోరా తెలుగు కథానిక-17
  • డయాస్పోరా రచనలకి ఆహ్వానం
  • 29వ ఉగాది ఉత్తమ రచనల పోటీ

ఇటువంటివే…

  1. ఆహ్వానం: అత్యాధునిక తెలుగు సాహిత్యం-వస్తు, రూప పరిణామం వెబినార్
  2. తానా జ్ఞాపిక ‘తెలుగు పలుకు’ – రచనలకు ఆహ్వానం
  3. నా భావనలో తెలుగు డయాస్పోరా
  4. తానా వ్యాస రచన పోటీకి ఆహ్వానం
  5. తెలుగు డయాస్పోరా: సాహిత్యం, సంస్కృతి

ఏప్రిల్ 2021 సంచికలో ...

  • 1808-1843 నాటి నిజాం రాజ్య చరిత్రలోని చిత్రకథలు 5
  • అట్రిబ్యూట్
  • అలా ఎలా
  • ఆకుపచ్చ పిట్ట
  • ఏప్రిల్ 2021
  • కేతన ఆంధ్రభాషాభూషణము: ఒక పర్యాలోకనం – 3
  • కొన్ని నిర్ఘాంతాలు
  • గడినుడి – 54
  • ఛందస్సులో గణితాంశములు – 4: అంత్యప్రాస
  • టి. ఎస్. ఎలియట్ కవితాశిల్పం
  • డయాస్పోరా రచనలకి ఆహ్వానం
  • నడిచిన పుస్తకం మా నాన్నగారు
  • నాలుగో వరం
  • పద్య పదార్థ విజ్ఞానం
  • ప్లవకు స్వాగతం
  • ముడతలమీద వాన
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 54
  • స్వప్నసంచారం
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

మార్చ్ 2021
శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 54

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.