29వ ఉగాది ఉత్తమ రచనల పోటీ

రచనలు మాకు అందవలసిన ఆఖరి తేదీ: మార్చ్ 15, 2024.

గత 29 సంవత్సరాల సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, రాబోయే క్రోధి నామ సంవత్సర ఉగాది (ఏప్రిల్ 09, 2024) సందర్భంగా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికావారు అంతర్జాతీయ స్థాయిలో 29వ ఉగాది ఉత్తమ రచనల పోటీ నిర్వహిస్తున్నారు. స్నేహపూర్వకమైన ఈ ‘పోటీ కాని పోటీ’లో రెండు విభాగాలు ఉన్నాయి.

ప్రధాన విభాగం

భారతదేశం మినహా విదేశాలలో ఉన్న తెలుగు రచయితల నుండి నూతన, అముద్రిత రచనలని ఈ పోటీకి ఆహ్వానిస్తున్నాం.

ఉత్తమ కథానిక: (రెండు సమాన బహుమతులు) ఒక్కొక్కటీ: US116

ఉత్తమ కవిత: (రెండు సమాన బహుమతులు) ఒక్కొక్కటీ: US$116

మొట్టమొదటి రచనా విభాగం

భారత దేశంతో సహా ప్రపంచ వ్యాప్తంగా కథ, కవితలూ వ్రాద్దామని కుతూహలం ఉన్నా, చిన్న, చిన్న ప్రయత్నాలు చేసినా, ఏదో ఒక కారణం చేత తమ రచనలను ఎక్కడా ప్రచురించని సరికొత్త రచయితలని ప్రోత్సహించే ఉద్దేశ్యంతో ఈ ప్రత్యేకమైన పోటీలు నిర్వహిస్తున్నాం. తరాల తారతమ్యం లేకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఔత్సాహిక రచయితలను ఈ పోటీలో పాల్గొనమని ఆహ్వానిస్తున్నాం.

నా మొట్టమొదటి కథ: (ఉత్తమ కథ): US$116

నా మొట్టమొదటి కవిత: (ఉత్తమ కవిత): US$116

అన్ని పోటీలకీ ముఖ్య గమనికలు

  • ఒకే రచయిత ఒక్కొక్క ప్రక్రియకి ఒక రచన మాత్రమే పంపించవచ్చును. వీలయినంత వరకూ అన్ని రచనలూ యూనికోడ్‌లో (ఉదా. గౌతమి ఫాంట్స్) మాత్రమే పంపించాలి. కథల నిడివి 2500 పదాలకు మించకూడదు. (సుమారు 15 పేజీల లోపు). కవితలు ఐదు పేజీలు లోపుగా ఉండాలి. PDF, JPEG లలో పంపించినా ఆమోదయోగ్యమే.
  • తమకు నచ్చిన ఇతివృత్తం రచయితలు ఎన్నుకోవచ్చు.
  • రచయితల అముద్రిత స్వీయ రచనలు మాత్రమే పరిశీలనకు స్వీకరించబడతాయి. స్వంత బ్లాగులు, స్వంత వెబ్‌సైట్స్ మొదలైన వాటిల్లో ప్రచురించుకున్న రచనలు పరిగణించబడవు. ఈ మేరకు హామీ పత్రం రచనతో బాటు విధిగా జత పరచాలి. “మొట్టమొదటి కథ” మరియు “మొట్టమొదటి కవిత” పోటీలో పాల్గొనేవారు తమ రచనలు మొట్టమొదటి రచనలు అని హామీ పత్రంలో పేర్కొనాలి.
  • బహుమతి పొందిన రచనలూ, ప్రచురణకి అర్హమైన ఇతర రచనలూ కౌముది.నెట్ లోనూ, మధురవాణి.కామ్, తదితర పత్రికలలోనూ ఆయా సంపాదకుల వీలుని బట్టి, కేవలం వారి నిర్ణయానుగుణంగా మాత్రమే ప్రచురించబడతాయి.
  • విజేతల వివరాలు ఉగాది పండుగ నాడు (ఏప్రిల్ 09, 2024) కాని, అంతకుముందు కానీ ప్రకటించబడతాయి. కాపీరైట్స్ ఆయా రచయితలవే అయినా, ఆ ఈ తేదీ లోపుగా పోటీకి పంపిన రచనలను రచయితలు ఇంకెక్కడా ప్రచురించకూడదు.
  • విజేతల ఎంపికలో న్యాయ నిర్ణేతలదీ, ఇతర విషయాలలో నిర్వాహకులదే తుది నిర్ణయం.
  • Last Date to receive entries: March 15, 2024.
  • Please send entries by email attachments (PDF, JPEG or Unicode fonts)

    sairacha@gmail.com & deepthinivas@gmail.com

భవదీయులు

వంగూరి చిట్టెన్ రాజు
శాయి రాచకొండ
దీప్తి పెండ్యాల

వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, హ్యూస్టన్, టెక్సస్.