సాహిత్యంలో ప్రగతి ఉండదు, విజ్ఞానశాస్త్రంలో వలె. కవికి సమాజం పట్ల ప్రత్యక్ష బాధ్యత ఉండదు, అంటాడు ఎలియట్. అతని బాధ్యత భాషకే. తన సాటివారి భాషను స్వీకరించి, దానిని శుద్ధిచేసి, కావ్యయోగ్యంగా తీర్చి దిద్దడమే ప్రజల పట్ల కవి పరోక్షబాధ్యత.
ఏప్రిల్ 2021
ప్రతీభాషా తనదైన కొన్ని మహాకావ్యాలను తయారుచేసుకుంటుంది. తరాలు మారినా తరగని సజీవచైతన్యాన్ని తమలో నింపుకుని, చదివిన ప్రతిసారీ నూత్నమైన అనుభవాన్ని మిగులుస్తాయవి. నిత్యనూతనమైన ఆ కావ్యాలే కాలక్రమేణా క్లాసిక్స్ అని పిలవబడి ఆ భాషాసంస్కృతులలో, ఆ జాతి సంపదలో భాగమవుతాయి. ఆయా సమాజాలు ఈ సాహిత్యకావ్యసంపదను ఎలా కాపాడుకుంటున్నాయో ఎలా చదువుతున్నాయో వాటిని ఎలా తరువాతి తరాలకు అందిస్తున్నాయో గమనిస్తే, ఆ సమాజపు సాహిత్యసంస్కారం తేటతెల్లమవుతుంది. తమ తమ భాషలలోని ప్రాచీన మహాకావ్యాలను తాము నిరంతరంగా భిన్న దృక్కోణాల నుండి అధ్యయనం చేయడమే గాక ఇతరభాషలలోకి కూడా అనువదించి వాటిని విశ్వవ్యాప్తంగా సజీవంగా నిలుపుకుంటున్న సమాజాలతో పోలిస్తే, ప్రస్తుత తెలుగు సాహిత్య సమాజపు అచేతనాస్థితి అర్థమవుతుంది. ప్రాచీన తెలుగు సాహిత్యం అన్న పేరు వినపడగానే కాలం చెల్లిన సంగతులేవో చెవిన పడుతున్నట్టు చూసేవారే మన చుట్టూ ఉన్నారిప్పుడు. మూఢభక్తి లాంటి భాషాభిమానమే తప్ప ప్రాచీన సాహిత్యం చదివి సమకాలీనులు తెలుసుకోదగినదీ, నేర్చుకోదగినదీ ఏమీ ఉండదన్న నమ్మకమే చాలామందిలో స్థిరపడిపోయి ఉంది. ప్రాచీనసాహిత్యాన్ని చదవడం భాషాభిమానాన్ని నిరూపించుకోవడానికో సమకాలీన సమాజపు పోకడలకు ఆకాలం ఎంత ఎడంగా ఉందో నిరూపించడానికో అయితే అంతకన్నా మూర్ఖత్వం ఇంకోటి ఉండబోదు. ఆవేశపూరితంగా, తాత్కాలికోద్వేగాన్ని మాత్రమే కలిగిస్తూ, ఆలోచనారహితమైన అభిప్రాయప్రకటనగా మిగిలిపోతున్న సమకాలీన సాహిత్యాన్ని గమనించే కొద్దీ, స్పష్టమైన ప్రణాళికతో చిరస్థాయిగా నిలబడగల రసానుభూతితో కళాత్మకంగా సాగే మహాకావ్యాల ప్రాధాన్యం అవగతమవుతుంది. వాటి వైపు వేసే ఒక్కో అడుగూ, మన ఆలోచనలు స్పష్టమయ్యేందుకు తగిన వ్యవధినిచ్చేంత సహనపూరితమైన పఠనానుభవం దొరకనుందన్న హామీనిస్తుంది. ఒక్కో అధ్యాయాన్ని, ఒక్కో అంకాన్ని, ఒక్కో వాక్యాన్నీ శ్రద్ధగా గమనించే కొద్దీ, కథాకథనపద్ధతులు గుణదోషాలతో సహా అర్థమవుతూ ఒక కళగా సాహిత్యాన్ని ఆనందించడాన్ని, విశ్లేషించడాన్ని నేర్పిస్తాయి. విస్తారమైన, సంపూర్ణమైన పఠనానుభవం అందించే మానసికోల్లాసం ఎలాగూ దక్కుతుంది. ఒక వాక్యమో, సన్నివేశమో ఇలాగే ఎందుకు రాశారన్నది గమనించే కొద్దీ, రాతలో కొత్త మెళకువలు తెలుస్తాయి. క్లాసిక్స్‌ని చదవడం దానికదే ఒక అభ్యాసము, మన అభిరుచిని పెంపొందించుకునే మార్గమూ కనుక సాహిత్యంలో పొల్లునూ గింజనూ విడదీసి చూడటం అబ్బుతుంది. అంటే, పాఠకులుగా, రచయితలుగా మన స్థాయిని, మన భాషాసాహిత్య స్థాయినీ కూడా ఒక మెట్టు పైకెక్కించే అభ్యాసమిది. ఇట్లాంటి అవకాశం, అభ్యాసం, పరిశ్రమ పూర్తిగా మృగ్యమై సాహిత్యం పట్ల కనీస అవగాహన లేని సాహిత్యకారులు చుట్టూ మర్రిమానుల్లా పాతుకుపోతున్నారు. ఇప్పటికైనా మహాకావ్యాలు చదవడమెందుకో మనం గుర్తించలేకపోతే, సమకాలీన తెలుగుసాహిత్యం ముందుతరాలకు క్లాసిక్స్ ఏవీ సృష్టించలేదన్నది కళ్ళకు కడుతున్న నిజం.
నేను ప్రతిరోజూ
రెండు పూటలా
ఒక ఆడపిల్లల కాలేజ్‍లో
ఫిజిక్స్ పాఠాలు చెబుతాను
తీరిక వేళల్లో – అంటే
కాలేజ్‍కి శలవులప్పుడూ
వాళ్ళు బుద్ధిగా
పరీక్షలు రాస్తున్నప్పుడూ
నేను కవిత్వం రాస్తాను.
మనుషులు మాటలకి, చిన్నపాటి ఈగో తృప్తికే వారిని వారు గొప్పవాళ్ళుగా బలవంతులుగా ఎలా అనుకుంటారో, వీళ్ళింత బలహీనులేంటి అనిపిస్తది నాకు. ఇవన్నీ అనుకొని చేసిందా లేకా అనుకోకుండా చేసిందా అన్నదాన్లో నాకెలాంటి అనుమానం లేదు. ఇన్నీ జరిగాకా సంతోష్ నస్రీన్ కోసం పనిచేయడానికి రత్నాన్ని పక్కన పెట్టడానికి ఎక్కువ టైమ్ కూడా పట్టలేదు.
అతను ఆ సంఘటనని కవితాత్మకంగా కళ్ళకు కట్టినట్టు వర్ణిస్తున్నాడు. ‘అతను పేలిపోయాడు’ అనే పదప్రయోగం ఇంతకుముందు ఎక్కడా వినలేదు నేను. బహుశా ఇది యుద్ధ పరిభాష అయి ఉండాలి. సందేహం లేదు, ఇది యుద్ధ భాషే. అతను చెప్తూ ఉంటే, ఆ సంఘటన నా కళ్ళ ముందే జరిగినట్టు, నేను అప్పుడు అక్కడే ఉన్నట్టుగా, అదంతా స్లో మోషన్‌లో జరిగినట్టు నా కళ్ళముందే కనిపిస్తోంది.
‘నడిచిన పుస్తకం మా నాన్నగారు’ అన్నాను ఒకసారి. ‘చదవడం కాక ఇంకేవైనా చేసేవారా అన్పిస్తుంది’ అన్నాను ఒకసారి. జీవితం అత్యంత విలువైనదా? సాహిత్యం జీవితంకన్నా విలువైనదా? దానిమీద నా వుద్దేశాలు చాలాసార్లు మారేయి. మారుతూనే వున్నాయి. కానీ మా నాన్నగారు సాహిత్యాన్ని జీవితంకన్నా విలువైనదిగా భావించినట్లు తోస్తుంది.
కేతన చెప్పిన సంధి సూత్రాలు ఆనాటి భాషను కూడా పూర్తిగా వివరించేవి కావు, కానీ ఆయన చెప్పిన మేరకు అవి ఆ కాలపు కావ్య భాషలోని అనేక తెలుగు సంధులను ఉదాహరణలతో సూత్రీకరించిన తీరు లోని సరళత ఆధునిక వ్యాకర్తలకు, భాషా శాస్త్రవేత్తలకు స్ఫూర్తిదాయకం కావాలి.
బుస్సీగారు తన కార్యసాధన విధానమున కేవలం సైనికబలముపైననే ఆధారపడి యూరకుండలేదు. అది అతని పలుకుబడికిని అధికారమునకును పునాదియైనమాట నిజమే. అంత బలవత్తరమైన స్థానమును పొందిన మరియొక సామాన్యవ్యక్తియైనచో దానిని వృథాచేసి యుండెడివాడు. బుస్సీగారికి విదేశీయుల స్వభావము, చిత్తవృత్తి బాగా తెలియును.
అలా ఎలా ప్రేమించేశావు
నువు పుట్టడాన్నీ
నీ ముందు ప్రపంచం పుట్టడాన్నీ
అవి నిద్రలోకి రాలిపోవడాన్నీ
అనుభవాలు గతంలోకి
ఉత్సాహం భవితలోకీ జారిపోవడాన్నీ
ఆనందుడు నవ్వుతూ చెప్పాడు, “పిచ్చివాడా, ‘బుద్ధేర్లోకానతస్త్రాతుమితి స్థితోస్మి’ ఆయనే చెప్పారన్నావుగా? మనకి ఈ ప్రపంచంలో తగులుకున్న భవరోగానికి దారి చూపించే భగవానుడికి గృహస్థు ఇంటికి దగ్గిర దారి ఎటువైపు ఉందో తెలియకపోవడమేమిటి? నీ కోసమే అటువైపు కావాలని, నేను మరొకర్ని తోడు పంపిస్తానన్నా వద్దని, ఒక్కడూ వచ్చాడు. నీ అదృష్టం ఏమని చెప్పేది?”
తెలుగులో అంత్యప్రాస రగడలకు తప్పనిసరి. మిగిలిన ఛందములకు ఐచ్ఛికము. కొందఱు ద్విపదకు కూడ పాటిస్తారు. రగడలకు, ద్విపదలకు పాదాంత విరామయతి నియతము అన్న మాటను మఱువరాదు ఈ సందర్భములో.
చిరువలయాల్లోంచి చదరాల్లోకీ సూటిగీతల్లోంచి
పేరుకునే నురగలకింది శూన్యపు ఉరవడుల్లోకీ
మలుపుల తలపుల్లోకీ రూపాల్లోంచి పాపాల్లోకీ
జారబోయినప్పుడల్లా పట్టుకోబోయి జార్చుకున్న బొమ్మే.
వెలుగు కన్నెత్తికూడా చూడని చీకటిగదిలో
ఒంటరితనపు పక్కమీద
నిద్రపట్టక దొర్లుతున్నప్పుడు
మనం ఆశాదీపాలనుకున్నవాళ్ళు
కిటికి సందుల్లో నుండి మిణుగురుల్లా
మెరిసి మాయమైపోతారు
మరపు పొదలలో
దాగిన ఆత్మీయులు
హఠాత్తుగా వెలికివస్తారు
ఆరిపోయిన నెగళ్ళలాంటి
తీరని కోరికలను భ్రమలవల
నిజంలా చూపెడుతుంది.
ముగ్గులు లేవిట, కానీ
అగ్గలమగు సంతసమున నతివలు నీకై
యొగ్గిరి కుసుమాంజలులన్
దిగ్గున రమ్మిక నవాబ్ద! దీవింప మమున్.
వడకఁగానేమి వలిచేత వపువు లిచట,
లోనఁ గలదోయి వెచ్చనిదైన మనసు
అందుచేఁ బల్కెదము మనసార నీకు
నంచితంబగు నాహ్వాన మభినవాబ్ద!
క్రితం సంచికలోని గడినుడి-53కి మొదటి ఇరవై రోజుల్లో పదిహేను మంది దగ్గరినుండి సరైన సమాధానాలు వచ్చాయి. విజేతలకందరికీ మా అభినందనలు.
గడి నుడి-53 సమాధానాలు.
జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా & నెచ్చెలి అంతర్జాల వనితా మాసపత్రిక సంయుక్త ఆధ్వర్యంలో డయాస్పోరా తెలుగు కథ-మొదటి సంకలనం & డయాస్పోరా తెలుగు కవిత-మొదటి సంకలనం-రచనలకి ఆహ్వానం!