మనకు తూర్పు కనుమలు, పడమటి కనుమలు బాగా తెలుసు. కానీ, సముద్రంలో ఉన్న కనుమల గురించి తెలుసా? ఈ సముద్రకనుమలు బారుగా ఒకదానికొకటి అంటుకొని సముద్రగర్భంలో భూమి చుట్టూ వడ్డాణపు గొలుసుల్లా పాకివున్నాయి. అన్నీ కలుపుకొని వీటి పొడవు 40వేల మైళ్ళు.

జాషువా మొదట్నించీ పద్యాన్ని పట్టుకోవాలి, పద్యాన్ని బాగా రాయాలి అన్న ప్రయత్నంలోనే ఉన్నాడు. తను కవిత్వం రాసే కాలానికి పద్యం పాత పద్ధతుల్లో లేదని, పద్యాన్ని భావకవులు వచ్చి మాటల కూర్పు మీద, ఊహల పొందిక మీద దృష్టి పెట్టి పద్య స్వభావాన్ని మార్చేశారని జాషువా గుర్తించలేదు. ఆయనకు కావలసిందల్లా పాత పద్ధతుల్లో భావాన్ని ఛందస్సులో ఇమిడ్చి చెప్పడమే.

ఆ సముద్రతీరపు అల్‌బహ్రీ రోడ్డు మస్కట్‌ నగరానికి సరి అయిన కంఠాభరణమని మెల్లగా అర్థమయింది. ఎడమవేపున సాగర జలాలు, వాటిలో సీగల్స్- కుడివేపున ఏవేవో భవనాలు, ఆఫీసులు. పనిరోజు కావడంవల్లనేమో, పర్యాటకులు యాత్రికులు దాదాపు లేరు. అయినా అంత ఎండలో కొత్త బిచ్చగాళ్ళు తప్ప ఎవరొస్తారూ?

స్త్రీపర్వంలో పగ పరాకాష్ఠ చేరిన సన్నివేశం ప్రసిద్ధం. ఆ పగను ఊహించిన కృష్ణుడు (పగను ఊహించడానికి పరమాత్ముడే కానక్కరలేదు) ధృతరాష్ట్రుడికి ముందు ఉక్కుభీముణ్ణి ఉంచిన కథ తెలియని వాడుండడు భారతదేశంలో. పగ పగతో ఆరదు, ఎన్నటికీ తీరదు. ఉక్కు తీర్మానాలు కూడా తుక్కు కావలసిందే. ఇదే భారతం తీర్మానం. భారతం చెప్పిన పరిష్కారం ఏమిటి?

స్త్రీలు సృజనాత్మక పనులు చేయడం తప్పని భావించే సగటు మనస్తత్వాన్ని బర్నీ కొంతకాలం అధిగమించలేకపోయింది. అందుకే ఆమె తన తొలి రచనలన్నిటినీ కుప్పపోసి తగలబెట్టింది. ‘నా పుస్తకాలనైతే తగలబెట్టగలిగాను కానీ నా ఆలోచనలను తగలబెట్టలేకపోయాను’ అంది ఆమె ఆ తర్వాత.

నేను దారి తప్పి అలసిపోయి ఉన్నా. ఆ చలికి నేను వేసుకున్న బట్టలు సరిపోవట్లేదు. అతని దుస్తులు పల్చగానే అనిపించాయి. నా దగ్గరకు వచ్చాడు. అతనొక పిచ్చివాడిలా అనిపించాడు. ఏమీ మాట్లాడలేదు. నన్ను పట్టించుకోలేదు. ముందుకు వెళ్ళిపోయాడు. అతని పాదాలు కొద్దిగా పెద్దగా ఉన్నాయి, అంత దృఢమైన మనిషిలా అనిపించలేదు. చాలా వేగంగా నడుస్తున్నాడు. అతని కళ్ళలో పచ్చిక్రూరత్వం.

పరమశివుని కనులు విచ్చుకున్నాయి. ఆర్తిగా చూస్తున్న పార్వతి నయనాలతో చూపులు పెనవేసుకున్నాయి. ఆ పద్మనయని ముగ్ధమోహన రూపాన్ని మంత్రముగ్ధుడై చూస్తుండిపోయాడు. లజ్జతో తత్తరపాటుతో ఆమె కనురెప్పలు బరువెక్కినాయి. మోహం కాలాన్ని ఒడిసిపట్టే ప్రయత్నం చేసి విఫలమైంది.

ఐఐటీ-జీలు, ఎమ్‌సెట్‌లు అని బండకేసి బాదించుకోవడం తప్ప ఇంకోటి తెలియనివాళ్ళు, ఆ మాత్రం కాంపిటీటివ్ స్పిరిట్ లేకుండా, చూపించకుండా ఉండలేరు. కానీ అతడి మీదున్నది ప్రేమో-దోమో-ఇంకేదో అనేది ఇంకా తేలకముందే, ‘నీ సుఖమే నే కోరుకున్నా… నిను వీడి అందుకే వెడుతున్నా’ లాంటి సినిమాస్థాయి త్యాగాల ట్యూన్లు మనసులో ఎందుకు మొదలవుతాయో ఆమెకి అర్థమై చావదు.

హైదరాబాద్ జాడ్యములకు పుట్టినిల్లు. అక్కడ అవినీతి తప్ప మరేమియు వర్ధిల్లదు. ఆదేశము నందలి దురదృష్ట ప్రజలను తుపాకి సన్నీల (బాయొనెట్ల) వాడిమొనలను చూపి భయపెట్టియు, పదునైన ఖడ్గములను ఝుళిపించియు సొమ్ము వసూలు చేయుదురు. అక్కడి యన్యాయములకు అంతము లేదు.

జీతం అనేది ఒకటి జీవితంలో మొదటిసారి అందుకోవడమూ, అందరమూ ఆ మొదటి తారీఖు రాగానే అకౌంట్స్‌ సెక్షన్‌ ముందు వరుసగా నిలబడటమూ, వాళ్ళు ఒక్కొక్కరినీ రెవెన్యూ స్టాంపులు అంటించిన రిజిస్టర్‌లో సంతకం పెట్టించుకుని, టేబుల్‌ మీద పరిచిన నోట్ల కట్టల్లోంచి మనకో కొన్ని కాగితాలు చిల్లర పైసలతో సహా లెక్కించి చేతికి ఇవ్వడమూ; కొన్నాళ్ళు పోయాక చెల్లింపుల్ని కొంత నాగరికపరిచి, ముందే అందరి డబ్బుల్నీ ఎవరి కవర్లో వాళ్ళకు వేసి పిన్‌ చేసి ఉంచడమూ;

ఒక్క ధర్మతత్వశాస్త్రం బోధించే పాఠశాలలలోనే ఒక ఆచార్యుడికి తన మతవిశ్వాసాలకి విరుద్ధంగా ఒక వాస్తవం కనిపిస్తే, దాన్ని అతను గోప్యంగానైనా ఉంచాలి, లేదా దాని ఉనికిని నిరాకరించాలి. లేకపోతే అతను తన పదవిని కోల్పోవలసి వస్తుంది. సత్యప్రకటన నేరం, పిరికితనం. కానీ, ఆత్మవంచన మాత్రం ఒక సుగుణం.

పెరిగిన గడ్డం, పెదాలకి అడ్డొచ్చే మీసం
పెద్దగా ఇబ్బంది పెట్టవు.
అంటుకున్న ఎంగిలి అద్దంలో చూసుకున్నాకయితే
ఒకప్పుడు చేత్తో తుడిచిన మనుషుల్ని ఎలా వెతుక్కోవాలి మరి?

అందమైన జ్ఞాపకాల పేజీలన్నీ
చెదలు పట్టి
పొడిపొడిగా రాలిపోతుంటే
మరపు మలుపులలో
అనుభూతుల స్మృతులన్నీ వెలసి
దిగులు పెంకులను విసిరేస్తోంటే
మనసు కొలను అల్లకల్లోలమవుతుంది

ఇంతకీ ఎదటి వాహన చోదక బాధ్యతలు నెరవేర్చుతున్నదెవడు లేక ఎవతి? చోదకుణ్ణి స్త్రీలింగంలో ఏమంటారో? ఓ! అంకుల్‌గారు… మెల్లగా, ప్రపంచంలోని టైమంతా తనకే ఉన్నట్లు రోడ్డుమీద స్పెండ్ చేస్తున్నారు. అబ్బ పోనిద్దూ. ట్రాఫికే అంత మెల్లిగా పాకుతుంటే ఆయన మాత్రమేం చేస్తాడు? ఒరే చైల్డూ, నువ్వు కాసేపు గోల చెయ్యకు. నన్ను డ్రైవ్ చెయ్యనీ! అయామోకే, యూ ఆర్ ఆల్సో ఓకె!

కల్తీ కొంగలు వాలి
ఏ ఏడుకాయేడు పంటను మేసేసినప్పుడూ
నగరం చుట్టూ ప్రాకిన నల్ల కొండచిలువ
సగం పొలాన్ని మింగేసినప్పుడూ
ఆలి కాటిఖర్చుల కోసం
జోడెద్దుల్ని అమ్ముకోవాల్సొచ్చినప్పుడూ

ఇపుడు జీవించాలన్న తలపు
తొలిచేస్తోంది
ఓపినన్ని కలలున్న ఎడారిని నేను
ఒయాసిస్సులను మొలిపించుకోగలను
ఏమో, పాడుకుంటూ పరవళ్ళు తొక్కే
ఒక సెలయేరూ దారిలో ఎదురవ్వచ్చు.

ఇస్మాయిల్‍గారు టాగూర్‌ను సదాబాలకులు అన్నారని మనకు తెలుసు. అయితే మంచి కవులందరూ సదాబాలకులే. వాళ్ళలో పసితనపు సమ్మోహనత్వమేదో నిలిచే ఉంటుంది. ఆ పసితనపు స్వచ్ఛత సూదంటురాయిలా ఆకర్షించినట్టు, వీళ్ళ కవిత్వం కూడా పాఠకులను లాగుతూ ఉంటుంది. ఈ సంపుటిలో కూడా ఇదే ప్రధాన ఆకర్షణ.

జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.

గడినుడి పాఠకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. క్రితం సంచికలోని గడినుడి-50కి మొదటి ఇరవై రోజుల్లో పద్దెనిమిది మంది నుండి సరైన సమాధానాలు వచ్చాయి. విజేతలకందరికీ మా అభినందనలు.

గడి నుడి-50 సమాధానాలు.