గడినుడి 9కి ఈసారి చాలా తొందరగా తప్పుల్లేని పరిష్కారాలు వచ్చాయి. అన్ని సమాధానాలూ సరిగా పంపిన ఈ అయిదుగురు విజేతలకు అభినందనలు:
- ఉరుపుటూరి శ్రీనివాస్
- వేదుల సుభద్ర
- రవిచంద్ర ఇనగంటి
- టి. ఎస్. రాధిక
- పంతుల గోపాలకృష్ణ
టి. చంద్రశేఖర రెడ్డి, వి. దీప్తి, పి. సి. రాములు, పి. వి. ఎస్. కార్తీక్ చంద్ర గార్లు ఒక తప్పుతో సమాధానాలు పంపించారు (అచ్చు-తప్పు కాబోలు). వారందరికీ కూడా మా అభినందనలు.
అడ్డం
- వ్యక్తుల పట్ల మొదలైన రేవతి నాలుక ధోరణి మార్చుకుంటే గాలులు విరుద్ధంగా వీస్తాయి (4,4)
సమాధానం: వ్యతిరేక పవనాలు. వ్య(క్తుల) ప(ట్ల) + రేవతినాలుక మార్పుతో. - రెండు ప్రాంతాల కలయికతో తయారైన అర్ధంకాని భాష (6)
సమాధానం: కీసర బాసర - పాండిత్యానికి మరో పేరు (3)
సమాధానం: సాహితి - పులుపు తాకను అన్న అయోమయంలో శివుడు (6)
సమాధానం: పునుకతాలుపు. చెల్లాచెదురైంది. - మమతలకోవిలని విమల వీడి హడావిడిగా వెళ్తేనే మృదుత్వం (4)
సమాధానం: కోమలత. మమతలకోవిల నుండి విమల తీసేస్తే వస్తుంది - ఈ రాగంలో మంగళ స్వరూపిణి కనిపిస్తుంది (3)
సమాధానం: కల్యాణి. రెండర్ధాల పదం - కడుపులో నిప్పు దాచుకునే మణి (5)
సమాధానం: అగ్నిగర్భము. అంటే సూర్యకాంత శిల. నిప్పు=అగ్ని కడుపు=గర్భం కలిసాయి. - యోగ్యత తలాతోకలతో వ్యాయామం (2)
సమాధానం: సాము. సామర్థ్యము అంటే యోగ్యత. దాని తలాతోకలతో వచ్చింది. - పొమ్ము! అది లక్ష్మణుడు ఆది నుండి బాణాలు దాచుకునే చోటు (5)
సమాధానం: అమ్ములపొది. పొమ్ము అది ల[క్ష్మణుడు] తో వచ్చింది. - వ్యర్ధపుమాటలు మాట్లాడు సెలయేరు (2)
సమాధానం: వాగు. రెండర్థాల పదం. - అచ్చు కానిది. అలాగని హల్లు కూడా కాదు (5)
సమాధానం: అముద్రితము. - కోక తడుపు ప్రమాదం కొందరు స్త్రీలకి ప్రసవంలో తప్పదు (5)
సమాధానం: కడుపుకోత. ప్రమాదం అక్షరాల మార్పు సూచిస్తుంది. - ఈతరం వాళ్ళు చేసే జలక్రీడా విశేషం (2)
సమాధానం:ఈత. అక్కడే ఉంది. - గొంతుపోక రగులుతుంటే వీడు అటుతిరిగి నిద్రపోతున్నాడు (5)
సమాధానం: గురకపోతు. వెనుకనుండి కనిపిస్తోంది. - తెలుసుకోగలిగేవాడు (2)
సమాధానం: గ్రాహి. - అమ్మ చివర కోవెలలోకి చెట్టుకి కాచేదానితో వెళ్తే కూష్మాండం (5)
సమాధానం: గుమ్మడికాయ. గుడి మధ్యలో [అ]మ్మ + చెట్టుకికాచేది కాయ కదా? - గుండీలు పెట్టుకోవాలంటే కాకినాడ సరుకులుండాలి (3)
సమాధానం: కాజాలు. కాకినాడ కాజాలు అందరికీ తెలిసిన విషయం. - అప్సర భగవంతుడి రాశి (4)
సమాధానం: దేవకన్య. భగవంతుడి = దేవ + రాశి = కన్య - గ్రంథాల్లో విషయాల్ని ఒక వరుసలో తెలిపే పట్టికా? (6)
సమాధానం: అనుక్రమణికా. విషయసూచికకి ఇంకో పేరు. - వాడుక భాష మధ్యన చర్మ వాద్య విశేషం (3)
సమాధానం: మద్దెల. మధ్యన, మధ్యలో పదాల్ని వాడుకలో కొన్నిప్రాంతాల్లొ వాడే మాట - ఎక్కువకష్టాలలో కృంగిపోతున్నప్పుడు చేసే జలక్రీడావిశేషం (6)
సమాధానం: తలమునకలు. జలక్రీడే కదా? - నీ అరచేతిలో ఉసిరికాయుంటే ఎవరూ చెప్పకుండానే అన్నీ తెలిసినట్టా? (8)
సమాధానం: కరతలామలకము. అమలకము అంటే ఉసిరికాయ. అన్నీతెలిసినవాడిని ఇలాగేకదా అంటాం?
నిలువు
- ఖర్చులో వసారా పూర్తికాకుంటే కృషి చెయ్యాలి (4)
సమాధానం: వ్యవసాయం. ఖర్చు అంటే వ్యయం. వసా[రా] మధ్యలో వచ్చింది. - బలరాముడి భార్య చుక్కలాగుంటుందా? (3)
సమాధానం: రేవతి. బలరాముడి భార్య పేరు రేవతి అంటే నక్షత్రం/చుక్క కదా? - ఫణిరా! పుట్ట పక్కకి పోకు. ఇటునుండి రాజపత్ని చూస్తోంది (5)
సమాధానం: పట్టపురాణి. వెనుకనుండి. - కసి నా వంకర ముక్కు (3)
సమాధానం: నాసిక. వంకర పదం తారుమారుని సూచిస్తుంది. - మనలేని బుద్ధిమంతుడు సమం (2)
సమాధానం: సరి. మనసరి అంటే బుద్ధిమంతుడు. మన తీసేస్తే మిగిలింది. - దీపావళిమతాబుకి తెలివి జోడిస్తే మంత్రప్రయోగం (4)
సమాధానం: బాణామతి. మతాబు అంటే బాణా. తెలివి అంటే మతి. కలిస్తే వచ్చింది. - సారము తలకెక్కి గిర్రున తిరిగితే పాతాళలోకం కనిపిస్తుంది (5)సమాధానం: రసాతలము. అంటే పాతాళలోకం. గిర్రునతిరగడం తారుమరు అని చెప్తోంది.
- కొండచిలువ గట్టు మీదెక్కితే తిరుమల కనిపిస్తుంది (5)
సమాధానం: చిలువగట్టు. అక్కడే ఉంది. - ఆ సంతోషం ఇది తాగనంతవరకే. తాగితే వృధా ఖర్చు (4)
సమాధానం: ఆముదము. ముదము అంటే సంతోషం. వాడుకలో చేతి డబ్బు ఎవరిమీదనైనా అనవసరంగా పెడితే అనే మాట కాదూ?(అక్షరాలు నాలుగుకి బదులు మూడు అని తప్పుగా ఇవ్వడం జరిగింది. పొరపాటు మన్నించాలి.)
- నేత్రపర్వము (6)
సమాధానం: కన్నులపండుగ. - సహోదరి ఉండే వీధిలోనే పూటకూళ్ళమ్మలు నివసిస్తారు (4)
సమాధానం: అక్కవాడ. సహోదరి అంటే అక్క. వీధి అంటే వాడ. పూటకూళ్ళమ్మలుండే చోటు ఇదే. - తక థక జాలు వారే బౌద్ధగ్రంధం (3,3)
సమాధానం: జాతక కథలు. తారుమారై అక్కడే ఉంది. - ఆప్రకారంగా చేసే పిండివంటలు (2)
సమాధానం: అట్లు. వేరే వివరణ అవసరం లేదుగా. - ప్రాణిపై చూపే కనికరం జీవకారుణ్యం (4)
సమాధానం: భూతదయ. ప్రాణి అంటే భూతం. కనికరం అంటే దయ. కలిస్తే అవుతుంది. - తలాతోకాలేకుండా భర్తలేని స్త్రీ జరిపే వేడుక (2)
సమాధానం: తంతు. వితంతువు తలాతోకా తీస్తే వస్తుంది. - పరీక్షల్లో సున్నా? (4)
సమాధానం: కోడిగుడ్డు. వాడుకులో సరదాగా అనే మాట. - ఈ జంతువు తీసే అరనిద్రని ఇలాగంటాం (5)
సమాధానం: కోడికునుకు. అరమోడ్పు కళ్ళతో కోడి తీసే నిద్ర. - ఆగ్రాలో మనదేశవనితగా అక్కడక్కడ కనిపించే అమ్మతల్లి (5)
సమాధానం: గ్రామదేవత. అక్షరం దాటి అక్షరం కలిపితే అమ్మతల్లి కనిపిస్తుంది. - స్మశానానికి రక్షణా? వ్యర్ధమైనపని (5)
సమాధానం: కాటికాపలా. శ్మశానం అంటే కాడు. రక్షణ అంటే కాపలా. - జబ్బు పడ్డప్పుడు ఇది పరమ ఔషధంలా పనిచేస్తుందని నానుడి (4)
సమాధానం: లంకణము. జ్వరం వస్తే ఒకొక్కప్పుడు చేసేది కదా? - మేము కలవారి కుటుంబం నుండి వచ్చినా ఎగాదిగా చూస్తే వేషం కనిపిస్తుంది (4)
సమాధానం: వాలకము. ఎగాదిగా చూడండి. - గోముఖ రాశి (3)
సమాధానం: మకర. గోముఖ అంటే మొసలి. మకర రాశి కూడా. - మకరదూలము లో తరచూ మళ్ళీ కనపడుతుంది (3)
సమాధానం: మరల. అక్షరాలు మార్చి చూస్తే కనిపిస్తుంది. - ఈ దంపుడు ఆడంబరంగా చెప్పే ఉపన్యాసం (2)
సమాధానం: ఊక. రాజకీయ ఉపన్యాసాలు విన్నప్పుడు అనిపించేది!