జేబఱబూచి


వికీపీడియా నించి

అమాకారు రాత్రి జాఱుడు ఊబి బుయ్యల్లోంచి జరజరా
బూఱడ కన్ను పాఱడ పళ్ళు కొరుకుతూ రాకాసి
కోఱల నోరు బారడు చాచి వొచ్చెస్తాడు జేబఱబూచి మాబోయ్
ఱంపం వొళ్ళు వంకర తోక ఝాడించుకుంటూ రంకెలు వేసి
అమ్మో మమ్మీ వెనక ఉలుబులుకు దాంకో పారిపో పారిపో.

జేబఱబూచి కరిసీగల్డు జాగర్త బూగుచ్చుముండా నీ
ఊబులకుయ్యి నొక్కెస్తాడు కోఱల పార బుసగొట్టి
శూలం కొమ్ము దించెస్తాడు బ్లేంకీలోకి దూలి నీ
బెల్లీబటన్ లూలెస్తాడురా వాడు కోపాల నేపాళబూచాడు!

ఱంపం కత్తి ఝళిపించి నిలబడ్డాడు బున్ను
మంచం కింద కించులబండ అదిలించి రారా జేబఱా రమ్మన్నాడు
రాక్షసలోయ ద్వారం మీద తలగడా తొడగొట్టి
పందిరి చెట్టు ఊడలకి వేలాడి పాతాళ మాంత్రికుడి
తెంపరి చూపు టక్కరి చెవ్వు అశ్శరభ రిక్కించి క్రీగన్ను.

అచ్చర కాలు సవరించుకున్నంత ఇంతలో ఆ వెనక సడి చూడు
పచ్చల కళ్ళు జబ్బర తోక తాటించి నీ బొజ్జ కరిసెస్తాడు
గొగ్గఱ పళ్ళు బుగ్గల మీద బులికించి గున గునా వూబుల వొళ్ళు
నాగుల తేప రాసెస్తాడు అగ్నిశ్వాస ఎగజిమ్మి ఊసెస్తాడు
తప తపా ఆషాఢ భూషాడు!

దమ్ములుంటే రా రా నీ మేంగో జ్యూసు లూలెస్తాను బూచీ అని
అమ్ములపొదిని ఝళిపించి వొంకల కత్తి కస కసా గుచ్చీసేడు బజ్జన్న
జిజ్జర పిట్ట ఏడుపులు జేబఱ నాగు జడిచచ్చి పడ్డట్టు చప్పుళ్ళు
జారుడు లాగు ఎగదోసుకుంటూ విజయ నాసికలు ఎగబీల్చి జగమొండి రాజా.

అమ్మో జేబఱబూచినే సితక చంపీసేవు కన్నా?
ఒచ్చీ వొచ్చి నా బొజ్జమీదెక్కిపోవే అనుమంతు ముండా!
జయ ధ్వానాలు చేస్తాము రా రా అల్లల్లబున్నీ అక్కుచిక్క
పక్కెక్కి చప్పట్లు కొట్టించుకుంటూ రాకాసి శశి వదన!

అమాకారు రాత్రి జాఱుడు ఊబి బుయ్యల్లోంచి జరజరా
బూఱడ కన్ను పాఱడ పళ్ళు కొరుకుతూ రాకాసి
కోఱల నోరు బారడు చాచి వొచ్చెస్తాడు జేబఱబూచి మాబోయ్
ఱంపం వొళ్ళు వంకర తోక ఝాడించుకుంటూ అటు చూసి ఇటు చూసి.

[మూలం : Lewis Carrol – Jabberwocky]