జనవరి 2004

ప్రపంచవ్యాప్తంగా వున్న పదివేల పైచిలుకు “ఈమాట” పాఠకులకు నూతన వత్సర శుభాకాంక్షలు!

కవి శ్రీ ఇస్మాయిల్‌ గారు నవంబర్‌ లో కీర్తిశేషులయారు. ఆయన జ్ఞాపకానికి ఈ సంచికను అంకితమిస్తున్నాం. ఈ ఐడియాని ఇవ్వటమే కాకుండా ఎంతో శ్రమించి ఇది సఫలం కావటానికి కారకులైన విన్నకోట రవిశంకర్‌ గారికి కృతజ్ఞతలు.

ఇస్మాయిల్‌ గారి కవిత్వాన్ని గురించి చక్కటి విశ్లేషణను రాసి యిచ్చిన వెల్చేరు నారాయణరావు గారికి కూడ అభివందనాలు.

క్రితం సంచికలో లాగానే దీన్లో కూడ ఎన్నో ఆడియో ఫైళ్ళని అందిస్తున్నాం. ఇవన్నీ పరుచూరి శ్రీనివాస్‌ గారు పంపగా మాచవరం మాధవ్‌ గారు డిజిటైజ్‌ చేసి ఇచ్చారు. వారిద్దరికీ కృతజ్ఞతలు. ఎప్పుడో విజయనగరం కళాశాల కార్యక్రమాలలో కృష్ణశాస్త్రి గారు చేసిన ప్రసంగ పాఠాన్ని మాచవరం మాధవ్‌ గారు సంపాదించి టైప్‌ చేసి పంపారు. ఇంత చక్కటి రచనని మనకు అందించిన కృష్ణశాస్త్రి గారిప్పుడు లేకపోయినా, వారి ఈ రచనను మనకిచ్చిన మాధవ్‌ గారికి కృతజ్ఞతలు.

చక్కటి రచనలను అందిస్తున్న రచయిత్రు(త) లందరికీ మా వందనాలు. ఇంకా రచయితలు, రచయిత్రులు ముందుకు రావలసి వుంది. అందరికీ మా ఆహ్వానం!