మొత్తానికి ఇళ్ళకన్నా, ఇళ్ళు చూపించిపెట్టే ఏజంట్ల వెదుకులాట అనేది అతి ముఖ్యం అయిపోయింది నాకు. ఆ పనిలోనే ఒకరోజు కాస్త పాపభీతి, దైవభక్తి మెండుగా ఉన్నట్టు కనపడే ఒక ఏజెంట్ దొరికాడు. నేను అతడిని కలవడానికి వెళ్ళిన సమయంలో అతను ఒక దేవత పటం ముందు నేలమీద కూర్చుని ధ్యానం చేస్తూ ఉన్నాడు.
శీర్షికలు సంచికలు
తిలక్ మొదటగా తనను తాను చూసుకున్నది, చెక్కుకున్నది, పక్వమైనదీ ఒక పద్యకవిగానే. అందుకనే ఆయన వచనకవిత్వాన్ని వ్రాయడం మొదలుపెట్టిన తరువాత కూడా పద్యాన్ని విడిచిపెట్టలేదు. తిలక్ పద్యం ఒక మెత్తందనాల జల్లు. కవితాగుణాల పెల్లు. ఆయన ఛందస్సును కించపరచకుండా లొంగదీసుకొని దానికి ఆధునికభాష నేర్పాడు. వినమ్రంగా పద్యసరస్వతి చెంపపై సరికొత్తగా చిటికవేశాడు. ఆమె నవ్వును గమనించి తల పైకి ఎత్తాడు. తన ఛాతీని విప్పార్చాడు.
గడ్డకట్టిన జీవితాలు
మాటలు మర్చిపోయి
ప్రేమలు కరువై
అరచేతులు రుద్దుకుంటూ
గొంగళ్ళు కప్పుకున్న
మానవాళి ఆనవాళ్ళు.
ఒకచోట నీళ్ళలోకి దిగి, వేగంలేని అలలతో ఆడుతున్నాం. నాయర్‌కి ఈత వచ్చు. నాకూ ప్రకాశం బారేజ్ దగ్గరి ఘాట్‌లలో ఈదిన అనుభవం ఉన్నా, సముద్రంలో ఇదే మొదటిసారి… ఇంతలో, కొద్దిదూరంలో ముగ్గురు విదేశీ వనితలు. అంతే. మా చూపులు అటే తిరిగిపోయాయి. వాళ్ళు పరుగెడుతున్నారు. అలలకి అల్లంత దూరంలో ఉండగానే ఒక్కొక్కటిగా బట్టలు వలిచేసుకుంటూ దభేల్ దభేల్మంటూ నీళ్ళలోకి దూకారు. ఆ నవ్వులూ కేరింతలూ… నాయర్ ముఖంలో ఒక వెర్రి సంతోషం.
పాఠకులంటే ఎంతో చిన్నచూపు ఉంటే కాని ఓ రచయిత ఇలాంటి కథ రాయలేడు. మనుషులను సెన్సిటైజ్ చేయడం ఓ కుట్ర. రాజకీయాలకంటే సాహిత్యమే ఆ పని ఎక్కువ చేస్తుంది. దాన్ని రాజకీయం వాడుకుంటుంది. ఈ కథలో పేదరికం, వివక్ష, వెర్రి ప్రేమ ఇలాంటి వాటిని ఓవర్ రొమాంటిసైజ్ చేయడం ద్వారా పాఠకుడి ఆలోచనలతో కాకుండా ఎమోషన్‌తో ఆడుకోవాలనే ఆలోచన ఈ కథను, రచయితను ఇద్దరినీ అధమ స్థాయిలోకి తీసుకెళ్తున్నట్లుంది.
చిన్నప్పుడు నిజానికీ అబద్ధానికీ తేడా తెలీని అయోమయంలో ఉండేదాన్ని. పాలిపోయిన నిజం కంటే, రంగేసిన అబద్ధమే బాగుంటుందని అర్థమైంది. ఎప్పుడు సమయం చిక్కినా నా రహస్య ప్రపంచంలోకి పరిగెత్తేదాన్ని. అమ్మ పెట్టిన నియమాలను ఎగరగొట్టడంలో గొప్ప ఆనందం దొరికేది. పనివాళ్ళ కంచాల్లో తింటూ వాళ్ళతో గడపటం, చెల్లమ్మక్క వేలు పట్టుకుని పొలాల్లో నడుస్తున్న ఊహలు, గాల్లో దూరం నుంచి తేలి వచ్చే పనివాళ్ళ కేకలు. వొద్దన్న పనులు చేస్తుంటే కలిగే ఆనందం, నాలో బోల్డంత ధైర్యాన్ని నింపింది.
టెస్ట్ స్ట్రిప్ మీద రిజల్ట్ కోసం ఎదురుచూస్తూ కేరీ-ఆన్ లోంచి విడిచిన బట్టలని తీసి బాత్‌రూమ్‌లో ఒక మూల పడేసింది. మేకప్ తుడుచుకుని, మొహం కడుక్కుని, నైట్‌డ్రెస్‌లోకి మారి ఫోన్ చేతిలోకి తీసుకుంది. అప్పటికే మోగన్ నించి రెండు మిస్‌డ్ కాల్స్ ఉన్నాయి. ఫోన్‌ని సైలెంట్ మోడ్‌లో పెట్టడంవల్ల ఆమెకి తెలియలేదు. హబ్బీ అని, మోహన్ అనీ కాక ఆ పేరుతో భర్తనంబర్ లిస్ట్ చెయ్యడం తప్పితే, అతని ఇష్టానికి విరుధ్ధంగా చేసిన పని ఏదీ ఆమెకు గుర్తుకురాదు.
ముఖమంతా మాపుతో
నలిగిన పువ్వులా ఉంది
అంత భద్రంగా
లోపల దాచుకున్నానంటే
బహుశా కోహినూర్ వజ్రంకన్నా
విలువైనదే అయ్యుంటుంది
ఒకరోజు కొత్తబట్టలు కట్టుకుని మా ఇంటికి వచ్చింది మా అక్కను కలవడానికి. ఆ రోజు ఏ పండగా కాకపోవడంతో ఆ రోజు తన పుట్టిన రోజని గ్రహించాను. మధ్యాహ్నమల్లా కూచుని మంచి ఆర్ట్ పేపరు మీద వాసు రాసిన పాటని పొందికగా రాసి, మూడో చరణంలో ‘మూర్తి’ అన్న పదాన్ని కోట్‌లలో పెట్టి వాళ్ళమ్మగారు లేని సమయం చూసి వాళ్ళింటికి వెళ్ళి ‘ఇది నీకు నా పుట్టినరోజు కానుక’ అని చెప్పి బుచ్చిరత్నానికి ఇచ్చేను. అది చదివి నమ్మలేనట్టు నావంక చూసింది.
నాటు అంటే అర్థం తెలుసా? మొదట్లో జనం గుంపులు, గుంపులుగా ఎక్కడ ఆహారం దొరికితే అక్కడికి తిరుగుతూ బతికేవారు. తర్వాత తర్వాత వ్యవసాయం చెయ్యడం నేర్చుకున్నారు. దాంతో ఒక్కొక్క గుంపు ఒక్కొక్కచోట స్థిరపడ్డారు. అంటే నాటుకుని స్థిరంగా ఎక్కడికీ వెళ్ళకుండా ఒక్క చోటే నిలిచి ఉన్నారు.
పట్టుచిక్కని
చిక్కని పట్టు కలలు.
రేయి చేపకంటిని
వేలితో పొడిచిన వేకువ జాలరి.
మఖమల్ సమయం
మెత్తగా వ్యాప్తమవుతూ…
పుస్తకం పేరు, రచయిత పేరు తప్పా తెలిసిన సమాచారం ఏమీ చేతిలో లేదు. నా ఆదివారాలూ నా ఖాళీసమయాలూ నాకు కాకుండా పోయాయి. ఇక వెతుకులాట మొదలయింది. ఆయన బెజవాడలో డాక్టర్‌గా యే ప్రాంతంలో నివసించేవారు? యెలా వుండేవారు? వారి ఫోటో యేమైనా దొరుకుతుందా? వారి పిల్లలెవరన్నా కనిపిస్తారా?
అడ్డం కరకుమేఘపుగర్జనలకుచింతపడినపికము (6) సమాధానం: మేఘచింతకము అమ్మబడిన పెళ్ళికొడుకు శుభలేఖ కథ (6) సమాధానం: వరవిక్రయము పాలబుగ్గల పసిడిపిల్ల కారులో వెళ్ళినది (3) సమాధానం: […]
క్రితం సంచికలోని గడినుడి-75కి మొదటి ఇరవై రోజుల్లో పండ్రెండుగురి నుండి సరైన సమాధానాలు వచ్చాయి. విజేతలకందరికీ మా అభినందనలు.
గడి నుడి-75 సమాధానాలు.
మారుతున్న కాలంతో పాటూ సాహిత్య వేదికలూ మారుతున్నాయి. ఆడియో కథలు ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. వీటికి యూట్యూబ్ ముఖ్య వేదిక. కనుక, ఈమాట యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించాం. గతనెలలో కొత్తగా అప్లోడ్ చేసిన రచనల వివరాలు ఇవీ:
డిసెంబరు, జనవరి నెలల్లో హైదరాబాదు, విజయవాడలలో జరిగే పుస్తక మహోత్సవాలు ఏటేటా మరింత బలపడి సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకోవడం ఆహ్వానించదగ్గ పరిణామం. వేల పుస్తకాలు ఒకేచోట అందుబాటులో ఉండే ఈ ప్రదర్శనలకు విచ్చేస్తున్న వారి సంఖ్యా అదే తీరున ఉంటోంది. సామాజిక మాధ్యమాలు, ప్రచురణ రంగంలో వచ్చిన మార్పుల పుణ్యమా అని రచయితల సంఖ్య పెరిగింది. రచయితలకూ పాఠకులకూ మధ్య దూరం తగ్గింది. ఈ స్నేహభావాలన్నీ పుస్తక ప్రదర్శనల్లో కనిపించడమే గాక, సాహితీప్రియులు పెద్ద సంఖ్యలో పుస్తకప్రదర్శనకు విచ్చేసేందుకు కూడా దోహదం చేస్తున్నాయి. తెలుగు సాహిత్యరంగం ఈ రెండు ప్రదర్శనలే లక్ష్యంగా పుస్తక ప్రచురణ చేపడుతోంది అనడం అతిశయోక్తి కాదు, ఎంతో మంది రచయితలు ఇక్కడి అమ్మకాలే కొలమానంగా పుస్తకాలను సిద్ధం చెయ్యడం అసమంజసమూ కాదు. కాని, పుస్తక ప్రచురణ, ప్రదర్శన, విక్రయం – ఇవన్నీ ఇలా ఈ రెండు ప్రాంతాలకు, కొన్ని రోజులకూ మాత్రమే పరిమితం కాకూడదు. తెలుగునాట సాహిత్యానికి ఆదరణ అంతగా లేదన్న అభియోగం నిజం కాకూడదంటే ఈ పుస్తకాలను, ఈ పుస్తకాల పండుగలను మిగతా ఊళ్ళకు, చిన్న చిన్న పట్టణాలకూ తీసుకురావాలి. సాహిత్యం ఒక సాంస్కృతిక సందర్భం కూడా కావాలి. చిన్నచిన్న ఊళ్ళల్లోనూ పుస్తకాల దుకాణాలుంటాయి. కాని, అవి ముఖ్యంగా నిత్యావసరాలకు ఉపయోగపడేవే కాని సాహిత్యాభిలాషను పెంపొందించే ఉద్దేశ్యంతో నడిచేవి కావు. ఆర్థిక కారణాలవల్ల సాహిత్య ప్రచురణకర్తలు, పంపిణీదారులు అలాంటి ఊళ్ళలో ఏడాది పొడుగునా దుకాణాలు తెరవలేరు. అయితే, అంత చిన్న ఊళ్ళల్లో కూడా పండగలకు జాతరలు, ప్రతి ఏటా తిరణాళ్ళ వంటివి జరుగుతాయి. ప్రతీ ఏడూ జరిగే ఆ పండుగలు వారి సామూహిక సామాజిక సాంస్కృతిక స్పృహలో భాగం కనుక జనం వాటిని గుర్తు పెట్టుకుంటారు. వాటికోసం ఎదురు చూస్తారు. వాటి గురించి మాట్లాడుకుంటారు. సంగీతం, సాహిత్యం – కళ ఏదైనా సమాజంలో ఆదరణ పొందాలి అంటే అది ఆ సమాజపు సాంస్కృతిక స్పృహలో, ఆ ఊరి ప్రజల సంభాషణలో భాగం కావాలి. పుస్తకాల పండగ కూడా అలాంటిదే, అదీ మనదే అన్న భావనను వారి స్పృహలో భాగం చెయ్యగలిగితే, ఆ సందర్భానికి కూడా క్రమేణా ఎదురు చూస్తారు. పుస్తకాలు కొంటారు, అంతకంటే ముఖ్యంగా చదువుతారు. సమకాలీన సాహిత్యంతో పరిచయం కలుగుతుంది. అవగాహన ఏర్పడుతుంది. మెల్లగా, మంచి సాహిత్యాన్ని గుర్తుపట్టడమూ ఆదరించటమూ అలవాటవుతుంది. నగరాలంత పెద్ద స్థాయిలో కాకున్నా ఊళ్ళల్లో పాఠశాలల ఆటమైదానాల వంటి చిన్న ప్రదేశాలలో, ఏదో ఒక స్థాయిలో గ్రంథాలయాల్లో, ఖాళీగా ఉన్న కళ్యాణమండపాల్లో పుస్తకోత్సవాలు ఏర్పాటు చేయవచ్చు. మొదట్లో ప్రచురణకర్తలకు, నిర్వాహకులకూ ఇవి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా లేకపోయినా, చిన్న చిన్న పట్టణాల్లో, ప్రతీ ఏడాదీ జరిగే జాతరలు, ఉత్సవాల లాగానే, పుస్తకాల పండుగ కూడా ఒకటి వాళ్ళకు గుర్తుండేట్టు చేయగలిగితే, పండుగలా జరపగలిగితే, సమకాలీన సాహిత్యాన్నీ ఆ చిన్న పట్టణాల సామూహిక స్పృహలో భాగం చెయ్యవచ్చు. తద్వారా సాహిత్యాభిరుచిని మరింతగా పెంపొందింపవచ్చు. అయితే, ఈ మార్పు ఏ ఒకటీ రెండేళ్ళలోనే వచ్చేది కాదు. కాని, గొప్ప సంకల్పాలు, గొప్ప ప్రణాళికలు ఎప్పుడూ ఎక్కువ సమయాన్నే కోరుకుంటాయి కదా.
ఈ కవితను ఎలా చదవాలి? అడగవలసిన ప్రశ్న: ఎలా చదవకూడదు? ఇది చదవకూడని కవిత. సరిగమలు చదివితే సంగీతమవుతుందా? వేస్ట్ లాండ్ లోని పదాల, పదార్థాల స్వరాలకు సంగీతరచన చేసుకొని, చెవులు మూసుకొని వినాలి. అర్థం చేసుకోవలసినది కూడా కాదు.
ఈ స్థితి పాపమాప్రియుడికి తెలియని కష్టంగా ఉంది. అందుచేతనే సృష్టికర్తను పట్టుకొచ్చి, ‘అయో విధీ!’ అంటున్నాడు. అనురాగమెటువంటిదో ఇంత కష్టించి వర్ణించాడు గాని, తన కామినికి అర్థమయిందో లేదోనని ఒక పోలికను తీసుకువచ్చి, ఇట్లా సమర్థిస్తున్నాడు. ఆ అనురాగము ఒక బావి వంటిదట. సాధారణమైన కూపం కాదది. అది దట్టమైన పచ్చికతో ఆవృతమై, లలితమైన సుఖాన్ని ఎంతమాత్రమూ ఇవ్వని బావి. ఎప్పుడూ ఇంకిపోయేది కూడా కాదు అది.
భలేగా ఉంది లెక్కల టీచరు! పొడుగ్గా, రెపరెపలాడే వాయిల్ చీరలో – ఎంత తెలుపో! మోచేతివరకూ చేతులున్న జాకెట్టు, నల్లతోలు బెల్టుతో రిస్టువాచీ, రెండో చేతికి నల్ల గాజులు, చెవులకు పొడుగ్గా వెండి లోలాకులు, మెళ్ళో సీతాకోకచిలక లాకెట్టుతో సన్నటి వెండి గొలుసు, కళ్ళకు సురమా కాటిక!
ఒద్దు ఒద్దనుకుంటూనే ఒక ఉత్తరాన్ని తెరిచాను. కుదురుగా ఉన్నాయి అందులోని పంజాబీ అక్షరాలు. మరో ఉత్తరం తెరిచాను. అదే చేతి రాత. అదే పొందిక. ఇంకోటి… ఆ గుర్‌ముఖి అక్షరాలు చదవడం రాదు కాబట్టి, ఆమె రాసింది నాకు తెలిసే ప్రమాదం లేదు. కానీ అవి ప్రేమలేఖలని గుర్తుపట్టడానికి, చదవాల్సిన పని లేకపోయింది! ప్రతి ఉత్తరానికీ కుడి చివరన స్పష్టంగా, సంతకానికి బదులు లిప్‍స్టిక్ రాసుకున్న పెదాలు ఒత్తిన ముద్రలు…