అర్జునుడు ఈ విధంగా జనులను ఆశ్చర్యమగ్నులను చేస్తుండగా ద్వారం దగ్గరకు ఒక యువకుడు వచ్చి భుజం చరుస్తాడు. ఆ శబ్దం కొండ మీద పడే పిడుగుపాటు లాగా భయంకరంగా వినిపిస్తుంది.

కానీ ఆ బ్లాక్ బోర్డ్ పక్కన
అతి నిర్లక్ష్యంగా కూచొని ఉంది
వెయిస్ట్ కోట్‌లో

ఓ పేదరికమా, నిన్ను చూస్తే నాకు జాలి కలుగుతుంది. నువ్వేమో నన్ను స్నేహితునిలా అంటి పెట్టుకొని నాతోనే ఉన్నావు. నేనొక వేళ చచ్చిపోతే నీ గతేమవుతుందనేదే నా చింత సుమా! ఉన్నట్లుండి కొరడాతో కొట్టినట్లయింది.

ఈమాట పదవ జన్మదిన ప్రత్యేక సంచికకు స్వాగతం! ఈ సందర్భంగా ఈమాటకు మీ సహాయ సహకారాలు కలకాలం ఉంటాయని ఆశిస్తూ, ఈ సంచికను మీ ముందుకు తెస్తున్నాం. ఈ సంచికలో:

ప్రత్యేక వ్యాసం: ఇటీవలే కన్నుమూసిన ప్రముఖ కవి, రచయిత “స్మైల్” (మహమ్మద్ ఇస్మాయిల్) జ్ఞాపకాలు వేలూరి వేంకటేశ్వర రావు మాటలలో.

  • ఏమిటీ ఈమాట మాట? ఈమాట ప్రారంభించినప్పటి ఆశయాలు ఎంతవరకూ నిజమయ్యాయి? కే.వీ.యస్. రామారావు మాటల్లో: “పదేళ్ళ ఈమాట మాట“. వేలూరి వేంకటేశ్వర రావు సంపాదకీయం : “ఈమాట -నామాట“.

తెలుగు కథ శతవార్షికోత్సవ సందర్భంగా కౌముది వెబ్ మాస పత్రిక, రచన మాస పత్రికలు సంయుక్తంగా కథల పోటీ నిర్వహిస్తున్నాయి.

నేటి సినిమా పాటల రచయిత ఒక పంచ భర్తృక. మాకు ఐదుగురు మొగుళ్ళు. సంగీత దర్శకుడు, సినిమా నిర్మాత, దర్శకుడు, గాయకుడు, నిర్మాత లేక దర్శకుడి బావమరది. ఇంతమంది చెప్పింది విని గీత రచయిత పాట రాయాలి.

రెండు గంటల పాటు జరగాల్సిన కచేరీ దాదాపు ఎనిమిది గంటల వరకూ జరిగింది. త్యాగరాజు సంగీతంలో మునిగి పోయి శరభోజి మహారాజు గోష్ఠి గురించి అందరూ మర్చిపోయారు.

అనంతం! మనిషి మనసుని ఇంతగా ప్రభావించిన లోతైన ప్రశ్న మరొకటి లేదు. మానవ మేధని ఇంతగా ఉత్తేజింపచేసిన ఊహ మరొకటి లేదు. అయినా, అనంతం కన్నా స్పష్టం చెయ్యాల్సిన భావన మరొకటి లేదు.

పదహారు సంవత్సరాలు నిండితే కానీ జ్ఞానదంతాలు రావు. అయితే, చిన్నతనమేలే అని అశ్రద్ధ చెయ్య కూడదు. రాబోయే ఆరేళ్ళూ ఆ దంతాలు కొక్కిర్లు లేకండా సరిగా పెరిగేట్టు చూసుకోవాలి. జాగ్రత్త పడాలి.

వంగూరి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 14 – 15, 2009 లలో హైదరాబాదులో “తెలుగు కథ శతవార్షికోత్సవం” పేరున సభలు జరపటానికి నిశ్చయించడం జరిగింది.

ఈ సమావేశంలో కవులు, కథా, నవలా రచయితలు, విమర్శకులే కాక సాహిత్యాభిమానులు ఎందరో పాల్గొన్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఈ-మెయిలు ద్వారా, రచ్చబండ ద్వారా పరిచితులైన ఎందరో మిత్రులను కలుసుకొని మాట్లాడే భాగ్యం కలిగింది.

అప్పుడప్పుడు మా ఆవిడ, అబ్బాయిలతో గుడికి వెళ్తుంటా. వాళ్ళ లాగే నేనూ దణ్ణం పెట్టుకుంటా. గుళ్ళో దొరికే ప్రసాదం తింటా. కొన్ని సార్లు దణ్ణం పెట్టుకోడానికి ముందే ప్రసాదం తెచ్చుకుని తింటా.

జొన్నగడ్డల వేంకటేశ్వర శాస్త్రికి ఈ ఏడాది బ్రౌన్ పురస్కారాన్ని ప్రకటిస్తున్నాము. ఇస్మాయిల్ అవార్డుకు పి.మోహన్ కవితా సంకలనం “కిటికీ పిట్ట”ఎంపికైంది.