సైగ నాదికాదు
కనుసైగ నీది
త్రోవ నాదికాదు
తప్పిపోయినవాణ్ణి నేను
ప్రతి దినం
నది మీద తిరిగే గాలిలా
రోజూ వేటకెళ్ళే పడవలా
ఎదిగి తరిగే వెన్నెలలా
దైనందిన
దీర్ఘ చదరంలో
చలిస్తున్నవాణ్ణి
తుఫాన్ వస్తుందని తెలీదు
గాలి సుడిగుండం
మునకేసిన పడవ
సైగ నాదికాదు
కనుసైగ నీది
రెండు చేపలు
వల పట్టేయి
త్రోవ నాదికాదు
తాడు బిగించి
దీర్ఘ చతురాన్ని
కుదించి
ముక్కోణంలోకి
లాగినప్పుడు
తప్పిపోయినవాణ్ణి నేను
తుఫాన్ ముగుస్తుంది
చేతులతో కాళ్ళతో
ఈది ఈది
సమస్త శరీరాన్ని ఒడ్డి
చేరినతీరం
గమ్యం నాదే
తీరం నీదే
సైగలెందుకు
కనుసైగలెందుకు
అంతా ఏకాంత ద్వీపమే!!
