కథ చదివేప్పుడు పాఠకుడికి ట్రెజర్ హంట్ లాంటి అనుభవం కలిగిస్తాడు రచయిత. కొన్ని క్లూలు అక్కడక్కడా ఉంటాయి. వాటిని వెతికి పట్టుకోవటం పాఠకుడి పని. పట్టుకున్నాక వాటితో కథను మళ్ళీ పునర్నిర్మించుకోవాల్సి వస్తుంది. కొందరికది ఇష్టమయితే మరికొందరికి కష్టం.
రచయిత వివరాలు
పూర్తిపేరు: సురేష్ఇతరపేర్లు:
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు:
రచయిత గురించి:
సురేష్ రచనలు
చిన్నప్పుడోసారి ఇంట్లో నన్నొదిలి నాలుగురోజులు ఎటోపోయి తర్వాత ఇంటికొచ్చారు అమ్మా నాన్నా. నేను ఆడుకొంటూ పట్టించుకోలేదు, కానీ కాసేపటికి అనుమానమొచ్చి లోపలికెళ్ళి చూశాను. అమ్మ వళ్ళో ఓ పాప పడుకొని ఉంది. ఎవరోలే పాపం అని నా మానాన నేను ఆడుకొంటూ కొంచెం సేపయ్యాక మళ్ళీ చూస్తే అదింకా ఆ ఫోజు లోనే ఉంది.
చిక్కబడిన చీకటిలాంటి నిశ్శబ్దం. గోడ పక్కన ఎండిపోయిన నాలుగైదు అరటి తొక్కలు. మూలగా చెత్తకుప్ప లోంచి బయలుదేరిన చీమలబారు వంటింటి గుమ్మం మీదెక్కి, మలుపుతిరిగి, […]