పసిడి పన్నుల పఠాభి కన్నుమూత

paThAbhi” పఠాభి”గా అవతరించిన తిక్కవరపు పట్టాభిరామిరెడ్డి “ఫిడేల్ రాగాల డజన్” ద్వారా తెలుగుదేశంలో సుప్రసిద్ధులు. అంతర్జాతీయ బహుమతి లభించిన “సంస్కార” చిత్రం ద్వారా యావద్భారత కీర్తినార్జించారు కూడా. పఠాభి జననం 1919 ఫిబ్రవరి 19న నెల్లూర్ లో. శాంతి నికేతన్ లోనూ, కొలంబియా విశ్వవిద్యాలయంలోనూ విద్యాభ్యాసం. స్నేహలతా రెడ్డిగా జగమెరిగిన స్నేహలతా పావెల్ తన జీవిత సహచరి. “ఫిడేల్ రాగాల డజన్”, “కయిత నా దయిత”, “పఠాభి పన్‌చాంగం” అన్న మూడు కావ్యాలు ఆధునిక తెలుగు కవితా రంగంలో విన్నూత్న ప్రయోగాల సృష్టిగా తెలుగు వారి మనసుల్లో కలకాలం నిలుస్తాయి.

పఠాభి మే 6, 2006 శనివారం నాడు బెంగుళూరు లో కన్నుమూశారు. ఆయన వయస్సు 87. ఆయనకు శ్రద్ధాంజలిగా పఠాభి రచనలపై ప్రొఫెసర్ వెల్చేరు నారాయణ రావు గారు రచించిన రెండు వ్యాసాలను ఈమాట పాఠకులకు అందిస్తున్నాము.

ఆధునిక కవులలో విలక్షణ కవిగా నిలిచిన పఠాభికి ఇవే మా నివాళులు