- అరణ్యం తడిచిపోతుంది
అరవిచ్చిన పూవులా నీవు
నిరంతరం నిన్నే చూస్తుంటా
వృక్షాల కొమ్మల్లోంచి–
కళ్ళు చికిలించే సూర్యునిలా
- ఎండిన ఆకుల్లో
ఎందుకు దాగున్నావు
పాత బావిలో నీరు
కన్నీటి చుక్క
- గండశిలను
చుడుతుంది సెలయేరు
నును మెత్తని కౌగిలి
ఉజ్వలంగా వెలిగే తారలు
అరణ్యంలో ఆకుల చాటున
విరబూసిన పూవులెన్నో
- నక్షత్రాలన్నీ
నా మాటే విన్నాయి
నల్లని అరణ్యం
కదిలే ముంగురులు
పెదవి విప్పలేదు
చెల్లాచెదురైన
లేళ్ళ గుంపులు
మళ్ళీ
చూస్తాననుకోను
రచయిత తమ్మినేని యదుకులభూషణ్ గురించి:
తమ్మినేని యదుకుల భూషణ్ జననం రాయలసీమలోని చారిత్రకస్థలం తాడిపత్రిలో. కొన్నాళ్ళు సింగపూర్‌లో పనిచేసారు. నివాసం సోమర్‌సెట్, న్యూజెర్సీలో. “నిశ్శబ్దంలో నీ నవ్వులు” అనే కవితాసంకలనం ప్రచురించారు. కథలు, విమర్శలు కూడా రాసారు.
...
పూర్తిగా »