లోతు కొలను
ఈత రాదు
చేతులాడవు
పాచిబట్టిన రాళ్ళు
నాచు మొక్కలు
పలుకరించే చేపలు
జలపాతం కింద
చూడలేను
అడుగున లీలగా
బుడగలతో
వేడిసోకిన
మేడిపండు
రాలి పడి
వలయాలు కదిలి
గలగల సద్దులో కలిసి
అలలెరుగని ఆకాశం
నిలకడగా అంతరంగం
చలనం లేని క్షణం
నేను లేను