రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

బైరాగి గీతాలకు గానరూపం: వర్షాయామిని

రచన: ప్రశాంతి చోప్రా, బైరాగి
సెప్టెంబర్ 2025

వర్షాయామిని

మేఘాల మోహాలు ముసురుకొను నీరేయి
వీడి క్రొమ్ముడి చెదిరి క్రమ్ముకొన్నవి కురులు
నల్లత్రాచుల వోలె ఒల్లమాలిన ఇరులు
చూపులందని పొరల చీల్చి మూగిన మరులు

ప్రాత తలపులు గుబులుకొన్నవీ పయ్యెదల
ఊర్పు తావులు కొసరి విసిరి చను నీరేయి.
మేఘాల మోహాలు ముసురుకొను నీరేయి.

ఆకాశదీపాలు ఆరిపోతున్నాయి.
తెగిన ముత్తెపుసరులు జారిపోతున్నాయి
రేగనుల నీలాలు కారిపోతున్నాయి

దెసల చెక్కిలినంటి కారుకాటుక ఛాయ
నొసటి వ్రాతలు చెరిగి చెమరుకొను నీరేయి
మేఘాల మోహాలు ముసురుకొను నీరేయి.

మెరుపు మెరిసినచోట తెరచి మూసిన తలుపు
చిమ్మచీకటి బాట చేరనీయదు మలుపు
ఈరేయి మీటినది ఏనాటిదో పిలుపు

మతుల తీగెల నూపి, స్మృతుల గాయము రేపి
వెతల క్రొంజివురులను పసరుకొను నీరేయి.
మేఘాల మోహాలు ముసురుకొను నీరేయి.

    
   

0There are no comments

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • బైరాగి గీతాలకు గానరూపం: వర్షాయామిని
  • బైరాగి గీతాలకు గానరూపం: అదే జ్యోతి
  • బైరాగి గీతాలకు గానరూపం: హేజననీ!
  • బైరాగి గీతాలకు గానరూపం: మాతృ గీతిక
  • బైరాగి గీతాలకు గానరూపం: సాంధ్యగీతిక

ఇటువంటివే…

  1. బైరాగి గీతాలకు గానరూపం: ఎంతెంతదూరం?
  2. బైరాగి గీతాలకు గానరూపం: కెందామర
  3. బైరాగి గీతాలకు గానరూపం: హేజననీ!
  4. బైరాగి గీతాలకు గానరూపం: సాంధ్యగీతిక
  5. బైరాగి గీతాలకు గానరూపం: అనునయము

సెప్టెంబర్ 2025 సంచికలో ...

  • GRANT ME A GRAIN OF FAITH
  • అంధ తమిస్రాన అఖండ జ్యోతి ఆలూరి బైరాగి
  • అణువణువున కవి
  • అనుశీలనకు అందని అనువాదాలకు లొంగని ఆలూరి బైరాగి కవనానునాదం!
  • అస్తిత్వ కథా రచయితగా బైరాగి
  • అస్తిత్వవాద మహాకవి బైరాగి
  • అ‘తను’
  • ఆధునిక ఆర్షకవి ఆదిమ బైరాగి
  • ఆలూరి బైరాగి ‘ఆగమగీతి’
  • ఆలూరి బైరాగి కథల్లో తాత్త్విక చింతన, కవితా ధోరణి
  • ఆలూరి బైరాగికవి
  • ఏకాంతంలో ఒక బైరాగి
  • ఒంటరి డేగనై, తప్పిపోయిన లేగనై — బైరాగి
  • ఒక గంట జీవితం — మనసు అంతరంగ యాత్ర
  • ఒక బైరాగి చింతన
  • కవన మర్మయోగి బైరాగి
  • కవి కథక విరాగి బైరాగి
  • చీకటి నీడల రమ్యక్రీడ – విరాగి జీవనగమ్య హేల
  • చీకటి నీడలలో బైరాగి జాడ
  • దివ్యభవనంలో బీజాక్షరి
  • దివ్యభవనంలోకి…
  • నా వాడు
  • నాకు జీవితాన్ని ఇచ్చిన కవి బైరాగి
  • నిరంతర స్వేచ్ఛాజీవి బైరాగి
  • నూతిలో గొంతుకలతో నలభయ్యేళ్ళ ప్రయాణం
  • నేనెరిగిన బైరాగి
  • పూర్ణకవి బైరాగి
  • బైరాగి
  • బైరాగి
  • బైరాగి “నూతిలో గొంతుకలు”
  • బైరాగి అవగాహన
  • బైరాగి కవితాత్మానుభవం
  • బైరాగి గీతాలకు గానరూపం: అదే జ్యోతి
  • బైరాగి గీతాలకు గానరూపం: అనునయము
  • బైరాగి గీతాలకు గానరూపం: ఎంతెంతదూరం?
  • బైరాగి గీతాలకు గానరూపం: కెందామర
  • బైరాగి గీతాలకు గానరూపం: జయ దేవానాం ప్రియ
  • బైరాగి గీతాలకు గానరూపం: నీ కోసం
  • బైరాగి గీతాలకు గానరూపం: మాతృ గీతిక
  • బైరాగి గీతాలకు గానరూపం: వర్షాయామిని
  • బైరాగి గీతాలకు గానరూపం: సాంధ్యగీతిక
  • బైరాగి గీతాలకు గానరూపం: హేజననీ!
  • బైరాగి గొంతుక
  • బైరాగి సర్వదా సజీవుడే
  • బైరాగి సూతాశ్రమం
  • బైరాగితో ప్రయాణం
  • యూట్యూబ్‍లో ఈమాట: ఆగస్ట్ 2025
  • వెలుగు నీడల్లో బైరాగి
  • వేదనాభరితం బైరాగికవిత్వం
  • వైరాగ్య రాగంలో మీటిన ఏక్‌తార: బైరాగి కవిత్వం
  • శతవసంతాల కవి ఆలూరి బైరాగి
  • సమాజాన్ని వ్రేలెత్తి చూపిన కవి
  • సెప్టెంబర్ 2025 బైరాగి ప్రత్యేక సంచిక
  • స్మరణ
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

బైరాగి గీతాలకు గానరూపం: నీ కోసం
బైరాగి గొంతుక

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.