సులువైన పని

అనువాదం


అన్నిటికంటే హత్య చెయ్యడమే
సులువైన పని

హత్యకు గురైన దేహపు కళ్ళను చూసి
మీరు దాక్కోనక్కర్లేదు
మీ దుర్వాసనలేవీ
దాని ముక్కుపుటాలకు అందవు
నలుపెక్కిన నాలుకా
ఆరిపోయిన పెదవులూ
మిమ్మల్ని ప్రతిఘటిస్తూ
ఒక్క మాటైనా అనవు
మీ అనర్థ విజయభేరీల శబ్దాలేవీ
దాని చెవినబడే అవకాశమేలేదు
దాని వేళ్ళు
మీకు ఎదురు తిరగవు

చర్చోపచర్చలు
అక్షరం, కళ
చరిత్ర, రాజకీయం
ఐకమత్యం, భిన్నత్వం
పరిశోధన, సాహిత్యం
సంధి, యుద్ధం
అన్నీ పనికిమాలిన పనులు
అన్నిటికంటే హత్య చెయ్యడం
సులువైన పని
శవాలు ఆలోచించవు.

(05-09-2015)

(మూలం: ఎళియ కారియం.)

మూలం


ఎళియ కారియం
పెరుమాళ్ మురుగన్

ఎల్లావట్రైయుమ్విడక్
కొలై సెయ్వదుదాన్ ఎళియ కారియం

కొలైయాన ఉడలిన్
కణ్గళైక్ కండు నీంగళ్ ఒళియ
వేండియదిల్లై
ఉంగళ్ నాట్రం ఎదువుం
అదన్ నాసిక్కుప్ పిడిబడప్ పోవదిల్లై
నీల నాక్కుం ఉలర్న్ద ఉదడుగళుం
ఉంగళుక్కు ఎదిరాగ
ఒరు సొల్లైయుం ఉదిర్క్కప్ పోవదిల్లై
ఉంగళ్ వెఱి ముఴక్కక్ కుమిఴిగళిన్
అనర్త్తచ్ చత్తం ఎదువుం
అదన్ సెవిగళిల్ విఴ వాయ్ప్పేయిల్లై
ఉంగళుక్కు ఎదిరాగ
అదన్ విరల్ ఎదువుం నీళచ్ చాత్తియమిల్లై

వాదం వివాదం
ఎఴుత్తు కలై
వరలాఱు సచ్చరవు
ఒట్రుమై వేట్రుమై
ఆయ్వు ఇలక్కియం
సండై సమాదానం
ఎల్లాం వెట్టి వేలైగళ్
ఎల్లావట్రైయుమ్విడక్
కొలై సెయ్వదుదాన్ ఎళియ కారియం
పిణంగళ్ సిందిప్పదిల్లై.

(కల్బుర్గిక్కు)
31-08-15

எளிய காரியம்
– பெருமாள் முருகன்

எல்லாவற்றையும்விடக்
கொலை செய்வதுதான் எளிய காரியம்

கொலையான உடலின்
கண்களைக் கண்டு நீங்கள் ஒளிய
வேண்டியதில்லை
உங்கள் நாற்றம் எதுவும்
அதன் நாசிக்குப் பிடிபடப் போவதில்லை
நீல நாக்கும் உலர்ந்த உதடுகளும்
உங்களுக்கு எதிராக
ஒரு சொல்லையும் உதிர்க்கப் போவதில்லை
உங்கள் வெறி முழக்கக் குமிழிகளின்
அனர்த்தச் சத்தம் எதுவும்
அதன் செவிகளில் விழ வாய்ப்பேயில்லை
உங்களுக்கு எதிராக
அதன் விரல் எதுவும் நீளச் சாத்தியமில்லை

வாதம் விவாதம்
எழுத்து கலை
வரலாறு சச்சரவு
ஒற்றுமை வேற்றுமை
ஆய்வு இலக்கியம்
சண்டை சமாதானம்
எல்லாம் வெட்டி வேலைகள்
எல்லாவற்றையும்விடக்
கொலை செய்வதுதான் எளிய காரியம்
பிணங்கள் சிந்திப்பதில்லை.

(கல்புர்கிக்கு)
31-08-15


అవినేని భాస్కర్

రచయిత అవినేని భాస్కర్ గురించి:

తమిళ తెలుగు అనువాదక రచయిత అవినేని భాస్కర్. ప్రధానంగా తమిళం వంటి ఇతర భారతీయ భాషలలోని ఉత్తమ సాహిత్యాన్ని తెలుగు పాఠకులకు పరిచయం చేయడంలో ఆయన విశేష కృషి చేస్తున్నారు. అలాగే, తెలుగు కథలను తమిళంలోకి కూడా తన అనువాదం ద్వారా అందజేస్తూ, దక్షిణ భారతీయ భాషల మధ్య సాహిత్య వారధిగా నిలుస్తూ, అవినేని భాస్కర్ గారు తెలుగు-తమిళ సాహిత్య రంగాల్ని సుసంపన్నం చేస్తున్నాడు.

 ...