నేత్రోన్మీలనం

ఈమాట ఒక సాహిత్యపత్రిక. సాహిత్యానికి పరిధులు, పరిమితులు ఉండవని, సాహిత్యం ఆహ్లాదాన్నే కాదు, ఆలోచననూ కలిగించాలని, సమాజపు పోకడలను ప్రశ్నించి, నిలదీసేలా కూడా ఉండాలని నమ్మే పత్రిక. కళలు, సాహిత్యం పట్ల కాని, వాటిని సృజించే కళాకారులు, కవి రచయితలు ఆ క్రమంలో ఏ రకమైన నిర్బంధాలకూ గురి కాగూడదని, వారికి వారి సృజన పట్ల పూర్తి స్వేచ్ఛ ఉందనీ నమ్మే పత్రిక. ఈ నమ్మకంతోనే గతంలో ఎన్నోసార్లు ఈమాట వివాదాలను ఎదుర్కున్నది. తన విశ్వాసాన్ని సడలనీయకుండా తన నమ్మకాలను సమర్ధించుకున్నది. కాని, సాహిత్య విమర్శ ఆ వేదికను దాటి, మత రాజకీయశక్తులకు, వారి దౌర్జన్యానికి ఒక ఆయుధమై, రచయితలకు మానసిక, శారీరక హాని కలిగించే ప్రమాదం ఉందని నిశ్చయమైనప్పుడు ఆయా రచయితలను కళాకారులను కాపాడుకోవడం కూడా ఈమాట తన బాధ్యతగానే పరిగణిస్తుంది. నేత్రోన్మీలనం అన్న ఈ కథను రాసిన రచయిత్రికి అశ్లీలము, అసభ్యము అయిన దూషణలే కాక, ఆమెపై భౌతికమైన దాడులకు కూడా సంసిద్ధత వ్యక్తం కావడం, అది నిజం అయే ప్రమాదమూ ఉందని తెలియడంతో, రచయిత్రి చట్టపూర్వకంగా చేసిన అభ్యర్థన మేరకు, ఆమె భద్రత గురించిన ఆందోళనతో, ఈ కథను ఈమాట నుంచి తొలగిస్తున్నాను. ఈ కథ ప్రచురించడం ద్వారా ముందు ముందు రాబోయే ఏ రకమైన చట్టపరమైన చర్యలకైనా ఈమాట బాధ్యత వహిస్తుందని తెలియజేస్తున్నాను. 

మాధవ్ మాచవరం
ఈమాట సంపాదకుడు.
06 నవంబర్ 2023.