అనామకం

కొన్ని కొన్ని సార్లు
కొన్ని కొన్ని విధాల మనిషిని
నేను.
కోట్ల కోణాలకి
ప్రతిసారీ కొత్తగా
నువ్వు.
ఇన్నేళ్ళ స్నేహాలైనా
అన్నేళ్ళ ప్రేమలైనా
ఆమీద మిగిలిన శూన్యమౌనాలకు
గడ్డకట్టిన జ్ఞాపకాలకూ లంకె పెడుతూ
‘ఎలా ఉన్నావ్?’ అని అడిగే మాటలు
తీరం మీద కూలబడే అలలు.

అదిగో
అటు చూడు
లైట్స్!
బట్ లైట్స్ నెవర్ గైడ్ యు హోమ్.
చీకటితో కాదు ఇబ్బంది
వెలుగుని వీపునేసుకుని వీచేదే కనుక.
ఇబ్బందంతా
నీకు-నాకు మధ్యన.

ఏమందాం దాన్ని మరి
ఏ పేరు పెడతావ్ చివరాఖరికి?