గడినుడి – 64

క్రితం సంచికలోని గడినుడి-63కి మొదటి ఇరవై రోజుల్లో ఇరవై మంది నుండి సరైన సమాధానాలు వచ్చాయి. అన్నీ సరైన సమాధానాలతో పంపినవారి పేర్లు:

  1. అనూరాధా శాయి జొన్నలగడ్డ
  2. మధుసూదనరావు తల్లాప్రగడ
  3. ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  4. ముకుందుల బాలసుబ్రహ్మణ్యం
  5. పడమట సుబ్బలక్ష్మి
  6. అనిత శిష్ట్లా
  7. రంగావఝల శారద
  8. రవిచంద్ర ఇనగంటి
  9. బయన కన్యాకుమారి
  10. వైదేహి అక్కిపెద్ది
  11. సరస్వతి పొన్నాడ
  12. చెళ్ళపిళ్ళ రామమూర్తి
  13. పాల వరప్రసాద్
  14. చల్లా శ్రీనివాస శర్మ
  15. ఆళ్ళ రామారావు
  16. వర్ధిని మాదిరాజు
  17. సుభద్ర వేదుల
  18. గిరిజ వారణాసి
  19. మెట్టుపల్లె శ్రీనివాసులు రెడ్డి
  20. జిబిటి సుందరి
విజేతలకందరికీ మా అభినందనలు. గడి నుడి-63 సమాధానాలు.

సూచనలు

  • కీబోర్డ్ పై ఉన్న ← ↑ → ↓ బొత్తాలను ఉపయోగించి ఒక గడి నుండి ఇంకో గడిలోకి నాలుగు వైపులా వెళ్ళవచ్చు.
  • టాబ్ (Tab) ⇥ ఉపయోగించి తరువాతి ఆధారానికి వెళ్ళవచ్చు.
  • డిలీట్ (Delete) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించవచ్చు.
  • బాక్ స్పేస్ (Backspace) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించి అంతకు ముందు గడికి వెళ్ళవచ్చు.
  • గడి సమాధానాలు ప్రచురించిన తరువాత నుంచీ మీ సమాధానాలు వెంటనే సరిచూసుకునే సౌకర్యం ఉంటుంది.
గడి ముగింపు తేదీ: ఈ నెల 20. ముగింపు తేదీ దాటగానే సరిచూపు సౌకర్యం కల్పిస్తాం.

గడినింపేదిశ: ➡
«కంట్రోల్-స్పేస్‌బార్ నొక్కి గడినింపే దిశను మార్చుకోవచ్చు»

ఆధారాలు

(ఆధారం పై క్లిక్ చేసి దానికి సంబంధించిన గడికి వెళ్ళి ఆ గడి నింపవచ్చు)

అడ్డం

  1. కీలుబొమ్మ (3)
  2. ఎముకలని కలిపిఉంచు సన్నని నరము (3)
  3. పార్వతీదేవి పుట్టుమచ్చ (3)
  4. ఇంక భయము (1)
  5. ప్రతి దినమే జరుగుతున్న దానిలో ప్రధానమైనది (3)
  6. తిరుగబడ్డ వీళ్ళు (2)
  7. విరామ చిహ్నం (2)
  8. తెగిపోవడం (4)
  9. సున్నలేని గుమ్మడికాయ మధ్యభాగం (1)
  10. బంక కాదు దీపం (4)
  11. పల్లకి మోయువారు (3)
  12. జారుడు పేదవాడు (3)
  13. లేమ గుణం (4)
  14. ఉపాసన (3)
  15. మొదలు లేని స్త్రీలలో గొప్పది (4)
  16. ఎర్రగానగు (3)
  17. వేడి కాదు విషము (3)
  18. కేరళ బ్రాహ్మణవంశం (4)
  19. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ దోపిడి తెగ (3)
  20. త్రోలడం (4)
  21. దర్భ (3)
  22. యువ గాయని! వందనం (3)
  23. ఇష్టం వచ్చినట్లు (4)
  24. తిరుగులేని ప్రతిష్ట (1)
  25. చింత (4)
  26. వెనుదిరిగిన ప్రతిమ (2)
  27. చిన్నబోయిన ముత్యాలపేరు (2)
  28. మాయాబజార్ లో తసమదీయులను తందనాలాడించేందుకు కావాల్సింది (3)
  29. 8, 15, 47 తో కలిసి ఈ నెల పండగ (1)
  30. ఉమ్మి (3)
  31. హామీ కోసం చేప ముందు వేరే భాషలో వెళ్ళండి (3)
  32. జిడ్డు కడలి (3)

నిలువు

  1. పచ్చడము (2)
  2. కొమ్ముల్లేని భయం (2)
  3. కిందనుంచి ఆవరించుకును (2)
  4. నికరము (2)
  5. సున్నపుముద్ద (3)
  6. సంకుమదము (3)
  7. నాలుగు పంక్తులుగల పరభాషా పద్యాలు (4)
  8. మధ్యలో కొమ్ము తీస్తే మార్పు (4)
  9. గర్వించు (2)
  10. కిందనుంచి పోలిక సరిపోతుంది (2)
  11. పోగు (2)
  12. సొమ్ము (2)
  13. దర్భతో చేసిన ఉపాసన పరికరం (2)
  14. విలాసము (2)
  15. వత్తులేని పురుగు (2)
  16. పూసేది (3)
  17. పూర్తిగా కనిపించలేదు (3)
  18. చిత్తూరు జిల్లా పట్టణం (3)
  19. తలలేని పాము! (3)
  20. భూతము (2)
  21. ఖాళీ (2)
  22. పెద్దగంప (2)
  23. దొంగబాలుడు (2)
  24. మోటుజరీ (2)
  25. విధేయుఁడు (4)
  26. అసితబిలేశయం (4)
  27. తనది (2)
  28. కొలత పాత్ర (2)
  29. అలంకరింపబడ్డ (3)
  30. అవిసిచెట్టు కింద ముని (3)
  31. మందు కొలత (2)
  32. మత్తు పదార్థం (2)
  33. లాభం (2)
  34. దగ్గు రూపాంతరం (2)