రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

అల్లరి పిచుకలు

రచన: పాలపర్తి ఇంద్రాణి
నవంబర్ 2013

జనసమ్మర్దంలో
నా కళ్ళ చెరువుల్లోకి
మెరుపుల్లా దూకిన
నీ చూపుల చేప పిల్లల

దండెం మీద ఎగిరిన
తడి నూలు చీరల వెనక
రెపరెప నీ పుస్తకాల అక్షరాల

ఆ పెళ్ళిలో
నా పట్టు చీర మీద
రాలి పడ్డ నీ కొంటె నవ్వుల
మత్తు మల్లె పువ్వుల

తర్లి పోతున్న మబ్బుల్లో
కలిసి వెచ్చని నురగల
కాఫీలు తాగిన వేళల

నీ మీసాల గరుకు
గిలిగింతల
తడి ముద్దుల
కలల సొగసుల

లాంటివి

అలాంటివి
ఏవో

కరిగిన నా కంటి
కాటుక వెనుక
తారట్లాడుతుంటే

రోజూ బియ్యానికి
అలవాటు పడ్డ
పిచుకలు
ఆలోచనలను
చెల్లా చెదురు చేసి

నేలేచి వెళ్ళిందాక
కిచ కిచలాడుతూ
కిటికీ అద్దాన్ని
ముక్కులతో
పొడవడం ఆపవు.

    
   

4అభిప్రాయాలు

మీ అభిప్రాయం తెలియచేయండి
  1. 1
    వాహెద్ November 1, 2013 10:26 am

    అద్భుతంగా ఉంది.. కొత్త ప్రయోగాలు..కొత్త ఇమేజరీ..చక్కని కవిత.

  2. 2
    రవి వీరెల్లి November 1, 2013 2:00 pm

    వావ్! బాగుంది.

    “రోజూ బియ్యానికి
    అలవాటు పడ్డ
    పిచుకలు
    ఆలోచనలను
    చెల్లా చెదురు చేసి”

    నచ్చింది.

  3. 3
    mallikarjuna sarma November 2, 2013 1:52 am

    ఇంద్రాణి గార్కి,
    ఆలోచనలకి అలవాటుపడ్డ మనసు, బియ్యానికి అలవాటుపడ్డ పిచుకల్లాంటిదే. ధ్యానం లేకపోతే ఆలోచనలాగవు. ధాన్యం లేకపోతే పిచుకలు రావు. రెండోది ఉందన్న ద్వైతభ్రమలో అటు పిచుకలు, ఇటు మనసు, అదిగో అసలైన ‘నేను’ కలగజేసుకుంటేగాని పోవు. మంచి ఆలోచనల్ని కలిగించిన కవిత! అభినందనలు.

    ‘నీ పుస్తకాల అక్షరాల రెపరెప’ అని వుండాలేమో ఒకచోట. నాకు సరిగ్గా అర్థం కాలేదు.
    మల్లికార్జున శర్మ దేవరకొండ.

  4. 4
    Seetha August 24, 2016 3:51 am

    ఎంత బాగుందో కదా

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • నివాసం
  • నీళ్ళు కాచే పనిపిల్ల
  • స్వీయప్రచురణ గురించి శ్రీపాద
  • వాళ్ళు రాక ముందు
  • ఇగో

ఇటువంటివే…

  1. భాషల ఋతువు
  2. అమ్మా, నాకేం పేరు పెడతావు?
  3. కృష్ణ: లలిత గీతాలు
  4. ఆకురాలు కాలము
  5. ఒక సరళ నిర్వచనం

నవంబర్ 2013 సంచికలో ...

  • అల బేల మరుల స్వామి
  • అల్లరి పిచుకలు
  • ఆకురాలు కాలము
  • ఆచార్య సుబ్బరామయ్య మీనాక్షిసుందరం
  • ఈమాట నవంబర్ 2013 సంచికకు స్వాగతం!
  • ఒంటరి ప్రపంచం
  • ఒక్కో రోజు
  • కవితాకన్యక మానసంరక్షణము
  • గద్యములో పద్యములు
  • చా.సో. తో ముఖాముఖీ
  • చినుకొకపరి…
  • తెలిసీ పలికిన విలువేమో!
  • తెలుగు, ఇతర ద్రావిడ భాషలు: వాటి ప్రాచీనత
  • ద్వితీయ కళత్రం
  • నన్నెచోడుని కుమారసంభవంలో ‘లలితాస్యాంబురుహంబు’ పద్యవివాదం: స్థితిస్థాపన
  • నాకు నచ్చిన పద్యం: చిత్తము పల్లవింప జేసే తిక్కన కవిత్వం
  • పలుకుబడి: శషసలతో శషభిషలు
  • ప్రద్యుమ్నుడి ఉపవాసం
  • ప్రోగ్రెషన్
  • బ్రౌన్ పురస్కారం, ఇస్మాయిల్ అవార్డ్ 2013
  • భారతీయ పుస్తక చరిత్ర: 2. రాత పుట్టుక, పరిణామం – భారతీయ లిపులు
  • మేఘసందేశం (తెలుగులో)
  • రచనా వివేచన
  • విశ్వనాథ: వివాహాశీస్సులు
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

ఆకురాలు కాలము
రచనా వివేచన

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.