క్రితం సంచికలోని గడినుడి-40కి మొదటి ఇరవై రోజుల్లో ఆరుగురి నుండి మాత్రమే సరైన సమాధానాలు వచ్చాయి. అన్నీ సరైన సమాధానాలతో పంపినవారి పేర్లు:
అనూరాధా శాయి జొన్నలగడ్డ
జిబిటి సుందరి
అగడి ప్రతిభ
సరస్వతి పొన్నాడ
వైదేహి అక్కిపెద్ది
కన్యాకుమారి బయన
విజేతలకందరికీ మా అభినందనలు.
గడి నుడి-40 సమాధానాలు.
సూచనలు
కీబోర్డ్ పై ఉన్న ← ↑ → ↓ బొత్తాలను ఉపయోగించి ఒక గడి నుండి ఇంకో గడిలోకి నాలుగు వైపులా వెళ్ళవచ్చు.
టాబ్ (Tab) ⇥ ఉపయోగించి తరువాతి ఆధారానికి వెళ్ళవచ్చు.
డిలీట్ (Delete) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించవచ్చు.
బాక్ స్పేస్ (Backspace) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించి అంతకు ముందు గడికి వెళ్ళవచ్చు.
గడి సమాధానాలు ప్రచురించిన తరువాత నుంచీ మీ సమాధానాలు వెంటనే సరిచూసుకునే సౌకర్యం ఉంటుంది.
గడి ముగింపు తేదీ: ఈ నెల 25. అయితే, ఏ తప్పూ లేకుండా గడులు నింపిన మొదటి అయిదు సమాధానాలు మాకు చేరగానే గడి సరిచూపు సౌకర్యం అందిస్తాం. ఆపైన సరిచూపు సౌకర్యం మాత్రమే ఉంటుంది. మాకు సమాధానాలు పంపే వీలు ఉండదు. లేకుంటే ముగింపు తేదీ దాటగానే సరిచూపు చూసుకొని మాకు పంపే అవకాశం కూడా కల్పిస్తాం.
ఆధారాలు
(ఆధారం పై క్లిక్ చేసి దానికి సంబంధించిన గడికి వెళ్ళి ఆ గడి నింపవచ్చు)
రచయిత ఎలనాగ గురించి:
ఎలనాగ అన్న కలం పేరుతో రచించే డాక్టర్ సురేంద్ర నాగరాజు తెలుగు, ఆంగ్ల సాహిత్య రంగంలో ప్రసిద్ధ కవి, రచయిత, అనువాదకులు, విమర్శకులు. ఇప్పటివరకు వారు రచించిన 41 పుస్తకాల్లో అనువాదాలు కూడా ఉన్నాయి. లాటిన్ అమెరికన్ కథలు, ఆఫ్రికన్ కథలు, సోమర్సెట్ మౌఘం కథలు, ప్రపంచ కథలు, సైరస్ మిస్త్రీ రాసిన క్రానికల్స్ ఆఫ్ ఎ కార్ప్స్ బేరర్, పవన్ కె వర్మ రచించిన గాలిబ్: ది మ్యాన్, ది టైమ్స్, కె సచ్చిదానందన్ రచించిన నాట్ ఓన్లీ ది ఓషన్స్ వంటి పుస్తకాలను తెలుగులోకి అనువదించారు. వట్టికోట అల్వారస్వామి, దాశరథి కృష్ణమాచార్య, కాళోజీ నారాయణరావు మొదలైన ప్రముఖ తెలుగు రచయితల రచనలను ఇంగ్లీషులోకి అనువదించారు. వారి ఆంగ్ల కవితా సంకలనం \”డాజ్లర్స్\” 25 విదేశీ భాషల్లోకి అనువదించబడింది.