ఎలనాగ

ఎలనాగ
పూర్తిపేరు
డాక్టర్ సురేంద్ర నాగరాజు
ప్రస్తుత నివాసం
హైదరాబాదు

జీవిత విశేషాలు

ఎలనాగ అన్న కలం పేరుతో రచించే డాక్టర్ సురేంద్ర నాగరాజు తెలుగు, ఆంగ్ల సాహిత్య రంగంలో ప్రసిద్ధ కవి, రచయిత, అనువాదకులు, విమర్శకులు. ఇప్పటివరకు వారు రచించిన 41 పుస్తకాల్లో అనువాదాలు కూడా ఉన్నాయి. లాటిన్ అమెరికన్ కథలు, ఆఫ్రికన్ కథలు, సోమర్సెట్ మౌఘం కథలు, ప్రపంచ కథలు, సైరస్ మిస్త్రీ రాసిన క్రానికల్స్ ఆఫ్ ఎ కార్ప్స్ బేరర్, పవన్ కె వర్మ రచించిన గాలిబ్: ది మ్యాన్, ది టైమ్స్, కె సచ్చిదానందన్ రచించిన నాట్ ఓన్లీ ది ఓషన్స్ వంటి పుస్తకాలను తెలుగులోకి అనువదించారు. వట్టికోట అల్వారస్వామి, దాశరథి కృష్ణమాచార్య, కాళోజీ నారాయణరావు మొదలైన ప్రముఖ తెలుగు రచయితల రచనలను ఇంగ్లీషులోకి అనువదించారు. వారి ఆంగ్ల కవితా సంకలనం “డాజ్లర్స్” 25 విదేశీ భాషల్లోకి అనువదించబడింది.

ఎలనాగ రచనలు