[
జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.]
సూచనలు
- కీబోర్డ్ పై ఉన్న ← ↑ → ↓ బొత్తాలను ఉపయోగించి ఒక గడి నుండి ఉంకో గడిలోకి నాలుగు వైపులా వెళ్ళవచ్చు.
- టాబ్ (Tab) ⇥ ఉపయోగించి తరువాతి ఆధారానికి వెళ్ళవచ్చు.
- డిలీట్ (Delete) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించవచ్చు.
- బాక్ స్పేస్ (Backspace) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించి అంతకు ముందు గడికి వెళ్ళవచ్చు.
- “సరిచూడు” అన్న బొత్తాము పై నొక్కి మీ సమాధానాన్ని సరిచూసుకోవచ్చు.
ఆధారాలు
(ఆధారం పై క్లిక్ చేసి దానికి సంబంధించిన గడికి వెళ్ళి ఆ గడి నింపవచ్చు)
అడ్డం
- సేద్యానికి నాంది
సమాధానం: ఏరువాక
- అష్టావధానికి పరీక్ష
సమాధానం: న్యస్తాక్షరి
- వాద్యం (కృష్ణ కర్ణామృతానికి)
సమాధానం: పిల్లనగ్రోవి
- వంశానుక్రమం
సమాధానం: కోవ
- ఒక దిక్కులో సగం
సమాధానం: మట
- 12 నిలువు కలగలుపు
సమాధానం: ళ్ళుసంకె
- శత్రువులు రోదించితే నియమాలు
సమాధానం: విధులు
- పూలచెట్టు
సమాధానం: మంకెన
- అలంకరణ
సమాధానం: కైసేత
- ఇదో విద్య
సమాధానం: యక్షిణి
- వర్షం వత్సరం కాదు
సమాధానం: వాన
- శరీరభాగం
సమాధానం: కరం
- కవచము
సమాధానం: తనుత్రాణము
- మాజీ మంత్రిగారి ఇంటి పేరు
సమాధానం: లుకలావు
- ఇదిప్పుడు కాదు
సమాధానం: తరువాత
నిలువు
- నమస్కారం
సమాధానం: ఏటికోళ్ళు
- జలాశయం
సమాధానం: వాపి
- వాడు చెప్పేది నమ్మకు
సమాధానం: కల్లరి
- వృక్ష విశేషం
సమాధానం: న్యగ్రోధం
- తలకొట్టి తలకిందులు చేసి దీవిస్తా
సమాధానం: స్తావి
- రెమ్మలు
సమాధానం: రివటలు
- శూద్రకుని సృష్టి
సమాధానం: వసంతసేన
- తేనెటీగ
సమాధానం: మధుమక్షిక
- శృంఖలాలు
సమాధానం: సంకెళ్ళు
- భట్రాజుల ప్రత్యేకత
సమాధానం: కైవారాలు
- తరంగిణి కలగలపు
సమాధానం: ణిరంగిత
- స్నిగ్ధత
సమాధానం: నునువు
- శిరోభాగం
సమాధానం: కణత
- ఒక్కొక్కరికి
సమాధానం: తలా
- నడుం జారిన ముగ్గురు
సమాధానం: మురు