అడ్డం
- అభ్యంజనము చెయ్యాలంటే వెనుకనుండి చూడుము తీగ (5)
సమాధానం: తలమునుక - పెళ్ళిళ్ళలో ఎక్కువగా కనిపించేది? (4)
సమాధానం: పట్టుచీర - నాలుక మాత్రమే పసిగట్టేది (2)
సమాధానం: రుచి - ఆరబెట్టు దిక్కు (3)
సమాధానం: తూరుపు - 32 నిలువులోనిది (4)
సమాధానం: కంకేరువు - రాజకీయపక్షాలలో తరచూ జరిగే భాగోతం (3)
సమాధానం: చీలిక - అతివ గనుక తిరిగిచూస్తే ఇవీ చూస్తాయి (4)
సమాధానం: కనుగవ - చెక్కిలిమీదున్న నుయ్యితో నీటికి కొదవలేదు కాబోలు (4)
సమాధానం: బుగ్గబావి - కాకిలో నేర్పు కొంచెం తక్కువైతే కృత్రిమంగా ఉంటుంది (5)
సమాధానం: కాపటికము - తడిసిముద్దయితే ఆ జల్లుని ఇలా అంటాం (5)
సమాధానం: చిత్తడివాన - పంది మాతృక (3)
సమాధానం: వారాహి - రామి మనవలను చేర్చుకుని జరుపుకునే ఉత్సవం (5)
సమాధానం: రామనవమి - పాలిక మాల ధరించిన సర్వజ్ఞుడు (3,2)
సమాధానం: కపాలమాలి - “తెలివిలేని వాళ్ళు” అనిపించినా శిరోజాలని కట్టిపడేసేవి (3)
సమాధానం: జడలు - నాది నయము కాకపోతే సూర్యపుత్రి ఏరు అవుతుంది (5)
సమాధానం: యమునానది - కంకులు రాటకి కట్టే రాక్షస స్త్రీ (5)
సమాధానం: కంటకురాలు - జక్కవపక్షి గురించి తెలుసుకోవాలంటే ఆరికెపూడి (కోడూరి) కౌసల్యాదేవిగారిని అడగాలి! (4)
సమాధానం: చక్రవాకం - జంబూ ద్వీపం (4)
సమాధానం: తొలుదీవి - ఏడ్పు కన్నీరు (3)
సమాధానం: రోదన - నీడ ఒక సంవత్సరంలా వెంబడిస్తుంది (4)
సమాధానం: భావానుగ - బాపిరాజు అరణ్యం! (3)
సమాధానం: అడివి - కారం కలిస్తే మాట చమత్కారమౌతుంది. (2)
సమాధానం: నుడి - వెన్నెముక టకీమని విరిగి తలకిందులుగా పడితే పురుగు బయటపడింది (4)
సమాధానం: కీటకము - మోసం చేసేవాడు పుణ్యక్షేత్రాలకి వెళ్ళక్కర్లేకుండానే పెట్టేవి (5)
సమాధానం: పంగనామాలు
నిలువు
- సుడిగాలి గబ్బిలం (5)
సమాధానం: తరుతూలిక - ఇది చెల్లిస్తేనే దేవత కటాక్షిస్తుంది (3)
సమాధానం: ముడుపు - ఒక రకం చుక్క – కరక్కాయ నీటితో వ్రాసిన కొన (4)
సమాధానం: కరకంచు - ఆకుపచ్చని వికసించని పుష్పం (5)
సమాధానం: పసరుమొగ్గ - చిట్టడవిలో దూరలేనిది (2)
సమాధానం: చీమ - చి. చీ..కమ్మటి గాఢాంధకారము (5)
సమాధానం: చిమ్మచీకటి - వేకువజామున కూసే ప్రాణి (5)
సమాధానం: ఉషాకలము - హి! అవి వాతలు! దారితప్పిన పెళ్ళికాని వనితలు (6)
సమాధానం: అవివాహితలు - ఊసుపోక కబుర్లు (7)
సమాధానం: లోకాభిరామాయణం - సాము చెయ్యాలంటే ఇక్కడికి రావాలి (5)
సమాధానం: గరిడిసాల - వర్షం దయతలిస్తే పిట్ట హంసగా మారుతుంది (7)
సమాధానం: వానజాలిపులుగు - తామరకంటి (6)
సమాధానం: వారిజలోచన - ప్రాణశక్తి ప్రవహించే ఈ మార్గాలు కుంగిపోతే అంతం (5)
సమాధానం: నవనాడులు - చూడ్డానికి మెడలో దండలా కనిపించినా ఇదో జబ్బు (5)
సమాధానం: కంఠరోగము - అణగిమణగి పడి ఉండేది (5)
సమాధానం: కుక్కినపేను - వారి శకటము మధ్యన లేకపోతే చినుకుదారి పట్టాల్సిందే (5)
సమాధానం: వారివాహము - ఇద్దరు కవులు తిరిగితే ఆ నవ్వులధ్వని (5)
సమాధానం: వికవికలు - చూడ్డానికి వేదాధ్యయనంలా కనిపించినా లోలోపల దీనికి ద్రోహబుద్ధి ఉంటుందని లోకోక్తి (4)
సమాధానం: కొంగజపం - సందిగ్ధంలో పడితే వ్యతిరేకం కాదా? (3)
సమాధానం: అవునా - జంజాటములో దాగున్న సమం కాని దొందు (2)
సమాధానం: జంట