- జిబిటి సుందరి
- కోడీహళ్ళి మురళీమోహన్
- బండారు పద్మ
- అనూరాధా శాయి జొన్నలగడ్డ
- వైదేహి అక్కిపెద్ది
- అగడి ప్రతిభ
- హరిణి
సూచనలు
- కీబోర్డ్ పై ఉన్న ← ↑ → ↓ బొత్తాలను ఉపయోగించి ఒక గడి నుండి ఇంకో గడిలోకి నాలుగు వైపులా వెళ్ళవచ్చు.
- టాబ్ (Tab) ⇥ ఉపయోగించి తరువాతి ఆధారానికి వెళ్ళవచ్చు.
- డిలీట్ (Delete) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించవచ్చు.
- బాక్ స్పేస్ (Backspace) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించి అంతకు ముందు గడికి వెళ్ళవచ్చు.
- గడి సమాధానాలు ప్రచురించిన తరువాత నుంచీ మీ సమాధానాలు వెంటనే సరిచూసుకునే సౌకర్యం ఉంటుంది.
గడినింపేదిశ: 
«కంట్రోల్-స్పేస్‌బార్ నొక్కి గడినింపే దిశను మార్చుకోవచ్చు»
ఆధారాలు
(ఆధారం పై క్లిక్ చేసి దానికి సంబంధించిన గడికి వెళ్ళి ఆ గడి నింపవచ్చు)
అడ్డం
- సువాసన తొలుత లక్కతో తయారు చేశారు (5)
- ఉదాహరణకి సర్వ వశంకరి (3)
- రామా! నాజీ పరిపాలనా? ఆ ఉద్యోగం నాకొద్దు (4)
- నీళ్ళు జనాలకి మేలు చేస్తాయి (4)
- ఎంతలా రికామీగా తిరిగినా రాత్రుళ్ళు దొంగతనాలు జరగకుండా చూడ్డమే ఇతనిపని (3)
- బాధతో పాడినపాటకి తందానతాన (2)
- 33 నిలువులో కొంత వెనుకబడ్డ అబద్ధం (2)
- కంటకంతో ఎప్పుడూ ఓడేది? (4)
- అక్కడ అంతంతో చూడుము తిరిగి మొదలు కనిపిస్తుంది (4)
- మండు పుటక ఒకదారికివస్తే అసూయ కలుగుతుంది (5)
- నూరడుగుల క్రిమితో దంపుడుసాధనం (5)
- వీణా నది (4)
- వశిష్ఠుని భార్య మరులుతీగ (3)
- సహవసతిలో దాగున్న రెండో పెళ్ళాం కాబోలు (3)
- మనకి అనుకూలంగా ఉండేలా రాసుకునే పత్రం లాగ కనిపిస్తుంది కానీ ఇది మరణశాసనం (4)
- ఆడమేకలనే కాసేవాడా? కాదు (5)
- కులాలు కుడి ఎడమైతే విలాసవతి పుడుతుంది (5)
- తిరిగిన వాడి జన్మలో ముసురు (4)
- దుర్యోధనుడి భార్య ప్రతిమను భారతంలో చూస్తాం (4)
- ప్రాయంలో ఉన్న వాడు పుట్టిన సంవత్సరం (2)
- అడ్డం ఆరులోసగం సంధి (2)
- వరిమడి వరుస (3)
- సింగినాదంతోపాటు వచ్చే వంటదినుసు ఈసడింపా? ఏమీలేదు (4)
- పొలంపని కోసం వ్యయం వసారా పూర్తికాకుండా చూడాలి (4)
- ఈ జీతానికి కూర్చుని పనిచెయ్యకూడదు (3)
- పెళ్ళికొడుకు నడుముకు కట్టేది కాదు, 1961లో భారత ప్రభుత్వం నిషేధించినది (5)
నిలువు
- వర్షంకోసం చేసే పూజ గంత జాగర కాదు (5)
- ఏనుగు దీర్ఘం తీస్తే గాలి కనబడుతుంది! (3)
- ఇదంటే తన పాముని పడతొయ్యడమే (5)
- స్వామిని తమిళనాట ప్రవహించే నదికి కాదే మార్పు? (3)
- శిరసు వంకరగా ఉంటే అవమానం (4)
- సారంగధరాభ్యుదయములో ఎదురుతిరిగిన కృష్ణసఖి (2)
- అక్షరంపోయి తిరిగి కలిసినా పసికట్టేది (3)
- కసాయివాడు సాయిలేనప్పుడు చేసే వ్యవహారము (3)
- ఉదాహరణకి అమ్మా, నాన్నా, కొడుకూ, కూతురూ (3)
- నెమలి చల్లిన పేడనీళ్ళు (3)
- మాయల మరాఠీకి మాత్రమే విధిగా తెలియాల్సినవి (5)
- సుగ్రీవుడి అన్నకి మధ్యలో ఇంటికి ముందుండేది (3)
- చేతిగుడ్డలు (5)
- మేలుకొలుపు చెప్పే వర్ణం (3)
- కోతి జీడిలతో మొదలయ్యే చెట్టు (3)
- ఈ లెక్కలు మనవే (3)
- ఏదుపంది ఎముక (3)
- నీలోత్పలము వల్ల నకలు తారుమారైంది (5)
- రాశిలో ధుమధుమలాడడం మొదలెడితే భిక్షాన్నం దొరుకుతుంది (5)
- లక్ష్మణుని కాపాడడం కోసం జీవనిధుల్ని ఒడ్డి హనుమంతుడు తెచ్చిన ఔషధం (4)
- ఎటునుండైనా కట్టుకునే చీర (3)
- రాజు మధ్యలో “హు” అంటే తొమ్మిదిలో ఒకటి (3)
- కవి జీతం బ్రతుకు తెరువుకు పనికొస్తుంది (3)
- ఇష్టమే కానీ ఎక్కువ ఖరీదు (2)