రోహిణీ ప్రసాద్ మిత్రుడు, ఆత్మీయుడు, ఆత్మబంధువు (సోల్‌మేట్). సైన్సుని తెలుగులో రాయటానికి ప్రయత్నించే అతి కొద్ది మందిలో రోహిణీ ప్రసాద్ ఒకరు కావటం ఈ స్నేహబంధానికి ఒక కారణం. సంగీత పరిజ్ఞానం బొత్తిగా లేని నాలాంటివారికి సంగీతం లోని అందాన్ని అందుకోవటం ఎలాగో చెప్పగలిగేడంటే సైన్సులో పరిజ్ఞానం లేని వారికి సైన్సు అరటిపండు ఒలచినట్లు చెప్పటంలో ఎంత సిద్ధ హస్తుడో మనం ఊహించుకోవచ్చు.
సైన్సుకి సంబంధించిన తెలుగు వ్యాసాలు రాయమనిన్నీ, రాసినవి ఆంధ్రప్రభలో ప్రతి వారం ప్రచురించమనిన్నీ నన్ను ప్రేరేపించిన వ్యక్తి రోహిణీప్రసాదే. నా చేతనే కాకుండా చాగంటి తులసి చేత కూడ ఈయన సైన్సు వ్యాసాలు రాయించేరు.
నేను గత ఏడాది హైదరాబాదులో వారింటికి వెళ్ళినప్పుడు మళ్లా అమెరికా వచ్చే ప్రయత్నంలో ఉన్నానని చెప్పేరు. వచ్చినప్పుడు కేలిఫోర్నియాలో మా ఇంటికి వస్తానని కూడ చెప్పేరు. ఇంత పిన్న వయస్సులోనే ఆయన మనని విడచి వెళ్లిపోయారంటే నమ్మలేకుండా ఉన్నాను.
ఆయన తల్లికీ, భార్యకీ నా సంతాపం తెలియజేస్తున్నాను.
వేమూరి వేంకటేశ్వరరావు
నాకు సంగీతంతో పెద్దగా పరిచయం లేకపోయినా, రోహిణీప్రసాద్‌గారు సంగీతం గురించి రాసిన వ్యాసాలు ఆసక్తిగా చదివేవాడిని. ఒకటి రెండుసార్లు సభల్లో వారిని కలిసే అవకాశం కలిగింది. ఆయన మరణవార్త విని చాలా విచారించాను. వారి మరణానికి సంతాపం తెలుపుతూ, ఈమాట ద్వారా వారి కుటుంబానికి నా సానుభూతిని అందజేస్తున్నాను. – రవిశంకర్
ఈమాట ఇటీవలి సంచికలలో రోహిణీప్రసాద్ గారి కబుర్లూ వ్యాసాలూ అభిప్రాయాలూ ఏవీ కనిపించలేదు. ఈ ఏడాది జనవరి తరవాత, మళ్ళీ ఆయన ఏవీ రాసినట్టులేదు. ఏమా? అని ఒకసారెప్పుడో నాలోనేనే అనుకున్నాను. మళ్ళీ ఏవో పనితొందరలు ఉంటాయి కదా అని నాకు నేనే జవాబు చెప్పుకున్నాను . ఈ వార్త చాలా విషాదకరం . ఆయనతో నాకు తగినంత పరిచయం కలగలేదు. ఒక్కసారి మాత్రం ఫొన్ లో మాట్లాడుకున్నాము . ముఖాముఖీ కలవడం కుదరలేదు. ఇలాంటి వార్త మనసుకి ఇబ్బందిని కలిగిస్తుంది ! వరూధిని గారికి ఈ వయసులో కలగకూడని దు:ఖం ఇది. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటున్నాను .
రోహిణీ ప్రసాద్ గారి సంగీతంపైనా వ్యాసాలు చదివాక నేనూ రాయడం మొదలు పెట్టాను. అంతకుముందు సంగీతంపట్ల అభిరుచున్నా రాయాలని అనిపించేది కాదు. సంగీతం మీద ఆయన వెలిబుచ్చిన అభిప్రాయాల మీద నాకు అభ్యంతరాలున్నా, ఆయన రాసిన సంగీత వ్యాసాలే నాచేత కూడా రాయించాయి. ఈమెయిల్స్ లో మాట్లాడడమే తప్ప కలిసే అవకాశమే రాలేదు.
నిస్సందేహంగా చక్కటి తెలుగు వాక్యం రాస్తారాయన. రోహిణీ ప్రసాద్ గారి వెలితి ముందు ముందు ఈమాటలో స్పష్టంగా కనిపిస్తూనే ఉంటుంది.
ఇలాంటి వార్తలు చదువుతూంటే, జీవితం ఎంత చిన్నదో కదా? అనిపిస్తూ ఉంటుంది. రోహిణీ ప్రసాద్ గారి తల్లి, వరూధినిగారికి ఎంత పెద్ద దుఃఖం వచ్చిందో?
హితుడు, స్నేహితుడు రోహిణీప్రసాద్ గారి ఆకస్మిక మరణము విభ్రాంతి కలిగించినది. హిందూస్తాని సంగీతముపైన, గాయకులపైన సామాన్య పాఠకలోకానికి అర్థమయ్యేటట్లు వ్యాసాలను వ్రాసినారు వారు. విజ్ఞాన శాస్త్రాన్ని విజ్ఞులకు మాత్రమేకాక జనసామాన్యానికి తెలుగులో అందజేయాలని కృషి చేసినారు వారు. కుటుంబరావుగారి శతజయంత్యుత్సవ సందర్భముగా వారిని డిట్రాయిటులో ఒక మారు కలిసి సంభాషించినది నా మధుర స్మృతులలో ఒకటి. వారితో కలిసి ఒక వ్యాసము వ్రాయాలని అనుకొన్నఆశ ఈడేరక ఆలాగే ఉండి పోయినది. వారి ఆత్మ శాంతిల్లు గాక! విధేయుడు – మోహన
“ఆర్థిక పరిస్థితులు మనుషుల జీవితాన్ని, వాళ్ళ ప్రవర్తనను ఎంతగా శాసిస్తాయో ..” అన్నారు. అవును, కరెక్టే.
అయితే, ఇది ఒక ” ఒక మంచి ఉదాహరణ” అని ఒప్పుకోలేక పోవడానికి కారణం, రచయిత, భర్త పాత్ర చేత భార్య పాత్రకి లెంప కాయ వేయించడమే. అలా కాకుండా, ఆ భర్త పాత్ర, తన భార్య మాటలకి ఆలోచనలో పడి వుంటే, ఈ కధ తప్పకుండా, ఒక ” ఒక మంచి ఉదాహరణ” అయి వుండేది.
ఈమాట కోసం ఎన్నో రచనలు చేసి పాఠక వర్గం అభిమానం చూరగొన్న శ్రీ కొడవటిగంటి రోహిణీప్రసాద్ ముంబాయిలో ఈరోజు కన్నుమూసారని తెలపటానికి చింతిస్తున్నాను. అనేక వెబ్ పత్రికలు, అచ్చుపత్రికల్లో శ్రీ రోహిణీప్రసాద్ రాసిన సంగీతం, సైన్సు సంబంధమైన అనేక విషయాలతో కూడిన విజ్ఞానదాయకమైన రచనలు పాఠకులకి పరిచయమే! కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీ రోహిణీప్రసాద్ ఆకస్మిక మరణం మిత్రులకి, పాఠకులకి బాధాకరమైన విషయమే!
నాకు ఒక మంచి మిత్రుడు, ఈమాటకి ఒక గొప్ప రచయిత మరింకలేరు!!!
‘భానుమతిగారి కథలను గుర్తుకు తెచ్చారు
ఒక మంచి కథను చదివిన అనుభూతిని మిగిల్చారు’ – మంగు శివ రాం ప్రసాద్ , (విశాఖపట్టణం)
* భానుమతి గారి కథలు నాక్కూడా చాలా ఇష్టమండి, శివరాం ప్రసాద్ గారూ!
మీ ప్రశంసకి నా మనః పూర్వక ధన్యవాదాలు తెలియ చేసుకుంటూ..
నమస్సులతో-
ఆర్.దమయంతి.
బొంబాయిలో తెలుగు కార్యక్రమాలు గురించి Rao Vemuri అభిప్రాయం:
09/08/2012 6:48 pm
ఎంత చెడ్డ వార్త వినవలసి వచ్చింది.
రోహిణీ ప్రసాద్ మిత్రుడు, ఆత్మీయుడు, ఆత్మబంధువు (సోల్‌మేట్). సైన్సుని తెలుగులో రాయటానికి ప్రయత్నించే అతి కొద్ది మందిలో రోహిణీ ప్రసాద్ ఒకరు కావటం ఈ స్నేహబంధానికి ఒక కారణం. సంగీత పరిజ్ఞానం బొత్తిగా లేని నాలాంటివారికి సంగీతం లోని అందాన్ని అందుకోవటం ఎలాగో చెప్పగలిగేడంటే సైన్సులో పరిజ్ఞానం లేని వారికి సైన్సు అరటిపండు ఒలచినట్లు చెప్పటంలో ఎంత సిద్ధ హస్తుడో మనం ఊహించుకోవచ్చు.
సైన్సుకి సంబంధించిన తెలుగు వ్యాసాలు రాయమనిన్నీ, రాసినవి ఆంధ్రప్రభలో ప్రతి వారం ప్రచురించమనిన్నీ నన్ను ప్రేరేపించిన వ్యక్తి రోహిణీప్రసాదే. నా చేతనే కాకుండా చాగంటి తులసి చేత కూడ ఈయన సైన్సు వ్యాసాలు రాయించేరు.
నేను గత ఏడాది హైదరాబాదులో వారింటికి వెళ్ళినప్పుడు మళ్లా అమెరికా వచ్చే ప్రయత్నంలో ఉన్నానని చెప్పేరు. వచ్చినప్పుడు కేలిఫోర్నియాలో మా ఇంటికి వస్తానని కూడ చెప్పేరు. ఇంత పిన్న వయస్సులోనే ఆయన మనని విడచి వెళ్లిపోయారంటే నమ్మలేకుండా ఉన్నాను.
ఆయన తల్లికీ, భార్యకీ నా సంతాపం తెలియజేస్తున్నాను.
వేమూరి వేంకటేశ్వరరావు
బొంబాయిలో తెలుగు కార్యక్రమాలు గురించి రవిశంకర్ అభిప్రాయం:
09/08/2012 6:43 pm
నాకు సంగీతంతో పెద్దగా పరిచయం లేకపోయినా, రోహిణీప్రసాద్‌గారు సంగీతం గురించి రాసిన వ్యాసాలు ఆసక్తిగా చదివేవాడిని. ఒకటి రెండుసార్లు సభల్లో వారిని కలిసే అవకాశం కలిగింది. ఆయన మరణవార్త విని చాలా విచారించాను. వారి మరణానికి సంతాపం తెలుపుతూ, ఈమాట ద్వారా వారి కుటుంబానికి నా సానుభూతిని అందజేస్తున్నాను. – రవిశంకర్
బొంబాయిలో తెలుగు కార్యక్రమాలు గురించి jayaprabha అభిప్రాయం:
09/08/2012 3:31 pm
ఈమాట ఇటీవలి సంచికలలో రోహిణీప్రసాద్ గారి కబుర్లూ వ్యాసాలూ అభిప్రాయాలూ ఏవీ కనిపించలేదు. ఈ ఏడాది జనవరి తరవాత, మళ్ళీ ఆయన ఏవీ రాసినట్టులేదు. ఏమా? అని ఒకసారెప్పుడో నాలోనేనే అనుకున్నాను. మళ్ళీ ఏవో పనితొందరలు ఉంటాయి కదా అని నాకు నేనే జవాబు చెప్పుకున్నాను . ఈ వార్త చాలా విషాదకరం . ఆయనతో నాకు తగినంత పరిచయం కలగలేదు. ఒక్కసారి మాత్రం ఫొన్ లో మాట్లాడుకున్నాము . ముఖాముఖీ కలవడం కుదరలేదు. ఇలాంటి వార్త మనసుకి ఇబ్బందిని కలిగిస్తుంది ! వరూధిని గారికి ఈ వయసులో కలగకూడని దు:ఖం ఇది. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటున్నాను .
జయప్రభ.
బొంబాయిలో తెలుగు కార్యక్రమాలు గురించి బ్రహ్మానందం గొర్తి అభిప్రాయం:
09/08/2012 2:14 pm
ఉదయాన్నే దుర్వార్త వినాల్సొచ్చింది.
రోహిణీ ప్రసాద్ గారి సంగీతంపైనా వ్యాసాలు చదివాక నేనూ రాయడం మొదలు పెట్టాను. అంతకుముందు సంగీతంపట్ల అభిరుచున్నా రాయాలని అనిపించేది కాదు. సంగీతం మీద ఆయన వెలిబుచ్చిన అభిప్రాయాల మీద నాకు అభ్యంతరాలున్నా, ఆయన రాసిన సంగీత వ్యాసాలే నాచేత కూడా రాయించాయి. ఈమెయిల్స్ లో మాట్లాడడమే తప్ప కలిసే అవకాశమే రాలేదు.
నిస్సందేహంగా చక్కటి తెలుగు వాక్యం రాస్తారాయన. రోహిణీ ప్రసాద్ గారి వెలితి ముందు ముందు ఈమాటలో స్పష్టంగా కనిపిస్తూనే ఉంటుంది.
ఇలాంటి వార్తలు చదువుతూంటే, జీవితం ఎంత చిన్నదో కదా? అనిపిస్తూ ఉంటుంది. రోహిణీ ప్రసాద్ గారి తల్లి, వరూధినిగారికి ఎంత పెద్ద దుఃఖం వచ్చిందో?
-బ్రహ్మానందం గొర్తి
బొంబాయిలో తెలుగు కార్యక్రమాలు గురించి ప్రసాద్ అభిప్రాయం:
09/08/2012 1:17 pm
అయ్యయ్యో, పాపం! అంత పెద్ద వయసు కూడా కాదు ఆయనది. వృద్ధాప్యంలో వున్న ఆయన తల్లి ఎంతగా దుఃఖిస్తారో! అయ్యో!
ప్రసాద్
బొంబాయిలో తెలుగు కార్యక్రమాలు గురించి మోహన అభిప్రాయం:
09/08/2012 12:03 pm
హితుడు, స్నేహితుడు రోహిణీప్రసాద్ గారి ఆకస్మిక మరణము విభ్రాంతి కలిగించినది. హిందూస్తాని సంగీతముపైన, గాయకులపైన సామాన్య పాఠకలోకానికి అర్థమయ్యేటట్లు వ్యాసాలను వ్రాసినారు వారు. విజ్ఞాన శాస్త్రాన్ని విజ్ఞులకు మాత్రమేకాక జనసామాన్యానికి తెలుగులో అందజేయాలని కృషి చేసినారు వారు. కుటుంబరావుగారి శతజయంత్యుత్సవ సందర్భముగా వారిని డిట్రాయిటులో ఒక మారు కలిసి సంభాషించినది నా మధుర స్మృతులలో ఒకటి. వారితో కలిసి ఒక వ్యాసము వ్రాయాలని అనుకొన్నఆశ ఈడేరక ఆలాగే ఉండి పోయినది. వారి ఆత్మ శాంతిల్లు గాక! విధేయుడు – మోహన
మనం అనుసరించలేకపోయిన భద్రిరాజు కృష్ణమూర్తి గురించి indrani Palaparthy అభిప్రాయం:
09/08/2012 11:29 am
ఇప్పుడే ఈ బ్లాగులో రోహిణీ ప్రసాదు గారి గురించి ఈ విషాద వార్త చదివాను.నమ్మలేక పోతున్నాను. మీరు ఎవరైనా నిర్ధారించగలరా?
ఇంద్రాణి పాలపర్తి.
తథాస్తు గురించి ప్రసాద్ అభిప్రాయం:
09/08/2012 11:03 am
“ఆర్థిక పరిస్థితులు మనుషుల జీవితాన్ని, వాళ్ళ ప్రవర్తనను ఎంతగా శాసిస్తాయో ..” అన్నారు. అవును, కరెక్టే.
అయితే, ఇది ఒక ” ఒక మంచి ఉదాహరణ” అని ఒప్పుకోలేక పోవడానికి కారణం, రచయిత, భర్త పాత్ర చేత భార్య పాత్రకి లెంప కాయ వేయించడమే. అలా కాకుండా, ఆ భర్త పాత్ర, తన భార్య మాటలకి ఆలోచనలో పడి వుంటే, ఈ కధ తప్పకుండా, ఒక ” ఒక మంచి ఉదాహరణ” అయి వుండేది.
ప్రసాద్
బొంబాయిలో తెలుగు కార్యక్రమాలు గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:
09/08/2012 10:40 am
ఈమాట పాఠకులకి, సంపాదవర్గానికి:
ఈమాట కోసం ఎన్నో రచనలు చేసి పాఠక వర్గం అభిమానం చూరగొన్న శ్రీ కొడవటిగంటి రోహిణీప్రసాద్ ముంబాయిలో ఈరోజు కన్నుమూసారని తెలపటానికి చింతిస్తున్నాను. అనేక వెబ్ పత్రికలు, అచ్చుపత్రికల్లో శ్రీ రోహిణీప్రసాద్ రాసిన సంగీతం, సైన్సు సంబంధమైన అనేక విషయాలతో కూడిన విజ్ఞానదాయకమైన రచనలు పాఠకులకి పరిచయమే! కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీ రోహిణీప్రసాద్ ఆకస్మిక మరణం మిత్రులకి, పాఠకులకి బాధాకరమైన విషయమే!
నాకు ఒక మంచి మిత్రుడు, ఈమాటకి ఒక గొప్ప రచయిత మరింకలేరు!!!
విష్ణుభొట్ల లక్ష్మన్న
Lucky.Vishnubhotla@Globalfoundries.com
ఉరుము ఉరిమి… గురించి ఆర్.దమయంతి. అభిప్రాయం:
09/08/2012 10:24 am