పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16479

  1. బొంబాయిలో తెలుగు కార్యక్రమాలు గురించి Ramanath అభిప్రాయం:

    09/09/2012 10:48 pm

    రోహిణీ ప్రసాద్ గారి మరణం భరించడానికి ఎంత వేదాంతవూ పనికిరావడం లేదు. పనికొచ్చే వేదాంతం అని ఆయన నాతో మా ఇంటికి వొచ్చినప్పుడు ఓ చిన్న సరదా చర్చ చేసేరు. ఆలోచన, మాట, ఆచరణ.. ఒక్కటిగా కుదుర్చుకున్న మనిషి. ఇలాటివాళ్ళు చాలా అరుదు. ఇంకా.. ఎన్నో గుర్తులు, అనుభవాలు.. ఇవన్నీ బాధ కలగకుండా నెమరేసుకోడానికి సమయం పడుతుంది. అంతవరకు తప్పదు ఎవరికైనాను.

    – రమానాథ్

  2. వర్ష రచన గురించి నాగరాజు రవీందర్ అభిప్రాయం:

    09/09/2012 9:52 pm

    మీ పేరు లాగే మీరు చెప్పే పద్దతి కూడ వైవిధ్యంగా ఉంది.

  3. కొడవటిగంటి రోహిణీప్రసాద్ (1949-2012) గురించి నాగరాజు రవీందర్ అభిప్రాయం:

    09/09/2012 9:42 pm

    నేను నా బ్లాగులో “సవాయి గంధర్వ సంగీత మహోత్సవం” గురించి వ్రాస్తే , శ్రీ కొడవటిగంటి రోహిణీప్రసాద్ గారు స్పందించి ఇలా వ్రాశారు. 

    Rohiniprasad said:

    మూడు దశాబ్దాలకు పైగా ముంబయిలో ఉన్నప్పటికీ నేను ఒక్కసారి మాత్రమే (1971లో) సవాయీ గంధర్వ ఉత్సవానికి హాజరయాను. ఎందుకంటే అక్కడికి వచ్చే కళాకారులందరూ ముంబయిలో తరుచుగా కచేరీలు చేసేవారు. కిరానా సంప్రదాయానికి చెందిన భీంసేన్ జోషీ తన గురువు పేరిట జరిపే ఈ 3 రోజుల సంగీతోత్సవం చలికాలంలో జరిగినప్పటికీ అప్పట్లో అయిదారు వేలమంది ప్రేక్షకులను ఆకర్షించేది. రాత్రి 8 ప్రాంతాల మొదలైన కచేరీలు పొద్దున్న 6 దాకా ఎడతెగక సాగేవి. చివరిరోజున మాత్రం మధ్యాహ్నం 12 దాకా జరిగేది. అందరికన్నా తరవాత భీంసేన్ కచేరీ జరిగేది. ముగింపు కోసం పాడే (సింధు) భైరవి రాగం మాత్రం సవాయీ గంధర్వ రికార్డు మోగించి వినిపించేవారు. 1971లో జరిగిన ఉత్సవంలో మా గురువు ఇమ్రత్ ఖాన్‌గారి సితార్ కచేరీ, బిర్జూ మహారాజ్ కథక్ నృత్యానికి శాంతాప్రసాద్ తబలా సహకారం, కిరానా గాయని హీరాబాయీ బడోదేకర్‌కు సన్మానం వగైరాలన్నీ జరిగాయి.
    January 6, 2010 8:07 PM  

    ఇది నేనెప్పుడూ మరచిపోలేను. దీనిని నేను ఒక అపురూపమైన వ్యాఖ్యగా భావిస్తాను ఎప్పటికీ. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ … 

  4. పాత తెలుగు సాహిత్యం ఎందుకు చదవాలి? గురించి ramamurthy అభిప్రాయం:

    09/09/2012 1:24 pm

    తెలుగు అకాడమి వారి కావ్యాలోకం లభిస్తలేదు. దయచేసి సాహిత్యాభిమానులు నెట్ లో ఉంచగలరని మనవి. రచన డా.కే.వీరభద్ర రావు.

  5. బొంబాయిలో తెలుగు కార్యక్రమాలు గురించి సురేశ్ కొలిచాల అభిప్రాయం:

    09/09/2012 1:13 pm

    ఈమాటకు శ్రేయోభిలాషి, నాకు ఆప్తమిత్రుడు అయిన రోహిణిప్రసాద్ గారు ఇక లేరు అన్న వార్త ఇంకా నమ్మలేకపోతున్నాను. Shocking news!

    ఆయన కొంతకాలం క్రితం విజయవాడలోని చిగురుపాటి సతీశ్‌బాబుకు ఇచ్చిన ఇంటర్వ్యూ:
    “మా నాన్న ఏర్పరిచిన వాతావరణమే నా జీవితానికి బాట వేసింది”

  6. కల్యాణి రాగం – అనుబంధం గురించి Prabhakar Gundlapalli అభిప్రాయం:

    09/09/2012 9:12 am

    Sri Rohini is no more for us. Today morning, I happened to see the news in Enadu. The day was dull, thinking of him. I had long interaction with him, during his stay at BARC. May his soul rest in peace… Prabhakar Gundlapalli.

  7. చలంతో రజని ముఖాముఖి గురించి ramamohan ch అభిప్రాయం:

    09/09/2012 2:10 am

    చలం మీద ఫ్రౌఇడ్ ప్రభవం వుంది. స్త్రీ స్వేచ్చ ఆయన జీవితేచ్ఛ తన రచనల్లో సాధించాడు. కుటుంబవ్యవస్థను గౌరవించినవాడు చలం. “There are no facts, only interpretations.”- Friedrich Nietzsche (1844-1900)

  8. కిటికీ గురించి Kalyan అభిప్రాయం:

    09/08/2012 11:08 pm

    It was one of the chapters in my english non detail in my 8th or 9th class. I still remember the way my teacher explained us the story and how interestingly we were listening to the teacher.
    Its a nice effort to translate the story and present it to the telugu people.

  9. బొంబాయిలో తెలుగు కార్యక్రమాలు గురించి ఆర్.దమయంతి. అభిప్రాయం:

    09/08/2012 10:28 pm

    ‘ఏవిటీ రోహిణీ ప్రసాద్ గారు కనిపించడం లేదు? కొంత రెస్ట్ కావాలనుకుంటున్నారేమో!?’ అనుకున్నాను ఈ మధ్యే గుర్తొచ్చి. కానీ పొద్దునే ఈ వార్త చూసి చాలా చలించి పోయాను. వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుణ్ని ప్రార్ధిస్తూ… వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపాన్ని తెలియ చేస్తూ…
    బాధతో.

  10. తథాస్తు గురించి ravikiran timmireddy అభిప్రాయం:

    09/08/2012 8:25 pm

    ఆహా, కాదండీ కొన్ని సార్లు మనం తూకం తూచుకోవు, మనం మన మంచిని ఆలోచించవు, ఆ నిముషం లో అది మనకి మంచిగానే కనిపిస్తుంది. అందుకని, మనం మనుషులవి కాబట్టి కొన్ని సార్లు ఇది అపాత్ర దానవని తెలిసినా సరే, దీనిని మనం సస్టెయిన్ చెయ్యలేవని తెలిసినా సరే చేస్తావు, మనం మనుషులవి కాబట్టి, మనం ఎక్కాల పుస్తకాలవి కాదుగాబట్టి. కానీ ప్రసాదు గారు చెప్పిన ఆ రెండో కోణం మాత్రం నిజం. అదేవిటండీ ఆయన పెద్ద రచయిత అన్నారు. “పెళ్ళైన ఈ రెండేళ్ళలో ఆరోజే మొదటి సారిగా నా భార్యను చెయ్యి చాచి కొట్టాను.” అనడం అశహ్యంగా లేదు? నిజవే పెళ్ళి, ఒక రూఫ్ క్రింద బతకడం మొదలు పెడితే చాలా సమస్యలే వస్తాయి. దాంట్లో కొన్ని సార్లు కొట్టు కోవడం కూడా వుండొచ్చు. కానీ పెళ్ళయి రెండేళ్ళయి ఇదే నేను మొదట సారి నా పెళ్ళాన్ని కొట్టడం అంటే ఏవిటి రచయిత ఉద్దేశం. పేళ్ళయిన ఒక ఏడు లోనో, రెండేళ్ళలో నో, పదేళ్ళలోనో పెళ్ళాన్ని కొట్టాలా. కొడితే కొట్టండి, తిరిగి కొడితే భరించండి, మళ్ళా మరు నిముషం లోనే ఒడిలోకి తీసుకుంటే, కౌగిలోకి లాక్కుంటే ఆ విషయాలు మీ సంసారినికే పరిమితం. అంతే గానీ, రెండేళ్ళగా కొట్టలేదని గొప్పగా ఫీల్ కావడం, అభ్భా నిజంగా చాలా అశహ్యంగా ఉందండి. ఒక మంచి కథ కాదు, ఒక మామూలు కథ, అయినా ఆఖరలో ఆ చిన్న వాక్యం మొత్తం కథనే చెడిపేసింది, మొత్తం కథనే చాలా, చాలా అసహ్యంగా మార్చేసింది. ప్రసాదు గారు ఈ విషయం లో మాత్రం మీ అభిప్రాయం ఒప్పండీ.
    -రవికిరణ్ తిమ్మిరెడ్డి