కృష్ణ గారికి:
ఈ వ్యాసం నచ్చినందుకు సంతోషం! పంపిన వ్యాసానికి ఆడియో లింక్స్ ఇచ్చి పంపాను. ఈమాట సంపాదకులు పద్యాలను ఎం. పి. 3 ఫార్మాట్ లో మార్చి పాఠక – శ్రోతల సౌకర్యం కోసం వ్యాసానికి జతపరిచేరు. కాబట్టి, అభినందనలు సంపాదకులకి కూడా చెందుతుంది!
ఈ ప్రత్యేక సంచిక తీసుకురావటంలో మీరు చేసిన కృషి ఎంతో అభినందనీయం. వెల్చేరుగారి వ్యక్తిత్వం, రచనల గురించి వివరంగా ఒకచోట తెలుసుకునే అవకాశం కలిగింది. వ్యాసాలు, అనువాదాలు – అన్నీ చాలా చక్కగా ఉన్నాయి.
ఒక చిన్న సూచన. ఈ సంచిక కాలం ముగిసాక, ఇందులో ప్రత్యేక వ్యాసాలు, అనువాదాల్ని ఒక e-bookగా కూర్చి, ఈ మాట గ్రంధాలయంలో ఉంచితే బాగుంటుంది. ఎక్కువసేపు ఆన్‌లైనులో గడిపే సౌకర్యం లేనివాళ్ళు డౌన్‌లోడ్ చేసుకుని చదవటానికి, ఎవరైనా E-readersలో ఉంచి చదువుకోవటానికి వీలుగా ఉంటుంది – రవిశంకర్
పద్యాలు మరియు సంగీత రాగాలు అంటె ఇష్టపడే నాలాంటి వాళ్ళకి ఈ శీర్షిక ఒక చక్కని విందు భోజనం. ఎన్నిసార్లు విన్నా మరలా మరలా వినాలనిపించె ఈ సంగీతం కూడిన పద్యాలందించేందుకు మీరెంత శ్రమించి వుంటారో అర్థం చేసుకోగలను అందుకే ధన్యవాదాలు.
ఎస్‌పీబి గారు అన్ని భాషలలో చెవుల కింపుగా సరియైన ఉచ్చరణతో పాడుతారు, సుశీలలా. వీరు, జానకి ఇళయరాజా ఆస్థాన విద్వాంసులు అనడములో అతిశయోక్తి లేదు. వీరికి (వాణీ జయరాం లా) ధారణాశక్తి ఎక్కువ. కంప్యూటర్‌లా నిమిషములో దేనినైనా జ్ఞాపకము తెచ్చుకొంటారు. పీ.బీ.ఎస్ తరువాత వీరు కన్నడ సినిమాలలో కూడ విజయభాస్కర్, రాజన్-నాగేంద్ర వంటి దర్శకులకు చాల చక్కగా పాడారు. మరొకటి వీరు మంచి నటుడు కూడ. తమిళ, తెలుగు చిత్రాలలో కొన్నిటిలో (ఇటీవలి దేవస్థానం ఒక ఉదాహరణ) బాగా నటించారు. యాదృచ్ఛికముగా నేను నిన్న యూట్యూబులో వీరు హీరోగా నటించి, సంగీత దర్శకత్వము వహించి, కె. బాలచందర్ నిర్మించిన శిగరం అనే తమిళ చిత్రము చూడడము జరిగినది. అంత మాత్రాన ఘంటసాల తక్కువ వారేమి కాదు. ఘంటసాలకు సాటి ఘంటసాలయే. ఎందరో గాయకులు, ఎందరో మహానుభావులు! వారి పాటలను విని ఆనందిద్దాము. మనలో చాల మంది వారికన్న తక్కువే. వారి చిన్న గొప్పలను పోల్చడానికి మనకు అర్హతలు తక్కువ అని నా భావన. విధేయుడు – మోహన
చివర నుదహరించిన Distant Rivers Reach the Sea చదివినప్పుడు నాకు ఏక్‌నాథ్ ఈశ్వరన్ వ్రాసిన God makes the rivers to flow – Passages for meditation అనే పుస్తకము జ్ఞాపకానికి వచ్చినది. నదీనాం సాగరో గతిః అంటారు అందుకే. ఆ కవితకు ఖండగతిలో (ఐదు మాత్రలతో) సాగే నా తెలుగు సేత క్రింద ఇస్తున్నాను –
దూరమున బుట్టు నదు లంబుధిని జేరుగద
దూరముగ నుండుటయు దగ్గరగ నుండుటయె
దూరమున నుండియును దలతు నే నతనినే
దూర మా సూరీడు తామరకు గాదు గద
దూరములు హెచ్చగా ప్రేమయును హెచ్చు గద
దూరమున బుట్టు నదు లంబుధిని జేరుగద
నన్నతడు జూడగా నే నతని జూతుగా
నా మొగ మ్మతనిపై కేంద్రీకృతమ్ముగా
వనములో నెమలు లా మేఘముల జూచుగా
చూపులే నాలోని యాశలకు పాశములు
పుస్తక పరిచయం: వేమూరి వెంకటేశ్వర రావు ‘అమెరికా అనుభవాలు’ గురించి Rao Vemuri అభిప్రాయం:
01/07/2013 1:46 pm
రాజేష్
మీ సూచనకి ధన్యవాదాలు.
పుస్తకం ప్రచురణ కర్తలైన ఎమెస్కో వారిని, కినిగె వారిని సంప్రదించి చూస్తాను. వారిరువురు ఒప్పుకుంటే తప్పకుండా అలానే చేద్దాం.
వేమూరి
ఘంటసాల గొంతులో జీవించిన ఉదయశ్రీ పద్యాలు గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:
01/07/2013 11:52 am
కృష్ణ గారికి:
ఈ వ్యాసం నచ్చినందుకు సంతోషం! పంపిన వ్యాసానికి ఆడియో లింక్స్ ఇచ్చి పంపాను. ఈమాట సంపాదకులు పద్యాలను ఎం. పి. 3 ఫార్మాట్ లో మార్చి పాఠక – శ్రోతల సౌకర్యం కోసం వ్యాసానికి జతపరిచేరు. కాబట్టి, అభినందనలు సంపాదకులకి కూడా చెందుతుంది!
విష్ణుభొట్ల లక్ష్మన్న
పులి వేట గురించి bhaskar అభిప్రాయం:
01/07/2013 10:25 am
సరదాగ వుంది.
ఈ సంచిక గురించి… గురించి రవిశంకర్ అభిప్రాయం:
01/06/2013 10:27 pm
ఈ ప్రత్యేక సంచిక తీసుకురావటంలో మీరు చేసిన కృషి ఎంతో అభినందనీయం. వెల్చేరుగారి వ్యక్తిత్వం, రచనల గురించి వివరంగా ఒకచోట తెలుసుకునే అవకాశం కలిగింది. వ్యాసాలు, అనువాదాలు – అన్నీ చాలా చక్కగా ఉన్నాయి.
ఒక చిన్న సూచన. ఈ సంచిక కాలం ముగిసాక, ఇందులో ప్రత్యేక వ్యాసాలు, అనువాదాల్ని ఒక e-bookగా కూర్చి, ఈ మాట గ్రంధాలయంలో ఉంచితే బాగుంటుంది. ఎక్కువసేపు ఆన్‌లైనులో గడిపే సౌకర్యం లేనివాళ్ళు డౌన్‌లోడ్ చేసుకుని చదవటానికి, ఎవరైనా E-readersలో ఉంచి చదువుకోవటానికి వీలుగా ఉంటుంది – రవిశంకర్
నాకు నచ్చిన పద్యం: ఊయలూగే అమ్మాయిలు గురించి jp narayana అభిప్రాయం:
01/06/2013 7:39 pm
అయ్యా ఈ వ్యాసం నాకు చాలా నచ్చింది.
ఘంటసాల గొంతులో జీవించిన ఉదయశ్రీ పద్యాలు గురించి krishna akkulu అభిప్రాయం:
01/06/2013 2:46 am
లక్ష్మన్ గారికి ధన్యవాదములు.
పద్యాలు మరియు సంగీత రాగాలు అంటె ఇష్టపడే నాలాంటి వాళ్ళకి ఈ శీర్షిక ఒక చక్కని విందు భోజనం. ఎన్నిసార్లు విన్నా మరలా మరలా వినాలనిపించె ఈ సంగీతం కూడిన పద్యాలందించేందుకు మీరెంత శ్రమించి వుంటారో అర్థం చేసుకోగలను అందుకే ధన్యవాదాలు.
ఘంటసాల – బాలసుబ్రహ్మణ్యం గురించి మోహన అభిప్రాయం:
01/05/2013 9:20 pm
ఎస్‌పీబి గారు అన్ని భాషలలో చెవుల కింపుగా సరియైన ఉచ్చరణతో పాడుతారు, సుశీలలా. వీరు, జానకి ఇళయరాజా ఆస్థాన విద్వాంసులు అనడములో అతిశయోక్తి లేదు. వీరికి (వాణీ జయరాం లా) ధారణాశక్తి ఎక్కువ. కంప్యూటర్‌లా నిమిషములో దేనినైనా జ్ఞాపకము తెచ్చుకొంటారు. పీ.బీ.ఎస్ తరువాత వీరు కన్నడ సినిమాలలో కూడ విజయభాస్కర్, రాజన్-నాగేంద్ర వంటి దర్శకులకు చాల చక్కగా పాడారు. మరొకటి వీరు మంచి నటుడు కూడ. తమిళ, తెలుగు చిత్రాలలో కొన్నిటిలో (ఇటీవలి దేవస్థానం ఒక ఉదాహరణ) బాగా నటించారు. యాదృచ్ఛికముగా నేను నిన్న యూట్యూబులో వీరు హీరోగా నటించి, సంగీత దర్శకత్వము వహించి, కె. బాలచందర్ నిర్మించిన శిగరం అనే తమిళ చిత్రము చూడడము జరిగినది. అంత మాత్రాన ఘంటసాల తక్కువ వారేమి కాదు. ఘంటసాలకు సాటి ఘంటసాలయే. ఎందరో గాయకులు, ఎందరో మహానుభావులు! వారి పాటలను విని ఆనందిద్దాము. మనలో చాల మంది వారికన్న తక్కువే. వారి చిన్న గొప్పలను పోల్చడానికి మనకు అర్హతలు తక్కువ అని నా భావన. విధేయుడు – మోహన
వేంకటంలో కొండలరాయడు గురించి రంగ అభిప్రాయం:
01/05/2013 8:16 pm
సురేశ్ గారూ,
అతి చక్కని అనువాదాన్ని అందించారు. అస్సలు అనువాదన రచన అనిపించకుండా, తేలికగా, హాయిగా వుంది.
రంగ.
God on the Hill, Goddess on the Plain, and the Space In-Between: Tirupati, South India గురించి మోహన అభిప్రాయం:
01/05/2013 6:26 pm
చివర నుదహరించిన Distant Rivers Reach the Sea చదివినప్పుడు నాకు ఏక్‌నాథ్ ఈశ్వరన్ వ్రాసిన God makes the rivers to flow – Passages for meditation అనే పుస్తకము జ్ఞాపకానికి వచ్చినది. నదీనాం సాగరో గతిః అంటారు అందుకే. ఆ కవితకు ఖండగతిలో (ఐదు మాత్రలతో) సాగే నా తెలుగు సేత క్రింద ఇస్తున్నాను –
దూరమున బుట్టు నదు లంబుధిని జేరుగద
దూరముగ నుండుటయు దగ్గరగ నుండుటయె
దూరమున నుండియును దలతు నే నతనినే
దూర మా సూరీడు తామరకు గాదు గద
దూరములు హెచ్చగా ప్రేమయును హెచ్చు గద
దూరమున బుట్టు నదు లంబుధిని జేరుగద
నన్నతడు జూడగా నే నతని జూతుగా
నా మొగ మ్మతనిపై కేంద్రీకృతమ్ముగా
వనములో నెమలు లా మేఘముల జూచుగా
చూపులే నాలోని యాశలకు పాశములు
దూరమున బుట్టు నదు లంబుధిని జేరుగద
మదిలోని కోర్కెతో దగ్గరైనట్టులే
నేలపై నేనిందు కొండలకు ఱేడందు
మేమిర్వురము కూడి యేకమైనాముగా
అద్భుతము యీ వింత మేనిలో బులకింత
దూరమున బుట్టు నదు లంబుధిని జేరుగద
విధేయుడు – మోహన
పుస్తక పరిచయం: వేమూరి వెంకటేశ్వర రావు ‘అమెరికా అనుభవాలు’ గురించి Rajesh అభిప్రాయం:
01/05/2013 9:24 am
Rao Garu
Please keep this book in KINIGE