Please donot compare Ghantasala with SPB. Ghantasala is divine voice which is evidenced in Bhagatgeeta. Even SPB sang Bhagatgetta which is jettisioned into dustbin. Even today day in every temple, you can hear only Ghantasala Bhagatgeeta.
Ghantasala did music direction for more than 100 film, most of them are super hit. Of SPB’s 50 films music direction, you will not find any hit. The main reason he is good sincer, but not good music director.
Last but not least: There are many fans to SPB, But there are many devotees to Ghantasala.
Though I am Devotee of Ghantasala, I am fan of SPB.
SPB failed in singing Poems. It is only Ghantasala who contributed to telugu padyams. Ghantasala died 35 years back, but even today, many devotees and fans still listen to his voice. Whether the same tribute will happen to SPB after 35 years is questionable and doubtful.
Ghantala provided equal opportunity to his co singers such as Madava peddi sathyam pittapuram, others. In fact I came to know that SPB did not allow other to rise. Example: V.Ramakrishna who was ruling the workd in 1973-1978, but later he was suppressed by many including Chakravarthi musci director,
తిరుపతికి దగ్గరలో ఉండే ఊరిని వేంకటగిరి అంటారు. అద్రి, గిరి ఒకటే అర్థము నిచ్చినా వాడుక విషయము వేరు. ఈ వెంకటగిరి తాలూకాకు ముఖ్యనగరము.
ఇది చంద్రగిరి,వెంకటగిరి కాదు, తప్పు దొరలినందులకు క్షమించాలి – మోహన
The story is told that when Venkatesvara wanted to get married, he needed to borrow money for his wedding from his brother Govinda Raja Swamy
నాకు తెలిసినంతవరకు గోవిందరాజ స్వామి డబ్బు యివ్వలేదు వేంకటేశ్వరునికి, కుబేరుడు ఇచ్చాడు, గోవిందరాజుల పని ఆ డబ్బును పడితో కొలచడము మాత్రమే, అందుకే పడిని తలగడగా పెట్టుకొని పడుకొన్నాడు. దీనిని ఊతగా పెట్టుకొని మాయాబజారు చిత్రము కూడ తీసినారు.
god lives on the seventh range, Venkatagiri
సామాన్యముగా దీనిని వేంకటాద్రి అంటారు, తిరుపతికి దగ్గరలో ఉండే ఊరిని వేంకటగిరి అంటారు. అద్రి, గిరి ఒకటే అర్థము నిచ్చినా వాడుక విషయము వేరు. ఈ వెంకటగిరి తాలూకాకు ముఖ్యనగరము. దీనికి దగ్గరలో ఉండే శ్రీవారిమెట్టునుండి ఎగువ తిరుపతికి మెట్లు ఉన్నాయి. ఈ మెట్ల ద్వారా పాలు, పూలు ఇత్యాదులు కొండపైకి సరఫరా చేయబడుతాయి. ఈ ప్రాంతములోనే స్వర్ణముఖి నది పుట్టి, తిరుచానూరు పక్కగా ప్రవహిస్తుంది, తరువాత కాళహస్తి, వెంకటగిరి (నెల్లూరి దగ్గర) మార్గముగా సముద్రము చేరుకొంటుంది.
గ్రామదేవతలను పార్వతీదేవి అంశమని భావిస్తారు, పార్వతి విష్ణువు చెల్లెలు. వేంకటేశ్వరుడు విష్ణ్వంశ సంభూతుడు, కాబట్టి గ్రామదేవతయైన గంగమ్మ వేంకటేశ్వరునికి చెల్లెలు అవుతుంది. నాలుగు మంగళవారాలు మడిబిచ్చము తీసికొని అడుగడుగుల దండాలు పెట్టుకొని గంగమ్మ గుడి వెళ్లడము సంప్రదాయము. “మంగళారం మడి బిచ్చం, ఒక్క పొద్దు, ఓటి కుండ” అని చెప్పుకొని బిచ్చము అడగాలి. 50 ఏళ్లకు ముందు చాటుగా బలి యిచ్చేవారు. గంగజాతర సమయములో ప్రయాణము కూడ చేయరు. స్త్రీవేషము మాత్రమే కాదు, ఈ జాతర సమయములో నపుంసకులు కూడ ఎన్నో చోటులనుండి తిరుపతికి వస్తారు. గంగజాతరలో నాకు నచ్చని దంతా ఒకటే, బూతుమాటలాడి, చీపురుతో మురికికాలువ నీళ్లను అందరిపైన చల్లడము, నల్లరంగు పులుముకొని వీథులలో తిరుగుతూ అందరినీ కౌగిలించుకోవడము. ఇది ఒక అరాజకమైన చర్య.
నారాగారి గురించి మీ జ్ఞాపకాలు చాలా బాగా రాసేరు. అలాగే మీకు తెలిసిన లిటెరరి ఫిగర్స్ అందరి తోనూ కనీసం కొందరితోనైనా మీ అనుభవాలూ-జ్ఞాపకాలూ రాస్తే బావుంటుంది అని నా అభిప్రాయం.వీలయినంత తొందరగా రాయడం మంచిదేమో అన్పిస్తోంది.
అభినందనలతో,
శ్యాం
Truly fascinating subject and angle. It is striking that virtually every aspect of this God is very unusual: I don’t think there is another god whose name includes “Eswara” who is not a form of Shiva but Vishnu; whose relatives also have unusual names like Govinda Rajulu and Padmavathi; whose story is very mundane, involving debts and interest; who hasn’t done anything praiseworthy like the other gods – punishing demons, showing supernatural abilities etc., As the author of this article says, there isn’t any study of how, from perhaps the 1st century A.D, this temple has evolved into such a wealthy, powerful attraction for kings and commoners alike over the centuries. Works like this article shed some light on this highly mysterious subject.
అన్నమాచార్యులపైన వారి కీర్తనలపైన అట్టి వాటిని అందరికీ ఆంగ్లములో అందుబాటు చేయలని నారాయణారావుగారు చేసిన కృషి నిజముగా అభినందనీయము. దానిపైన సంక్షిప్తముగా తన అభిప్రాయాలను తెలిపిన బ్రహ్మానందముగారికి అభినందనలు. అన్నమాచార్యుల సారస్వతము అందరికీ చేరినది. వాటి ఆంగ్లానువాదము తెలుగురాని సంగీత సాహిత్యాభిమానులకు కూడ ఎక్కువగా ఉపయోగ పడుతుంది. పుస్తకములో మాతృకలను కూడ ఇవ్వవలసినదనే అభిప్రాయమును నేను కూడ అంగీకరిస్తాను. నాలుక తిరగకున్నా మూలము ఎలాగుంటుందో అన్నది వాటివల్ల తెలిసికోవచ్చును.
నేను ఒకప్పుడు ఒక పరిశోధనను ఆంగ్లములో వ్రాసి ఒక రష్యన్ విజ్ఞానపత్రికకు పంపాను, వాళ్లు దానిని రష్యనులో అనువాదము చేసి ప్రచురించారు. ఆరు నెలల తరువాత దానిని మళ్లీ ఆంగ్లములో సోవియెట్ ఫిజిక్స్ అనువదించినది. నా ఆంగ్ల మూలమును , ఈ ఆంగ్ల ప్రతిని చదివితే అక్కడక్కడ నాకు నవ్వు వచ్చింది. అందుకే ఈ వ్యాసములోని ఆంగ్లానువాదములను తెలుగులోకి మళ్లీ అనువదిస్తే ఎలాగుంటుందో అనే భావన కలిగింది. దాని ఫలితమే క్రింది అనువాదాలు. తప్పులన్ని నావే, ఆ అన్నమాచార్యులది కాదు, ఈ నారాయణరవుది కాదు 🙂 నవ్వి ఆనందించండి.
‘నువ్వు పెట్టేదొకందుకైతే నేను తినేదొకందుకు’ అనే సామెత గుర్తొచ్చింది. ఆయన చెప్తూనే ఉన్నాడు. మనం వింటున్నది మరొకందుకు!
కీర్తిశేషులు వల్లంపాటి వెంకటసుబ్బయ్య గారు కొన్నాళ్ళ క్రితం డిట్రాయిట్ వచ్చిన సందర్భం లో చెప్పిన సంగతి ఇది: “ఆ మధ్య ఒక రచయిత తను రాసిన కథల మీద అప్పుడే ఒక M. Phil. వచ్చేసింది, ఇంకా మీ పుస్తకాల మీద ఎవరూ పని చేస్తున్నట్టు లేదే. ఎవరైనా ఒక Ph D చెయ్యొచ్చు అన్నాడు. శుభం, కానీ ఈ సలహా మాత్రం ఎవరికీ ఇవ్వొద్దు అన్నాను. నా అదృష్టం బాగుండి అతను ఇంకా ఎవరిదగ్గరా ఆమాట అన్నట్టు లేదు.”
సాహిత్య పరిశొధనల మీద తెలుగు నాట ఉన్న అవగాహన ఎప్పుడు మారిందో తెలియదు గానీ, నారాయణరావు గారు ఇంగ్లీషులో చెప్పింది తెలుగులోకి అనువాదం చెయ్యడం వల్ల ఏమైనా బాగుపడుతుందేమోనని ఆశ! (ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో అందరూ ఇంగ్లీషు పండితులే కాబట్టి, తెలుగులో ఉంటే పరభాషా వ్యామోహంతో చదువుతారేమో!)
తెలుగులో ఏ సాహిత్య పత్రికా చెయ్యని (చెయ్యలేని) పని ఈ మాట ద్వారా చేసినందుకు సంపాదక వర్గానికి అభినందనలు, అభివందనలూను!
వారడిగిన దానికి న్యాయం చేయలేకపోయినా, మిక్కిలి దయతో వారి వ్యాసంలో నా చిత్రానికి చోటు కల్పించిన శ్రీ జెజ్జాల కృష్ణమోహనరావు గారికి శతసహస్ర కృతజ్ఞతలతో …అంతకుమించి వారి వ్యాసానికి పెట్టిన పేరులో నా పేరు ఇమిడ్చినందుకు మరిన్ని కృతజ్ఞతలతో
ఘంటసాల – బాలసుబ్రహ్మణ్యం గురించి venkateswarlu అభిప్రాయం:
01/04/2013 2:04 pm
Dear writer,

God on the Hill, Goddess on the Plain, and the Space In-Between: Tirupati, South India గురించి Mohana అభిప్రాయం:
01/04/2013 11:28 am
తిరుపతికి దగ్గరలో ఉండే ఊరిని వేంకటగిరి అంటారు. అద్రి, గిరి ఒకటే అర్థము నిచ్చినా వాడుక విషయము వేరు. ఈ వెంకటగిరి తాలూకాకు ముఖ్యనగరము.
ఇది చంద్రగిరి,వెంకటగిరి కాదు, తప్పు దొరలినందులకు క్షమించాలి – మోహన
God on the Hill, Goddess on the Plain, and the Space In-Between: Tirupati, South India గురించి Mohana అభిప్రాయం:
01/04/2013 11:21 am
ఆసక్తికరమైన వ్యాసము, రచయితకు జోహారులు.
The story is told that when Venkatesvara wanted to get married, he needed to borrow money for his wedding from his brother Govinda Raja Swamy
నాకు తెలిసినంతవరకు గోవిందరాజ స్వామి డబ్బు యివ్వలేదు వేంకటేశ్వరునికి, కుబేరుడు ఇచ్చాడు, గోవిందరాజుల పని ఆ డబ్బును పడితో కొలచడము మాత్రమే, అందుకే పడిని తలగడగా పెట్టుకొని పడుకొన్నాడు. దీనిని ఊతగా పెట్టుకొని మాయాబజారు చిత్రము కూడ తీసినారు.
god lives on the seventh range, Venkatagiri
సామాన్యముగా దీనిని వేంకటాద్రి అంటారు, తిరుపతికి దగ్గరలో ఉండే ఊరిని వేంకటగిరి అంటారు. అద్రి, గిరి ఒకటే అర్థము నిచ్చినా వాడుక విషయము వేరు. ఈ వెంకటగిరి తాలూకాకు ముఖ్యనగరము. దీనికి దగ్గరలో ఉండే శ్రీవారిమెట్టునుండి ఎగువ తిరుపతికి మెట్లు ఉన్నాయి. ఈ మెట్ల ద్వారా పాలు, పూలు ఇత్యాదులు కొండపైకి సరఫరా చేయబడుతాయి. ఈ ప్రాంతములోనే స్వర్ణముఖి నది పుట్టి, తిరుచానూరు పక్కగా ప్రవహిస్తుంది, తరువాత కాళహస్తి, వెంకటగిరి (నెల్లూరి దగ్గర) మార్గముగా సముద్రము చేరుకొంటుంది.
గ్రామదేవతలను పార్వతీదేవి అంశమని భావిస్తారు, పార్వతి విష్ణువు చెల్లెలు. వేంకటేశ్వరుడు విష్ణ్వంశ సంభూతుడు, కాబట్టి గ్రామదేవతయైన గంగమ్మ వేంకటేశ్వరునికి చెల్లెలు అవుతుంది. నాలుగు మంగళవారాలు మడిబిచ్చము తీసికొని అడుగడుగుల దండాలు పెట్టుకొని గంగమ్మ గుడి వెళ్లడము సంప్రదాయము. “మంగళారం మడి బిచ్చం, ఒక్క పొద్దు, ఓటి కుండ” అని చెప్పుకొని బిచ్చము అడగాలి. 50 ఏళ్లకు ముందు చాటుగా బలి యిచ్చేవారు. గంగజాతర సమయములో ప్రయాణము కూడ చేయరు. స్త్రీవేషము మాత్రమే కాదు, ఈ జాతర సమయములో నపుంసకులు కూడ ఎన్నో చోటులనుండి తిరుపతికి వస్తారు. గంగజాతరలో నాకు నచ్చని దంతా ఒకటే, బూతుమాటలాడి, చీపురుతో మురికికాలువ నీళ్లను అందరిపైన చల్లడము, నల్లరంగు పులుముకొని వీథులలో తిరుగుతూ అందరినీ కౌగిలించుకోవడము. ఇది ఒక అరాజకమైన చర్య.
విధేయుడు – మోహన
అంబఖండి నుంచి అట్లాంటా దాకా… గురించి Shyam అభిప్రాయం:
01/03/2013 5:57 pm
వెంకటేశ్వర్రావుగారూ,
నారాగారి గురించి మీ జ్ఞాపకాలు చాలా బాగా రాసేరు. అలాగే మీకు తెలిసిన లిటెరరి ఫిగర్స్ అందరి తోనూ కనీసం కొందరితోనైనా మీ అనుభవాలూ-జ్ఞాపకాలూ రాస్తే బావుంటుంది అని నా అభిప్రాయం.వీలయినంత తొందరగా రాయడం మంచిదేమో అన్పిస్తోంది.
అభినందనలతో,
శ్యాం
ఒక నేను, కొన్ని నువ్వులు గురించి lilly అభిప్రాయం:
01/03/2013 3:45 am
బాగుంది కాని అంతా ఒకే కథ లా ఉంటే బాగుండేది
God on the Hill, Goddess on the Plain, and the Space In-Between: Tirupati, South India గురించి K.V.S. Ramarao అభిప్రాయం:
01/03/2013 3:33 am
Truly fascinating subject and angle. It is striking that virtually every aspect of this God is very unusual: I don’t think there is another god whose name includes “Eswara” who is not a form of Shiva but Vishnu; whose relatives also have unusual names like Govinda Rajulu and Padmavathi; whose story is very mundane, involving debts and interest; who hasn’t done anything praiseworthy like the other gods – punishing demons, showing supernatural abilities etc., As the author of this article says, there isn’t any study of how, from perhaps the 1st century A.D, this temple has evolved into such a wealthy, powerful attraction for kings and commoners alike over the centuries. Works like this article shed some light on this highly mysterious subject.
గాడ్ ఆన్ ది హిల్ – టెంపుల్ పోయమ్స్ ఆఫ్ తిరుపతి: ఒక మెచ్చుకోలు గురించి Mohana అభిప్రాయం:
01/02/2013 12:06 pm
అన్నమాచార్యులపైన వారి కీర్తనలపైన అట్టి వాటిని అందరికీ ఆంగ్లములో అందుబాటు చేయలని నారాయణారావుగారు చేసిన కృషి నిజముగా అభినందనీయము. దానిపైన సంక్షిప్తముగా తన అభిప్రాయాలను తెలిపిన బ్రహ్మానందముగారికి అభినందనలు. అన్నమాచార్యుల సారస్వతము అందరికీ చేరినది. వాటి ఆంగ్లానువాదము తెలుగురాని సంగీత సాహిత్యాభిమానులకు కూడ ఎక్కువగా ఉపయోగ పడుతుంది. పుస్తకములో మాతృకలను కూడ ఇవ్వవలసినదనే అభిప్రాయమును నేను కూడ అంగీకరిస్తాను. నాలుక తిరగకున్నా మూలము ఎలాగుంటుందో అన్నది వాటివల్ల తెలిసికోవచ్చును.
నేను ఒకప్పుడు ఒక పరిశోధనను ఆంగ్లములో వ్రాసి ఒక రష్యన్ విజ్ఞానపత్రికకు పంపాను, వాళ్లు దానిని రష్యనులో అనువాదము చేసి ప్రచురించారు. ఆరు నెలల తరువాత దానిని మళ్లీ ఆంగ్లములో సోవియెట్ ఫిజిక్స్ అనువదించినది. నా ఆంగ్ల మూలమును , ఈ ఆంగ్ల ప్రతిని చదివితే అక్కడక్కడ నాకు నవ్వు వచ్చింది. అందుకే ఈ వ్యాసములోని ఆంగ్లానువాదములను తెలుగులోకి మళ్లీ అనువదిస్తే ఎలాగుంటుందో అనే భావన కలిగింది. దాని ఫలితమే క్రింది అనువాదాలు. తప్పులన్ని నావే, ఆ అన్నమాచార్యులది కాదు, ఈ నారాయణరవుది కాదు 🙂 నవ్వి ఆనందించండి.
1) మనుగడ యిది ఆటాయెను నిత్యము
కనబడనిది కనుగొనుటే సత్యము
వచ్చుట యది నిజముగదా
వెళ్లుట యది నిజముగదా
రాకలకు పోకలకు
నడుమ రక్తి గట్టు ఆట
కందోయికి ముందున్నది
కడు విశాల విశ్వమ్మది
చిట్టచివర నుండు నిజము
చిట్టచివర నుండు నిజము
(ఆరు మాత్రలతో)
2) ఎఱ్ఱని పువ్వుల కామిని పెదవుల
నల్లన నల్లని కస్తురి మఱకలు
ప్రియునికి పంపిన యనంగ లేఖల
నయమగు ప్రణయపు టక్షర పంక్తులు
వెన్నెల పులుగుల కన్నులు కలికికి
కన్నుల కొనలో నెఱ్ఱని చారలు
నాథుని యెదలో గ్రుచ్చిన చూపుల
మరల్చ నెత్తుట తడి యయె గన్నులు
ప్రియునికి పంపిన యనంగ లేఖల
నయమగు ప్రణయపు టక్షర పంక్తులు
(నాలుగు మాత్రలతో)
3 )హాయిహాయిగ హొయలు మించగ నాథు వలపుల నింపెను
తీయతీయగ మాటలాడుచు తల్లి నిద్దుర వోయెను
పగటి ఘడియలు సాగె నింకను నామె కన్నుల తెఱవదు
వెలుగు నిండిన మొగముపై బలు కురులు చెదరుచు నాడెను
(మిశ్రగతి)
4) అలలు తగ్గగా మునిగెద నందువు
కలదే యంత మనంతమగు మతికి
దప్పి తీర నిజ మెఱిగెద నందువు
దప్పిక తీరునె సత్యము తెలియునె
కలదే యంత మనంతమ్మునకును
భావి నెఱిగి యా భూతము మఱతువె
రేపు తెలియదే నిన్న మఱువవే
కలదే యంత మనంతమ్మునకును
కొండలరాయని నిశ్చలమతితో
యండ జేరు యా నిండు భక్తి యది
కలలో గూడ యూహకు నందదు
కలదే యంత మనంతమ్మునకును
(ఎనిమిది మాత్రలతో)
5) చెప్పవే వానితో నాజూకుగా నుండ
ఆషాఢభూతి నే నసలు గాదనుచు
ఒక మాట కొక మాట బదులు చెప్పక తాను
దూతితో సందేశమును పంపరాదే
గుర్రుగుర్రని నన్ను చూచు టెందులకే
సిగ్గుతో తలవంచి నిలువ డెందులకో
చెప్పవే వానితో నాజూకుగా నుండ
అట్టహాసము చేసి బెదిరించకను తాను
చిరునవ్వుతో సద్దు చేయకుండగ నౌనె
ఆడు మాడుము యంచు ఆదేశ మివ్వకను
బ్రేమతో నన్నక్కు జేర్చుకో రాదే
చెప్పవే వానితో నాజూకుగా నుండ
రతికేళితో నన్ను రంపు జేయక తాను
ప్రక్కలో పండుకొని కౌగిలించిన చాలు
వాడు కొండల రాయ డలమేలు మంగ నే
నొక చిన్న స్పర్శ చా లది నాకు మిన్న
(ఐదు మాత్రలతో)
విధేయుడు – మోహన
ఈ సంచిక గురించి… గురించి Krishna Rao Maddipati అభిప్రాయం:
01/01/2013 1:19 pm
‘నువ్వు పెట్టేదొకందుకైతే నేను తినేదొకందుకు’ అనే సామెత గుర్తొచ్చింది. ఆయన చెప్తూనే ఉన్నాడు. మనం వింటున్నది మరొకందుకు!
కీర్తిశేషులు వల్లంపాటి వెంకటసుబ్బయ్య గారు కొన్నాళ్ళ క్రితం డిట్రాయిట్ వచ్చిన సందర్భం లో చెప్పిన సంగతి ఇది: “ఆ మధ్య ఒక రచయిత తను రాసిన కథల మీద అప్పుడే ఒక M. Phil. వచ్చేసింది, ఇంకా మీ పుస్తకాల మీద ఎవరూ పని చేస్తున్నట్టు లేదే. ఎవరైనా ఒక Ph D చెయ్యొచ్చు అన్నాడు. శుభం, కానీ ఈ సలహా మాత్రం ఎవరికీ ఇవ్వొద్దు అన్నాను. నా అదృష్టం బాగుండి అతను ఇంకా ఎవరిదగ్గరా ఆమాట అన్నట్టు లేదు.”
సాహిత్య పరిశొధనల మీద తెలుగు నాట ఉన్న అవగాహన ఎప్పుడు మారిందో తెలియదు గానీ, నారాయణరావు గారు ఇంగ్లీషులో చెప్పింది తెలుగులోకి అనువాదం చెయ్యడం వల్ల ఏమైనా బాగుపడుతుందేమోనని ఆశ! (ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో అందరూ ఇంగ్లీషు పండితులే కాబట్టి, తెలుగులో ఉంటే పరభాషా వ్యామోహంతో చదువుతారేమో!)
తెలుగులో ఏ సాహిత్య పత్రికా చెయ్యని (చెయ్యలేని) పని ఈ మాట ద్వారా చేసినందుకు సంపాదక వర్గానికి అభినందనలు, అభివందనలూను!
మద్దిపాటి కృష్ణారావు
వంశీవనము (హాలుని గాథాసప్తశతి నుండి కొన్ని పద్యములు) గురించి మాగంటి వంశీ మోహన్ అభిప్రాయం:
01/01/2013 12:26 pm
వారడిగిన దానికి న్యాయం చేయలేకపోయినా, మిక్కిలి దయతో వారి వ్యాసంలో నా చిత్రానికి చోటు కల్పించిన శ్రీ జెజ్జాల కృష్ణమోహనరావు గారికి శతసహస్ర కృతజ్ఞతలతో …అంతకుమించి వారి వ్యాసానికి పెట్టిన పేరులో నా పేరు ఇమిడ్చినందుకు మరిన్ని కృతజ్ఞతలతో
భవదీయుడు
మాగంటి వంశీ మోహన్
కోనసీమ కథలు: రెండో రుమాలు గురించి Y.Uma Maheswaa Rao అభిప్రాయం:
01/01/2013 6:18 am
కథ చాలా బాగుంది.కథా కథనం ఎంతో బిగితో అల్లారు. జీవిత సత్యాలు ఒక్కొక్కసారి మన మనసుల్ని తడునుతాయి. మీ కథ కూడా మనసుని తడిమింది.
కృతజ్ఞతలతో
ఉమ యారాశి