పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16474

  1. ప్రధాన సంఖ్యలలో కవలలు గురించి Taara అభిప్రాయం:

    08/08/2015 6:42 pm

    >>మాలాంటి సామాన్యులకి అర్థం అయే రీతిలో ఎక్కడెక్కడ ప్రధాన సంఖ్యల అవసరం వస్తుందో చెబితే బాగుంటుంది కదా?


    I have quals this semester :).

    Primes are (not prime numbers) like atoms (because of Grothendeick), we dont really care about numbers like 4,6,8. We only care about (2), (3).. (x) = ideal generated by x.
    By classification of local fields we have C, R and Q_p as char 0 and F_p((t)) as char p.

    So, when ever we have some results on C or R, we can extend that to p-adic field Q_p, but C or R are easier to work with (or better understood). So, there is more work going on C or R. recently other metrics gained momentum because of works of Terry Tao, Margulis and the recent fields medalists. But the problem is the flows are not homogeneous or simply there may be no longer compact topological structure which makes all existing knowledge obsolete.

    Coming to practical application, unfortunately CS eats everything. But more classical motivation is from Dynamics or Physics or in simple terms what happens to earth’s orbit after say some 1000 billion years, how can you estimate? Well there comes Ergodic theory. There we will have an algebraic structure, which can be reduced to Number Theoretic one. Infact number theory there makes lot of things much easier.

    My adviser was supported by Shell while he was in Grad school, his problem was, the shale gas horizontal drilling process exhibits a nice algebraic curve and he was expected to exploit it’s properties. Unfortunately he didn’t, but some one else did and now we have cheap natural gas. Shell still sponsors Maths grads at lot of schools.

    Or simply to say, any manifold is either R^n or R^2n, so we have real numbers on any manifold, and hence primes. For example earth is 2 dimensional real space (not 3 dimensional), which is R^2, so every point on earth represents a prime (irreducible polynomials like x-1, x-2, x^2+1, x^2 + 2 so on). So, what ever physical phenomenon you mention, it has number theoretic implications.

    Alternatively

    http://intlpress.com/site/pub/pages/journals/items/cntp/_home/_main/

  2. సాహిత్యచరిత్రలో అపూర్వమైన పర్యాయకావ్యం: గణపవరపు వేంకటకవి ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసము – 2. గురించి ఏల్చూరి మురళీధరరావు అభిప్రాయం:

    08/06/2015 3:25 pm

    మాన్యులు శ్రీమదిత్యాది శ్రీమాన్ కృష్ణదేశికాచార్యుల వారి సన్నిధికి

    సప్రశ్రయ నమస్కారములతో,

    సహృద్వాత్సల్యౌదార్యాలు ఉట్టిపడుతున్న మీ ఆశీర్మయవిలేఖితానికి ధన్యవాదాలను విన్నవించికొంటున్నాను. ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసాన్ని ఎంతో దీక్షతో అధ్యయనించిన మీరు అదొక కావ్యసామాన్యం కాదని, అపూర్వమైన వినూత్న లక్ష్యసాగరమని చేసిన ప్రతిపాదన మీ ఆమోదానికి నోచికొన్నందుకు ఎంతో సంతోషంగా ఉన్నది. గణపవరపు వేంకటకవి కృతులను పరిచయం చేసేటపుడు తత్తత్కాలాదికాన్ని విపులంగా సమీక్షింపవచ్చునని అనుకొన్నాను. అందువల్ల మీ ప్రశ్నకు సంక్షేపతః ఇక్కడ సమాధానిస్తున్నాను:

    ‘విద్యావతీ దండకం’ 1948లో Bulletin of Govt. Oriental MSS Library (సంపు – 1; సంచిక – 1) లో అచ్చయింది. అది ముద్దళగిరికి అంకితం. ప్రబంధరాజంలో కవి “చండ విద్యావతీ దండక”మని ప్రాసయతి నిమిత్తం అన్నాడే కాని, అది చండవృష్టి దండకం కాదు. నన్నయాదులు ప్రవేశపెట్టిన కామబాణ దండకమే. వీరేశలింగం గారు కవి 1750 నాటివాడనటం సరికాదని; ముద్దళగిరి 1674లో తంజావూరును పరిపాలించినందువల్ల కవి కాలం నిరూపింపబడుతున్నదని కె. వెంకటసుబ్బాశాస్త్రి గారు, నిడుదవోలు వేంకటరావు గారు విద్యావతీ దండకం పీఠికలో వ్రాశారు. ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసం కూడా తత్సమకాలికమని నిడుదవోలు వారి అభిప్రాయం. అప్పటినుంచి విమర్శకులు కవి కాలాన్ని ఆ విధంగా నిర్ధారించటం జరుగుతున్నది. అది సరికాదు.

    1674లో ముత్తులింగ నాయకుడు (ముద్దళగిరి) తన సవతి అన్న చొక్కనాథ నాయకుని ప్రాపకంతో తంజావూరుకు రాజైనాడు. అప్పటికి అతని వయోవస్థాకాలం పాతిక – ముప్ఫై యేళ్ళకు దరిదాపులలో ఉండి ఉంటుంది. యౌవనోద్రేకం వల్ల, అన్నగారన్న చనవు మూలాన చొక్కనాథ నాయకుని ఏలుబడిలో ఉంటూనే, సమానుడైన స్వతంత్రప్రభువు వలె ప్రవర్తించాడు. శివాజీ సవతి తమ్ముడు ఏకోజీ దండెత్తి, ఒకటి రెండు పర్యాయాల విఫలయత్నం తర్వాత 1676 జనవరి 16-వ తేదీని విష్ణుచక్రం కోటను వశపరచుకొన్నాడు. ఏకోజీ తొలిదండయాత్ర నాటి పరాజయగాథ ‘పెదళ్గిరి విజయము’ మాలికా కావ్యంలో సవిస్తరంగా వివరింపబడింది. (‘పెదళ్గిరి విజయము’ నిడుదవోలు వారన్నట్లు గణపవరపు వేంకటకవి రచన కాదని నేను ఇతరత్ర వేరొక వ్యాసంలో నిరూపించాను.) అప్పటికే అతని ప్రవర్తనతో విసిగి ఉన్న చొక్కనాథుడు అతనికి అండరాలేదు. రాజ్యభ్రష్టుడైన ముద్దళగిరి 1678లో మళ్ళీ అన్నగారి వద్దకు చేరుకొని, అపార్థాలకు క్షమాభిక్షను అర్థించి మధుర వద్ద రాజప్రతినిధిగా ఉన్నాడు. 1678 (కాళయుక్తి)లో మధురలోనూ, 1679 (సిద్ధార్థి)లో శ్రీరంగంలోనూ అతని దానశాసనాలున్నాయి. 1682లో చొక్కనాథ నాయకుడు మరణించిన తర్వాత చిన్నచిన్న అధికారపదవులను చేపట్టి, 1700-1705 (±) ప్రాంతాల కర్ణాటకానికి వెళ్ళి సుమారు యాభై – యాభైఅయిదేళ్ళప్పుడు కుంతూరు దుర్గానికి రాజయ్యాడు. ఎంతకాలం ఉన్నాడో స్పష్టంగా చెప్పలేము. ఆ కాలంలోనే లింగనమఖి శ్రీకామేశ్వరకవి ధేనుమాహాత్మ్య రచన జరిగింది. శ్రీకామేశ్వరకవి ‘సత్యభామా సాంత్వనము’ ముద్దళగిరికి అంకితమైంది. ఈ చారిత్రిక పరిణామాలను గుర్తింపక నిడుదవోలు వారు శ్రీకామేశ్వరకవిని కూడా 1674కు పరిమితం చేశారు. వారిని అనుసరించి తర్వాతివారందరూ వ్రాస్తున్నారు.

    అంతర్గతసాక్ష్యాల వల్ల గణపవరపు వేంకటకవి ‘సర్వలక్షణశిరోమణి’ క్రీస్తుశకం 1700కు పూర్వరచన కాదని నిశ్చయంగా చెప్పవచ్చును. తద్రచనాకాలం కొంచెం ఇంచుమించుగా 1705-1715 (±) కావచ్చును. అందులో ముద్దళగిరి ప్రస్తావన లేదు. అప్పటికి అతని ప్రాపకం లేదన్నమాట. ‘విద్యావతీ దండకం’ ముద్దళగిరికి అంకితం. దాని చివరను “మహాలక్షణగ్రంథ భాషాభిమానప్రథామాధురీసాధురీత్యర్థవ చ్ఛబ్దబంధానుబంధ ప్రబంధాధినాథాప్పయామాత్య రాడ్వేంకటార్య ప్రణీతంబైన” అని ఉన్నది. అంటే విద్యావతీ దండకం సర్వలక్షణశిరోమణికి అనంతరీయం అన్నమాట. ఆ తర్వాత ఒక దశాబ్ది కాలం కృషిచేసి, వందలాది గ్రంథాలనుంచి లక్షణలక్ష్యాలను సమీకరించుకొని ప్రబంధరాజ సంకలనాన్ని మొదలుపెట్టి ఉండాలి. తలకొక్కతీరుగా ఉన్న వ్రాతప్రతులలోని ప్రక్షిప్తాలను తొలగించి సుష్ఠుప్రతిని పరిష్కరింపగలిగితే ప్రబంధరాజ రచనాకాలం 1730 – 1755 (±) కావచ్చునని ఇప్పటి ఆలోచన. ప్రకృతవ్యాసంలో ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసము యొక్క సర్వాంగీణవిమర్శ గాక, తెలుగు సాహిత్యచరిత్రకు అపరిచితమైన ఒక్క అపూర్వమైన విశేషం మాత్రమే అధికరింపబడుతున్నది. అందులో సంప్రయుక్తమైన లక్షణజాతాన్ని గురించి, చిత్రకవిత్వాన్ని గురించి ప్రత్యేకంగా పరిశీలింపవలసి ఉంటుంది.

    వేంకటకవి రచనలో తుల్యసంవాదం ఉంటే ఆ రచన ప్రబంధరాజానికి పౌర్వికమని, వేంకటకవి దానిని పరిశీలించి తన సంకలనంలో చేర్చుకొన్నాడని గ్రహించాలి. ఈ పూర్వాపరాల నిశ్చయం అంత సులభసాధ్యం కాదని వ్యాసంలో నేను మనవిచేశాను. గ్రంథస్థపద్యాల పట్టికను తన్మూలపద్యాల గుర్తింపుతో ప్రకటిస్తేనే కాని అది సాధ్యం కాదు. తెలుగు సాహిత్యచరిత్ర చాల వరకు ప్రామాణ్యభావం లేని ప్రాథమికోహలతో సాగినందువల్ల కావ్యపీఠికలలో నిర్ణయింపబడిన కాలాదికాన్ని ప్రమాణంగా స్వీకరింపక చరిత్రనికషపాషాణపట్టికపై స్వయంగా గీచిచూచి తథ్యమిథ్యావివేకంతో పునారచింపవలసిన అవసరం ఉన్నది.

    మీ ఆత్మీయతకు, ఆదృతికి నమస్సుమాంజలి.

    విధేయుడు,
    ఏల్చూరి మురళీధరరావు

  3. పలుకుబడి: దిక్కులు, పక్కలు గురించి Rao Vemuri అభిప్రాయం:

    08/05/2015 1:07 am

    ఎడ- అంటే దూరం, gap.

    “ఎడ పిల్ల” అంటే “చంటి పిల్లకి ముందు పిల్ల” (“penultimate baby”) అని మా ప్రాంతాలలో వాడతారు. – వేమూరి

  4. ప్రధాన సంఖ్యలలో కవలలు గురించి Rao Vemuri అభిప్రాయం:

    08/01/2015 12:47 pm

    భౌతిక శాస్త్రంలోను, ఖగోళ శాస్త్రంలోను, గతి శాస్త్రంలోను ప్రధాన సంఖ్యల ఉపయోగం ఉందని చెప్పి ఊరుకుంటే ఎలా? మాలాంటి సామాన్యులకి అర్థం అయే రీతిలో ఎక్కడెక్కడ ప్రధాన సంఖ్యల అవసరం వస్తుందో చెబితే బాగుంటుంది కదా? చాల రోజులు బౌల్య బీజగణితం ఎందుకూ పనికి రాదనుకునేవారు. కాని ఈ “కొత్త లెక్కలు” కలన యంత్రాల నిర్మాణానికి మూలం అయి కూర్చున్నాయి. అలాగే ప్రధాన సంఖ్యలు ఎలా ఉపయోగపడుతున్నాయో తెలుసున్న వాళ్లు చెబితే బాగుంటుంది. – వేమూరి

  5. పలుకుబడి: దిక్కులు, పక్కలు గురించి P.RAMA KRISHNA REDDY అభిప్రాయం:

    07/31/2015 12:06 am

    చాలా బాగుంది. ధన్యవాదాలు మీకు …

    పి. రామకృష్ణారెడ్డి
    తెలుగు పండిట్, నంది అకాడమి,
    నంద్యాల.

  6. ప్రధాన సంఖ్యలలో కవలలు గురించి Taara అభిప్రాయం:

    07/30/2015 2:48 pm

    I haven’t read the entire article.

    Zhang, did his Ph.D. in Alg. Geo. and immediately he wanted to move to Analytic Number Theory. So, his advisor is not in a good position to write for him. More over his thesis is not great too (not of publishable quality), even with great letters it’s hard to get a post doc with such a thesis.

    It’s not true that he got job because of his friend, he applied for position and it was Appel who hired him. (You might know about him). He published many papers (in arvix) but most of them were incomplete (but they are amazing enough) but were very famous.

    There are lot of assumptions both in the article and in comments which are not true always. And every one assumed “Standard Metric” things will completely change in other local fields apart from R and C.

    వేమూరి గారు శుద్ధ గణితంలో ఒక భాగం అయిన సంఖ్యా గణితానికి ఏ ఉపయోగమూ లేదంటూ, సంఖ్యా గణితంలో ఒక ఉపశాఖ అయిన ప్రధాన సంఖ్యలు ఎవ్వరికి, ఎప్పుడు, ఎందుకు పనికొస్తాయో తెలియదు అన్నారు.

    This statement is very popular among public and at same time it doesn’t make any sense. Well I am a Number Theorist, most of things I work on are motivated and used every where (physics, astronomy, esp my work is motivated by Dynamics). But now a days computer science is available to most people and hence they quote it as applications.

  7. ఒంటరితనం గురించి లక్ష్మీదేవి అభిప్రాయం:

    07/27/2015 9:43 am

    కథలో ప్రత్యేకత చాలా మైల్డ్ షో ఇస్తుంది. మళయాళం సినిమాల్లో మాదిరి. ఒంటరితనం –అంతవరకూ అంటే యాభయ్యేళ్ళు గడచినాయనే అతనికి అనిపించదు. ముసలితనం వచ్చిందనే అనిపించదు. ఇంట్లో ఉండకుండా మెత్తటి గొంతుతో కుత్తుక వత్తినట్టుగా ఉండే ఒంటరితనం నుంచి పారిపోవడం మొదటి సారి కనిపిస్తుంది. పలకరించే మనిషి కోసం ఆరాటం, ఎల్లలు లేని చనువున్న తోడు లేని లోటు …అనుభవైకవేద్యం మాత్రమే, ఊహించరానిది. ఇవన్నీ నాకు కనిపిస్తున్నాయి. కానీ రచయిత వ్యాఖ్యానం కన్నా పాత్ర ఆలోచనలలోనే అన్నీ స్ఫుటంగా తెలుస్తుంటాయి.
    అందుకే నాకు తెలుగు చేయాలనిపించింది—(ఎందుకు ఈ కథనెంచుకున్నానో చెప్పాలనిపించింది.)

  8. ప్రధాన సంఖ్యలలో కవలలు గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    07/27/2015 12:35 am

    A nice article on Terrance Tao mentioned in the essay: http://www.nytimes.com/2015/07/26/magazine/the-singular-mind-of-terry-tao.html

  9. సాహిత్యచరిత్రలో అపూర్వమైన పర్యాయకావ్యం: గణపవరపు వేంకటకవి ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసము – 2. గురించి దేశికాచారి అభిప్రాయం:

    07/27/2015 12:07 am

    అసాధారణమైన సూక్ష్మేక్షికతో ప్రబంధరాజవిజయవిలాసాన్ని పరీక్షించి, దానినొక లక్ష్యసంకలనగ్రంథంగా నిరూపించిన శ్రీమురళీధరరావుగారి అసమానశేముషిని కొనియాడకుండా ఉండలేము – ఏంత కొనియాడినను తక్కువే యని నా యభిప్రాయము. లక్ష్యములైన ఈపద్యములకు జనకమైన లక్షణముల స్వరూపమును వివరిస్తూ, ఈగ్రంథమునకు విపులవ్యాఖ్యానమును వ్రాయుటకు నాకు దెలిసినంతవఱకు ఈకాలములో వారొక్కరే సమర్థులుగా కనిపించుచున్నారు. సరస్వతీదేవి వారి కాయాదేశమును చేసి తనను తాను సన్మానించుకొనునని యాశించుచున్నాను. ఈ వ్యాసములను చదివిన పిమ్మట గణపవరపుకవియొక్కగారి కాలమును గుఱించిన కొన్ని విషయముల సమన్వయము నాకు కుదురకున్నది.
    వేదం వేంకటరాయశాస్త్రిగారి అకాడమీప్రతిలో 1673లో తంజావూరును పరిపాలించుచుండిన ముద్దళగిరిమీద ఈకవి చండవిద్యాదండకమును చెప్పినాడనియు, అందుచేత ఈతడు 17వ శతాబ్దిలో నుండినవాడనియు నేలటూరి వేంకటరమణయ్యగారు వ్రాసినారనియు, ఆరుద్రగారును ఈకాలనిర్ణయమునే సమర్థించుచున్నారనియు వ్రాసినారు. కాని ఈవ్యాసములలో పేర్కొన్న కొన్ని గ్రంథములయొక్క గ్రంథకర్తలు 18వ శతాబ్ది చివర నున్నట్లు తోచుచున్నది. పేర్కొన్న గ్రంథములలో నాదగ్గర నున్న కొన్ని గ్రంథములను చూడగా వాటి కాలనిర్ణయ మీక్రిందివిధముగా నున్నది:
    బిల్హణీయము – చిత్రకవి సింగరాచార్యులు – 1775 ప్రాంతం, స్వామి శివశంకరశాస్త్రిగారి పీఠిక
    హంసవింశతి – అయ్యలరాజు నారాయణామాత్యుడు – 1800 ప్రాంతం, మద్దులపల్లి వేంకటసుబ్రహ్మణ్యశాస్త్రుల పీఠిక
    కనుపర్తి అబ్బయామాత్యుని కాలం 1750 ప్రాంతం – వారణాసి వీరనారాయణశర్మగారి ‘కనుపర్తి అబ్బయామాత్యని కృతులు’ సిద్ధాంతవ్యాసం.
    ముకుందవిలాసం, అచలాత్మజాపరిణయం – ఇవి రచించిన కవులిద్దఱూ గద్వాలసంస్థానాధీశుడైన చినసోమభూపాలుని కాలం (1764-1794) వారు, రవ్వా శ్రీహరిగారి ముకుందవిలాసం పీఠిక. (1700 ప్రాంతంలో గద్వాలను నిర్మించిన పెదసోమభూపాలునికి సంబంధించిన కథయే నా ‘హనుమప్పనాయకుడు’ కావ్యానికి ఇతివృత్తం.)
    ఈవిధంగా నేలటూరివారు చారిత్రకాధారాలద్వారా నిర్ణయించిన కాలానికి, ఈవ్యాసంలో గణపవరపుకవి సంగ్రహించినాడని పేర్కొన్న కొన్నికావ్యాలకు వందసంవత్సరాల తేడా ఉంది. ఈవ్యాసంలో ఇచ్చిన సాక్ష్యాల ప్రకారం గణపవరపుకవి 1800 తర్వాత ఉండి ఉండాలి. అట్టి స్థితిలో అతడు 1673 సంవత్సరానికి ముందే ఉన్న ముద్దళగిరిమీద చండవిద్యాదండకమును ఎట్లా చెప్పినాడు? దీనికి, ఈ వ్యాసంలో సాక్షీభూతమైన కాలానికి నామనస్సులో సమన్వయం కుదురుట లేదు. మురళీధరరావుగారు దీనిని విశదీకృతం చేస్తారని కోరుతున్నాను.

  10. తెలుగు భాష వయస్సెంత? గురించి suresh choppara అభిప్రాయం:

    07/26/2015 5:08 pm

    చాలా బాగుంది. తెలుగు భాష గురించి తెలుసుకున్నందుకు నేను ఒక తెలుగు వాదిగా గర్వపడుచున్నాను. ధన్యవాదములు.