“కలకంఠీ అంటే N. of sev. birds. అని ఆంధ్రభారతి సంస్కృత నిఘంటువులో ఉన్నది.”
“ఇందులో మరుత్కుమారుడు అంటే పిల్లగాలి అని నేను అర్థము చేసికొన్నాను.” – మోహన
I guess ‘పిల్లగాలి’లో పిల్ల does not mean girl. I guess, పిల్లగాలి simply means breeze as opposed to a tornado, or typhoon. అలాటి విసురుగాలి ఐతే అక్కడ ఆ వసురాజు తోటలో పూలూ, ఆకులూ, చెట్లు, మహా వృక్షాలు కూడా ఉండవు.
కలకంఠి అంటే కల నాదములు చేయునది. మధుర స్వనములు చేయునది. అవ్యక్త మధుర స్వరము కలిగినది – ఇలాటి అర్ధములు చెప్పబడినవి. అని. స్త్రీ పరంగా ఎక్కువ వాడినా అందరు ఆడవాళ్ళూ కలకంఠులు కారు. కఠోర కంఠులుంటారు. కవి కలకంఠీ! అని వాడితే ఆ ఆడుది మృదుమధురంగా మాట్లాడుతుందని. అట్టి కలకంఠులను మీరు ఏ తోటలోనూ, వసంత సమయంలో కలిసి యుండలేదా?
అలాగే పక్షులన్నీ కలకంఠులు కావు. Singing birds ను సేకరించే వ్యాపారస్తులున్నారు. వారి వద్ద కొనుక్కుని, తమ తోటల్లో పెంచుకునే వారున్నారు. వెదురు గొట్టాలు, వీణలు, గంటలు ఇవి అన్నీ కలకంఠులుగా మారొచ్చు, గాలి తాకులకైనా, సంగీతకారుడు వాడినా.
ఇక్కడ చర్చిస్తున్న పద్యంలో -అది వసురాజు తోట. అది వసంత వర్ణనం. వసుచరిత్రలోని అక్కడి పద్యాలలో, కవి వసంతుడికీ, గాలికీ ఉండే సంబంధాలు మారుస్తూనే ఉన్నాడు. కలకంఠి ప్రయోగం లోని అర్థాలు కూడా మారుస్తున్నాడు.
నేనూ ఆంధ్ర భారతి చదువుతున్నాను. ‘చంద్రికా పరిణయము’ ఒక పీఠిక అక్కడ చదువుతున్నాను. అందులో చంద్రికా పరిణయం నుండి కొన్ని పద్యాలు, వసుచరిత్ర లో పద్యాలు కొన్ని, చాలా దగ్గర పోలికలున్నవి ఇచ్చారు. ఎవరు బాగా రాసారు అనేది పాఠకులనే తేల్చుకోమని. ఇచ్చిన పద్యాల వరకే చూసినా, నాకు ‘వసుచరిత్ర’ గెలిచినట్టనిపించింది. ఇక, ఈ మాట గ్రంథాలయంలో – దేశికాచారి గారుంచిన మరో పీఠిక, ‘చంద్రికా పరిణయం’ చదవాలి. అప్పుడు వసుచరిత్ర నాకింకొంచెం అర్థమవుతుంది.
ఆంధ్ర భారతికి వెళ్లినా, ఈ పద్యం కోసం, మరుత్తులు ఏడుగురు, అందులో ఏడు లోకాల్లో విహరించే మరుత్తుల లో ఏ మరుత్తు ఇక్కడ విహరిస్తున్నాడని ఏ పురాణ కథ లోకో వెళ్లి నేను వెదకలేదు. చర్చలోని ఈ పద్యంలో, కవి పిల్లగాలి, మంద మారుతం అని ఉండొచ్చు. అనలేదు. అని ఉంటే మనం పువ్వులు, ఆకులు, గాలి – అంటూ gender-less, age non-specific interaction చూస్తాము. కాని కవి అలా అనలేదు. The poet attributes masculinity to the wind here. మరుత్కుమారుడు అన్నాడు.
ఆ పవన కుమారు డొస్తే (హనుమంతుడు కాదు), వసంతుడితో పాటు తోటల్లో ఆడే స్నేహితుడు, పవనుడొస్తే –ఉయ్యాలూపుతున్నారు ఆ స్త్రీలంతా అని, కవి భావన. తేనెలు తాపినా, తేనెల్లో ముంచినా, పువ్వుల్లో పొదిగినా, ఆకుల్లో ఊపినా, ఉయ్యాల పాటలు పాడినా అన్నీ -చెట్లు, మొక్కలు, తీవెలు, పొదల సొంత మర్యాదలే, సయ్యాటలే. రసం శృంగారం. సలిపేవి వసంత సమయపు శృంగార క్రీడలు.
అడివి బాపిరాజు ‘అడివి శాంతి శ్రీ’ లో వసంత సమయం వేడుకలు ఎంత చక్కగా రచించాడు! అందులో, రాజకుమారుడిని, వసంతుడుగా (సంగీతం పోటీ పరీక్షలో గెలిచినందుకు) అక్కడివారు ఎన్నుకుంటే, అతడు మలయ పవన దేవుడిని, భృంగ దేవుడిని ఎన్నుకుంటాడు. ‘వనరమ’ గా ఒక రాకుమారిని ఎన్నుకుంటాడు.
జోల అంటే ఉయ్యాల. ఉయ్యాల పాటలన్నీ పసిపిల్లలకూ, వారిని నిద్ర పుచ్చటానికీ కాదు. Individual gardens లోనూ, పూర్వీకుల/ ఇప్పటి వారి ఇళ్ల లోనూ, బల్ల ఉయ్యాలలు adults కోసం ఉండవూ? What about those nice big hammocks in country houses and beach resorts? వసంత సమయంలో ఉయ్యాలలలో కృష్ణుడు, ఇతర వనితలు వర్ణ చిత్రాలెన్నో ఉన్నాయి. రాముడి కోసం బాలుడిగా ఉన్నప్పుడు పాడే జోలపాటలూ, రాజయ్యాక పాడే మేలుకొలుపు, శయనింపు పాటలు ఒకే లాగా ఉండవు కదా.’ జో! అచ్యుతానంద’ చిన్న పిల్లలకు పాడటం తెలుగు వాళ్లకు అలవాటై, అది పరమాత్ముడికి ఒక కవి రాసిన పాట అనే తలపు మరుపున పడి పోయి ఉండొచ్చు.
ఇంతకు ముందు నేనీ పద్యం గురించి రాసినప్పుడు, పాఠకులు ఒకరిద్దరు జోలపాటలని ఇక్కడా ఏవో సినిమా పాటలు వినిపించినట్టున్నారు. అన్నా చెల్లెళ్ల ఏడుప్పాటలు, పిల్లల జోల పాటలట!
ఆ సినిమా పాటల్లో సావిత్రులు, న్. టి. రామారావులు -ఇద్దరూ తెలుగులో, తమిళులో, అక్కడొకరూ ఇక్కడొకరూ చెరో చంటి పిల్లని భుజాన్ని వేసుకుని దబిడీ దిబిడీ చిచ్చి కొడుతూ, ‘చందురుని మించి అందమొలికించు చిట్టిపాపాయివే’ అని ఏడుపు పాటలు పాడితే, అవి జోలపాటలవుతాయా? How Sad! ఆ ఏడుపు స్వరం పిల్లలకు ఎంత వేదన కలిగిస్తుంది. ఆ అమ్మా నాన్నల కన్నీళ్లు పిల్లల మీదే కారి పడుతున్నయి. ఆ ఏడుపేదో అవతలికి పోయి ఏడ్చుకుని, ఆ పిల్లలకు ఆనందపు స్వరంతో, పిల్లల పాటలు పాడి, వారితో ఆటలాడే వారిని ఏర్పాటు చెయ్యటం మంచిది అనిపించింది.
తెలుగు సినిమాల్లో ఒక ఆనంద సమయంలో పాటనే, మరో విషాద సమయంలో టెంపో స్లో చేసి, ఏడుపు గొంతులతో పాడారు. అసహ్యకరమైన పని. పాటలకేదో కరువొచ్చినట్టు. Emotions, events, mess up చెయ్యటం. ఒక్క పాటనీ హాయిగా పాడుకోనివ్వరు. I really didn’t want to get in there. I don’t want to end my note on that kind of note. Leaves a bad taste in my mouth. అందుకని మధురంగా థ్వనించే పద్యాలున్న వసుచరిత్ర లోకే మళ్లీ వెళ్లి, ఇంకొన్ని పేజీలు తిప్పి వసురాజు వచ్చినపుడు ఆ తోట చేసిన మర్యాద ఎంత రమణీయంగా ఉన్నదో, ఇంకోసారి చదువుకుంటాను. ఎన్నో తెలివైన, అందమైన రచవలున్నయ్యి. ప్రపంచంలో ఇంకా చూడని సుందరత ఎంతైనా ఉంది. I am so eager to go get it.
“కనీసం ఈ రెండు వాక్యాల్లో, పై తెలుగు వాక్యాలలోలా పదానికొక అచ్చుతప్పు లేదు కదండీ? – సం’
కన్నమ్మ కట్టు బట్టలు విప్పేసి పక్కింటమ్మకు పట్టుబట్టలు పెట్టినట్టుగా ఉన్న అభిప్రాయం మీద మీ వ్యాఖ్య చాలా సౌమ్యంగా ఉందండి . ఉత్తర అమెరికనులు ఇంగ్లిష్ ను చితకబాద లేదా . ఊత్తర అమెరికా రాజ్యాంగ అయిదవ సవరణ తరవాత ప్రచారంలోకి వచ్చిన , ‘The fifth’ ఇంగ్లిష్ ఇడియమా ,’The’ అన్న ఆర్టికిల్ ను దాని ముందు ఉంచినా తుంచినా ఆ మాట నాకు జిబరిషే .
తః తః
ఈ రోజు పొద్దున్నే ఫేస్‌బుక్ చూస్తుంటే ఈ కింద లింక్ కనపడింది. కర్నాటక సంగీతంలో మనం పాడుకొనే కల్యాణి రాగానికి సమానమైన రాగం యమన్ లో ఈ కుర్రాడు (10-12 ఏళ్ళు ఉంటాఏమో?) పాడిన వైఖరి చూసి నా కళ్ళు తిరిగాయి. తరవాత అర్ధం అయ్యింది ఎందుకో!
ఆ కుర్రవాడు గొప్ప హిందూస్తానీ సంగీత గాయకుడు, భారతరత్న భీమ్‌సేన్ జోషీ మనమడు విరాజ్ జోషీ. ఆ కుర్రాడు పాడిన యమన్ రాగం ఇక్కడ వినండి.
కలకంఠీ అంటే N. of sev. birds. అని ఆంధ్రభారతి సంస్కృత నిఘంటువులో ఉన్నది. కలకంఠీనాదగీతంబులన్ అనగా ఎన్నో విధములైన పక్షులు చేసే నాదముల గీతములు అని అర్థము చేసికొనవచ్చును.
అలరుంగైదువుజోదు కూర్మిసయిదోడై మాధవశ్రీతపః
ఫలమై యాడు మరుత్కుమారు బ్రియమొప్పం దేనె నీరార్చి లే
దెలిపూజొంపపు బొత్తులన్ బొదిగి ధాత్రీజాతముల్ జోల వా
డె లసత్పల్లవడోల నుంచి కలకంఠీనాదగీతంబులన్
నండూరి సుబ్బారావు గారి ఎంకి పాటల్లో “దూరాన నా రాజు కేరాయుడౌనో” అన్న పాటకి విజయవాడ సంగీత కళాశాలలో పని చేసి సంగీతం నేర్పిన M.V. రమణ మూర్తి గారు శివరంజని రాగంలో బాణీ కట్టి పాడగా మేం రికార్డు చేసుకున్నాం.
1970 లలో నేనూ, రామన్నా ఈ పాటని ఎన్ని సార్లు పాడుకున్నామో చెప్పలేను. ఈ పాట ఎక్కడన్నా దొరికితే ఎవరన్నా చెప్పగలరు (Any hints Paruchuri Sreenivas?). ఈ పాటలో కూడా సాధారణ, అంతర గాంధారాల కలయిక కనపడుతుంది.
A lot of information is available in the pages on the raga. We are thankful for sending the link.
With due apology, I would say that artifact [artefact in British English] is defined as an object recovered by archaeological endeavour, which may have a cultural interest. It is material object from antiquity, something that was made, or was given shape by man, such as a tool or a work of art
To the best of knowledge, usage mandates that the term cannot be used to refer to a piece of information, or to a datum in connection with an art form.
You will get complete details about above sloka with related story. Like why kalidas choose such tongue twistted letters in sloka.. can understand if know telugu. Is explained by great avadhani and IAS Officer Late. Sri Rallabandi Kavita Prasad on youtube link pasted in url box.
నాకు నచ్చిన పద్యం: పల్లవడోలలో పసిబాలుడు గురించి lyla yerneni అభిప్రాయం:
04/10/2016 1:34 pm

A beautiful year to all!
Lyla
రాగలహరి: శివరంజని గురించి తః తః అభిప్రాయం:
04/09/2016 3:05 am
“కనీసం ఈ రెండు వాక్యాల్లో, పై తెలుగు వాక్యాలలోలా పదానికొక అచ్చుతప్పు లేదు కదండీ? – సం’
కన్నమ్మ కట్టు బట్టలు విప్పేసి పక్కింటమ్మకు పట్టుబట్టలు పెట్టినట్టుగా ఉన్న అభిప్రాయం మీద మీ వ్యాఖ్య చాలా సౌమ్యంగా ఉందండి . ఉత్తర అమెరికనులు ఇంగ్లిష్ ను చితకబాద లేదా . ఊత్తర అమెరికా రాజ్యాంగ అయిదవ సవరణ తరవాత ప్రచారంలోకి వచ్చిన , ‘The fifth’ ఇంగ్లిష్ ఇడియమా ,’The’ అన్న ఆర్టికిల్ ను దాని ముందు ఉంచినా తుంచినా ఆ మాట నాకు జిబరిషే .
తః తః
రాగలహరి: కల్యాణి గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:
04/06/2016 7:33 am
తప్పుగా విరాజ్ జోషీ అని చెప్పాను!
This clip is making the rounds as Bhimsen Joshi’s grandson’s. It’s actually Anubhab Khumaru a young amazing singer.
https://www.youtube.com/watch?v=L_L2JGt0iQg
విష్ణుభొట్ల లక్ష్మన్న
రాగలహరి: కల్యాణి గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:
04/05/2016 4:08 pm
ఈ రోజు పొద్దున్నే ఫేస్‌బుక్ చూస్తుంటే ఈ కింద లింక్ కనపడింది. కర్నాటక సంగీతంలో మనం పాడుకొనే కల్యాణి రాగానికి సమానమైన రాగం యమన్ లో ఈ కుర్రాడు (10-12 ఏళ్ళు ఉంటాఏమో?) పాడిన వైఖరి చూసి నా కళ్ళు తిరిగాయి. తరవాత అర్ధం అయ్యింది ఎందుకో!
ఆ కుర్రవాడు గొప్ప హిందూస్తానీ సంగీత గాయకుడు, భారతరత్న భీమ్‌సేన్ జోషీ మనమడు విరాజ్ జోషీ. ఆ కుర్రాడు పాడిన యమన్ రాగం ఇక్కడ వినండి.
https://www.facebook.com/ashis.roy.796/videos/1040016396058641/
విష్ణుభొట్ల లక్ష్మన్న
రాగలహరి: శివరంజని గురించి lyla yerneni అభిప్రాయం:
04/05/2016 1:36 am
రాయుడు కాదండి. రాయిడి. అంటే కష్టం, ఆపద అని. దూరంగా ఉన్న నాయుడి బావకి, ఇంకో రాయుడు బావ దొరికితే ఎంకికి అదింకా పెద్ద డేంజర్ అనుకోండి.
Friends?
Lyla
లిఖిత: ఇక ఇదే ఉదయం, ఇక ఇదే జీవితం గురించి వెంకటేశ్వరరావు అభిప్రాయం:
04/04/2016 11:59 am
చూసినా ఏం ఉంది
అప్పుడు నాకు-?
అదే ఉదయం
అదే జీవితం
నాకు నచ్చిన పద్యం: పల్లవడోలలో పసిబాలుడు గురించి మోహన అభిప్రాయం:
04/03/2016 3:11 pm
కలకంఠీ అంటే N. of sev. birds. అని ఆంధ్రభారతి సంస్కృత నిఘంటువులో ఉన్నది. కలకంఠీనాదగీతంబులన్ అనగా ఎన్నో విధములైన పక్షులు చేసే నాదముల గీతములు అని అర్థము చేసికొనవచ్చును.
అలరుంగైదువుజోదు కూర్మిసయిదోడై మాధవశ్రీతపః
ఫలమై యాడు మరుత్కుమారు బ్రియమొప్పం దేనె నీరార్చి లే
దెలిపూజొంపపు బొత్తులన్ బొదిగి ధాత్రీజాతముల్ జోల వా
డె లసత్పల్లవడోల నుంచి కలకంఠీనాదగీతంబులన్
ధాత్రీజాతములు ప్రియ మొప్పన్ (ప్రియముతో) అలరుంగైదువుజోదు కూర్మిసయిదోడై మాధవశ్రీతపఃఫలమై యాడు మరుత్కుమారుని తేనె నీరు ఆర్చి (తడియజేసి) లేదెలి పూజొంపంపు బొత్తులన్ (పొత్తులలో) బొదిగి (కప్పి) లసత్పల్లవడోల నుంచి (ఉనిచి, ఉండబెట్టి) కలకంఠీ నాద గీతంబులన్ (పక్షుల పాటలతో) జోల వాడె (లాలిపాటలు పాడాయి).
ఇందులో మరుత్కుమారుడు అంటే పిల్లగాలి అని నేను అర్థము చేసికొన్నాను. కుమారుడు అనగా కౌమార దశలో ఉండే వాడు లేక తనయుడు అని అర్థము కాదని నా అభిప్రాయము.
Have a nice spring day!
విధేయుడు – మోహన
రాగలహరి: శివరంజని గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:
04/03/2016 8:38 am
నండూరి సుబ్బారావు గారి ఎంకి పాటల్లో “దూరాన నా రాజు కేరాయుడౌనో” అన్న పాటకి విజయవాడ సంగీత కళాశాలలో పని చేసి సంగీతం నేర్పిన M.V. రమణ మూర్తి గారు శివరంజని రాగంలో బాణీ కట్టి పాడగా మేం రికార్డు చేసుకున్నాం.
1970 లలో నేనూ, రామన్నా ఈ పాటని ఎన్ని సార్లు పాడుకున్నామో చెప్పలేను. ఈ పాట ఎక్కడన్నా దొరికితే ఎవరన్నా చెప్పగలరు (Any hints Paruchuri Sreenivas?). ఈ పాటలో కూడా సాధారణ, అంతర గాంధారాల కలయిక కనపడుతుంది.
విష్ణుభొట్ల లక్ష్మన్న
రాగలహరి: శివరంజని గురించి Siddineni Bhava Narayana అభిప్రాయం:
04/02/2016 10:02 pm
Sreenivaas garu,
A lot of information is available in the pages on the raga. We are thankful for sending the link.
With due apology, I would say that artifact [artefact in British English] is defined as an object recovered by archaeological endeavour, which may have a cultural interest. It is material object from antiquity, something that was made, or was given shape by man, such as a tool or a work of art
To the best of knowledge, usage mandates that the term cannot be used to refer to a piece of information, or to a datum in connection with an art form.
నాకు నచ్చిన పద్యం: ఊరుద్యుతి వర్ణన గురించి Nagaraju అభిప్రాయం:
04/02/2016 5:24 pm
You will get complete details about above sloka with related story. Like why kalidas choose such tongue twistted letters in sloka.. can understand if know telugu. Is explained by great avadhani and IAS Officer Late. Sri Rallabandi Kavita Prasad on youtube link pasted in url box.
https://youtu.be/dPgJ8G3y318