చాల బాగుంది కామేశ్వరరావు గారు! సామాన్యముగా కవులు తమ కావ్యములలో చిత్రకవిత్వాన్ని ఒక భాగముగా వ్రాస్తారు. కాని చిత్రకవిత్వమే కథలోని ఒక భాగముగా చేసిన ఘనత సూరనదే. కవికి గొల్లవానికి ఉండే పోలికలు ఉన్న ఈ పద్యమంటే కూడ నాకు ఇష్టమే –
ఇది చాలు నాకు. అని అందరూ అనుకునేంత అందమైన భావాలు. చాలా చాలా బాగున్నాయి. దాచుకుని చదువుకోదగ్గ సాహిత్యం. వైరముత్తు గారిని ఇలా పరిచయం చేసినందుకు సంతోషం. ధన్యవాదాలు.
పలుకుబడి: తెలుగులో సాధు శకటరేఫములు – 1 గురించి Vasu అభిప్రాయం:
05/02/2016 12:37 pm
Good. Better if you provided readers with sound files.
-Vasu
నాకు నచ్చిన పద్యం: శుచిముఖి చెప్పిన మెటా కవిత్వం గురించి మోహన అభిప్రాయం:
05/02/2016 12:12 pm
చాల బాగుంది కామేశ్వరరావు గారు! సామాన్యముగా కవులు తమ కావ్యములలో చిత్రకవిత్వాన్ని ఒక భాగముగా వ్రాస్తారు. కాని చిత్రకవిత్వమే కథలోని ఒక భాగముగా చేసిన ఘనత సూరనదే. కవికి గొల్లవానికి ఉండే పోలికలు ఉన్న ఈ పద్యమంటే కూడ నాకు ఇష్టమే –
విశ్రామ విహతి గావింపక, సార వ-
త్సాహిత్య సౌమనశ్యంబు లెఱిగి
సమయంబు దప్పక శ్రవణకఠోరంబు
లైన శబ్దము లత్యాకులాత్మ
జేయక సత్పరిచిత సుకుమార వా-
క్సరళి తాభిత్రాయగా నొనర్చి
పదబంధ శిథిలత వాటిల్ల గానీక
యే చందములయందు నేమరిలక
పరగు కవియు దోహకరుడును, యశము దు-
గ్ధమును బడయు, నట్లు గానివాడు
కృతి దురాస మొదవు, గీర్తియు బాలు నీ
కుంట గాదు, హాసయోగ్యు జేయు … (1.008)
శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు ఎలా కావ్యాలలో ఉండాలి అనే విషయముపైన ఈ పద్యమును చదవండి –
పొసగ ముత్తెపు సరుల్ పోహళించిన లీల
దమలోన దొరయు శబ్దములు గూర్చి
యర్థంబు వాచ్య లక్ష్య వ్యంగ్య భేదంబు
లెఱిగి నిర్దోషత నెసగ జేసి
రసభావములకు నర్హంబుగ వైదర్భి
మొదలైన రీతు లిమ్ముగ నమర్చి
రీతుల కుచితంబులై తనరారెడు
ప్రాణంబు లింపుగా పాదుకొల్పి
యమర నుపమాదులును యమకాదులు నగు
నట్టి యర్థ శబ్దాలంక్రియలు ఘటించి
కవిత జెప్పంగ నేర్చు సత్కవివరునకు
వాంఛితార్థంబు లొసగనివారు గలరె … (1.082)
విధేయుడు – మోహన
ఆశనిరాశలు గురించి వనజ తాతినేని అభిప్రాయం:
05/02/2016 10:30 am
ఆలస్యం అమృతం. బావుంది.
చిరంజీవి గురించి వనజ తాతినేని అభిప్రాయం:
05/02/2016 10:21 am
ఆఖరిన కొద్దిగా బాధ. పైన చిన్నోడిని మీ చూపులో, ఈ కవనంలో చూసి మరిచిపోయా. ఇంతకీ పేరేమిటో చెప్పలేదు మానస గారు. 🙂
సౌభాగ్య కుమార మిశ్ర: రెండు ఒరియా కవితలు గురించి Vasu అభిప్రాయం:
05/02/2016 10:19 am
మీ అనువాదాలు చాలా బాగున్నాయి. పుస్తకం ఎప్పుడొస్తోంది?
-వాసు
నిశ్శబ్ద సమూహం గురించి Sarala Mohan అభిప్రాయం:
05/02/2016 9:40 am
తాళం వెనుక తాళం తీస్తూ పోతే తలపులలా తెరచుకుంటూనే ఉంటాయి. అది ఎడతెరగని ప్రక్రియ… ఆలోచనల కెరటాలు… నిలవరించ చూసే నిశ్శబ్దం గురించి చక్కగా చెప్పారు.
చిరంజీవి గురించి neeta అభిప్రాయం:
05/02/2016 9:33 am
Chala chala bavundi.
ఇది చాలు నాకు గురించి వనజ తాతినేని అభిప్రాయం:
05/02/2016 9:11 am
ఇది చాలు నాకు. అని అందరూ అనుకునేంత అందమైన భావాలు. చాలా చాలా బాగున్నాయి. దాచుకుని చదువుకోదగ్గ సాహిత్యం. వైరముత్తు గారిని ఇలా పరిచయం చేసినందుకు సంతోషం. ధన్యవాదాలు.
చిరంజీవి గురించి msk అభిప్రాయం:
05/02/2016 8:15 am
చాలా బావుంది
నిశ్శబ్ద సమూహం గురించి Dasaradhi Koganti అభిప్రాయం:
05/02/2016 12:07 am
ఆందరికీ వుండే ఆలొచనలని ఎంతో చక్కగా ఆవిష్కరించారు. Abhinandanalu.