ఆంగ్లమును ఎలా బోధించాలి అన్నది ఆంగ్లోపాధ్యాయులకు వదలండి. ఈ వ్యాసముతో నాకు కూడ అక్కడక్కడ ఇబ్బందులు ఉన్నాయి. కాని వ్యాసకర్త ముఖ్యోద్దేశము అందరికీ అవగతమవుతుంది. ఈ course తీసికొన్న తఱువాత (1) ఒక రైల్వే స్టేషన్ పేరు, బస్సు బోర్డు పేరు, వీధి పేరు, హోటల్ (రెస్టొరాన్) పేరు విద్యార్థి చదువగలిగితే సంతోషము. (2) ఒక వార్తాపత్రిక headlines చదువగలిగితే సంతోషము. (3) ఒక వీధిలో ఎవరినయినా directions అడుగగలిగితే సంతోషము. (4) ఒక అంగడి లేక హోటల్‌కి వెళ్లి orders ఇవ్వగలిగితే సంతోషము. (5) చిన్న చిన్న వాక్యాలు వ్రాసి తమపేరును సంతకము చేయగలిగితే సంతోషము. ఈ ఆశయాలతో course ను పరిశీలించండి. ఇవ్వబడిన సమయములో పై ఆశయాలు నెరవేరినాయా లేవా అన్నదే ప్రశ్న. అంతకంటె ఎక్కువగా రంధ్రాన్వేషణ చేయ రాదు.
తెలుగు మనభాష మనది కనుక మనం ఎన్నైనా వ్యాఖ్యానాలు వ్రాయవచ్చు, లోగడ ఉప్పల లక్ష్మణరావు గారు చేసినట్లు. మరి ఇంగ్లీషు సంగతేమిటి? ఉదాహరణకి:
1. capital letters ఎంతమాత్రం అవసరం లేదు.
2. “w” అక్షరం శుద్ధ దండగ.
3. “y” ఒక అచ్చు అక్షరం కూడా.
4. ఉచ్చారణ విషయానికొస్తే,
– english అన్నది ఎంగ్లీష్ కాదా?
– nation లో ‘ti’, laugh లో ‘gh’ ల సంగతేమిటి?
– put, but ల విషయం జగద్విదితం.
– ఒకే అక్షరాన్ని ఒకేపదంలో కూడా వేరువేరుగా ఉచ్చరించడం అన్న concept ఇంగ్లీషు భాషకే చెల్లింది.
– ఉండీలేనట్లున్న అక్షరాల సంగతీ అంతే. ఉదా: talk, psychology.
అంతర్జాలం లోకి వెళితేనూ కొంచెం ఆలోచిస్తేనూ ఈభాష వక్రపరాక్రమాలెన్నో చూడవచ్చు. విశ్వనాధవారి ‘విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు’ చదివితే దీని విచిత్రరూపం ఇంకా విశదమౌతుంది.
మరి ఎవరైనా ఇంగ్లీషు నేర్పవలసి వస్తే ఇలాటివి మార్చి నేర్పవచ్చుకదా!
ఇంకా ఇతర భాషలలో:
– హిందీలో భూతకాలానికి వాడే ‘నే’ ప్రత్యయాన్ని తీసేయవచ్చు.
– తమిళ మలయాళ భాషలలో ఱ నూ, న-ణ లకి మధ్య వచ్చే శబ్దం గల అక్షరాన్నీ కూడా వదిలేయవచ్చు. వాళ్ళు ‘ఱ’ చక్కగా పలికినాసరే అనవసరం.
– సంస్కృతంలో ద్వివచనాన్ని మానవచ్చు.
– take కి భూతకాలం taked అనీ give కి gived అనీ ఇలా అనేక మార్పులు చెయ్యవచ్చు.
– అ ఆ ఇ ఈ లను ‘అ’ గుణింతం గా (క గుణింతం మాదిరిగా) మారిస్తే ఎన్నో వంకరగీతలని అచ్చులుగా గుర్తుపెట్టుకునే బాధ తప్పుతుంది.
వెంకటేశ్వరరావు గారూ,
మీపేరుని అందరూ పలికేవిధంగా వెంకటేశ్వర్రావు అని తెలుగులోనూ,
venkatesvara raavu / venkatesvarraavu అని ఇంగ్లీషులోనూ వ్రాసుకుంటారా?
తెలుగుని సులువుచేసే ప్రయత్నంలో ఈ భాషని తేలిక చేయకండి. ఇతరభాషల వాళ్ళు, వారివారి భాషలను ఆమోదించి గౌరవించారే గానీ దాన్ని సంస్కరించే ప్రయత్నం చేయలేదు. తమిళులు ఇందుకు ఒక గొప్ప నిదర్శనం. వాళ్ళ భాషలో ఖ, ఛ, ఠ, థ, ఫ, ఘ, ఝ, ఢ, ధ, భ అక్షరాలు లేనే లేవు. అందువల్ల వాళ్ళూ వాళ్ళ లిపిలో ఇంగ్లీషుతొ సహా అన్యభాషా పదాలను తగువిధంగా చదవడం దాదాపు అసాధ్యం. చదవడం లోనూ, వ్రాయడం లోనూ ఎన్నో కట్టుబాట్లు ఉన్నాయి. ఐనా, వాళ్ళభాషని ఎన్నడూ విమర్శించరు. వాళ్ళలాగా మాతృభాషని ప్రేమించే వారుగానీ దానిని చూసి గర్వించే వాళ్ళు గానీ ఇతరభాషలలో తారసపడటం అరుదు. ఇదేవిధంగా, అనేక ఇతరభాషలవాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా, తమ మాతృభాషపై ఎంతో కొంత పట్టు కలిగినవారే. వాడుకలోగానీ ఉచ్చారణలోగానీ తప్పులనేవి వారిదగ్గర ఇంచుమించు కనబడవు, ముఖ్యంగా వ్రాతలోనూ, సభాముఖంగానూ.
భాష అన్నది “convention” (kanvenshan?) కి సంబంధించినది. ఇది ఇలాగే ఉండాలి అంటుంది. లిపి కూడా అంతే. సులువు చేయడానికి, అనేక సంవత్సరాలక్రితం పూర్ణానుస్వారాన్నీ, full stop, comma మొదలైనవాటినీ తెలుగులోకి తెచ్చుకోలేదా? కొత్తపదాలను ఆహ్వానించండి. కానీ ఉన్నవాటిని చంపివేయకండి. యాభై అక్షరాలు నేర్చుకున్నవాడికి మరొక నాలుగు నేర్చుకోవడం కష్టం కాదనుకుంటా. పదాలవిషయమూ అంతే.
మరొక మాట: భాషని logical గా నేర్చుకునే / నేర్పే ప్రయత్నం పెద్దగా ఫలించదు. మనకి చిన్నప్పుడు కొత్తవిషయాలూ కొత్తభాషలూ తొందరగా పట్టుబడటానికి ఒక కారణం ఎక్కువ ప్రశ్నించకుండా విషయాన్ని ఉన్నది ఉన్నట్టుగా స్వీకరించడమే.
అమ్మ ఈ పదానికి అర్థం తెలియని … జీవి కానీ , జగం కానీ, రూపం కానీ.. లేదు … అన్ని రాగాలకు , వరాలకు, అనురాగాలకు మూలం ఆమె రూపం… అమ్మ చేతి స్పరశకు స్పందించలేని జీవం మరణం… ప్రేమకు నిలువైన రూపం… అమ్మ పిలుపే ఓ వరం …ఓ జీవికి ఎన్నో బందాలు ఉండచ్చు కానీ అమ్మ ఒక్కటే ఎ జీవికైన మూలం … ఆ పాదాల దగ్గర అన్ని పుణ్యక్షేత్రాలు నేలువైవుంటాయని తెలిసిన తరించలేని జీవితాలు ఎన్నో… ఈ సృష్టి లో తన కోసం కాక తను సృష్టించిన తనువు కోసం , మరో జీవి కోసం నిరంతరం తపించే దైవం అమ్మ… అమ్మ కోరే వరం , అమ్మ బరించే శాపం ప్రేమ … ఆ అమ్మ ప్రేమ కోసం… ఎప్పుడు ఆ చంటి బిడ్డల ఆ పాదాల చాటు దాగే వరం ఇస్తే చాలు …@శివాజి
వేమూరి గారు మొదట్లోనే చెప్పారు – మహాప్రభో ఇది నేను ఆచరించిన పద్ధతి ఈ కాలేజీలో ఎందుకంటే క్లాసుకొచ్చిన కుర్రాళ్లకి/కుర్రమ్మలకీ ఏమీరాదు కాబట్టీ, ఇలా చెయ్యాల్సొచ్చింది అని. చివర్లో మళ్ళీ ఇంకోసారి నేను నేర్పిన తెలుగుతో వాళ్ళేమీ ఉద్ధండ పండితులైపోలేదు సారూ అని మొత్తుకున్నారు కదా?
దేశికాచారి గారు: మీరెప్పుడైనా – దండం విదల్చకుండా – ఎక్కడైనా తెలుగు పాఠాలు చెప్పారా (అంటే ఉత్తర అమెరికాలో)? మీ పరిస్థితి ఎలా ఉంది అప్పుడు? అలు, అలూలూ, బండి-ర నేర్పించారా? నేర్చుకున్నాక ఏమైంది? మీకు తెలిసిన తెలుగువాళ్లలో (ఇండియాలో ఉన్నా అమెరికాలో ఉన్నా), ఎంతమందికి మీరు చెప్పిన, మీకు వచ్చినటువంటి తెలుగు తెలుసు? వచ్చినా రోజువారీ చదవడం, రాయడంలో దానిని ఎంతమంది వాడుతుంటిరి? అదేమీ తప్పో, ఒప్పో దయచేసి స్థాలీపులక న్యాయంగా (అంటే ఏమిటో నన్ను అడక్కండి దయచేసి. అది తెలిస్తే ఇలా ఉండేదా నా భాష) వివరింపుడు. మీరు చెప్పినట్టూ మాంఛి కాంక్రీటు స్థంభాల్లంటి పునాదుల మీద తెలుగు నేర్చుకోవాలంటే పదిహేనేళ్ళు పడుతుంది నాలాంటివాడికి. అమెరికా కుర్రమ్మలకి ఎంతకాలం పడుతుందో నాకు తెలియదు. అయినా ప్రతీదానికి ఇప్పుడు ” గూగిలించేస్తే ” చాలు కదా ఎందుకు ఆపసోపాలు పడడం.
వేమూరిగారు: మీకు తెల్సిన విషయమే కానీ మరో సారి చెప్తున్నాను. గిడుగు వారు భాషా ఉద్యమం (వాడుక భాషకి అనుకుంటా, నాకు తెలిసి ఏడిస్తే కదా!) మొదలుపెట్టినప్పుడు ఇలాగే హంసపాదులు మొదలయ్యాయి అని విన్నాను. చిన్నయసూరి (1809-61) బాలవ్యాకరణం, నీతిచంద్రికా మీరు కనక మొదలుపెట్టి ఉంటే మీ కాలేజీలో తెలుగు కి ఈ పాటికి దహన సంస్కారం జరిగి ఆ బూడిద గంగలో కలపడానికి మిమ్మల్నే కాశీ పంపించి ఉండేవారు కదా. ఇవన్నీ పట్టించుకోకండి. మీరు రాసిన ఈ తేలిక తెలుగు వ్యాసం నేను చదువుకునే రోజుల్లోనే వచ్చి ఉండవల్సింది.
అసలిప్పుడు ఆంధ్రా/తెలంగాణా లో ఉన్నవాళ్లకే తెలుగు రాదు. దీనిలో తమిళులు, మళయాళీలు మనకన్నా చాలా బెటర్. వాళ్ళకి కాస్త భాషభిమానం ఉంది. నన్నడిగితే ఇప్పుడు ఈ తేలిక తెలుగు వచ్చినవాళ్ళు కూడా అతి తక్కువమంది. నా స్వంత బాబయ్య (కజిన్స్ అనుకోండి) పిల్లలూ వాళ్ళు కూడా “మేము తెలుగు చదవం” అని గొప్పగా చెప్పుకుంటారు.
ఇది ఈ మధ్యన ఈమాటలో వచ్చిన వ్యాసాల్లో ఒక అద్భుతమైన వ్యాసం.
నమస్తే
అయ్యవారు గారు: నారాయణ సూక్తం వేరు, మంత్రపుష్పం వేరు కానీ రెండింటిలోనూ మంత్రాలు దాదాపుగా ఒకేలాగ ఉంటాయి. బొంబాయి రామాకృష్ణా మఠం వారు ప్రచురించిన మంత్రపుష్పం పుస్తకం మీదగ్గిర ఉంటే చూడండి (స్వామి దేవరూపానందగారు రాసినది). యోపామాయతనం అనేది నారాయణ సూక్తంలో లేదు. అలాగే “అధః నిత్యో నారాయణః, బ్రహ్మా నారాయణః….యద్భూతం యశ్చభవ్యం…” అనేవి మంత్రపుష్పం లో లేవు. గూగిల్లో జాగ్రత్తగా చూస్తే దొరకచ్చేమో.
అసలీ మంత్రపుష్పం వినాలంటే మా ఊరు వెళ్ళాల్సిందే (పంచారామాలలో ఒకటి). ఏకాదశి నాడు రుద్రాభిషేకం చేస్తారు 11 మందితో. పొద్దున్న అభిషేకం అయ్యాక కాస్త విశ్రాంతి (ఫలహారం) తీసుకుని మధ్యాహ్నం బిల్వార్చన. సాయంత్రం అవుతూంటే గుడిలో మైకు పెద్ద స్థాయికి ఊరంతా వినబడేలా (గుడి ఊరికి 2/3 మైళ్ళు దూరం కాబోలు; శివాలయం కదా)పెంచి మంత్రపుష్పం చదవడం మొదలుపెడతారు. యోపాం పుష్పం దగ్గిరకొచ్చేసరికి ఈ 11 మంది రెండు గ్రూపులుగా విడిపోయి, “యోపామాయతనం వేద,” అని ఒకరు అంటే “ఆయతనవాన్ భవతి” అంటూ రెండో గ్రూప్ అందుకుంటారు. ఇలా అవుతూనే మంత్రాలని బట్టి ఆ గ్రూప్ అనేది వీళ్ళూ, వీళ్ళనేది వాళ్ళూ చెప్తారు. మొత్తమ్మీద ఒక పదిహేను నిముషాలు ఒళ్ళు గగుర్పొడిచే వేద పఠనం. ఆ తర్వాత మహా ఆరతి, అవీను. విని కళ్ళతో చూడాలి తప్పితే ఎంతరాసినా వివరించడం కష్టం. ఆ రోజు కనక అదృష్టం ఉంటే గర్భ గుడిలోపలకి వెళ్ళి ఆభిషేకం చేసుకోవచ్చు. అసలీ మంత్ర పుష్పం ఒక్కదానికోసం ఆ రోజు శివాలయానికి వెళ్ళొచ్చు. నేను అనుకోవడం ప్రతీ శివాలయంలోనూ ఇలాగే జరగొచ్చు కానీ నేను మా ఊరి బావిలో కప్పని కాబట్టి నాకు తెల్సింది ఇంతవరకే.
లక్శ్మిగారు: మీకీ వివరణ నచ్చినందుకు సంతోషం.
మరో విషయం. ఈ కధలో పద్యం పోతన రాసినది *కాదు*. ఆ విషయం మూడో పాదం చదవగానే తెలిసిపోతుంది. ఎందుకంటే పోతన ఎప్పుడూ “నాపై కొంతరానిమ్ము” అని రాయడు (నాకు తెల్సినంతలో). రాముడు రాయమంటే రాసాను తప్ప నాదేం లేదు అనే ఆయన చెప్పాడు కదా “పలికించెడువాడు రామభద్రుండట…” అంటూ.
సుమారు 50+ కవితలతో జూన్ నెలాఖరికి ద్విభాషాసంకలనం తేవాలని ప్రయత్నం. అన్ని కవితలూ ఆత్మనేపది పుస్తకం నుంచి కాదు. కొన్ని కవితలు మధ్యపదలోపి సంకలనం నుంచి, మరికొన్ని నఈ పహారా సంకలనం నుంచీ తీసుకున్నాను.
తేలిక తెలుగు గురించి మోహన అభిప్రాయం:
05/08/2016 11:47 am

విధేయుడు – మోహన
నవనాలంద గురించి Prakhya parvathi అభిప్రాయం:
05/08/2016 8:47 am
చా లా సంతొషం.భారత దేశపు పూర్వవైభవం మళ్ళీసంతరించుకుంటున్నది.
తేలిక తెలుగు గురించి Dr.I.A.P.S. Murthy అభిప్రాయం:
05/08/2016 6:58 am
తెలుగు మనభాష మనది కనుక మనం ఎన్నైనా వ్యాఖ్యానాలు వ్రాయవచ్చు, లోగడ ఉప్పల లక్ష్మణరావు గారు చేసినట్లు. మరి ఇంగ్లీషు సంగతేమిటి? ఉదాహరణకి:
1. capital letters ఎంతమాత్రం అవసరం లేదు.
2. “w” అక్షరం శుద్ధ దండగ.
3. “y” ఒక అచ్చు అక్షరం కూడా.
4. ఉచ్చారణ విషయానికొస్తే,
– english అన్నది ఎంగ్లీష్ కాదా?
– nation లో ‘ti’, laugh లో ‘gh’ ల సంగతేమిటి?
– put, but ల విషయం జగద్విదితం.
– ఒకే అక్షరాన్ని ఒకేపదంలో కూడా వేరువేరుగా ఉచ్చరించడం అన్న concept ఇంగ్లీషు భాషకే చెల్లింది.
– ఉండీలేనట్లున్న అక్షరాల సంగతీ అంతే. ఉదా: talk, psychology.
అంతర్జాలం లోకి వెళితేనూ కొంచెం ఆలోచిస్తేనూ ఈభాష వక్రపరాక్రమాలెన్నో చూడవచ్చు. విశ్వనాధవారి ‘విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు’ చదివితే దీని విచిత్రరూపం ఇంకా విశదమౌతుంది.
మరి ఎవరైనా ఇంగ్లీషు నేర్పవలసి వస్తే ఇలాటివి మార్చి నేర్పవచ్చుకదా!
ఇంకా ఇతర భాషలలో:
– హిందీలో భూతకాలానికి వాడే ‘నే’ ప్రత్యయాన్ని తీసేయవచ్చు.
– తమిళ మలయాళ భాషలలో ఱ నూ, న-ణ లకి మధ్య వచ్చే శబ్దం గల అక్షరాన్నీ కూడా వదిలేయవచ్చు. వాళ్ళు ‘ఱ’ చక్కగా పలికినాసరే అనవసరం.
– సంస్కృతంలో ద్వివచనాన్ని మానవచ్చు.
– take కి భూతకాలం taked అనీ give కి gived అనీ ఇలా అనేక మార్పులు చెయ్యవచ్చు.
– అ ఆ ఇ ఈ లను ‘అ’ గుణింతం గా (క గుణింతం మాదిరిగా) మారిస్తే ఎన్నో వంకరగీతలని అచ్చులుగా గుర్తుపెట్టుకునే బాధ తప్పుతుంది.
వెంకటేశ్వరరావు గారూ,
మీపేరుని అందరూ పలికేవిధంగా వెంకటేశ్వర్రావు అని తెలుగులోనూ,
venkatesvara raavu / venkatesvarraavu అని ఇంగ్లీషులోనూ వ్రాసుకుంటారా?
తెలుగుని సులువుచేసే ప్రయత్నంలో ఈ భాషని తేలిక చేయకండి. ఇతరభాషల వాళ్ళు, వారివారి భాషలను ఆమోదించి గౌరవించారే గానీ దాన్ని సంస్కరించే ప్రయత్నం చేయలేదు. తమిళులు ఇందుకు ఒక గొప్ప నిదర్శనం. వాళ్ళ భాషలో ఖ, ఛ, ఠ, థ, ఫ, ఘ, ఝ, ఢ, ధ, భ అక్షరాలు లేనే లేవు. అందువల్ల వాళ్ళూ వాళ్ళ లిపిలో ఇంగ్లీషుతొ సహా అన్యభాషా పదాలను తగువిధంగా చదవడం దాదాపు అసాధ్యం. చదవడం లోనూ, వ్రాయడం లోనూ ఎన్నో కట్టుబాట్లు ఉన్నాయి. ఐనా, వాళ్ళభాషని ఎన్నడూ విమర్శించరు. వాళ్ళలాగా మాతృభాషని ప్రేమించే వారుగానీ దానిని చూసి గర్వించే వాళ్ళు గానీ ఇతరభాషలలో తారసపడటం అరుదు. ఇదేవిధంగా, అనేక ఇతరభాషలవాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా, తమ మాతృభాషపై ఎంతో కొంత పట్టు కలిగినవారే. వాడుకలోగానీ ఉచ్చారణలోగానీ తప్పులనేవి వారిదగ్గర ఇంచుమించు కనబడవు, ముఖ్యంగా వ్రాతలోనూ, సభాముఖంగానూ.
భాష అన్నది “convention” (kanvenshan?) కి సంబంధించినది. ఇది ఇలాగే ఉండాలి అంటుంది. లిపి కూడా అంతే. సులువు చేయడానికి, అనేక సంవత్సరాలక్రితం పూర్ణానుస్వారాన్నీ, full stop, comma మొదలైనవాటినీ తెలుగులోకి తెచ్చుకోలేదా? కొత్తపదాలను ఆహ్వానించండి. కానీ ఉన్నవాటిని చంపివేయకండి. యాభై అక్షరాలు నేర్చుకున్నవాడికి మరొక నాలుగు నేర్చుకోవడం కష్టం కాదనుకుంటా. పదాలవిషయమూ అంతే.
మరొక మాట: భాషని logical గా నేర్చుకునే / నేర్పే ప్రయత్నం పెద్దగా ఫలించదు. మనకి చిన్నప్పుడు కొత్తవిషయాలూ కొత్తభాషలూ తొందరగా పట్టుబడటానికి ఒక కారణం ఎక్కువ ప్రశ్నించకుండా విషయాన్ని ఉన్నది ఉన్నట్టుగా స్వీకరించడమే.
భవదీయుడు
ఇంద్రగంటి అనంత ప్రభాకర సత్యనారాయణ మూర్తి.
చిరంజీవి గురించి Shivaji అభిప్రాయం:
05/07/2016 12:30 pm
అమ్మ ఈ పదానికి అర్థం తెలియని … జీవి కానీ , జగం కానీ, రూపం కానీ.. లేదు … అన్ని రాగాలకు , వరాలకు, అనురాగాలకు మూలం ఆమె రూపం… అమ్మ చేతి స్పరశకు స్పందించలేని జీవం మరణం… ప్రేమకు నిలువైన రూపం… అమ్మ పిలుపే ఓ వరం …ఓ జీవికి ఎన్నో బందాలు ఉండచ్చు కానీ అమ్మ ఒక్కటే ఎ జీవికైన మూలం … ఆ పాదాల దగ్గర అన్ని పుణ్యక్షేత్రాలు నేలువైవుంటాయని తెలిసిన తరించలేని జీవితాలు ఎన్నో… ఈ సృష్టి లో తన కోసం కాక తను సృష్టించిన తనువు కోసం , మరో జీవి కోసం నిరంతరం తపించే దైవం అమ్మ… అమ్మ కోరే వరం , అమ్మ బరించే శాపం ప్రేమ … ఆ అమ్మ ప్రేమ కోసం… ఎప్పుడు ఆ చంటి బిడ్డల ఆ పాదాల చాటు దాగే వరం ఇస్తే చాలు …@శివాజి
ఆమ్మను అందం గా గోప్ప గా వర్ణించారు ….
సౌభాగ్య కుమార మిశ్ర: రెండు ఒరియా కవితలు గురించి Vasu అభిప్రాయం:
05/07/2016 12:20 pm
గురువు గారూ, సంతోషం. నన్నూ గుర్తుంచుకోండి.
-వాసు
తేలిక తెలుగు గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:
05/07/2016 10:05 am
ఇదేనండి మన తెలుగువాళ్ల దగ్గిర వచ్చిన చిక్కు.
వేమూరి గారు మొదట్లోనే చెప్పారు – మహాప్రభో ఇది నేను ఆచరించిన పద్ధతి ఈ కాలేజీలో ఎందుకంటే క్లాసుకొచ్చిన కుర్రాళ్లకి/కుర్రమ్మలకీ ఏమీరాదు కాబట్టీ, ఇలా చెయ్యాల్సొచ్చింది అని. చివర్లో మళ్ళీ ఇంకోసారి నేను నేర్పిన తెలుగుతో వాళ్ళేమీ ఉద్ధండ పండితులైపోలేదు సారూ అని మొత్తుకున్నారు కదా?
దేశికాచారి గారు: మీరెప్పుడైనా – దండం విదల్చకుండా – ఎక్కడైనా తెలుగు పాఠాలు చెప్పారా (అంటే ఉత్తర అమెరికాలో)? మీ పరిస్థితి ఎలా ఉంది అప్పుడు? అలు, అలూలూ, బండి-ర నేర్పించారా? నేర్చుకున్నాక ఏమైంది? మీకు తెలిసిన తెలుగువాళ్లలో (ఇండియాలో ఉన్నా అమెరికాలో ఉన్నా), ఎంతమందికి మీరు చెప్పిన, మీకు వచ్చినటువంటి తెలుగు తెలుసు? వచ్చినా రోజువారీ చదవడం, రాయడంలో దానిని ఎంతమంది వాడుతుంటిరి? అదేమీ తప్పో, ఒప్పో దయచేసి స్థాలీపులక న్యాయంగా (అంటే ఏమిటో నన్ను అడక్కండి దయచేసి. అది తెలిస్తే ఇలా ఉండేదా నా భాష) వివరింపుడు. మీరు చెప్పినట్టూ మాంఛి కాంక్రీటు స్థంభాల్లంటి పునాదుల మీద తెలుగు నేర్చుకోవాలంటే పదిహేనేళ్ళు పడుతుంది నాలాంటివాడికి. అమెరికా కుర్రమ్మలకి ఎంతకాలం పడుతుందో నాకు తెలియదు. అయినా ప్రతీదానికి ఇప్పుడు ” గూగిలించేస్తే ” చాలు కదా ఎందుకు ఆపసోపాలు పడడం.
వేమూరిగారు: మీకు తెల్సిన విషయమే కానీ మరో సారి చెప్తున్నాను. గిడుగు వారు భాషా ఉద్యమం (వాడుక భాషకి అనుకుంటా, నాకు తెలిసి ఏడిస్తే కదా!) మొదలుపెట్టినప్పుడు ఇలాగే హంసపాదులు మొదలయ్యాయి అని విన్నాను. చిన్నయసూరి (1809-61) బాలవ్యాకరణం, నీతిచంద్రికా మీరు కనక మొదలుపెట్టి ఉంటే మీ కాలేజీలో తెలుగు కి ఈ పాటికి దహన సంస్కారం జరిగి ఆ బూడిద గంగలో కలపడానికి మిమ్మల్నే కాశీ పంపించి ఉండేవారు కదా. ఇవన్నీ పట్టించుకోకండి. మీరు రాసిన ఈ తేలిక తెలుగు వ్యాసం నేను చదువుకునే రోజుల్లోనే వచ్చి ఉండవల్సింది.
అసలిప్పుడు ఆంధ్రా/తెలంగాణా లో ఉన్నవాళ్లకే తెలుగు రాదు. దీనిలో తమిళులు, మళయాళీలు మనకన్నా చాలా బెటర్. వాళ్ళకి కాస్త భాషభిమానం ఉంది. నన్నడిగితే ఇప్పుడు ఈ తేలిక తెలుగు వచ్చినవాళ్ళు కూడా అతి తక్కువమంది. నా స్వంత బాబయ్య (కజిన్స్ అనుకోండి) పిల్లలూ వాళ్ళు కూడా “మేము తెలుగు చదవం” అని గొప్పగా చెప్పుకుంటారు.
ఇది ఈ మధ్యన ఈమాటలో వచ్చిన వ్యాసాల్లో ఒక అద్భుతమైన వ్యాసం.
సత్య దర్శనం గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:
05/07/2016 9:33 am
నమస్తే
అయ్యవారు గారు: నారాయణ సూక్తం వేరు, మంత్రపుష్పం వేరు కానీ రెండింటిలోనూ మంత్రాలు దాదాపుగా ఒకేలాగ ఉంటాయి. బొంబాయి రామాకృష్ణా మఠం వారు ప్రచురించిన మంత్రపుష్పం పుస్తకం మీదగ్గిర ఉంటే చూడండి (స్వామి దేవరూపానందగారు రాసినది). యోపామాయతనం అనేది నారాయణ సూక్తంలో లేదు. అలాగే “అధః నిత్యో నారాయణః, బ్రహ్మా నారాయణః….యద్భూతం యశ్చభవ్యం…” అనేవి మంత్రపుష్పం లో లేవు. గూగిల్లో జాగ్రత్తగా చూస్తే దొరకచ్చేమో.
అసలీ మంత్రపుష్పం వినాలంటే మా ఊరు వెళ్ళాల్సిందే (పంచారామాలలో ఒకటి). ఏకాదశి నాడు రుద్రాభిషేకం చేస్తారు 11 మందితో. పొద్దున్న అభిషేకం అయ్యాక కాస్త విశ్రాంతి (ఫలహారం) తీసుకుని మధ్యాహ్నం బిల్వార్చన. సాయంత్రం అవుతూంటే గుడిలో మైకు పెద్ద స్థాయికి ఊరంతా వినబడేలా (గుడి ఊరికి 2/3 మైళ్ళు దూరం కాబోలు; శివాలయం కదా)పెంచి మంత్రపుష్పం చదవడం మొదలుపెడతారు. యోపాం పుష్పం దగ్గిరకొచ్చేసరికి ఈ 11 మంది రెండు గ్రూపులుగా విడిపోయి, “యోపామాయతనం వేద,” అని ఒకరు అంటే “ఆయతనవాన్ భవతి” అంటూ రెండో గ్రూప్ అందుకుంటారు. ఇలా అవుతూనే మంత్రాలని బట్టి ఆ గ్రూప్ అనేది వీళ్ళూ, వీళ్ళనేది వాళ్ళూ చెప్తారు. మొత్తమ్మీద ఒక పదిహేను నిముషాలు ఒళ్ళు గగుర్పొడిచే వేద పఠనం. ఆ తర్వాత మహా ఆరతి, అవీను. విని కళ్ళతో చూడాలి తప్పితే ఎంతరాసినా వివరించడం కష్టం. ఆ రోజు కనక అదృష్టం ఉంటే గర్భ గుడిలోపలకి వెళ్ళి ఆభిషేకం చేసుకోవచ్చు. అసలీ మంత్ర పుష్పం ఒక్కదానికోసం ఆ రోజు శివాలయానికి వెళ్ళొచ్చు. నేను అనుకోవడం ప్రతీ శివాలయంలోనూ ఇలాగే జరగొచ్చు కానీ నేను మా ఊరి బావిలో కప్పని కాబట్టి నాకు తెల్సింది ఇంతవరకే.
లక్శ్మిగారు: మీకీ వివరణ నచ్చినందుకు సంతోషం.
మరో విషయం. ఈ కధలో పద్యం పోతన రాసినది *కాదు*. ఆ విషయం మూడో పాదం చదవగానే తెలిసిపోతుంది. ఎందుకంటే పోతన ఎప్పుడూ “నాపై కొంతరానిమ్ము” అని రాయడు (నాకు తెల్సినంతలో). రాముడు రాయమంటే రాసాను తప్ప నాదేం లేదు అనే ఆయన చెప్పాడు కదా “పలికించెడువాడు రామభద్రుండట…” అంటూ.
ధన్యవాదములు
చిరంజీవి గురించి రవి వీరెల్లి అభిప్రాయం:
05/06/2016 11:43 pm
గండు మీనులు.. దండెం మీది బట్టలు… లేరంగుల ఇంద్రధనుస్సు ..
భలే ఉంది మీ పద్యం.
మీ పద్యాలలో, వ్యాసాలలో తెలుగువాక్యం మీద మీకున్న నమ్మకం, శ్రద్ధ కనిపిస్తాయి. మీరింకా రాయాలి.
సౌభాగ్య కుమార మిశ్ర: రెండు ఒరియా కవితలు గురించి వేలూరి వేంకటేశ్వర రావు అభిప్రాయం:
05/05/2016 4:13 pm
వాసు గారూ:
సుమారు 50+ కవితలతో జూన్ నెలాఖరికి ద్విభాషాసంకలనం తేవాలని ప్రయత్నం. అన్ని కవితలూ ఆత్మనేపది పుస్తకం నుంచి కాదు. కొన్ని కవితలు మధ్యపదలోపి సంకలనం నుంచి, మరికొన్ని నఈ పహారా సంకలనం నుంచీ తీసుకున్నాను.
మీ అభిమానానికి కృతజ్ఞుడిని.
వేలూరి వేంకటేశ్వర రావు.
చిరంజీవి గురించి Anand అభిప్రాయం:
05/05/2016 3:25 am
చాలా బావుందండీ.