ఈ వ్యాసాన్ని ఇప్పుడే చూసాను. మంచి నీళ్ళ దగ్గర తిట్టుకునే ఆడవాళ్ళు ఉపయోగించే భాషకు మరొక కారణం – అదృష్ట వశాత్తూ – వాళ్ళకు సంస్కృతం తెలియక పోవటం. బృందావనరావుగారు తిక్కన తెలుగుకి యెంత పెద్ద చోటు ఇచ్చారో ముందు చెప్పారు. తెలుగు వారిలో సంస్కృతం మీద ప్రేమ పెంచుకున్న వాళ్ళకు తెలుగును చులకనగా చూడటం వాడుక.** అటువంటి సంస్కృత ప్రియులకు తెలుగు పాంచాలి మాటలు గొప్పగా తోచవు. కానీ మంచినీళ్ళ కోసం తిట్టుకునే ఆడవాళ్ళ భాష తెలిసిన వాళ్ళకు ఆ ఆడవాళ్ళ కసి గూడా తెలిసి ఉండాలి.
** 1. ‘పెద్ద మనుషులు’చిత్రం లోనూ, 2. ‘దొంగ రాముడు’ చిత్రం లోనూ నరసరాజు ఈ విషయాన్ని రేలంగి చేతా, వంగర చేతా పలికించాడు. 1. “బోడిముండ అంటే కోపం వచ్చిందా? వితంతువు అంటాలే”. 2. ” మా ఊరు నక్క బొక్కల పాడు, దాన్నే జంబూకరంధ్ర అగ్రహారం అని కూడా అంటారు.” (కొద్ది తేడాలతో)
శ్రీ వాసుదేవరావు గారికి
నా ‘ఎనాలజీల’తో మిమ్మల్ని బాధించినందుకు క్షమార్పణలు. ఈ ఎనాలజీలు అన్నివేళలలోనూ నప్పవు. పుస్తకం పేరు కూడ నచ్చలేదన్నారు. మీరు సూచించిన పేరు కాసింత మెరుగ్గానే ఉందనిపించింది కాని వేళకి ఆ పేరు నా బుర్రకి తట్టలేదు. మీలాంటి విజ్ఞులు నా పుస్తకం దింపుకుని చదివేరంటేనే అది నాకు ఒక కితాబు! నేను ఈ రకం రాతలు రాయడానికి ఒక కారణం ఉంది. ఇవి చదివి, స్పందించి, ఇంతకంటె బాగా రాయగలిగే వారు ముందుకి వచ్చి నా కంటె బాగా రాస్తారనే ఆశతోటే!
నమస్కారములతో
వేమూరి
నాకు నచ్చిన పద్యం: తిక్కన భారతంలో ద్రౌపది కోపవర్ణన గురించి తః తః అభిప్రాయం:
06/18/2016 7:36 pm
ఈ వ్యాసాన్ని ఇప్పుడే చూసాను. మంచి నీళ్ళ దగ్గర తిట్టుకునే ఆడవాళ్ళు ఉపయోగించే భాషకు మరొక కారణం – అదృష్ట వశాత్తూ – వాళ్ళకు సంస్కృతం తెలియక పోవటం. బృందావనరావుగారు తిక్కన తెలుగుకి యెంత పెద్ద చోటు ఇచ్చారో ముందు చెప్పారు. తెలుగు వారిలో సంస్కృతం మీద ప్రేమ పెంచుకున్న వాళ్ళకు తెలుగును చులకనగా చూడటం వాడుక.** అటువంటి సంస్కృత ప్రియులకు తెలుగు పాంచాలి మాటలు గొప్పగా తోచవు. కానీ మంచినీళ్ళ కోసం తిట్టుకునే ఆడవాళ్ళ భాష తెలిసిన వాళ్ళకు ఆ ఆడవాళ్ళ కసి గూడా తెలిసి ఉండాలి.
** 1. ‘పెద్ద మనుషులు’చిత్రం లోనూ, 2. ‘దొంగ రాముడు’ చిత్రం లోనూ నరసరాజు ఈ విషయాన్ని రేలంగి చేతా, వంగర చేతా పలికించాడు. 1. “బోడిముండ అంటే కోపం వచ్చిందా? వితంతువు అంటాలే”. 2. ” మా ఊరు నక్క బొక్కల పాడు, దాన్నే జంబూకరంధ్ర అగ్రహారం అని కూడా అంటారు.” (కొద్ది తేడాలతో)
తః తః
ఘంటసాల గొంతులో జీవించిన ఉదయశ్రీ పద్యాలు గురించి Krishna Keerty అభిప్రాయం:
06/16/2016 6:41 pm
చాలా చక్కని వ్యాసం మరియు రాగ విశ్లేషణ.
ఎన్ని సార్లు విన్నా ఇంకా కొత్త దనం కనిపిస్తూనే ఉంటుంది మనసుకి హత్తుకు పొయే ఈ పాత పద్యాలు పాటలలో.
2010 లో మీరు హౌస్టన్ ఘంటసాల ప్రోగ్రాం లో పాటలు పాడారు కదా? మీరేనా?
ధన్యవాదములు
క్రిష్ణ కీర్తి
నాకు నచ్చిన పద్యం: తిక్కన భారతంలో ద్రౌపది కోపవర్ణన గురించి k.krishnamoorthy అభిప్రాయం:
06/16/2016 6:21 am
ఈ పద్యం మనసులో నిలిచి పోవాలంటే వీరాభిమన్యు చలన చిత్రం లో శ్రీమతి జి. వరలక్ష్మి గారు ద్రౌపది గా చేసిన అభినయం చూడండి. ఆ కసిని ఆమె ఎలా చూపిందో చూడండి.
నాకు నచ్చిన పద్యం: పారిజాతాపహరణంలో సత్యభామ గురించి VSTSayee అభిప్రాయం:
06/15/2016 2:23 pm
“పారిజాతాపహరణము”కోసం గూగుల్‌లోనో, యాహూలోనో, బింగ్‌లోనో వెతకాలి.
నమస్తే,
శాయి.
నాకు నచ్చిన పద్యం: పారిజాతాపహరణంలో సత్యభామ గురించి y v s n murthy అభిప్రాయం:
06/15/2016 10:32 am
నాకు పారిజతపహరణం తెలుగులో కావాలి? ఎక్కడ దొరుకుతుంది? నేనేం చేయాలి?
సత్య దర్శనం గురించి దేవరకొండ అభిప్రాయం:
06/14/2016 1:32 am
‘కథ’ ఏక బిగిన చదివించింది. ‘మన సచివుడు…’ పద్యం కూడా వుంటే బాగుండేదనిపించింది. శర్మ గార్కి అభినందనలు.
సౌభాగ్య కుమార మిశ్ర: రెండు ఒరియా కవితలు గురించి మధురశ్రీ అభిప్రాయం:
06/14/2016 1:31 am
తల బాదుకొని సముద్రం రోదిస్తుంది అన్న పంక్తి బాగుంది. ధన్యవాదములు
చిరంజీవి గురించి Purnima అభిప్రాయం:
06/11/2016 11:29 am
Beautiful!
మనుషులెందుమూలంగా జీవిస్తారు? గురించి SAMBASIVARAO అభిప్రాయం:
06/11/2016 10:55 am
చాలా బావుంధి. ఆలోచింపచేయడమే కాదు. కొన్ని ఆలోచనలకు సమాధానాలు కూడా దొరికాయి.
అంకెలు-సంఖ్యలు: రామానుజన్ నుండి భార్గవ దాకా గురించి Rao Vemuri అభిప్రాయం:
06/11/2016 10:52 am