పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16473

  1. ప్రయాణం గురించి దడాల వెంకటేశ్వరరావు అభిప్రాయం:

    06/27/2016 8:37 am

    బెత్తెడు జాగా చెక్కుకుంటాను అని వ్రాసారు. అర్థం కాలేదు

  2. సంస్కృతాంగ్లాల మధ్య నలుగుతూన్న తెలుగు గురించి Siddineni Bhava Narayana అభిప్రాయం:

    06/24/2016 12:56 pm

    Vemuri Venkateshwara Rao garu,

    i request you dwell upon the editors to consider a small piece on J .P. L. Gwynn.

    We, as a speech society are not exactly noted for being punctilious. In matters related to mother tongue. Yet, we are enamored at the affection shown by non native philophiles for our language. Our society is does not discriminate between native admirers and foreign admirers. We meticulously ignore the both. We are scrupulous in holding these enthusiasts of our language and our culture in relegation to oblivion.

    We never hold these linguists in high gratitude for their love for our language. You cannot really repay the services rendered by their meticulous study of the language. Our society is indebted to theses linguists for infusing a propitious, modern, rational, propitious approach in matters of etymology and of phonetics.

    J.P.L Gwyn is one among them. He may be remembered and be paid our tribute in his centenary year.He has rendered valuable service on two fronts. He devoted his entire time after retirement for the dictionary work. His dictionary, compiled in association with Prof. Venkateswara Shastry, has incorporated the latest practices developed in etymological enquiry.

    J.P.L Gwynn has played a significant role, throwing his weight as a senior most bureaucrat in setting the official policy tilted towards a spoken tongue .An ICS bureaucrat of the pre independence cadre, he developed a deep fascination for Telugu, and served the Telugu speaking areas only. He chose to remain in independent India and chose A P cadre. His love for Telugu is said to be partially responsible for this choice.
    .

    The erstwhile government of A.P.constituted a committee on 28-12-1966 to come up with viable options as to the most suitable mode of Telugu academic instruction. The recommendations of the committee turned to be progressive, pragmatic and to be conducive to the growth of language. The committee is referred as J.P. L Gwynn Committee, and is hailed to have set a pioneering example in setting guide lines for a vernacular in independent India.

    Warm regards.

    Yours faithfully,

    –Siddineni Bhava Narayana.

  3. ఇది చాలు నాకు గురించి తః తః అభిప్రాయం:

    06/22/2016 4:25 am

    శ్రీ అవినేని: మీ అనువాద రచన అందం గా ఉంది.

    “చరణాలలో వనమాలి చేసిన అనువాదం అంత గొప్పగా లేదు- శ్రీ కొలిచాల.

    వనమాలికి ఉన్న సినిమా వత్తిళ్ళ వంటివి శ్రీ అవినేనికి లేవనుకుంటాను. మచాడొ చిన్న ( స్పానిష్) ) కవిత ‘Caminante no hay Camino’కున్న రకరకాల అనువాదాలు నన్ను చాలా ఇబ్బంది పెట్తాయి. నాకు స్పానిష్ రాదు. మచ్చుకు రెండు అనువాదాలు చూడండి. చివరకు నాకు నచ్చినది మొదటిది. నేను మొదటి సారిగా చదివినది.

    1 Traveller, the path is your tracks
    And nothing more.
    Traveller, there is no path
    The path is made by walking.
    By walking you make a path…..”

    2 Wayfarer, the only way
    Is your footprints and no other.
    Wayfarer, there is no way.
    Make your way by going farther.
    By going farther, make your way….
    తః తః

  4. అంకెలు-సంఖ్యలు: రామానుజన్ నుండి భార్గవ దాకా గురించి Rao Vemuri అభిప్రాయం:

    06/22/2016 1:02 am

    నేను కంప్యూటరు వాడిని; వైద్యుడిలా పోజి పెట్టి కథలు రాస్తున్నాను. లైలా గారు వైద్యులు; ఆమె కంప్యూటరు వాడికి కంప్యూటర్ల గురించి పాఠం చెబుతున్నారు! బ్రహ్మం గారు ఎప్పుడో చెప్పేరు! 🙂
    అమ్మా! మన్నించండి. ఉండబట్టలేక స్పందిస్తున్నాను. – వేమూరి

  5. అమర కోశం గురించి తః తః అభిప్రాయం:

    06/21/2016 4:21 pm

    [అభిప్రాయాలు రాస్తున్న ముసుగులో మీరు మీ కవితలు ఇలా ప్రచురించుకునే ప్రయత్నం చేయవద్దని, అలా మీరు రాసిన అభిప్రాయాలు ప్రచురించమని చాలాకాలం క్రితమే మీకు చెప్పి ఉన్నాం. ఇప్పుడూ అదే మాట చెప్తున్నాం – సం.]

    చాలా సంవత్సరాల వెనకటి మాట: Punch మాగజిన్ లొ ఒక వ్యాసం మీద ఒకరు తన అభిప్రాయ లేఖలో ఆ వ్యాసం తనెప్పుడో రాసి – ఎక్కడా ప్రచురించని ఒక కవితలాగా ఉన్నదని అంటూ, ఆ కవితని గూడా ఆ లేఖలొ రాసారు. ఆ లేఖని ఆ కవితతో సహా ప్రచురించి పత్రికా సంపాదకులు ఇలా రాసారు: “Now it is published. Do not send any more.”

    తః తః

  6. ఏనుగుల ఆటలా – నవరసాలకు బాటలా? గురించి మల్లేశ్వరరావు పొలిమేర అభిప్రాయం:

    06/21/2016 3:58 pm

    మోహనరావు గారు, చాలా బాగా విడమర్చి తెలిపారు. మీ ఛందో జ్ఞానమునకు నమస్సుమాంజలి. ఈ వృత్తము గురించి బాగా తెలిసినది.

  7. అంకెలు-సంఖ్యలు: రామానుజన్ నుండి భార్గవ దాకా గురించి lyla yerneni అభిప్రాయం:

    06/21/2016 11:28 am

    “ఈ లెక్కని ఎంతమంది వ్యక్తులు ఈ పుస్తకాన్ని దింపుకున్నారో ఎలా తెలుస్తుంది?”

    “సాఫ్ట్ వేర్ రంగంలో మన తెలుగు వాళ్ల కొమ్ములు తిరిగిపోయాయని అంటూన్నారు కనుక ఏదో చిన్న ధర్మ సందేహం.” – వేమూరి

    I wish you watch the very last episode of ” Silicon Valley” (HBO) aired. It answers your question. – Lyla

  8. అంకెలు-సంఖ్యలు: రామానుజన్ నుండి భార్గవ దాకా గురించి Rao Vemuri అభిప్రాయం:

    06/21/2016 9:45 am

    “పాఠక మహాశయులకి:
    ఈ వ్యాసంతోపాటు, ఈమాటలో నేను ప్రచురించిన గణిత సబంధమైన మరిన్ని వ్యాసాలని కూడగట్టి, “రామానుజన్ నుండి ఇటీ, అటూ” అనే ఇ-పుస్తకం ప్రచురించేను. దీనిని ఈ దిగువ జాలస్థలి నుండి ఉచితంగా దింపుకోవచ్చు.
    http://kinige.com/kbook.php?id=6975
    It is FREE. If you like it, tell others.
    రామానుజన్ పేరు ఇటీవల ఎక్కువగా వినిపిస్తోంది (సినిమా కూడ వచ్చింది) కనుక ఈ పుస్తకం ఆసక్తికరంగా ఉంటుందనే అనుకుంటున్నాను. – వేమూరి”

    అంటూ నేను జూన్ 8 న పై ప్రకటన చేసిన తరువాత జూన్ 21 నాటికి 200 ప్రతులు దింపుకోవడం జరిగిందని నేను సంతోషిస్తున్న సమయంలో ఒక సంఘటన జరిగింది. కంప్యూటర్లు వాడడంలో ప్రావీణ్యం లేని ఒక వ్యక్తి ఏమిటి చెయ్యాలో తెలియక బొత్తాం నాలుగు సార్లు నొక్కేడు. నాలుగు ప్రతులు దిగేయి! ఈ లెక్కని ఎంతమంది వ్యక్తులు ఈ పుస్తకాన్ని దింపుకున్నారో ఎలా తెలుస్తుంది? సగటున, 200 ని 4 చేత భాగించగా 50 మందా? లేక నాకు కనిపించే “కౌంటరు” ఒక IP address నుండి ఎన్ని సార్లు దింపుకున్నా ఒక్క సారే లెక్కపెడుతుందా? సాఫ్ట్ వేర్ రంగంలో మన తెలుగు వాళ్ల కొమ్ములు తిరిగిపోయాయని అంటూన్నారు కనుక ఏదో చిన్న ధర్మ సందేహం. – వేమూరి

  9. అమర కోశం గురించి దడాల వెంకటేశ్వరరావు అభిప్రాయం:

    06/20/2016 2:58 am

    మీ కవిత మాకు ససేమిరా అర్ధం కాదు
    మా అభిప్రాయం “ఈమాట” ప్రచురించదు
    ప్రచురించిన అభిప్రాయాలకు జవాబు ఇవ్వరు
    ఇక అభిప్రాయం తెలియజేసే పక్రియ ఎందుకొ
    అన్న ప్రశ్నకైనా జవాబు దొరికి చస్తుందా
    లేక నాకు చావు లేదు చావుయొక్క బతుకును నేను అంటారా?

    [అభిప్రాయాలు రాస్తున్న ముసుగులో మీరు మీ కవితలు ఇలా ప్రచురించుకునే ప్రయత్నం చేయవద్దని, అలా మీరు రాసిన అభిప్రాయాలు ప్రచురించమని చాలాకాలం క్రితమే మీకు చెప్పి ఉన్నాం. ఇప్పుడూ అదే మాట చెప్తున్నాం – సం.]

  10. వల్లూరి జగన్నాథరావు గురించి Sreenivas Paruchuri అభిప్రాయం:

    06/19/2016 7:45 am

    Thanks to Sri P.V. Ramana of Sobhanachala blog fame who dug out some more information about Valluri and kindly shared with me. This advertisement from June 2015

    clearly proves that Valluri recorded by 1915 itself, and perhaps even little earlier. My sincere thanks to Ramana gaaru for this valuable information! If you are already not of aware of his blog it is a real treasure trove of information on Telugu culture at large.