పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16473

  1. నాకు నచ్చిన పద్యం: మాధవపెద్దివారి మధుర స్మృతికావ్యం గురించి nagamurali అభిప్రాయం:

    07/02/2016 1:43 am

    ‘వెల్వడగా నిల్వగ బాఱువోక’ – కుమార సంభవంలోని ఈ శ్లోకార్ధం గుర్తుకొచ్చింది.

    మార్గాచలవ్యతికరాకులితేవ సింధుః
    శైలాధిరాజతనయా న యయౌ న తస్థౌ ||

  2. స్వాధీనపతిక, ప్రోషితభర్తృక గురించి Dr Sastry B Cherla అభిప్రాయం:

    07/01/2016 4:38 pm

    Very few writers have the ability to make the reader believe that he is really there as part of the action. Dr Tirumala Desikachari garu has the blessings of the goddess Saraswati as his writing style is truly inspiring and exhilarating and his lyrics are like enjoying payasam ,especially the renedering of the song ‘Cheliyaro..’ by Isaivaanar Srimati Ratna Sastry. Lot of hard work went into this presentatation. We are fortunate to have such great talented writers in North America who need encouragement and recognition. My hearty congratulations to both the author and the Gayatri as well the cymbals player Miss Sumathi Thimmana.

  3. నాకు నచ్చిన పద్యం: మాధవపెద్దివారి మధుర స్మృతికావ్యం గురించి VSTSayee అభిప్రాయం:

    07/01/2016 12:58 pm

    మాధవపెద్దివారి ‘బృందావనం’ డి.ఎల్.ఐ.లో –
    http://dli.ernet.in/bitstream/handle/2015/394269/Brundavanamu.pdf

    మాధవపెద్దివారి మృత్యుంజయ శతకము ‘ఆంధ్రభారతి’లో
    http://www.andhrabharati.com/shatakamulu/mRityuMjayaM/index.html

  4. ఇది చాలు నాకు గురించి దేవరకొండ అభిప్రాయం:

    06/30/2016 5:38 am

    కనీసం 40 ఏళ్ల క్రితం వరకూ కోస్తా జిల్లాల్లో మంచి నీరు ప్రవహించే కాలువలు ఉండేవి. మంచి నీరు అంటే నా ఉద్దేశ్యం రేవులోకి దిగి దోసిళ్లతో నీరు ఏ సంకోచం లేకుండా అంతా తాగగలిగేది అని. ఆ కాలువల్లో పడవలు, గూటి పడవలు అప్పుడప్పుడు లాంచీలు తిరుగుతూండేవి. వైరముత్తు గారి కవితలను భాస్కర్ గారు ఇంత చక్కని అల్పాక్షరాల్లో అందించి ఒక్కసారి ఎక్కడికో తీసుకెళ్లారు. కలలె మనకు మిగిలిపోవు కలిమి సివరకు…ధన్యవాదాలు భాస్కర్ గారు.

  5. సంస్కృతాంగ్లాల మధ్య నలుగుతూన్న తెలుగు గురించి తః తః అభిప్రాయం:

    06/29/2016 9:11 pm

    తెలుగు వారిగా ఆంధ్ర దేశంలో పుట్టి 20, 25 సంవత్సరాలు ఆంధ్ర దేశం లోనే పెరిగి తెలుగు చదవలేరు, రాయలేరు, సరిగా మాట్లాడనూ లేరు. ‘అబ్బో’ / ‘ఎంత బాగుందో’ అనటానికి ‘వౌ’ అంటారు. ఇటువంటి వారిలో కొందరు అమెరికన్లొ సామెతలనూ సొంతం చేసుకున్న చతురులు కూడా ఉండే ఉంటారు. వారిలో ఎవరికైనా అమెరికాలో వారి అమెరికన్ భాషా ప్రావీణ్యానికి సన్మానాలు జరిగిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా?

    తఃతః

  6. ఏం జీవితం! గురించి manohar అభిప్రాయం:

    06/29/2016 11:42 am

    జీవితంలో అంత అందమైన జ్ఞాపకాలు సంపాదించుకున్న మనిషి, ఆసుపత్రిలో ఒంటరిగా ఉండడం విస్మయంగా ఉంది. అదికూడా కుటుంబసభ్యుల వివరాలతో కాకుండా స్నేహితుడి పేరు మీద.

  7. సంస్కృతాంగ్లాల మధ్య నలుగుతూన్న తెలుగు గురించి తమ్మినేని యదుకులభూషణ్ అభిప్రాయం:

    06/28/2016 4:33 pm

    J.P.L గ్విన్ నిఘంటు నిర్మాణంలో పాలుపంచుకుని సహసంపాదకత్వం నెరిపినందుకు గాను జొన్నగడ్డల వేంకటేశ్వర శాస్త్రిగారికి 2008 బ్రౌన్ పండిత పురస్కారం లభించింది

    http://eemaata.com/em/issues/200811/1359.html

  8. సంస్కృతాంగ్లాల మధ్య నలుగుతూన్న తెలుగు గురించి విన్నకోట నరసింహారావు అభిప్రాయం:

    06/27/2016 10:58 pm

    ఈ సంవత్సరం జూన్ 22 జె పి ఎల్ గ్విన్ గారి శతజయంతి. ఈ సందర్భంగా ఆంధ్రజ్యోతి దినపత్రికలో జూన్ 22, 2016 న ఈ క్రింది లింక్‌లో ఉన్న వ్యాసం వచ్చింది.

    http://www.andhrajyothy.com/artical?SID=256749

  9. సంస్కృతాంగ్లాల మధ్య నలుగుతూన్న తెలుగు గురించి Rao Vemuri అభిప్రాయం:

    06/27/2016 10:09 am

    Siddineni Bhava Narayana garu:

    The Telugu transliteration is not working. So I am writing in English.

    The editorial board of eemata is no nearer to me than it is to you. Besides, I knew very little about Gwynn. If you write a piece on Gwynn, I am sure the editor will consider it. And it would be a timely tribute. Regards – Rao Vemuri

  10. శంకరాచార్యుల రచనలో ఛందస్సు వైభవము గురించి Bhaskar Burra అభిప్రాయం:

    06/27/2016 9:56 am

    పూజ్యులైన గురువు గారికి నమస్కారం,

    మీ వ్యాసం, వివరణ చాల అర్ధవంతముగా ఉన్నది. అందుకు మీకు కృతజ్ఞతలు. నాకు ఒక శ్లోకం / పద్యం యొక్క అర్ధం తెలుపగలరు మరియు అది ఏ గ్రంథము లోనిదో కూడ తెలుపగలరు అని సవినయముగా కోరుకుంటున్నాను.

    పద్యం:
    ఉభయ కుశల చిరజీవన ప్రసుతధరిత మంజులతర శ్రుంగారే సంచారే
    అధర రుచిత మధురితభగ సుధనకనక ప్రసమనిరత బాంధవ్యే మాంగళ్యే
    మమతవసపి సమదశశత ముగమనశుక సుమనలయివ సుసుతసహిత కామం విరహ రహిత భావం
    ఆనందభోగం ఆ జీవ కాలం పాశానుబంధం కాలను కాలం దైవానుకూలం కామ్యార్ధ్యసిధ్యం కామయే …

    మీకు నమస్కరిస్తూ మీ విధేయుడు,
    భాస్కర్ బుర్రా