పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16473

  1. Sixty Years of Telugu Poetry : A telugu retrospective గురించి Padmini Varanasi అభిప్రాయం:

    08/03/2016 6:59 am

    Namaskaram,

    I am looking for Poems of Telugu Saints & Poets. The meaning of the poems should match or resonate with the shlokas of the Mandukya Upanishad; i.e.with the themes of the three states of consciousness described in the Mandukya – waking (Vaishvanara), dream (Taijasa) and deep sleep (Prajna) and the fourth state that goes beyond these three, Turiya, the super conscious state.
    These four states are linked to the A, U and M and what comes beyond that of Omkar.

    I cannot read or write telugu, so please translate & share. would be grateful for your efforts.

    Regards

    Padmini Varanasi

  2. మాయదారి సిన్నోడు: స్వరకర్త రమేశ్ నాయుడు గురించి RAVI KRISHNA CHAREPALLI అభిప్రాయం:

    08/02/2016 11:51 am

    A)ఆకాశవాణి హైదరాబాద్ లో లలితసంగీతం లో శ్రీమతి రావు బాలసరస్వతి గారు పాడిన లలిత గీతాలు మూడు వరుసగా ప్రసారం అయ్యేవి. అవి
    1)ఈ చల్లని రేయి తిరిగి రానే రాదు 2)ఏనాటికి రాడు ఏలాటి ప్రియుడే 3)ఓ ప్రభు! వినిపించెనో నీ వేణు గానము. ఈ మధుర గీతాలు మీ వద్ద ఉంటే ప్రసారం చేయగలరు,ధన్యవాదాలు. B)గ్రామ దేవతలు ,1968 లో వచ్చిన తెలుగు సినిమా లో శ్రీమతి P.లీల గారు పాడిన ‘కోమల పల్లవ పాణి’ అనే పాట ఆడియో ఎక్కడా దొరకలేదు.మీ ద్వార వినగలిగితే చాలా సంతోషం.దీనికి సంగీతం శ్రీ. పెండ్యాల గారు.ధన్యవాదాలు.

  3. మల్లె అంటు గురించి చోడవరపు ప్రసాద్ అభిప్రాయం:

    08/02/2016 3:12 am

    వైదేహి గారు:
    మొదటి భాగంలో వర్ణణ చాలా చక్కగా కుదిరింది. జన సామాన్యమైన అనుభవాన్ని సామాన్యమైన భాషలోనే అందంగా ఆకర్షణీయంగా చెప్పారు. రెండవ భాగం ఊహించని మలుపు తీసుకుని nostalgia ని climax కు చేర్చింది. మళ్ళీ చదివితే, సొంత ఊరు వదిలి వేరే దేశంలో/ప్రదేశంలో తమ ప్రతిభా పరిమళాలు పంచుతూ పుష్పిస్తున్న వారంతా తమ ఊరు గుర్తొచ్చినప్పడు అనుభవించే తపన స్ఫురిస్తుంది. బాగుంది.
    Cheers
    ప్రసాద్

  4. నేటికెవరు మరి కథానాయకుడు? గురించి తాడిగడప శ్యామలరావు అభిప్రాయం:

    08/01/2016 6:52 am

    ఈ కథ బాగుందండోయ్.

  5. బోధిచెట్టులో సగంచెట్టు గురించి Dadala Venkateswara Rao అభిప్రాయం:

    07/31/2016 3:12 pm

    అప్పటి బ్రాహ్మణ జీవితం నాలుగు దశలని, మొదటి దశ యవ్వనం వేదాలు అధ్యయనం, రెండవ దశ వివాహం కుటుంబం మరియు సమాజం, మూడో దశలో పిల్లలు వారి భవిష్యత్తు, నాలుగవ దశలో బాధ్యత నుండి విడుదల బ్రాహ్మణ సన్యాసి జీవితం. సిద్ధార్థ ఈ అధ్యయనం చాలా ఆలస్యం అని గ్రహించాడు అతను దీర్ఘ కాలం వేచి వుండాలని కోరుకోలేదు.ఈ విషయం భార్యకు తండ్రికి ముందుగానే తెలియజేసాడు. అప్పటి రాజ్య పరిస్థితులు వారిద్దరినీ సతమతపరుస్తూనే వుండెవి. రాజ్యాన్ని వదలి సన్యసించాలనె ఆలొచన ఎప్పటికప్పుడు ఆమెతొ చర్చిస్తూనే వస్తాడు.

    సిద్ధార్ధుడు తన భార్యను వదలి వెళ్ళిపొతాడన్న విషయం ఆమెకు చాలా ముందుగానే తెలుసు. “నీవు చాలా దైర్యముగల మహిళవు. నా భాగస్వామిగా నిజంగా నా తపనను తీర్చడానికి నీవు సహాయపడతావు. నీవు నాకు అందరికంటే ఎక్కువ. సమీప భవిష్యత్తులో నేను మిమ్ములను వదిలి చాలా ప్రయాణం ఉంది. ఈ పనిని కొనసాగించే ధైర్యాన్ని మీరు కలిగి వుంటారని నాకు తెలుసు. నే ను మీ నుండి ఎంతదూరములొ ఉన్నా నా ప్రేమ మారదు. నేను ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. ఆ జ్ఞానం పొందడం కొరకు మీరు మన దూరాన్ని భరించెయ్యగలరు. నేను మార్గాన్ని కనుగొన్నాప్పుడు మిమ్ములను చేరుకుంటాను. అని ముందుగానె చెబుతాడు”

    అది సిద్ధార్ధుడు హటాత్తుగా తీసుకున్న నిర్నయమూ కాదు. యశోధరకు ఈ విషయం ముందుగా తెలియనిదీ కాదు

    యశోధర తన భర్త విదిచివెళ్ళినప్పుడు ఆశ్చర్యపోలేదు. సిద్ధార్దుడు ప్రాపంచిక ఆనందాలకు దూరంగా ఉంటాడని పెళ్ళికి ముందే తన తండ్రి పదె పదే హెచ్హరించినా ఆమె వినలేదు. ఆమె ఒక ధైర్యశాలి మహిళ. ఆమె భర్త జ్ఞానోదయం కోరుతూ ప్రజలకొసం చింతించడాన్ని జ్ఞానం యొక్క పూర్తి పదాలతో ఆమె ‘మేము జీవితంలో పెద్ద విషయాలను పొందేందుకు చిన్న విషయాలు కోల్పోవడం అవసరం’ అని జవాబిస్తుంది.

    బోధివృక్షం క్రింద సిద్ధార్దుడికి జ్ఞానోదయమైనది.బోధివృక్షం మహావృక్షం.దాన్ని సగంచెట్టు అనకూడదు.

  6. పడుచు కెరటాలు గురించి appaalayya అభిప్రాయం:

    07/31/2016 6:49 am

    నిజంగానే ఛాలా బాగుంది. శ్రీ రవి శంకర్ గారికి ఆభినందనలు.

  7. “చందమామ” జ్ఞాపకాలు గురించి దేవులపల్లి శ్రీనివాస మూర్తి అభిప్రాయం:

    07/30/2016 8:50 pm

    హృదయాంతరాళ్లలో … మా చిన్ననాటి … తీపిగురుతుల్ని … తలపిస్తూ (పాత సినిమాల్లో పాత్ర ముందు “జిలేబీ చుట్టలు తిరుగుతున్నట్టన్నమాట ) మమ్మల్ని ఆ “తరానికి ” తీసుకెళ్లడమే కాకుండా .. ఇప్పటికీ మాకు తెలియని చాలా విషయాల్ని పొందుపరచి సంగ్రహంగా తెలియజేసిన శ్రీ రోహిణీ ప్రసాద్ గారి “శైలి ” మనసుకు హత్తుకునేలా వుంది . వారికి నా కృతజ్ఞతలు , అభినందనలు . ఈ నా ఆనందాన్ని నా “పేస్ బుక్ ” మిత్రులతో ఈ విధంగా పంచుకున్నందుకు నాకు చాలా ఆనందంగా వుంది .
    *****

    ” దేవులపల్లి శ్రీనివాస మూర్తి::రామవరప్పాడు (పో) విజయవాడ 521108

    “చందమామ” జ్ఞాపకాలు
    నింగిలో మెరుస్తూ మురిపించిన చందమామని ఆ “బాల రాముని” కోసం “అద్దం” లో చేతికందించాడ.. రామాయణంలో నాటి దశరధుడు తన “గారాల పట్టి ” కోసం …… అది పురాణమైతే … నేటి బాలలే రేపటి పౌరులని తలచి .. మహామహులు , వారి మేధోవికాసం కోసం …మహామహులు , చందమామని మన “చేతి” కి అందించారు
    మా చిన్నతనంలో “చందమామ ” కోసం తపించే వాళ్ళం , పోటీ పడేవాళ్ళం ముందుగా చదివెయ్యడానికి ….” బాలానందం ” కార్యక్రమం వినడానికి “రేడియో ” చుట్టూ ఈగల్లా మూగినట్టు , చందమామ కోసం తపించే వాళ్ళం …..
    14 భాషల్లో ఆబాలగోపాలాన్నీ కొన్ని దశాబ్దాల పాటు తన తో మమేకం చేసుకున్న “చందమామ ” కి “సృష్టికర్తలు ” , మూల విరాట్టులు పూజనీయులు , ధన్య చరితులు .. ఎందరో మహానుభావులు …..
    (For many decades, Chandamama’s illustrators defined the look of the magazine. They included such names as M.T.V. Acharya, T. Veera Raghavan, who signed his work as Chithra; Vaddadi Papaiah, who signed as Vapa; Kesava Rao who signed as Kesava; M. Gokhale; and K. C. Sivasankaran, alias Sankar, who joined Chandamama in the year 1951, and continues to draw even now in 2011, in an unbroken association of 6 decades! Later artists such as Shakthi Dass; M. K. Basha, who signed as Razi; Gandhi Ayya, aka Gandhi; and P. Mahesh (Mahe), also continued the tradition into current times.[2] Initially, the covers were printed in four-colours, while the illustrations inside used line drawings. Each page of Chandamama has an illustration, although in the strict sense of the term, Chandamama is not a comic book, with the exception of the Chitra-katha column.)- Wikipedia
    అంతటి ప్రాభవం గల “చందమామ ” జ్ఞాపకాలు
    : కీ . శే . కొడవటిగంటి కుటుంబరావు (“కో.కు” . గా సుప్రసిధ్ధులు ) గారి తనయులు శ్రీ. కొడవటిగంటి రోహిణీప్రసాద్‌గారి మాటల్లో….
    http://eemaata.com/em/issues/200601/33.html

  8. గుర్తుందా గోదారీ? గురించి appaalayya అభిప్రాయం:

    07/30/2016 6:53 am

    చాల చాల బాగుంది.

  9. బోధిచెట్టులో సగంచెట్టు గురించి అవినేని భాస్కర్ అభిప్రాయం:

    07/28/2016 4:32 am

    మణ గారు, Ramanuja Rao గారు, బండారి రాజ్ కుమార్ గారూ, — మెచ్చుకున్నందుకు ధన్యవాదాలండి.

    బాలు గారూ, — ఒరిజినల్ లో కాలమే అడుగుతుంది. సంపాదకులు అనువాదంలో ఇలా మార్చారు. ట్రావెలింగ్ ఇన్ టైమ్ లాగ అన్న మాట. భూమి వెనక్కి తిరిగినా ఆ కాలంలోనే ఆగుతుంది. కాలం లో వెనక్కి నడిచినా చేరేది ఒక్క చోటికే కదా? అరవలో భూమి వెనక్కి తిరిగితే అని అన్నప్పుడు ఆ వాక్యాల్లో కొంత చమత్కారం ధ్వనిస్తుంది. అది తెలుగులోకి as it is గా అనువాదం చేస్తే అరవ వాసనగా ఉన్నట్టు అనిపించుండచ్చు. అందుకే అలా మార్పుచేసి పంపారు. నాకు సరి అనిపించింది.

  10. నాకు నచ్చిన పద్యం: పారిజాతాపహరణంలో సత్యభామ గురించి PV Raju అభిప్రాయం:

    07/28/2016 3:03 am

    పారిజాతపహరణం వ్యాఖ్యాన సహిత పుస్తకం అందుబాటులో వున్నదా?వుంటే తెలుపగలరు