పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16469

  1. నాకు నచ్చిన పద్యం: కైలాసాన్నే కాదన్న వీరవనిత గురించి vvadi అభిప్రాయం:

    07/31/2017 12:31 pm

    Off the tangent here. This was an extremely violent time(late 11th century to early 14th century) for common people.

    Jangamaiah’s are local landlord’s(Siva’s) goons. Landlords demand extreme loyalty. Just imagine the cruelty in the story of Siriyala. What is the mental state of the parents to kill their own progeny and also to cook the flesh. This story never happened. But the fear mongering is evident, and it always happens to the people at the bottom of the pyramid. It is truly a dark age in south indian history.This violence was not only among Veera Shaivas and Veera Vaishnavas. These two sects also committed innumerable atrocities on sramanic religions (Jainism and Buddhism).

  2. ఆచార్య చేకూరి రామారావు భాషాశాస్త్ర పరిశోధన, మార్గదర్శనం గురించి సురేశ్ కొలిచాల అభిప్రాయం:

    07/30/2017 3:11 pm

    సౌమ్య గారు,

    చేరావారి అముద్రిత తెలుగు భాషా వ్యాకరణం నాకు తెలిసినంతవరకూ ఇంకా ముద్రణకు నోచుకోలేదు. దాని గురించి వారి అమ్మాయిని అడిగితే తెలుస్తుందేమో.

    సురేశ్.

  3. భద్రిరాజు కృష్ణమూర్తి గారితో ఇంటర్యూ గురించి సురేశ్ కొలిచాల అభిప్రాయం:

    07/30/2017 3:07 pm

    సౌమ్య గారు,

    సి. పి. బ్రౌన్ అకాడెమీ వారు కృష్ణమూర్తి వారికి “తెలుగుభారతి” పురస్కారం మే 2008లో ఇచ్చారు. ఆ సందర్భంగా ఆయన ఆకాశవాణికి ఇచ్చిన ఇంటర్వ్యూ ఇది.

    ఆ పురస్కారం గురించిన ప్రకటన ఇక్కడ చూడవచ్చు: భద్రిరాజు కృష్ణమూర్తి గారికి తెలుగు భారతి పురస్కారం

  4. తిక్కనగారి భారతంలో ఒక పద్యం గురించి విజయ సారధి అభిప్రాయం:

    07/30/2017 11:53 am

    తిక్కన భారతం లో ఈ పద్యం లాగా నే, నన్నయ్య భారతం ఆది పర్వం మొదటి ఆశ్వాసం లో 124 వ పద్యం.. రెండవ ఆశ్వాసం లో 204 వ పద్యం కూడా ఒకటే…

    కాదన కిట్టి పాటియపకారముఁ దక్షకుడుఁడేకవిప్ర సం
    బోధనఁ జేసె చేసె నృపపుంగవ నీవు ననేక భఊసురా
    పాదిత సర్పయాగమున భస్మము సేయుము తక్షకాది కా
    కోదర సంహతిన్ హుతవహోగ్ర సమగ్ర శిఖాచయంబులన్

  5. వింజమూరి శివరామారావు లలితగీతాలు గురించి రానారె అభిప్రాయం:

    07/30/2017 10:12 am

    థాంక్యూ శ్రీనివాస్ గారూ. I had a blissful time this evening listening to these songs, sitting on a terrace along with my father.

  6. శవం గురించి Srinivas అభిప్రాయం:

    07/29/2017 6:21 pm

    ఎందుకలా అవుతుంది అనేది బాధ కలిగిస్తుంది. ప్రేమ సఫలమయినా దాన్ని కోల్పోయిన వాళ్ల కథలన్నీ ఈ చిన్న కథలో చూపించారు. చదివి ఒక్కరయినా మనసు మార్చుకుంటే బాగుండును.

  7. సినారె: ఒక స్మరణ గురించి పారునంది కార్తికేయ అభిప్రాయం:

    07/29/2017 9:16 am

    సినారే గురించి తెలియని విషయాలు క్లుప్తంగా చెప్పారు. ధన్యవాదాలు

  8. ( ర ) సాలూరు రాజే “స్వర ” రావు నివాళి గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:

    07/27/2017 2:21 pm

    ఓ విభావరి ఓహో విభావరి
    నీహార తీర నీలాంబర ధారిణి మనో హారిణి ఓ విభావరి ఓహో విభావరి

    నీ చెంచల చేలాంచల నిభృత స్వప్న సీమలలో
    ఏలా భయ ఛాయ జాల మేలా సౌఖ్య రోచీర్నీల ఓ విభావరి ఓహో విభావరి

    సంతతశాంత తరంగిణి మదభరయువ కురంగిణి
    ఏలా అలస గమనమ్ము ఎలా నవవిలసనమ్ము ఓ విభావరి ఓహో విభావరి

    ధరణీ తల చంద్రశిలా ధరల మంటపమున నిలచి
    యుగములుగ పరీభ్రమింతు స్వగమ్యుడవ్ ఎవని వలచి ఓ విభావరి ఓహో విభావరి

    ఈ పాట ఇక్కడ వినొచ్చు!

    https://www.youtube.com/watch?v=ioc7VsUaTO0

    విష్ణుభొట్ల లక్ష్మన్న

  9. ( ర ) సాలూరు రాజే “స్వర ” రావు నివాళి గురించి కోట ప్రసాద్ అభిప్రాయం:

    07/27/2017 7:24 am

    వ్యాసం బాగుంది. చాలా వివరాలు కవర్ చేసారు. ధన్యవాదములు. మరొక మనవి. బాలాంత్రపు రజనికాంతారావు రచించిన గీతం ‘ఓ విభావరి ఒహో విభావరి’ సాలూరు వారు స్వరపరచి పాడారు’ ఈ గీతం lyric నాకు అందుబాటులో లేదు. మీ దగ్గర వుండే వుంటుంది వుంటె దయచేసి కనీసం నాకోరకు post చేయ్యండి.Please.

  10. అబద్ధం గురించి కోట ప్రసాద్ అభిప్రాయం:

    07/27/2017 6:06 am

    అధ్భుతము! ఒక Abstract Painting లా వుంది!