పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16469

  1. గణపతి: అంతు చిక్కని వింత దేవుడు-1 గురించి చక్రవర్తి అభిప్రాయం:

    09/03/2017 12:07 am

    అవును మీరు ప్రస్తావించిన వివరం ప్రకారం అక్కడ ఉదహరించిన .. ఇక్కడ మీరు ప్రస్తావింనంట్లు ఋగ్వేద సంహిత యొక్క ద్వితీయ మండలం లోని 23వ సూక్తములో శ్లోకం ప్రకారం అది ఆ సూక్తానికి అధిదేవత ఐన బృహస్పతి/బ్రహ్మణస్పతి ని ఉద్దేశ్యించి చేసినదే. అలాగున మిగిలిన ఉదాహరణలు కూడానూ .. అంతే కాకుండా, ఈ శ్లోకాన్ని కాంటెక్శ్చువల్ ( contextual ) పరంగా ఆలోచించుకుని, ఏ పరిస్థితిలో గణపతిని ఉదహరిస్తామో అది అక్కడ అన్వయించుకుంటే, విఘ్ననాయకుని పూజించేటప్పుడు ఆ లంబోదరుడే ఇక్కడ ప్రాధాన్యం అవుతారు.. అలాగే, వేదాన్ని అధ్యయనం చెసేటప్పుడు ఆదిగా, ఈ శ్లోకాన్ని పఠించడం కూడా ఓ ఆనవాయితి.. అందువల్ల, మీరు కించిత్ సాహసం చేసి, మీ శ్రీమతిని (మీకు తెలిసిన వివరాల ద్వారా) డామినేట్ చేసారేమో అని నా అభిప్రాయం.

  2. గణపతి: అంతు చిక్కని వింత దేవుడు-1 గురించి వురుపుటూరి శ్రీనివాస్ అభిప్రాయం:

    09/02/2017 10:07 pm

    @ ….చందురు వర్ణు ని …

    బాగా గుర్తుకుచేసారు. పొద్దున్నే ఆ పాట మనసులో, వంటింట్లో మా ఆవిడ గొంతులో పలుకుతూ ఉంటే హాయిగా ఉన్నది.

    త్యాగరాజవైభవం బ్లాగ్‌స్పాట్‌ నుంచి:

    1 – candara vadanuni – canduru varNuni. The hue of the Lord is blue-black. SrI tyAgarAja has, nowhere, mentioned the hue of the Lord is white i.e. the hue of moon. He uses the word ‘canduru bOlu mukhamu’ in the kRiti ‘ennaDu jUtunO’ – rAga kalAvati. Therefore, while ‘canduru’ may be correct, ‘varNuni’ seems to be incorrect.

  3. గణపతి: అంతు చిక్కని వింత దేవుడు-1 గురించి తః తః అభిప్రాయం:

    09/02/2017 1:26 pm

    ఆ మాట చదివి నాగమురళిగారు అడిగిన ప్రశ్న ఇది:

    “శశివర్ణం ఎలా కుదుర్తుంది విష్ణువుకి? నీలవర్ణం అనాలి.”

    (ఆ చర్చను ఇక్కడ పెట్టమని తనే సూచించారు.)
    .రచన : కాకర్ల త్యాగబ్రహ్మం
    రాగం : శ్రీ , తాళం : ఆది
    “ఎందరో …
    ….చందురు వర్ణు ని …
    నమస్కారాల తో
    తః తః

  4. గణపతి: అంతు చిక్కని వింత దేవుడు-1 గురించి తః తః అభిప్రాయం:

    09/02/2017 12:06 pm

    “నువ్వు స్వర్ణకమలం సినిమా చూశావు కదా? అందులో శ్రీలక్ష్మి వినాయకుని పటానికి హారతి పడుతూ- శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం అంటూ ఆంజనేయ దండకం చదువుతుంది గుర్తుందా? అది గుర్తుకు వచ్చి నవ్వుతున్నాను.”’

    రచన : కాకర్ల త్యాగబ్రహ్మం
    రాగం : కనకాంగి ,తాళం : ఆది

    శ్రీ గణ నాథం భజామ్యహం
    శ్రీకరం చింతితార్థ.ఫలదం (శ్రీ)
    శ్రీ గురు గుహాగ్రజం అగ్ర పూజ్యం
    శ్రీ కంఠాత్మజం శ్రిత సామ్రాజ్యం (శ్రీ)

    రంజిత నాటక రంగ తోషణం
    శింజిత వర మణి-మయ భూషణం
    1ఆంజనేయావతారం సుభాషణం
    కుంజర ముఖం త్యాగరాజ పోషణం (శ్రీ)
    నమస్కారాల తో
    తః తః

  5. బిల్హణీయము – గేయ(నృత్య)నాటిక గురించి Prof. Cherla B Sastry అభిప్రాయం:

    09/02/2017 10:57 am

    Kudos and congratulations to the author Dr Desikachary for writing this exceelent Dance Drama . Enjoyed it very much including the two songs beautifully rendered by Isai Vannar Ratna Cherla .

  6. గణపతి: అంతు చిక్కని వింత దేవుడు-1 గురించి nagamurali అభిప్రాయం:

    09/02/2017 8:17 am

    శశివర్ణం ఎలా కుదుర్తుంది విష్ణువుకి? నీలవర్ణం అనాలి కదా.

    అలాగే ఈ శ్లోకంలో కీలకం ‘విఘ్నోపశాంతయే’. విఘ్నాలు తొలగించడానికి ప్రత్యేకంగా చేస్తున్న ప్రార్థన. కాబట్టి కూడా ఇక్కడ దేవుడు గణేశుడనే చెప్పుకోవచ్చు కదా?

    అవును, సశేషం బోర్డు పెట్టడం చాలా అన్యాయం.

  7. బ్రేక‌ప్ గురించి Chandra Naga Srinivasa Rao Desu అభిప్రాయం:

    09/02/2017 7:23 am

    Heavy dialogues on ప్రేమ………. పెళ్లి…..

    Really permanent breakup…

  8. గుర్రాల మావయ్య గురించి Chandranaga Srinivasa Rao Desu అభిప్రాయం:

    09/02/2017 7:16 am

    “పెళ్లాలొస్తారు. వాళ్లని ఏమే ఏమే అని పిలవకండి. అరిష్టం”

    “ఆ నవ్వులో ఎంత ఆప్యాయత! దయాపేక్షలకు మాటలక్కర్లేదని అర్థమైంది.”

    Great Expressions. Liked the story.

  9. యుద్ధం గురించి Desu Chandra Naga Srinivasa Rao అభిప్రాయం:

    09/02/2017 7:07 am

    Very concise. defining the meaning of love. Crisp in narrative… liked it.

  10. గణపతి: అంతు చిక్కని వింత దేవుడు-1 గురించి వురుపుటూరి శ్రీనివాస్ అభిప్రాయం:

    09/02/2017 7:07 am

    (ఫేస్‍బుక్ వ్యాఖ్యని తిరిగి వ్రాస్తున్నాను – కొన్ని మార్పులతో.)

    ఒకటిన్నర పేజీలైనా వ్రాయలేదు అప్పుడే సశేషం బోర్డు పెట్టడం చాలా అన్యాయం.

    “చూశావా! ఈ స్తోత్రంలో శుక్లాంబరధరం విష్ణుం అంటే, తెల్లని బట్టలు ధరించిన విష్ణువును ధ్యానిస్తున్నాను– అంటూ స్పష్టంగా విష్ణువు గురించి చెప్పే శ్లోకమే అని తెలిసిపోతుంది.”… ఇలాగే అర్థాలు చెప్పుకుని సాధిస్తున్నప్పుడు – “పీతాంబరధరం విష్ణుం” అని ఎందుకు అనలేదు అని అనుమానం కలిగింది. ఈ శ్లోకంలోవిష్ణువుకి “సర్వవ్యాపి” అని అర్థం చెబుతారు కదా, సంప్రదాయం ప్రకారం? సామవేదం షణ్ముఖశర్మ తన విష్ణుసహస్రనామభాష్యంలో, “విష్ణువునకు అభిన్నుడైన గణపతి స్తుతి ఇది. “ప్రసన్నో కరటీముఖః” అని నిఘంటువు. ప్రసన్నశబ్దానికి ఏనుగుముఖాన్నే చెప్పారు శబ్దార్థవేత్తలు.” అని చెప్పారు. (ఆ మాటకి ప్రమాణాలు ఇవ్వలేదు, అయితే).

    ఆ మాట చదివి నాగమురళిగారు అడిగిన ప్రశ్న ఇది: “శశివర్ణం ఎలా కుదుర్తుంది విష్ణువుకి? నీలవర్ణం అనాలి.” (ఆ చర్చను ఇక్కడ పెట్టమని తనే సూచించారు.).