పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16469

  1. టోరాబోరా వంటమనిషి గురించి తఃతః అభిప్రాయం:

    12/12/2017 3:21 am

    ఎక్కడా కృతకం గా లేని అనువాదంతొ మంచి చిన్న కథ నందిచ్చిన మీకు అభినందనలు భాస్కర్! మీ కథ మరొక ముసలాయన కథని గుర్తుకు తెచ్చింది : ‘ ద ఇన్విజిబిల్ మాన్ ‘ ద పెంగ్విన్ బుక్ అఫ్ వెరీ షార్ట్ స్టొరీస్, Jake Allsop.
    నమస్కారాల తో
    తః తః

  2. టోరాబోరా వంటమనిషి గురించి GS Badrinath అభిప్రాయం:

    12/11/2017 10:43 am

    చాలనాళ్ళకి ఒక చక్కని చిక్కటి కథ చదివా.
    అవినేని భాస్కర్ గారికి కృతజ్ఞతలు.

  3. వో షామ్ కుచ్ అజీబ్ థీ… గురించి S A RAHMAN అభిప్రాయం:

    12/11/2017 10:35 am

    వో షామ్ కుఛ్ అజీబ్ థి – ఎ కవిత భి బహుత్ సె అజీబ్ హై. కవిత చాలా చాలా బాగుంది.
    ఎస్.ఎ.రహమాన్, చిత్తూరు.

  4. పర పరాగ్ ​- 1970​ గురించి S A RAHMAN అభిప్రాయం:

    12/11/2017 10:30 am

    గిలి గిలి గిలిగా కవిత ముద్ద మందారం లా ఉంది. చక్కని చిక్కని కవిత చాలా బాగుంది.

    ఏస్.ఎ.రహమాన్.చిత్తూరు.

  5. కూచిపూడి పదం–భుజంగరాయ శర్మ గురించి ముజఫర్ రహ్మాన్ అభిప్రాయం:

    12/09/2017 10:37 am

    ఈ మాటవారి సింబల్ “ఈ” అనేది కధ/కవితల్లో ఉన్న బొమ్మ మీద మౌస్ పెడితే పైకొచ్చి కనిపిస్తోంది (మెయిన్ పేజీలో మాత్రమే) .అయితే ఈ వ్యాసంలో పెట్టిన శర్మ గారి బొమ్మమీద అది ఒక సూదిని శర్మగారి కపాలం లోంచి పెదాల దాకా దిగినట్టు చూపించి అతి వికృతంగా ఉంది. ఆయన పోయాక రాసిన ఈ వ్యాసం లో బొమ్మ అలా కనిపించడం కడుపులో దేవినట్టుగా ఉంది; గమనించగలరు.

    ముజఫర్ రహ్మాన్
    ఖమ్మం

  6. టోరాబోరా వంటమనిషి గురించి Sujata అభిప్రాయం:

    12/09/2017 7:28 am

    What a simple narrative of the innocent old man. I loved this story.

  7. నాకు నచ్చిన పద్యం: చూపులు కలిసిన శుభవేళ గురించి లక్ష్మీదేవి అభిప్రాయం:

    12/09/2017 4:52 am

    ఔను. ఎన్నో!
    సీసపద్యమూ తేటగీతి పద్యాలూ అద్భుతానందాలే.

  8. ఉగాది కవిసమ్మేళనాలు గురించి సత్యసాయి విస్సా అభిప్రాయం:

    12/08/2017 11:44 am

    అలనాటి మేటి రతనాల మూట ఈమాట
    తేట తెలుగు తేనెల ఊట ఈమాట
    ఈ పూట నేనన్న ఈ మాట మామూలు మాట కాదు
    ఏనాటిదో ఆ తెలుగు బంధం నేటికీ ఇక ఏ నాటికీ వసివాడని
    ఈ మాటని మా కందించిన మహానుభావులకు హృదయపూర్వక అభినందనలు
    పరవశాన ఊగిన మా శిరసుల పాదాభివందనాలు
    అలాగే మిగిలిన ఉగాది, వివిధ సందర్భాల్లో ఉషశ్రీ, దాశరధి, తిరుమల, మల్లెమాల, సినారే వంటి నాటి మేటి గళాలు ముదిమి మీదపడినా నేటికీ తొణకని ఆచార్య మానాప్రగడ శేషసాయి గారివంటి మహానుభావుల కవితా సుధా రసధారలు అందించమని వినమ్ర విన్నపముతో
    భవదీయుడు
    సత్యసాయి విస్సా

  9. ఐదు కవితలు: కుందాపన – రవి వీరెల్లి గురించి ఆర్.దమయంతి. అభిప్రాయం:

    12/07/2017 2:13 pm

    మీ సమీక్షలో – మొత్తం పుస్తకం మెరుస్తూ కనిపించింది.
    కొని చదవాలన్నంత ఇష్టాన్ని పుట్టించింది.
    అభినందనలు.

    ఆర్.దమయంతి

  10. సడి లేని సంభాషణలు గురించి లలిత అభిప్రాయం:

    12/07/2017 2:54 am

    బాగుంది రేఖా. జ్ఞాపకాలదొంతరలని అలా తట్టిలేపుతోంది.