పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16469

  1. సమకాలీన తెలుగు సాహిత్య విమర్శ గురించి Vijay Koganti అభిప్రాయం:

    01/01/2018 12:20 pm

    “విమర్శకులు తమ అభిప్రాయం జనబాహుళ్యంలో అప్పటికే ప్రచారంలో ఉన్న అభిప్రాయానికి భిన్నమైనదైనా సరే, ప్రతిపాదించడానికి కూడా వెనుకాడకూడదు.” ఇలాటి సహేతుకమైన వ్యాఖ్యలు వివరణలు యీ వ్యాసానికి నిర్దుష్టతను యిస్తూ ఆద్యంతం ఆసక్తికరంగా మలిచాయి. ప్రస్తుత తరానికి ముఖ్యంగా యువ రచయితలకు సమీక్షకులకు చాలా వుపయోగకరంగా వుంది. ఇలాటి వ్యాసాలను చదవడం ఆకళింపు చేసుకోడం విమర్శకులమనుకునేవారికి చాలా ముఖ్యం. కొన్ని fallacies భ్రమలోపడి వందిమాగధుల పనిచేసేవారిటువంటి వ్యాసాలు చదవడం చాలా అవసరం. అభినందనలు.

    డా. విజయ్ కోగంటి

  2. సమకాలీన తెలుగు సాహిత్య విమర్శ గురించి అఫ్సర్ అభిప్రాయం:

    01/01/2018 9:36 am

    మానసా,

    ముందుగా అభినందనలు! యింత వివరంగా ఇటీవలి కాలంలో సాహిత్య విమర్శని పట్టించుకున్న వాళ్ళే లేరు. అయితే, కేవలం కవిత్వం పరిధిలో మాత్రమే విమర్శని పరిశీలించడం వల్ల ప్రయోజనం తక్కువ అని నా అభిప్రాయం. అత్యంత విలువైన సాహిత్య విమర్శ చర్చ అంతా వచన ప్రక్రియల్లో- ముఖ్యంగా కథల మీద- జరిగింది. మీ అభిరుచి పరిధిలో చేసిన కవిత్వ విమర్శ అనుశీలన ఇది. చివర్లో మీరిచ్చిన సూచనలు బాగున్నాయి. యిప్పుడు ఇలాంటి విమర్శ వ్యాసాలని ప్రోత్సహించే ఆసా, భరోసా వెబ్ పత్రికలే అనిపిస్తోంది నా మటుకు నాకు.

  3. సమయానికి… గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:

    01/01/2018 7:03 am

    ‘గజయీతరాలు’ కధల మా గొరుసన్న ( ప్రముఖ సీనియర్ రచయిత గొరుసు జగదీశ్వర రెడ్డి గారు ) రాసిన “వాన” కధను ( ముసురుకున్న వానలో ఓ గర్భిణీ స్రీని ప్రసూతిఆసుపత్రికి తీసుకెళ్లదానికి సాయం చేసిన కుర్రాడి కధను ) యాదికి దెచ్చుకుంటుంటే మీ యిద్దరికి నడుమ ఇంత అంతరం ఎలాసాధ్యం అని ప్రశ్నిస్తోంది నా మది నన్ను.

    గొరుసన్న గారి రాజీ! ఓ నిండుచూలాలు తల్లికి అవసరానికి పెరుగు తెచ్చివ్వలేనితనం మీలో ఉన్నట్లు నేను ఊహించలేను. ఆ దేవుడే దిగివచ్చి చెప్పినా నమ్మను.

  4. పరిచయం: ఇంటివైపు – అఫ్సర్ కవితల సంపుటి గురించి Sasikala అభిప్రాయం:

    01/01/2018 5:34 am

    నిజంగా ఆత్మగత ప్రయాణమే. లోనికి వెళితే తిరిగి ఇప్పటికి ఎప్పటికి రాగలమో. మిత్రమా లోనికి వెళ్ళేటప్పుడు అక్కడక్కడా కొన్ని గుర్తులు ఉంచుకొని వెళ్ళు. లేకుంటే అఫ్సర్ అక్షరలోకంలో తప్పిపోయి తిరుగుతూ ఉంటావు.

  5. రీప్లే గురించి Sasikala అభిప్రాయం:

    01/01/2018 5:13 am

    ఒక కథ నిజం. ఒకటి మిధ్య అని తెలుస్తుంది. కానీ కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంది. కానీ కథనం చాలా వేగంగా బాగుంది.

  6. పరిచయం: ఇంటివైపు – అఫ్సర్ కవితల సంపుటి గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:

    01/01/2018 3:05 am

    ప్రియమైన శ్రీ వాడ్రేవు చినవీరభద్రుడు గారు,

    ఒక ఆత్మగత ప్రపంచానికి ప్రతీకగా ఉన్న అఫ్సర్ గారి కవితల పుస్తకం “ఇంటివైపు”ను నవోదయ బుక్ హౌస్ కాచీగూడా వారు అందించారు కాని దాన్ని ఎలా ఆశ్వాదించాలో మీ యీ విశ్లేషణ వల్లే తెలుసుకున్నాను. (వాకిలి అంతర్జాల పత్రికలో స్వాతి కుమారి బండ్లమూడి గారు కూడా యీ పుస్తక పరిచయం చేసి సాయపడ్డారు). మీకు ధన్యవాదాలు.

    “కణకణ మండే ఉద్యమ రక్తకాసారాల్లోకి
    దేహాల్ని చితుకుల్లా విసిరేస్తున్న ప్రాణాలూ తెలుసు నాకు” అన్న అఫ్సర్ గారికి వొందనాలు.

  7. పలుకుబడి – కాలమానము II గురించి సంతోష్ కుమార్ అభిప్రాయం:

    01/01/2018 1:01 am

    మురళీధర్ రావు గారికి మీరు మే 14, 2013 లో ఇచ్చిన జవాబు అది. ధన్యవాదాలు.

  8. పలుకుబడి – కాలమానము II గురించి సంతోష్ కుమార్ అభిప్రాయం:

    01/01/2018 12:46 am

    సురేష్ గారికి, నమస్కారములు. మురళీధరరావు గారు: నాకు నిజంగా 1901 వివాదం గురించి తెలియదు. అయితే, నా ఊహ ప్రకారం అధికమాస నిర్ణయంలో సందిగ్ధతకు కారణాలు ఈ కింది వాటిలో ఏదైనా కావచ్చు.

    1. ఉత్తర భారతంలో పౌర్ణమి నుండి పౌర్ణమి ముందురోజు దాకా ఒక చాంద్రమాసంగా పరిగణిస్తే, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహరాష్ట్రా, గుజరాతులలో అమావాస్య తరువాత రోజు నుండి అమావాస్య వరకూ ఒక మాసంగా లెక్కిస్తారు. దీని వల్ల అధిక మాసం వేర్వేరు మాసాల్లో వస్తాయి. (అయితే, 1901 వివాదానికి ఇది కారణం కాకపోవచ్చు).

    2. అధికమాస నిర్ణయానికి సూర్య సంక్రమణ కాలం, చాంద్రమాస కాలం కచ్చితంగా నిర్ణయించాలి. చాంద్రమానం అని విన్నాను. మరి ఈ చాంద్రమాసం గురించి వివరింప ప్రార్థన. ధన్యవాదాలు.

  9. మంచి కవి, మంచి స్నేహితుడు గురించి తః తః అభిప్రాయం:

    12/31/2017 1:40 pm

    “నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు” లో ‘అందమైన’ అని తిలక్ అనిఉండకూడదనీ, అలా అనటం నన్ను చాలా బాధ పెట్టిందనీ ‘ఈమాట’ అభిప్రాయాలలో (ఎప్పుడో, ఎక్కడో గుర్తు రావటం లేదు) ఒక సారి రాసాను. మొన్న డిసెంబర్ 18 వ తేదీ ‘ఈనాడు’ అనుబంధం II వ పుటలో – అప్పుడు హైదరాబాదు లో జరుగుతున్న ‘ప్రపంచ తెలుగు మహసభల’ ప్రేరణతో – ఒక ఆడ పిల్ల – వేమూరి సుధా మాధురి, భీమవరం- రాసిన ‘అమ్మ ఒడంత వెచ్చదనం నా తెలుగు’ అంటూ మొదలైన ‘అమ్మ ఒడి’ అన్న ఒక కవిత వచ్చింది. అందులో చివరి చరణం:

    “తిలక్ చెప్పినట్లు మన తెలుగు అక్షరాలు
    నిజంగానే వెన్నెల్లో ఆడుకునే ఆడపిల్లలు”

    1968 నుంచీ నేను పడిన బాధ సుధా మాధురి కి తెలిసిందని ఊరట కలిగింది.

    2018 శుభాకాంక్షలతో,
    తః తః

  10. వో షామ్ కుచ్ అజీబ్ థీ… గురించి వీరభద్రం అభిప్రాయం:

    12/27/2017 12:15 pm

    <> ఇక్కడ శూన్య అంటే అర్ధం ఏమిటి?