పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16469

  1. మంచి కవి, మంచి స్నేహితుడు గురించి తః తః అభిప్రాయం:

    01/04/2018 11:30 pm

    లైలా యెర్నేని: నిజానికి “‘తిలక్ చెప్పినట్లు’ అంటూనే తిలక్ మాటల్లోని ‘అందమైన’ ని ఎందుకు తప్పించేశావు తల్లీ!” అని సుధామాధురిని అడగాలని నాకూ కుతూహలంగా ఉంది.

    ‘అందమైన’ అనటంలో కవి లౌల్యానికి గురి అయినట్టుగా అనిపించింది. ఆ మాటతో తిలక్ వంటి కవి – తనకు తెలీకుండానే – అ(క్షరాలు), అం(దమైన), ఆ(డుకునే), ఆ(డపిల్లలు) వంటి అక్షర రమ్యత, శ్రవణ రమణీయతల కోసం – అందమైన వాళ్ళు కానివారికి తన ప్రపంచంలో చోటు లేదని చెపుతున్నాడా! తన ‘ఆనంద పరమావధిని’ విస్మరించాడా! అన్న బాధ కలిగింది.

    నమస్కారాలతో
    తః తః

  2. సమకాలీన తెలుగు సాహిత్య విమర్శ గురించి దీప్తి పెండ్యాల అభిప్రాయం:

    01/04/2018 6:57 am

    విమర్శపై చక్కటి విశ్లేషణాత్మక విమర్శ, మానసా! ఒక రచనపై సాహితీ పరిణతి లేని విమర్శకుడి విశ్లేషణ -కేవలం తన పరిశీలనా పరిధి, ఒక పాఠకుడిగా తను పొందిన అనుభూతి పరిమితులలోనే చిక్కుకుపోతే, ఆయా విమర్శలు/విశ్లేషణలు సాహిత్యానికి ఏ రకమైన ప్రయోజనాన్ని అందించలేవు. ఇది నూటికి నూటొకపాళ్ళూ నిజం. ఎన్నో సున్నిత అంశాలు సోదాహరణంగా, అధ్యయనాత్మకంగా వివరించిన తీరు ప్రశంసనీయం.

    విశ్లేషిస్తూ చేసే ఒక వ్యాఖ్యయినా సరే, అది రచనకి సరైన న్యాయం చేసేదై ఉండాలన్న బాధ్యతాయుత తలంపు ఉన్న విమర్శకులు అరుదైపోతున్న ఈ సమయంలో మీరు చేసిన సూచనలు అత్యంత అవశ్యకమైనవి. సాధికారకంగా విమర్శ ప్రాముఖ్యతని తెలియచేసారు. అభినందనలు.

  3. రీప్లే గురించి Rishita అభిప్రాయం:

    01/04/2018 1:32 am

    Chaala bagundhi sir, it’s interesting to read actually. I liked the way you pen down.

  4. ఘటన గురించి దడాల వెంకటేశ్వరరావు అభిప్రాయం:

    01/03/2018 8:38 am

    రాత్రి తునకలు పరిగెడుతుంటే చీకటి ఎలా చిక్కబడుతుంది. భళ్ళున బ్రద్దలైనప్పుడు శబ్దం, తోసినప్పుడు చప్పుడు, చక్రాలకింద పడినప్పుడు నిశ్శబ్దం చోటుచేసుకుంటాయేమో కదా!

  5. ఉడుత గురించి దడాల వెంకటేశ్వరరావు అభిప్రాయం:

    01/02/2018 10:53 pm

    మీరు అక్షరాలను పదాలుగా పదాలను కవితలుగా అలవోకగా చిత్రీకరించగలరు

  6. హళ్ళికి సున్న గురించి దడాల వెంకటేశ్వరరావు అభిప్రాయం:

    01/02/2018 10:40 pm

    పనీపాటా లేని చంద్రుడు, మాడు మొహం చంద్రుడు, నిప్పుకళ్ళ సూర్యుడు పదాల ప్రయోగం అంత బాగోలేదు. రోజు గడిచిన తరువాత రాత్రి ఎలావస్తుందో తెలీలేదు.

  7. యజ్ఞం కథ: మరో పరిశీలన గురించి చంద్రశేఖర్ చీర్ల అభిప్రాయం:

    01/02/2018 9:32 am

    యజ్ఞం కథ మొట్టమొదట ప్రచురితమైనప్పుడు (యువ దీపావళి సంచికలో అనుకొంటాను) చదివిన వాళ్ళలో నేనొకన్ని. చదవగానే గొప్ప కథ అనిపించింది – ముగింపుతో నిమిత్తం లేకుండా. ఆ కథ ఇంకా చర్చిమ్పబడుతుండడమే ఆ గొప్పతనానికి నిదర్శనం.

    అవి నక్సలైట్ ఉద్యమం ఉద్ధృతంగా ఉన్న రోజులు – తెలుగు సాహిత్యంలో విరసం ప్రభావం కూడా ఎక్కువే ఉండింది. ఆ వాతావరణానికి తగినట్లుగా కథ ముగింపు SHOCK TREATMENT వలె ఉండడమే రచయితే ఉద్దేశ్యం కావచ్చు. ఇన్నేళ్ళ తర్వాత ఆ కథలో చారిత్రిక సత్యం ఉందా, లేక రాచకీయ ప్రభావమా అని చర్చిం చడం కన్నా, ఆ కథనంలో ఉన్న వైశిష్ట్యం – మొదటిసారిగా తెలుగు కథలో SURREALISTIC PERSPECTIVE – గమనించడం ఉచితమనుకొంటాను.

    జనవరి 02, 2017

  8. మంచి కవి, మంచి స్నేహితుడు గురించి lyla yerneni అభిప్రాయం:

    01/02/2018 8:47 am

    “నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు” లో ‘అందమైన’ అని తిలక్ అనిఉండకూడదనీ, అలా అనటం నన్ను చాలా బాధ పెట్టిందనీ…” 2018 శుభాకాంక్షలతో, తః తః”

    Happy New Year!

    ‘అందమైన’ అని ఎందుకు కవి అని ఉండకూడదు? వెన్నెలలో ఆడుకునే ఆడపిల్లలు అందరూ అందంగానే ఉంటారనా? అక్షరాలు ఆడపిల్లలే ఎందుకు కావాలి ? వెన్నెలలో ఆడుకునే పిల్లలు -అనవచ్చుగా. మగపిల్లలు ఆడపిల్లలూ కలిసి ఆడుతున్నా అందంగానే ఉంటుందిగా. నాకు మీ ఉద్దేశం తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది, తహ్.

    నారాయణరావు గాని, మరెవరైనా గాని వారి అభిప్రాయాలు తెలిపినా సరే.

    Also, ‘How to write a sentence and how to read one’ – a small book by Stanley Fish is so juicy. If you have not read it before, I am positive you will love this book.
    Thanks. – Lyla

  9. ఈమాటలో వ్యాఖ్యలపై ఒక పరిశీలన గురించి Vijay Koganti అభిప్రాయం:

    01/01/2018 9:15 pm

    బాగుంది. అయితే శీర్షిక ‘ ఈమాటలో కథలపై వచ్చిన వ్యాఖ్యలపై…’ అంటే మరింత సమంజసంగా వుండేదనిపించింది. అభినందనలు

  10. గురువు/పాఠం గురించి Vijay Koganti అభిప్రాయం:

    01/01/2018 9:12 pm

    ఎప్పటిలాగే భిన్నమైన కథనం గుండెను మెత్తగా తాకేలా మళ్ళీ మళ్ళీ చదవాలనిపించేలా… అభినందనలు!