పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16469

  1. బేతాళ కథలు: కథన కుతూహలం – 3 గురించి Anil అట్లూరి అభిప్రాయం:

    08/04/2018 12:16 am

    వ్యంగ్యం బాగుంది!

    ఒక చిన్న కథని పూర్తిగా చదవటానికి ఎక్కువమంది పాఠకులు మొగ్గు చూపుతున్నారు. దీంతో కథ నిడివి తగ్గటం, చదివించగలగటంలో ఇంతకుముందు లేనంతగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది గ్రహించే, కొన్ని అంతర్జాల పత్రికలు తప్ప; చాలా పత్రికలు తమకి పంపే కథలు ఇన్ని పేజీల కన్నా ఎక్కువ ఉండటానికి వీల్లేదు అంటున్నాయి.

    చిన్న కథని చదవటానికి పాఠకులు మొగ్గు చూపితున్నారు అన్నంత వరకు సరనుకుంటాను.

    అది ఒక్కటే కారణం కాదు. పత్రికలు ఏ ఒకటో రెండో మిసిమి, అమ్మనుడి లాంటివి మినహాఇస్తే పూర్తిగా వ్యాపారధోరణికి మారిపోయినవి. ఆర్ధికమైన లాభాలులేనిదే వాటి మనుగడ కష్టం. లాభాలే ముఖ్యం అనుకున్న పత్రికా యాజమాన్యాలు సాహిత్యానికి పెద్ద ప్రాముఖ్యత నివ్వటం లేదు. క్రమం తప్పకుండా సాహిత్యం కోసం కేటాయించిన పేజీలని కూడ “డ్రాప్” చేస్తున్న సందర్భాలు మనం చూస్తున్నాం.

    అంతే కాకుండా జీవన శైలి మారింది. దానితో పాటు పాఠకుల అభిరుచులు కూడా.

  2. పరీక్ష గురించి amarendra dasari అభిప్రాయం:

    08/03/2018 10:55 pm

    పెట్టని పరీక్షకు బలి అయిన జీవితం!! అవసాన దశలో ఆంతా అయోమయం…ప్చ్!

  3. ఒక సంస్కారవంతమైన కథ గురించి swatee sripada అభిప్రాయం:

    08/03/2018 5:52 pm

    నిజమే చాలా సార్లు చాలా మంది అడిగారు ఇది మీ కథా అని అన్ని కథలూ నావి ఎలా అవుతాయి?
    పైగా జాలి చూపులు. ఆ కథలో పాత్ర నేనే అన్నట్టు!
    బాగా రాసారు.

  4. పరీక్ష గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:

    08/03/2018 10:07 am

    అద్భుతంగా చెప్పారండి. కొన్ని అంతే – ఎంత వదుల్చుకుందామన్నా చితి దాకా వస్తాయి.

  5. రాగమాలిక గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:

    08/03/2018 9:57 am

    దేశం లో ఉన్నప్పుడు ఎక్కడికైనా ఒక్కడినే వెళ్ళడం అలవాటు. అప్పట్లో ఇలా తిరగడం, కొత్త జనాలని కల్సుకోవడం అదీ ఓ పెద్ద ఎడ్వంచర్. అలా డిల్లీ నుంచి మహాబలిపురం దాకా, కలకత్తా నుంచి బాంబే దాకా ఒకటే తిరుగుడు. అన్నింటికన్నా బాగా నచ్చినది ఇండియన్ రైల్వేస్. అందులో ఒక్కణ్ణీ (కొండోకచో రిజెర్వేషన్ లేకుండా) వెళ్ళడం అంత కిక్కు మరో దేనిలోనూ దొరకదు. ఒకసారి దాదాపు మూడు వందల కిలోమీటర్లు నించునే ప్రయాణం చేసాను. ఆఖరికి నా సూట్ కేస్ మీద కూర్చుందామన్నా ఖాళీ దొరకలేదు. అప్పట్లో అలా పండుగ రోజు వెళ్ళాల్సి వచ్చింది. మీ ప్రయాణం కూడా ఇటువంటి ఎడ్వంచర్ లు అద్భుతం గా ఉంటాయని నిరూపించాయి టూరేంద్ర గారు. 🙂

    దేశం వదిలాక , చదువు అయ్యి ఉద్యోగం చేస్తున్నప్పుడు నేను చదువుకున్న కాలేజీకి కుటుంబంతో – మా ఆచార్యులు గారు పదవీ విరమణ సందర్భంగా – వెళ్ళాను. మరో సారి నేను పనిచేసిన లేబ్, అక్కడ నన్ను ఏడిపించిన మనుషులూ, అవన్నీ మరో సారి గుర్తు చేసుకోవడానికి. అయితే ఏదీ కుదరనివ్వలేదు కూడా వచ్చిన అయ్యవారూ అమ్మవార్లూను. దాహం, కోలా కొంటావా, ఆకలి మెక్ డొనాల్డ్ కి వెళ్దామా అంటూ ప్రాణం తోడేసారు. చివరకి మా అచార్యులని రాత్రి భోజనానికి తీసుకెళ్తే అక్కడ ఆయననీ, వాళ్ళావిడనీ కూడా ఏడిపించుకు తిన్నారు సరిగ్గా తిండి తినకా మరోటీ అంటూ. అప్పుడు ఆయన నాకేసి జాలిగా చూసిన చూపు ఇప్పటికీ గుర్తు వచ్చి మనసులో ముల్లులా గుచ్చుకుంటూ ఉంది. బ్లెస్ హిజ్ హార్ట్ ఏమీ అనలేదు కానీ తర్వాత మెయిల్ పంపించారు ఆయనే – మరేం ఫర్వాలేదు అని.

    తెలిసివచ్చిన పాఠం/నిజం: ఇటువంటి ట్రిప్పులకి ఒక్కరూ వెళ్లడమే మంచిది. ఎవరైనా కూడా వస్తానంటే – అందులోనూ పిల్లలతో – వద్దు అని ఘాట్టిగా చెప్పకపోతే మొత్తం ట్రిప్పు అంతా నాశనం అవుతుంది.

  6. మళ్ళీ మందాక్రాంతము గురించి desikachary అభిప్రాయం:

    08/03/2018 9:06 am

    మందాక్రాంతావృత్తంలోని లయవిన్యాసలను విశ్లేషించే ఈయత్నం శ్లాఘావహమైనది. 150 పద్యాలున్నవి గనుక ఇవన్నీ ఏదో ఒక చిన్న సన్నివేశాన్నో సంఘటనో వర్ణిస్తూ అంతర్గతమైన వస్త్వైక్యత కలిగియుండినచో మఱింత బాగుండెడిది. ఇటువంటిది చెప్పడం సులభం గాని, ముఖ్యంగా పదేండ్లపాటు చెదురుముదురుగా వ్రాసిన పద్యాలలో, ఇటువంటి వస్త్వైక్యత సాధించుట కష్టమని నాకుఁ దెలుసు. ‘తాను నడవలేడు గాని, ఎదుటివానిని ఎవరెష్టు ఎక్కమంటున్నాడు’ అన్నట్లుగా నిది ఉందని కూడ నాకుఁ దెలుసు. భాషాభావాలలో క్వాచిత్కంగా అపరిపక్వతలు గోచరిస్తున్నవనుటలో సందేహం లేదు.

  7. పేరు గలవాడేను మనిషోయ్ గురించి amarendra dasari అభిప్రాయం:

    08/03/2018 12:50 am

    తెలుసుకోవాలి అనే గొప్ప కుతూహలంతో ఆడుగుతున్నాను : రనారే ఏవరూ ?! ఇంకా యేమేం రాసారూ…

  8. దక్షిణ భారతీయ భాషా శాస్త్రజ్ఞుడు: మర్రీ ఎమెనో గురించి amarendra dasari అభిప్రాయం:

    08/02/2018 11:01 pm

    feeling fortunate to read this interview.

    many thanks to madhav garu and also akella garu

  9. రాగమాలిక గురించి amarendra dasari అభిప్రాయం:

    08/02/2018 10:38 pm

    dear ఉష అనిల్ సురేశ్ , మీకు మూడు కోట్ల థాంకూలూ…మీ, టూరేంద్రుదు

  10. దక్షిణ భారతీయ భాషా శాస్త్రజ్ఞుడు: మర్రీ ఎమెనో గురించి సూర్యనారాయణ మూర్తి ఆకెళ్ళ అభిప్రాయం:

    08/02/2018 5:41 pm

    భారతీయ అస్తిత్వానికి శాంతియుత జీవనం అవసరం అని పరిశీలనలో ఎక్కడ వెల్లడయ్యిందో కనిపించలేదు