నాకు కూడా ఇందులోని కొన్ని కవితలు చాలా నచ్చాయి… “నిశబ్దం నీకూ నాకు మధ్య” ఐతే ఈమాటలో వచ్చినప్పటి నుండి ఇప్పటిదాకా బోలెడు సార్లు చదివా, చదువుతూనే ఉంటా…అలాగే, కొన్ని కవితలు చదువుతూ ఉంటే, ఎంత హాయిగా అనిపించిందో…అయితే, ఈ సంకలనం మరీ చిన్నది అనిపించింది నాకు….
“పొరపాటున రెండు ఈగలు గనక ఒకేసారి లోపలికొస్తే, అటునించి ఇటు, ఇటునించి అటూ స్వేచ్చగా ఎగరడానికి కూడా స్థలం చాలదు. ఎదురుబొదురు గోడలకి తలకాయలు కొట్టుకొని వాటంతట అవ్వే చస్తాయి. మన ప్రమేయం అనవసరం.”
– :)) Good one!
కథ బాగుంది. I enjoyed reading it.
ఈ వ్యాసంపై తమ అభిప్రాయాలు చెప్పిన వారందరికీ కృతజ్ఞతలు.
నేను “సాగరసంగమం” సినిమా పై సంధించిన ప్రశ్నకి సరైన సమాధానమే ఇచ్చారు. ఘంటసాల పాడిన “పుట్టబోయడి బుల్లి బుజ్జాయి కోసమై…” అన్న పద్యం కూడా హంసానంది (దగ్గరగా సోహిని) రాగానికి చెందిందే!
నేను సంగీతం శాస్త్రీయంగా నేర్చుకోలేదు అన్న విషయం మళ్ళీ మనవి చేసుకోక తప్పదు. సంగీతం కొత్తగా నేర్చుకొనే వారికై ఈమాట పాత సంచికల్లో కొన్ని పరిచయ వ్యాసాలున్నాయి. పాఠకులకి వచ్చే సందేహాలని అన్నీ ఈమాట అభిప్రాయ వేదిక ద్వారా తీర్చటం సాధ్యం కాదేమో! పైగా ఇది ఇతర పాఠక-శ్రోతలకి విసుగ్గా ఉండొచ్చు!
అందుకని నాతో ప్రత్యేకంగా అడిగి తెలుసుకొందామనుకున్న వారు నన్ను నా ఈమైల్ ద్వారా సంప్రదించండి. Lark_Vishnubhotla@yahoo.com
ఇప్పటికీ, ఎప్పటికీ అన్ని విషయాల్లోలాగే సంగీతంలో కూడా “సాధన” అతి ముఖ్యమైన విషయం. సంగీతంలో “దైవదత్తం” అంశం ఉండొచ్చు. కానీ, అది మన చేతుల్లో లేదుగా! అందుకే మన అధీనంలో ఉన్న “పరిశ్రమ” సంగీతంలో అతి ముఖ్యమైనది.
ఈమాట పాఠక-శ్రోతల కోసం వచ్చే సంచికల్లో మరికొన్ని వ్యాసాలు రాసే ప్రయత్నం చేస్తాను.
వేలూరి కథ చదివి ఉల్లసించిన వారు – మాలతి రాసిన కథ “నిజానికీ ఫెమినిజానికీ మధ్య” గాని చదివితే మళ్ళీ రంజిస్తారు. నాకు చాలా నచ్చింది. ప్రస్తుతం నెట్ లో ఉంది. మొదటగా 1987లో, ఆంధ్రప్రభ వార పత్రికలో వేశారట.ఆ కథ చదివి చాలా బాగుంది. శభాష్! అనుకున్నాక, మాలతి పుస్తకం –
“Telugu Women Writers 1950 -1975” -వెంటనే నా బుక్ షెల్ఫ్ నుండి బైటకు లాగాను.
వివరాలు కావాలంటే రచనలు చేసిన వారే సరిగ్గా చెపుతారు కదా.
కథని అర్థం చేసుకునే శక్తి నాకు లేదో ఏమో తెలియదు కానీ, — మొదటిసారి చదివితే నాకు ఈ కథ ఏమీ అర్థం కాలేదండీ. అర్థం కాలేదు కదా అని — రెండవసారి చదవడం ప్రారంభించాను. అలా మొదలుపెట్టగానే కథలోని మొదటి వాక్యం నన్ను వెక్కిరించినట్టు అనిపించి ఠక్కున ఆపేసాను. 🙁
నిద్రిత నగరం వైదేహి ప్రపంచం గురించి Sowmya అభిప్రాయం:
07/16/2009 2:50 am
నాకు కూడా ఇందులోని కొన్ని కవితలు చాలా నచ్చాయి… “నిశబ్దం నీకూ నాకు మధ్య” ఐతే ఈమాటలో వచ్చినప్పటి నుండి ఇప్పటిదాకా బోలెడు సార్లు చదివా, చదువుతూనే ఉంటా…అలాగే, కొన్ని కవితలు చదువుతూ ఉంటే, ఎంత హాయిగా అనిపించిందో…అయితే, ఈ సంకలనం మరీ చిన్నది అనిపించింది నాకు….
కొందరు స్నేహితులు… నాన్న… వొక అర్ధరాత్రి గురించి Sowmya అభిప్రాయం:
07/16/2009 2:48 am
“అనగలనా..దిగులు లేదు…అని
అలవాటు కాని చీకటిలో
నిలబడి. ”
-బాగుంది.
ఈ కానుకనివ్వలేను గురించి Sowmya అభిప్రాయం:
07/16/2009 2:45 am
కథనం చాలా నచ్చింది నాకు.
ఇంకా, అసలీ కాన్సెప్ట్ కూడా – ఆలోచింపజేసింది.
ఈ కథను నా స్నేహితూలకి కూడా చదవమని చెప్తున్నాను…
పడమట సంధ్యారాగం గురించి Sowmya అభిప్రాయం:
07/16/2009 2:36 am
“పొరపాటున రెండు ఈగలు గనక ఒకేసారి లోపలికొస్తే, అటునించి ఇటు, ఇటునించి అటూ స్వేచ్చగా ఎగరడానికి కూడా స్థలం చాలదు. ఎదురుబొదురు గోడలకి తలకాయలు కొట్టుకొని వాటంతట అవ్వే చస్తాయి. మన ప్రమేయం అనవసరం.”
– :)) Good one!
కథ బాగుంది. I enjoyed reading it.
పడమట సంధ్యారాగం గురించి మాలతి అభిప్రాయం:
07/15/2009 7:52 am
పైన నావ్యాఖ్యలో పొరపాటు. భగవంతునికోసం కథ రాసినవారు త్రిపురగారు. వివిన మూర్తిగారు కాదు. ఇద్దరు రచయితలకీ క్షమాపణలు. – మాలతి.
లైలా ఆ కథ 22 ఏళ్లక్రితం రాసేనని స్పష్టం చేసినందుకు ధన్యవాదాలు.
[కథ అసలు పేరు భగవంతం కోసం – సం.]
హాయిహాయిగా ఆమని సాగే గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:
07/15/2009 7:00 am
ఈ వ్యాసంపై తమ అభిప్రాయాలు చెప్పిన వారందరికీ కృతజ్ఞతలు.
నేను “సాగరసంగమం” సినిమా పై సంధించిన ప్రశ్నకి సరైన సమాధానమే ఇచ్చారు. ఘంటసాల పాడిన “పుట్టబోయడి బుల్లి బుజ్జాయి కోసమై…” అన్న పద్యం కూడా హంసానంది (దగ్గరగా సోహిని) రాగానికి చెందిందే!
నేను సంగీతం శాస్త్రీయంగా నేర్చుకోలేదు అన్న విషయం మళ్ళీ మనవి చేసుకోక తప్పదు. సంగీతం కొత్తగా నేర్చుకొనే వారికై ఈమాట పాత సంచికల్లో కొన్ని పరిచయ వ్యాసాలున్నాయి. పాఠకులకి వచ్చే సందేహాలని అన్నీ ఈమాట అభిప్రాయ వేదిక ద్వారా తీర్చటం సాధ్యం కాదేమో! పైగా ఇది ఇతర పాఠక-శ్రోతలకి విసుగ్గా ఉండొచ్చు!
అందుకని నాతో ప్రత్యేకంగా అడిగి తెలుసుకొందామనుకున్న వారు నన్ను నా ఈమైల్ ద్వారా సంప్రదించండి. Lark_Vishnubhotla@yahoo.com
ఇప్పటికీ, ఎప్పటికీ అన్ని విషయాల్లోలాగే సంగీతంలో కూడా “సాధన” అతి ముఖ్యమైన విషయం. సంగీతంలో “దైవదత్తం” అంశం ఉండొచ్చు. కానీ, అది మన చేతుల్లో లేదుగా! అందుకే మన అధీనంలో ఉన్న “పరిశ్రమ” సంగీతంలో అతి ముఖ్యమైనది.
ఈమాట పాఠక-శ్రోతల కోసం వచ్చే సంచికల్లో మరికొన్ని వ్యాసాలు రాసే ప్రయత్నం చేస్తాను.
అభినందనలతో,
విష్ణుభొట్ల లక్ష్మన్న
గోవిందా! గోవిందా! గురించి raji అభిప్రాయం:
07/15/2009 6:46 am
కథ చాలా బాగుంది, తిరుపతి అనుభవం అంతా కళ్ళకు కట్టినట్టు రాసారు. చాలా బాగుంది.
పడమట సంధ్యారాగం గురించి lyla yerneni అభిప్రాయం:
07/15/2009 6:12 am
ఒకరోజులో సాయంసంధ్య పగటినించి రాత్రివేపు నడిపించేది. సుందరానికి రెండుసంబంధాలలోనూ ఎదురయింది చీకటే. -మాలతి అభిప్రాయం
సుందరానికి “కుడి ఎడమల కుసుమ పరాగం” దొరకలేదంటారు. 🙂
వేలూరి కథ చదివి ఉల్లసించిన వారు – మాలతి రాసిన కథ “నిజానికీ ఫెమినిజానికీ మధ్య” గాని చదివితే మళ్ళీ రంజిస్తారు. నాకు చాలా నచ్చింది. ప్రస్తుతం నెట్ లో ఉంది. మొదటగా 1987లో, ఆంధ్రప్రభ వార పత్రికలో వేశారట.ఆ కథ చదివి చాలా బాగుంది. శభాష్! అనుకున్నాక, మాలతి పుస్తకం –
“Telugu Women Writers 1950 -1975” -వెంటనే నా బుక్ షెల్ఫ్ నుండి బైటకు లాగాను.
వివరాలు కావాలంటే రచనలు చేసిన వారే సరిగ్గా చెపుతారు కదా.
లైలా
ఈ కానుకనివ్వలేను గురించి రాఘవ అభిప్రాయం:
07/15/2009 5:20 am
కథ ఈ మధ్య బాగా వినవస్తున్న సమస్య గురించినది కావడం, సహాయం చేసే ఉద్దేశ్యం ఉన్నవాళ్లకి కూడా నొచ్చుకోలు ఉంటుందని చెప్పడం… బావుందండీ. అభినందనలు.
పడమట సంధ్యారాగం గురించి రాఘవ అభిప్రాయం:
07/15/2009 2:55 am
కథని అర్థం చేసుకునే శక్తి నాకు లేదో ఏమో తెలియదు కానీ, — మొదటిసారి చదివితే నాకు ఈ కథ ఏమీ అర్థం కాలేదండీ. అర్థం కాలేదు కదా అని — రెండవసారి చదవడం ప్రారంభించాను. అలా మొదలుపెట్టగానే కథలోని మొదటి వాక్యం నన్ను వెక్కిరించినట్టు అనిపించి ఠక్కున ఆపేసాను. 🙁
ఎవరైనా కాస్త ఉప్పందించి సహాయం చేయగలరని ఆశిస్తూ…