పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16485

  1. పలుకుబడి: సంఖ్యా పదాలు – 2 గురించి మోహన అభిప్రాయం:

    09/13/2011 3:44 pm

    శబ్దరత్నాకరములోని ఆరోపములో నూఁగు నూఁగు లేఁగొమ్మలు అనేదానికి కొన్ని యాకుల మీదను కాయల మీదను ఏర్పడియుండు చిన్న చిన్న ముండ్లు అని ఉన్నది, లేతదనము కాదు.
    విధేయుడు – మోహన

  2. పలుకుబడి: సంఖ్యా పదాలు – 2 గురించి rama bharadwaj అభిప్రాయం:

    09/13/2011 3:25 pm

    నూగు+ ఆరు = నూగారు అని మీరు ఒప్పుకోకపోడానికి గాని.. అలాగే నూన్ అన్న వ్యుత్పత్తిలోంచి నూగు అన్నదానిని సాధించదానికి ప్రయత్నించడం గాని కన్విన్సింగ్ గా అన్పించడం లేదు. నేను నునుపారు అని అన్నది నూగారుని మీరు ఆ పధ్ధతిలో అంటే “ఆరు” ని గ్రహించమని చెప్పడానికే !! నూగారు..నునుపారు లాగే అనుకుందికి మీకేమిటి ఇబ్బందీ?? నూగు+ ఆరు అని కాకుండా మీరు ఎందుకని మరోతోవ వెదుక్కుంటున్నారూ?? నూగు ..ఆరు రెండింటికీ అక్కడ స్పస్టమైన అర్ధమూ ఉంది. విభజనకి వీలూ ఉంది.

    రమ.

  3. పలుకుబడి: సంఖ్యా పదాలు – 2 గురించి సురేశ్ కొలిచాల అభిప్రాయం:

    09/13/2011 2:38 pm

    @రమగారు: నూఁగారు అన్న పదానికి ‘సన్న వెంట్రుకలు’ అన్న అర్థమే నేను కూడా చెబుతున్నానండి. అయితే, మోహన గారితో నేను విభేదించేది నూఁగు అన్న పదానికి ‘నున్నటి’ (smooth), ‘సన్నటి’ (minute) అన్న అర్థాలే గానీ,లేఁత అన్న అర్థం లేదు అన్న విషయంపై. ఇక నూఁగారు విషయంలో నేను ముందు అనుకున్న నూన్+కారు వీలుకాదని నూన్+గు+ఆరు కరక్టేనని ఒప్పుకుంటూ ‘ఆరు’కు వ్యుత్పత్తి ఏమై ఉంటుందా అని మోహనరావుగారిని అడిగాను (ఆయనకు తమిళ, కన్నడ భాషలలో విశేషమైన పరిజ్ఞానంతో పాటు ప్రత్యక్షంగా పరిచయం ఉంది కాబట్టి).

    నూఁగు అన్న పదం వ్యుత్పత్తి రీత్యా నున్-/నూన్- అన్న ధాతువుకు సంబంధించిందే అన్న విషయంలో నాకే సందేహాలు లేవు. నునుపచ్చి,నునుమేను,నునుసిగ్గు, నునులేత చెక్కిళ్ళు, నువ్వులు, నూలు అన్న పదాలన్నీ నున్-/నూన్- ధాతువుకు సంబంధించినవే.

    తెలుగులో నాలుగు, ఏనుగు, పిడుగు అన్న పదాలలో కనిపించే -గు ప్రత్యయం నూన్- ధాతువుతో కలసి నూంగు అయ్యింది అని సులభంగా వివరించవచ్చు.

    అయితే నిఘంటువుల అర్ధాలే వ్యవహారానికి ఎల్లవేళలా ప్రమాణం కావు అన్నది ముందు గుర్తుంచుకోవాల్సిన విషయం.

    Exactly. శబ్దరత్నాకరము నూఁగు అన్న పదానికి లేఁతదనము,లేఁత అన్న అర్థాలు ఇచ్చినంత మాత్రాన అది ప్రమాణంగా స్వీకరించాల్సిన అవసరం లేదు. నూఁగు అంటేనే లేత అయితే ‘నునులేత’ అన్న పదబంధానికి అర్థం ఏమిటి? ‘నూఁగునూఁగు లేఁగొమ్మలు’ లో తిక్కన ‘నూఁగునూఁగు’ అన్న తరువాత మళ్ళీ ‘లేఁ’ అని ఎందుకు వాడాడు?

    నునుపారు వివరించడం తేలికే కదా? నునుపారు = నునుపు + ఆరు (నిండిన) = very smooth (‘గంగ మట్టియ తోడ సాంగత్య మెడలిన నునుపారు ముని మిట్టనుదురు వోలె’ అని క్రీడాభిరామములో ప్రయోగము)

  4. పలుకుబడి: సంఖ్యా పదాలు – 2 గురించి rama bharadwaj అభిప్రాయం:

    09/13/2011 12:21 pm

    కొలిచాల సురేష్ పదాల వ్యుత్పత్తిని గురిచి అలొచించడం మాట్లాడడం బాగుంది.
    అయితే నిఘంటువుల అర్ధాలే వ్యవహారానికి ఎల్లవేళలా ప్రమాణం కావు అన్నది ముందు గుర్తుంచుకోవాల్సిన విషయం. “నూగు” అన్న శబ్దం .. వ్యవహారం బట్టి చూస్తే.. అది మోహన గారన్నట్టే… సన్న వెట్రుకలన్న అర్ధం లోనే వాడకం ఉంది. దాన్ని వృక్ష పరంగా చూసినా “..చెరుకు నూగు” .”.కొమ్మకి ఉన్న నూగు”..లేదా” నూనూగు మీసాలు …ఇవన్నే మనకి ఇస్తున్న అర్ధమ్ ఆ సన్నని మెత్తని స్పర్శ తో కూడినదే !! మీసాలు అన్నప్పుడు వెంట్రుకలనీని..కొమ్మ దగ్గర చెట్టు బెరడు లేదా కొమ్మ బెరడు మీద ఉన్న ఆ సన్నని పదార్ధం అనీని. అంతే కానీ తిక్కన ప్రయోగం ఏకోశానా “నునుపైన” అన్న అర్ధాన్ని ఇవ్వడం లేదు. ఆయన ఉద్దేశించింది సైతం ఇవాళ్టికీ వ్యవహారంలో ఉన్న అర్ధమే !! పైగా ” నూగు” అంటేనే కొమ్మపైన ఉన్న చేతికి తగిలే నూగు. అంతే గానీ “నునుపు” అన్న కిట్టింపుకి వీలేలేదు. నూగారు లాగే నునుపారు కూడా ఉంది. ”నూగు” అన్న పదానికీ..”ఆరు” అన్న పదానికీ కూడా “రోమావళి” అన్న అర్ధాన్ని నిఘంటువులు ఇచ్చాయి. గనక ” నూగారు” అన్న పదపు వ్యుత్పత్తిలోగానీ..అర్ధ వివరణ లో గానీ సంశయానికి ..సందేహానికీ చోటు లేదు.

    నూన్ +కారు= నూగారు అయితే……….. మరి నునుపారు ??

    రమ.

  5. వేటూరి పాట గురించి సురేశ్ కొలిచాల అభిప్రాయం:

    09/13/2011 10:24 am

    శ్రీనివాస్ గారు: Many thanks! ప్రతిరోజు ఒక్కసారైనా మోనియర్ విలియమ్స్ నిఘంటువు చూసే నేను, ‘స్వరస’ గురించి ఎందుకు వెతకలేదో నాకే తెలియదు. స్వ- అన్న ఉపసర్గను ఆత్మార్థబోధకంగానే (reflexive) కాక, సహజమైన, స్వయంసిద్ధమైన అన్న అర్థాలలో వాడుతారని ఇప్పుడే తెలుసుకున్నాను. స్వరస అన్న పదానికి natural flavor అన్న అర్థంతోపాటు మీరు వివరించిన అర్థచ్ఛాయలు కూడా ఉన్నాయి. ‘స్వారస్యం’ అన్న పదం ‘సారస్యం’ నుండి వచ్చినట్టు వివరించిన బ్రౌణ్యం కంటే మీ వివరణే బాగుంది. చాలా కృతజ్ఞతలు.

  6. శ్రీ సోది సుబ్బయ్య గారి సొంత గోడు గురించి బులుసు సుబ్రహ్మణ్యం అభిప్రాయం:

    09/13/2011 3:48 am

    సుజాత గార్కి,
    మీ వ్యాఖ్యలకి ధన్యవాదాలు.

  7. రచయితలకు సూచనలు గురించి raavi rangarao అభిప్రాయం:

    09/13/2011 12:24 am

    సంపాదకులకు నమస్కారం…
    మీ ప్రయత్నం అద్భుతం…అభినందనలు

  8. వేటూరి పాట గురించి Srinivas Vuruputuri అభిప్రాయం:

    09/13/2011 12:11 am

    వేటూరి లేకపోయినా ఆన్ లైన్ నిఘంటువులున్నాయి కదా, 🙂

    స్వరసం కరెక్టే! స్వరసం అనే మాటకి ఉన్న వివిధార్థచ్ఛాయలలో ఒకటి: proper taste or sentiment in composition; మరొకటి: agreeable or pleasant to one’s taste , congenial (చూ. మోనియర్ విలియంస్)

    “స్వారస్యం” అనే మాట స్వరసం నుంచి వచ్చింది. ఆ మాటకి తీయదనం అని అర్థం. ఔచిత్యం, ప్రయోజనం అనే అర్థాలలో కూడా వాడతారనుకుంటాను. “స్వారస్యం మా చమత్కారంగా తీశావ్!” అంటాడు రామప్ప పంతులు, కన్యాశుల్కంలో.

  9. పలుకుబడి: సంఖ్యా పదాలు – 2 గురించి సురేశ్ కొలిచాల అభిప్రాయం:

    09/12/2011 6:04 pm

    మోహన గారు: మీరన్నది నిజమే కావచ్చు. కానీ, ఆరు అన్న శబ్దానికి నాకు ఇతర ద్రావిడ భాషలలో “వెంట్రుక” అన్న అర్థంలో పదాలు కనిపించ లేదు.

    అదీగాక, *నున్/*నూన్- అన్న ధాతువుతో smooth, minute అన్న అర్థంతో ఎన్నో పదాలు ఉన్నాయి. నునుపు (దూరపు కొండలు నునుపు), నున్నగా (తల నున్నగా దువ్వుకుని) మొ॥. మిగిలిన భాషలలో ఈ ధాతువుకు సంబంధించిన పదాలను ద్రావిడ వ్యుత్పత్తి నిఘంటువు [DEDR 3700] లో చూడవచ్చు. ఈ ధాతువు ఆధారంగా నూఁగు శబ్దానికి లేఁత అన్న అర్థం కంటే నునుపైన, చిన్నదైన అన్న అర్థాలు సబబని నాకనిపిస్తుంది. తిక్కన “నూఁగునూఁగు లేఁగొమ్మలు” అన్నాడు. అంటే నునుపైన లేతకొమ్మలా కాదంటారా? “నునులేత కొమ్మలు” అన్న వాడుక కూడా ఉంది కదా!

    ఇక ఆరు శబ్దానికి “వెంట్రుక” పదంలో అర్థాలు వేరే భాషల్లో లేవు కానీ, కురుళ్, కురులు, కూదల్, కూంతల్ అన్న పదాలున్నాయి. కురులు శబ్దం నుండి ఆరు నిష్పన్నం చేయడం అంత సులభం కాదు కాబట్టి, నూఁగారు అన్న పదానికి వ్యుత్పత్తి అంత సులభంగా వివరించలేమేమో.

  10. పలుకుబడి: సంఖ్యా పదాలు – 2 గురించి మోహన అభిప్రాయం:

    09/12/2011 2:54 pm

    నూఁగు అంటే లేఁత (నూనూఁగు మీసాల నూత్న యౌవనమున రచియించితి మరుత్తరాట్చరిత్ర). నూఁగు + ఆరు = నూఁగారు. కొందరు దీనిని ముద్దుటుంగురములా నూఁగుటారు అని కూడ అంటారు. ఈ నూఁగుటారు నూఁగు శబ్దముతో తప్ప మరే శబ్దముతో వస్తుంది? నూఁగారు అంటే అప్పుడే యౌవనదశలో అంకురించిన రోమావళి అని అర్థము. విధేయుడు – మోహన