పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16481

  1. మారిన కాలం మారిన మనుషులు గురించి k.t.devi అభిప్రాయం:

    02/22/2012 10:31 pm

    మధ్యతరగతి జీవితాల గురించి హృదయానికి హత్తుకుపొయే విధంగా వ్రాశారు.బంగారం కుదువ పెట్టకుండా, అప్పు చేయకుండా చదివించలేని రోజులువి.ఇంత మంచి అనువాదకథ అందించిన మీకు ధన్యవాదాలు.

  2. మూడు వందల రామాయణాలు గురించి Srinivas Vuruputuri అభిప్రాయం:

    02/21/2012 10:40 am

    తః తః గారి వ్యాఖ్య పూర్తిగా అర్థం కాలేదు నాకు. నాకు అర్థమయినంత మేరకు –

    B.A. స్థాయికి ఈ పాఠం సమంజసమో కాదో నాకు తెలీదు కానీ, ఇది చరిత్ర పాఠమేనా అని నాకు అనుమానం. అందుకే “ఈ వ్యాసం చరిత్ర విద్యార్థుల కన్నా సాహిత్య విద్యార్థులకు ఎక్కువ ఉపయుక్తమవుతుందేమో…” అని రాసాను.

    “ఈ వ్యాసాన్ని పాఠ్యాంశంగా ఉంచాలని తీసుకున్న నిర్ణయం వెనకాల కూడా నాన్-అకడమిక్ ప్రోద్బలాలలున్నాయని” నాకు అనిపించింది. అదలా ఉంచితే, “అసహిష్ణు రాజకీయాలు” అన్న మాటను politics of intolerance అనే మాటకు అనువాదంగా వాడినట్లున్నాను. నేను చదివిన కొన్ని వ్యాసాల ఆధారంగా నేను ఏర్పరచుకున్న అభిప్రాయం అది. ఆ అసహిష్ణుత మరే ఇతర రాజకీయాలకో ప్రతిక్రియాత్మకం కావచ్చు కానీ అది వీధుల్లో ప్రదర్శనగా వ్యక్తమై, విశ్వవిద్యాలయాల నిర్ణయాలను ప్రభావితం చేయటం జరిగిందని, అది తప్పని అనుకున్నాను. కాదంటారా?

  3. మూడు వందల రామాయణాలు గురించి Phaneendra అభిప్రాయం:

    02/21/2012 4:41 am

    సురేష్ గారూ… మళ్ళీ ఇబ్బంది పెట్టేస్తున్నారు. బుద్ధుడూ, వ్యాసుడూ వాల్మీకి కంటే పూర్వీకులని అంటారు. ఇంక చెప్పగలిగేదేముంది? మాట్లాడగలిగేదేముంది? బౌద్ధ వాజ్ఞ్మయంలో సీతా రాములు అన్నా చెల్లెళ్ళా! బాగు బాగు. అన్నా చెల్లెళ్ళ మధ్య వివాహాలను ఇస్లాం అంగీకరిస్తుంది కాబట్టి వాల్మీకి మహమ్మద్ ప్రవక్త కంటె తరువాతి వాడు అన్నదే తరువాయా? హతోస్మి.

    ఫణీంద్ర పురాణపండ

  4. మూడు వందల రామాయణాలు గురించి సురేశ్ కొలిచాల అభిప్రాయం:

    02/20/2012 1:03 pm

    ఫణీంద్ర పురాణపండ గారు,

    వ్యాసాన్ని క్షుణ్ణంగా చదివి ఓపిగ్గా మీ అభిప్రాయాలను వివరించినందుకు కృతజ్ఞతలు. రామాయణ కథ వాల్మీకి కన్నా ముందే మౌఖికంగా ప్రచారంలో ఉండేదని చెప్పడానికి ఆధారాలు ఉన్నాయి. అంతేకాక, వాల్మీకి కన్నా పూర్వమని చరిత్రకారులు ఒప్పుకునే “దశరథ జాతక” అన్న కథ బౌద్ధ వాఙ్మయంలో కనిపిస్తుంది. ఈ కథలో రాముడు, సీత అన్నా చెల్లెళ్ళు. ఇందులో తండ్రి గారి ఆజ్ఞమేరకు రాజ్యాన్ని త్యజిస్తాడు కానీ హిమాలయాలకు వెళ్తాడు. అలాగే మహాభారతంలో కనిపించే రామోపాఖ్యానం వాల్మీకి రామాయణం కన్నా ప్రాచీనమని కొంతమంది పండితుల అభిప్రాయం.

    అయితే, మీరు చెప్పినట్టుగానే రామాయణాల చరిత్రలో వాల్మీకిరామాయణ ప్రభావాన్ని, ప్రాధాన్యతను విస్మరించలేమని నేను కూడా ఇండో-యూరేసియన్ రీసర్చ్ అనే చర్చావేదికలో వాదించాను . ఈ అంశం గురించే ఎప్పుడైనా వీలు చిక్కినప్పుడు వివరంగా ఒక వ్యాసం రాయాలని నా ఆశ.

    Bas-relief గురించి మీరు చెప్పింది నిజమే. ఈ పదానికి బ్రౌణ్యం “ఉబుకు పని” అని అనువాదం చేసింది. మన పాత గ్రంథాలలో ఈ రకమైన కళాకృతులను సూచించడానికి ఏ పదం వాడి ఉంటారో ఎవరికైనా తెలుసా?

  5. పలుకుబడి: మానవ బంధుత్వ పదాలు గురించి Sadroopananda swami అభిప్రాయం:

    02/20/2012 10:34 am

    చాల చక్కగ వివరించారు. సంతొషం.

  6. మూడు వందల రామాయణాలు గురించి తఃతః అభిప్రాయం:

    02/20/2012 10:10 am

    ” His 1991 essay “Three Hundred Ramayanas: Five Examples and Three Thoughts on Translations” courted controversy over its inclusion in B.A., History syllabus of Delhi University ” వికీ పీడీయా నుంచి .

    ఏ స్థాయి విద్యార్థులకు ఈ పాఠాన్ని తీసివేయటం సమంజస మనుకున్నారు? నిజంగా ఈ పాఠం చరిత్రగా B.A. స్థాయిలో చెప్పుకోటం సమంజసమేనా? అసలు ఈ పాఠాన్ని BA లో చరిత్ర పాఠంగా పెట్టిన వాళ్ళ ఉద్దేశ్యాలు ఏమి అయి ఉంటాయి? అన్నవి ఆలోచించకుండా – ఇలాంటి పాఠాలు ఒక నాన్ క్రెడిట్ అధ్యయనంగా MA చదివే పిల్లలకు ఉంచ వచ్చు నేమో – “ఈ వ్యాసాన్ని పాఠ్యాంశాలలోంచి తొలగించాలని పట్టు పట్టడం ఖచ్చితంగా తప్పే,అసహిష్ణు రాజకీయాల కారణంగా జరిగినదే.” (Srinivas Vuruputuri అభిప్రాయం) అన్న నిర్ణయానికి రావచ్చా?

    “On the face of it, the controversy centres on a 1991, 18-page essay by A K Ramanujan, a historian of outstanding scholarship ….” [పాణిని శంఖవరం ఇచ్చిన టైమ్స్ ఆఫ్ ఇండియా లంకె నుంచి] – రామానుజన్ ని చరిత్రకారుడుగా తీసుకోవచ్చా?

    ఆలోచించగలరు.
    తఃతః

  7. నన్ను ఎవరో చదివారు గురించి jyothiprasad అభిప్రాయం:

    02/20/2012 8:10 am

    చాలా అద్బుతంగా మరియు చదువుకునే రోజులల తీపిగుర్తుగా అనిపించింది. జాన్ గారు. సింప్లీ సుపర్బ్.

  8. కొత్త ఏడాదికి కొత్త తీర్మానాలు గురించి sudarsana kumar అభిప్రాయం:

    02/20/2012 5:07 am

    నమస్తే.

    ‘ఊర్మిళాదేవి నిద్ర’ గురించి వ్రాసిన ముందుమాటలు చాలా బాగున్నాయి. ఇంత ప్రాచీనమైన / మరుగున పడి పోతున్న సాహిత్యాన్ని వెలుగులోనికి తెచ్చిన ప్రతి ఒక్కరికీ మనః పూర్వక అభినందనలు.

  9. ఉరి: కధ నచ్చిన కారణం గురించి Phaneendra అభిప్రాయం:

    02/20/2012 5:02 am

    విశ్వనాథ లోని వైవిధ్యాన్ని ఉరి కథ ఒక రకంగా చూపి విస్మయం కలిగిస్తే… స్వలింగ సంపర్కుల అనుబంధం అంశంగా రాసిన మరో చిన్న కథ విభ్రాంతి కలిగిస్తుంది, “గే రిలేషన్” పై ఆయన 50,60ల్లోనే కథ రాయడం గమనార్హం. నాటక రంగం నేపథ్య0లో ఇద్దరు మగవాళ్ళ మధ్య సంబంధాన్ని సజెస్టివ్‌గా చూపే ఆ కథ రాసినది ఏ చలమో కాక విశ్వనాథ కావడం ఆశ్చర్యకరం. అందులో కూడా ఆయన ఎక్కడా స్వలింగ సంపర్కం తప్పనో ఒప్పనో ఎలాంటి తీర్పులూ ఇవ్వడు. ఆ కథ “విశ్వనాథ చిన్న కథలు”లో చూడవచ్చు అనుకుంటా.

    ఫణీంద్ర పురాణపండ

  10. కిరానా సంప్రదాయపు భీమబలుడు గురించి Rohiniprasad అభిప్రాయం:

    02/20/2012 12:10 am

    సంధ్యారాగ అనే కన్నడం సినిమాలో రాజ్‌కుమార్‌కు భీమ్సేన్ జోషీ పాడిన పాటలు ఇక్కడ వినవచ్చు. పురందరదాసు కీర్తన ఈ పరియ అనేది హంసానంది రాగం. రెండోది దేసీకాని ఆభేరికాని కావచ్చు. మూడోది కల్యాణి.

    మధ్యలో బాలమురళి పాడినది కూడా ఉంది. సందర్భం ఏమిటో మోహనగారు వివరిస్తే బావుంటుంది.