పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16481

  1. ఖమాజ్/ ఖమాచ్/ కమాస్ రాగం గురించి తఃతః అభిప్రాయం:

    02/26/2012 11:55 am

    తమిళులకు సంబంధించినంతవరకూ కరునాడు అంటే ఆంద్ర దేశం. అందుకనే దాక్షిణాత్య సంగీతానికి కరునాడు సంగీతమని తమిళులే పెట్టారేమో. అది సంస్కృతీకరింపబడి – నక్కబొక్కలపాడు జంబూక రంధ్ర అగ్రహారమైనట్టుగా, (దొంగరాముడు, డీ.వీ. నరస రాజు, వంగర వెంకట సుబ్బయ్య) – కర్ణాటక సంగీతమన్న పేరుపొంది మళ్ళీ నిరుక్తాలను వెతుక్కుందేమో.

    ఈ ఉటంకింపు చూడండి: “… ఆనాడు తెలుగులూ- తమిళులూ – చాల సన్నిహితంగా బ్రతికినారు.ఆంధ్రదేశాన్ని వారు “కరునాడు” అనేవారు. తెలుగును “వడక్కు” అని పిలవటం వాడుక. ఆ సందర్భంలో మూలం ఇలా వుంది.

    ‘మజలై తిరుమొజియిల్ చిలవడకుం,చిలతమి జుం
    కురిత్తరు,కరునాటియర్!క్కటై తిరమిన్’

    దీని అనువాదం:
    మురిపించుతూ కొన్ని ముద్దు తెలుగు పదాలు
    అరవమ్ముతో కలిపి అచటచట తడబడుచు
    చిరుతీపి పలుకులు చెవులు విందులు చేయ
    కరునాడు యువతులు గడియ తీయండి … ”

    ఈ ఆసక్తికరమైన – కనీసం నాకు – విషయం మొన్న ఖర మాఘ బహుళ విదియ గురువారం [ఫిబ్రవరి 09, 20112] ఆరుద్ర అనువాద కావ్యం ‘వెన్నెల -వేసవి’ [2009, విశాలాంధ్ర ప్రచురణాలయం, హైదరాబాద్ ] కొని
    రెండు గంటల క్రితం పుట్టపర్తి నారాయణాచార్యులు గారి తొలిపలుకు ‘ముదావహం’ చదవటంతో తెలిసింది. పైన ఉటంకించింది పుటలు 15,16 ల నుంచి.

    ఇంక నేను దీనికి గడియ వేసేస్తాను.
    తఃతః

  2. రవీంద్రధనుస్సు గురించి హెచ్చార్కె అభిప్రాయం:

    02/26/2012 9:01 am

    Just for practice, I stopped reading the essay after the English version of Guruji, made my own attempt to Telugize it, and then continued reading the five Telugu versions. Felt my rendering was not too out of mark. So, sharing it here. Think it is alright:

    ఎక్కడ మనస్సు నిర్భయమై శిరస్సు నిటారుగా నిలబడుతుందో
    ఎక్కడ జ్ఞానం స్వేచ్ఛగా వర్తిస్తుందో
    ఎక్కడ ప్రపంచం
    ఇరుకు గోడల మధ్యన ముక్కలు ముక్కలయిపోకుండా ఉంటుందో
    ఎక్కడ మాటలు సత్యం లోతుల లోంచి పుడతాయో
    ఎక్కడ నిర్విరామ కృషి పరిపూర్ణత వైపు చేతులు చాస్తుందో
    ఎక్కడ హేతువు అనే శుభ్రమైన సెలయేరు దారి తప్పి
    మూర్ఖపు అలవాట్ల ఎడారి ఇసుక లోనికి ప్రవహించదో
    ఎక్కడ మస్తిష్కాన్ని
    నవనవోన్మేషమైన యోచన, ఆచరణల వైపు నువ్వు నడిపిస్తావో
    ఆ స్వేచ్ఛా స్వర్గం దిశగా, తండ్రీ, నా దేశం మేల్కొననీ

    Oh, Already several people did the same as I did. Some of them are really better. But let me too stay here.
    Thanks to Kolichala Suresh for directing me here.

  3. రాగలహరి: మోహనం గురించి Siddineni Bhavanarayana అభిప్రాయం:

    02/26/2012 6:15 am

    లక్ష్మన్న గారూ – I, being illiterate in music, exclusively rely on my musically imtimated amateur friends for technical tit bits. I have been made to endorse that జ్యోతి కలశ… (భాభీ కీ చుడియా) was based on Hindusthani Bhimpalasi. Could there be any justification to harbor such doubt? Could you please throw some more light?

  4. రాగలహరి: మోహనం గురించి Siddineni Bhavanarayana అభిప్రాయం:

    02/26/2012 5:52 am

    వినిపించని రాగాలే కనిపించని… (ఆరాధన)….ఇది చదువుకున్న అమ్మాయిలు లోని
    పాట కాదూ?

  5. సినిమా పాటల్లో హాస్యం గురించి Siddineni Bhavanarayana అభిప్రాయం:

    02/26/2012 5:42 am

    “హాస్య పాట…” ఈ పద బంధం చాలా వికారంగా వుందండీ!

  6. ఖమాజ్/ ఖమాచ్/ కమాస్ రాగం గురించి Brahmanandam Gorti అభిప్రాయం:

    02/26/2012 12:51 am

    జయప్రభ గారితో నేనూ ఏకీభవిస్తాను. అన్నమయ్యా, శ్రీపాదరాయలూ ఒకే కాలం వారు అనుకుంటాను. అన్నమయ్య కాలం 1424-1503 వరకూ అయితే, శ్రీపాదరాయల కాలం మాత్రం సందేహాస్పదం. కొందరు 1412 అనీ, మరికొందరు 1424 అనీ అంటారు. ఇదమిత్థంగా తెలీదు. ఇద్దరూ సమకాలీనులయ్యే అవకాశం మాత్రం ఎక్కువగానే వుంది. ఇద్దరి కథల్లోనూ సాళువ నరసింహరాయల ప్రస్తావన వుంది కాబాట్టి ఒకే కాలం వారని చెప్పగలం. సంగీతంలో ఎవరి ప్రేరణ మరొకరి వుందో పరిశోధనాంశంగా అనుకోవాలి. పురందరదాసు గొప్ప సంగీతకారుడే కానీ అన్నమయ్య స్థాయీ, స్థానమూ వేరు.

    రామామాత్యుడి “స్వరమేళ కళానిధి”లో కానీ, వేంకటమఖి “చతుర్దండి ప్రకాశిక”లో కానీ కర్నాటక లేదా కర్ణాటక పదం కనిపించదు. అన్నమయ్య కీర్తనల్లో వెతకాలి. రామామాత్యుడు సుమారు 1550లో స్వరమేళ కళానిధి రాసాడు. వేంకటమఖి రచన 1660 కాలం నాటిది. వీటి దృష్ట్యా, కర్ణాటక లేదా కర్నాటక సంగీతం అన్నది ఆ తరువాత వాడుకలోకి వచ్చిందే అయ్యుండాలి. దౌర్భాగ్యం ఏవిటంటే సంగీతంలో తెలుగువారి కృషి గురించి తెలుగువారికే పట్టదు. కాబట్టి సంగీతాన్ని పట్టించుకునే వారు చెప్పిందే నిజంగా చెలామణీ అయ్యే అవకాశాలు ఎక్కువ. త్యాగరాజుని త్యాగరాజన్ అని కొందరు చెప్పుకుంటే, నిజమే ననుకునే తెలుగువారూ వున్నా ఆశ్చర్యపోనవసరం లేదు.

  7. ఖమాజ్/ ఖమాచ్/ కమాస్ రాగం గురించి Rohiniprasad అభిప్రాయం:

    02/25/2012 11:32 pm

    తఃతః గారు అక్షరాల గురించి పరిశీలిస్తున్నారు కనక సురేశ్ అని రాయడానికి సురేష్ అని రాయకుండా ఉండాలి.

  8. ఖమాజ్/ ఖమాచ్/ కమాస్ రాగం గురించి Rohiniprasad అభిప్రాయం:

    02/24/2012 10:26 pm

    తెలుగు ఇంటిపేర్లలోకూడా కర్నాటి అనేది ఉంది కనక, అది ఒక ప్రాంతానికి సంబంధించినది కనక సురేశ్‌గారు చెప్పినదానికి సరిపోతుంది. నా పాత వ్యాసాల్లో నేను కర్ణాటక అనే రాసి, ఇలాంటి చర్చ కొంత జరిగాక మార్చాను.

  9. ఖమాజ్/ ఖమాచ్/ కమాస్ రాగం గురించి తఃతః అభిప్రాయం:

    02/24/2012 4:01 pm

    మోహన గారూ – ఈ “ణ” కారం చాలా సంస్కృ త పదాల్లొ నకారానికి ముందు “ర” కారం జల్లటం వల్ల వస్తుందన్న పరిశీలన ఉందన్న విషయం మీకు తెలిసే ఉంటుంది ఉదా: సీతాయన, రామాయణ అన్న మాటల్లొ సీత, రామ శబ్దాల తర్వాత ఉన్న( ఒకే ) శ బ్దం లొ వచ్చిన మార్పుకు కారణం రామ శబ్దంలో ఉన్న ర కారమని.

    రోహిణీ ప్రసాద్ గారూ – మోహన గారు చెప్పింది నేనన్న దానికి వివరణ అని అనుకోమంటారా? మరొక సారి దయతో రెండూ చదివి చూడండి.

    సురేష్ గారూ – ప్రాంతానికి సంబంధించి వాడుకలో ఉన్న కర్ణాటక అన్న పదమూ, ప్రస్తుతం బహుళ వ్యాప్తిలొ ఉన్న సంగీత పరమైన కర్ణాటక అన్న పదమూ ఒకటే అయినా ప్రాంత సంబంధిగా కర్నాటక శబ్దం ద్వారా ఒక నల్లని/ఎత్తైన ప్రాంతం సూచింపబడటం సమంజసంగా నే ఉంది గానీ మీరు, సంగీతానికి చెప్పిన నిరుక్తాన్ని [కర్ణ అట -‘క’ ని వదిలేసి – చెవుల సంచరించునది కర్ణాట సంగీతము, ఈ అర్ధాన్ని తీసుకోవాలని బాలమురళి పదే పదే చెబుతూ ఉంటారు] – ప్రాంత సంబందిగా , ఎందుకో తెలియదు, చూపించి వింత నిరుక్తము అని అన్నారు “… ద్రావిడ భాషావ్యుత్పత్తి రీత్యా Karnataka అన్న నామవాచకాన్ని కర్నాటక అని రాయడమే సబబు.” అన్నది చాలా సబబుగా ఉన్నది కానీ సంస్కృత శబ్దాల సంధి రూపంగా వాడుతున్నప్పుడు కర్ణాటక అనే అనాలేమో ?

  10. ఖమాజ్/ ఖమాచ్/ కమాస్ రాగం గురించి jayaprabha అభిప్రాయం:

    02/24/2012 3:44 pm

    “కర్ణాటక యుధ్ధాలు” జరిగింది కర్నాటకలో కాదు తమిళనాడులో అని చెప్పిన మోహన గారు కర్నాటక సంగీతానికి “ఆద్యులైన” వారి పేర్లు చెప్పి వారంతా ఇప్పటి కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారేనని చెప్పడం తాను ముందు చెప్పిన సరిహద్దులని కుంచించినట్లయింది. ఇప్పటి కర్ణాటకం వేరు అప్పుడు కర్ణాటకంగా పరిగణించింది వేరు అని కదా ఆయన ముందు చెప్పదలుచుకున్నదీ?

    ఇకపోతే “కర్ణాటక సంగీతానికి ఆద్యులు” అన్నది శ్రీపాదరాయల తొనే మొదలైనట్టూ ..అటుతరవాత వ్యాసరాయలు ఆయన శిష్యులైన పురందరులూ.. కనకదాసాదులూ వీరి చుట్టు అల్లుకున్నట్టు ..ఇవాళ మోహన గారు మాట్లాడటం వింతగా వినిపించే విషయం. ఆ మాట గానీ లేదా ఆ భావన గానీ అన్నమయ్య గారిని గురించి తెలియనప్పుడు పాతకాలంలో అనుకున్న సంగతులు. కాలం రీత్యా శ్రీ పాద రాయలు సైతం అన్నమయ్యగారి కన్నా వయసులో చిన్నవాడు. అన్ని రాగాలలో విస్తరించిన అన్నమయ్య వేలాది సంకీర్తనలు మోహన గారు పేర్కొన్న కన్నడ వాగ్గేయకారుల పేర్లు అన్నిటి కన్నా కూడా సంగీతమ్లో ముందటివి, కాలంరీత్యా !! గనక కర్ణాటక సంగీతానికి “ఆద్యుడు” అన్నమాటని ఇవాళ పురందర దాసు విషయంలో ఇదివరకటి లాగా సులువుగా అనడానికి వీలులేదు. సంగీత శాస్త్రానికి సంబంధించి తెలుగువారు చేసిన కృషి విజయనగర యుగంలో ముఖ్యమైనది. రాజమండ్రి ప్రాంతానికి చెందిన సోమనాధుని “రాగవిబోధ” ని గానీ.. తెలుగువాడైన రామామాత్యుని తాతగారైన కల్లినాధుని గ్రంధం లేదా రామామాత్యుని ప్రముఖ సంగీత గ్రంధం స్వరమేళ కళానిధిని గానీ ఇవాళ విస్మరించి మాట్లాడటం కుదరదే? ఒక్క ‘పిళ్ళారి గీతాల’ ఆధారం గానే పురంధరదాసునికి “కర్ణాటక సంగీత పితామహ” అన్న బిరుదినివ్వడం ఆయన పట్ల కన్నడిగులకి ఉన్న ప్రేమని చూపించుకోవడం కోసమే అయితే కావొచ్చు గానీ, సంగీత చరిత్ర రీత్యా మాత్రం అది నిజం కాదు.

    పురందరదాసు అన్నమయ్య కొడుకుకో, మనుమనికో సమకాలికుడు. ఆనాడు అన్నమయ్య పదాలు బాగానే ప్రచారంలో ఉన్నట్టున్నాయి. అన్నమయ్యగారి పదం “నారాయణ తే నమో నమో” అన్నది పురందరుల పదంగా పాడే ఆనవాయితీ మనకి కన్నడిగులలో ఇటీవల దాకా కనిపించగా ఈ మధ్యనే వారు దాన్ని అన్నమయ్య పదంగా గుర్తించి అన్నమయ్య పేర పాడటాన్ని మొదలు పెడుతున్నారు. పదం చివరలో ఉండే ముద్ర అన్నమయ్య పదాన్ని చివరికి అలా రక్షించిందన్నమాట. చరిత్ర తెలియక ముందు చెలామణీలో ఉన్న భావాలని చరిత్రలో కొత్త సంగతులు బయట పడినప్పుడైనా మార్చుకోవడం పరిశోధనలో ముఖ్యం అవుతుంది కద!! మోహన గారీ విషయాన్ని గమనించగలరని భావిస్తాను. కర్ణాటక సంగీత పితామహుడు అన్నమయ్యే కావాలి గానీ ఆయనకన్నా అరవై ఏళ్లకి పిమ్మట ఉన్న పురందర దాసుల వారు కాదు మరి.

    జయప్రభ.