పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16440

  1. నాకు నచ్చిన పద్యం: మనుచరిత్రలో సాయంకాల వర్ణన గురించి మధు అభిప్రాయం:

    12/25/2024 4:08 am

    అయ్యా నాదొక అజ్ఞానపు సందేహం హిమాలాయాల్లో ఎండమావులు మృగతృష్ణలు ఎలా వచ్చాయి కవి ఉద్దేశం ఏమిటి? 🙏

  2. భారతీయతను ఎలా నిర్వచించాలి? గురించి తమ్మినేని యదుకులభూషణ్ అభిప్రాయం:

    12/24/2024 9:53 am

    భారతీయ బ్రాహ్మణ విజ్ఞానం చివరికి వినాశనానికి మూలమా?

    భారతీయ విజ్ఞానం అంటే చాలు ప్రతి వాక్యంలో బ్రాహ్మణ శబ్దాన్ని జొప్పించడం అనవసరం. ఆర్యభట బ్రాహ్మణుడు కాదు, దళితుడు. బ్రహ్మగుప్తుడు కూడా బ్రాహ్మణుడు కాదు, వైశ్యుడు. పాశ్చాత్యులు యూక్లిడ్‍ను ఏ రకంగా తెల్లవాడిగా చూపిస్తారో – అదే విధంగా మనవారు ఆర్యభటని తెలిసో తెలియకో ఆర్యభట్టగా రాసి – విషయాన్ని తారుమారు చేస్తారు. మరిన్ని వివరాలకు చూ: Aryabhata dalit, his philosophy of ganita, and its contemporary applications. C. K. Raju. (చంద్ర కాంత రాజు ప్రపంచ ప్రసిద్ధి గాంచిన గణిత వేత్త, గణిత శాస్త్ర చరిత్రను కూలంకషంగా ఎరిగిన వారు.)

    ఇప్పటి కులతత్వపు కళ్ళద్దాలతో గతాన్ని చూడరాదు. ఈ వ్యాసం కూడా వలసవాద సామ్రాజ్యవాద ప్రతిధ్వనే తప్ప మరొకటి కాదు. అంతేకాదు, వ్యాసం ఆమూలాగ్రం స్పష్టత కొరవడింది. కలిపికొట్టు కావేటి గంగ తరహాలో తయారైంది. భారతీయతను ఎలా నిర్వచించాలి అన్న శీర్షికన వేరొక వ్యాసం రాయవచ్చు, సమీక్షను అడ్డం పెట్టుకొని అర్థం లేని కుల మత రాజకీయాలను ఈడ్చుకురావడం మంచి పద్ధతి కాదు. శ్రద్ధ చూపవలసింది ఆకరాలను సరైన రీతిలో ఇవ్వడంలో. భాస్కరుని వాక్యాలు ఉట్టంకించారు, మూలంలో ఏ శ్లోకం అది, దాని తాత్పర్యం సరి చూసుకున్నారా? భాస్కరుడు సూటిగా అనంత ప్రస్తావన తీసుకువచ్చాడా? భాస్కరుడు దాన్ని ‘ఖహరం’ అని వ్యవహరిస్తాడు. ‘అయమనంతో రాశిః ఖహర ఇత్యుచ్యతే (“ఈ యనంత రాశికి ఖహరమని పేరు.”)

    అస్మిన్ వికారః ఖహరే న రాశా
    వపి ప్రవిష్టే ష్వపి నిస్సృతేషు
    బహుష్వపి స్యా ల్లయ సృష్టికాలేఽ
    నంతేఽచ్యుతే భూత గణేషు యద్వత్

    ఏ ప్రకారముగా సృష్టి నిర్మాణకాలమందెన్ని భూతములు పుట్టినను ప్రళయ కాలమందెన్ని భూతములు లయించినను అనంతుడును, అచ్యుతుడును అగు పరమేశ్వరుని యందు వికారము పుట్టదో యట్లు ఈయనంత రాశియందెన్ని సంఖ్యలు కలిపినను, ఇందుండి యెన్ని సంఖ్యలు తీసివేసినను దీనికి మార్పు కల్గదు.’ (ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం, కొమఱ్ఱాజు వారి సంపాదకత్వం.)

    తన వలన అనేక భూతజాతము సృష్టి కాలమున సృజింపబడినను, లయకాలమందు తనయందు లీనమైనను, ఆత్మ పదార్థము మార్పు చెందనట్లు ఈ ఖహర రాశియు ఇతర సంఖ్యలను కలిపినను తీసివేసినను మార్పు చెందదు’ (పిడపర్తి వారి భావానువాదం).

    ఇక సమీక్షకుల ఉట్టంకింపు పరిశీలిద్దాం:

    ‘ఏ సంఖ్యనైననూ శూన్యముతో గుణించిన శూన్యము అగును. శూన్యమును ఏ సంఖ్యతో భాగించిననూ శూన్యము వచ్చును. కానీ ఏ సంఖ్యనైననూ శూన్యముతో భాగించినచో వచ్చునది అనంతము. అనంతము నుండీ ఏదయినా పరిమిత సంఖ్యను తీసివేసిననూ కలిపిననూ దాని విలువ మారదు. ఈ అనంతము అద్వితీయమగు పరబ్రహ్మ వంటిది. బ్రహ్మ కూడా భూతసృష్టి వల్ల కానీ లయము వల్ల కానీ మారడు’ అంటాడు భాస్కరాచార్య. పూర్ణమదః పూర్ణమిదం అనే ఉపనిషత్ శ్లోకసారం కూడా ఇదే.’

    పై ఉట్టంకింపులో మొదటి భాగం:

    “ఏ సంఖ్యనైననూ శూన్యముతో గుణించిన శూన్యము అగును. శూన్యమును ఏ సంఖ్యతో భాగించిననూ శూన్యము వచ్చును. కానీ ఏ సంఖ్యనైననూ శూన్యముతో భాగించినచో వచ్చునది అనంతము.”

    ఖగుణః ఖః (ఏ సంఖ్యనైననూ శూన్యముతో గుణించిన శూన్యము అగును), ‘శూన్యమును ఏ సంఖ్యతో భాగించిననూ శూన్యము వచ్చును’ అన్న దానికి శూన్య పరికర్మాష్టకంలో చూపడానికి ఆధారం లేదు. కానీ ‘ఏ సంఖ్యనైననూ శూన్యముతో భాగించినచో వచ్చునది అనంతము’ (ఖభాజితో రాశిః ఖహరస్యాత్) అన్నది తప్పుడు భావానువాదం.

    1/0 = ∞ అని ఆధునికులు వ్యవహరించినా, భాస్కరుడు మతి పోగొట్టే స్పష్టత చూపుతాడు ఇక్కడ. ‘ఖభాజితో రాశిః ఖహరస్యాత్’ (శూన్య పరికర్మలు – 4వ ప్రకరణం – లీలావతి గణితం (1936) పిడపర్తి వారి అనువాదం); సున్నతో భాగించబడినది అనగా సున్న హారముగా గలది (ఖహరం – A fraction with cipher as its denominator ( Coolebrook, Henry T (1893, Calcutta). Zero Denominator అన్న ఊహే ఆశ్చర్యం గొలుపుతుంది. వీటి స్వారస్యాన్ని గ్రహించడానికి ఇంచుక గణిత రసజ్ఞత కావాలి, శ్రీవారికి సంచలనం కలిగించే రాజకీయాల మీద శ్రద్ధ లావు కావున, ఎన్నో దూడలను వదిలేయడం జరిగింది.

    ‘అనంతము నుండీ ఏదయినా పరిమిత సంఖ్యను తీసివేసిననూ కలిపిననూ దాని విలువ మారదు'(ఈ వాక్యం కూడా మూలార్ధాన్ని సరిగా తెలపడం లేదు. భాస్కరుని గొడవ ఖహరంతో.)

    ‘ఈ అనంతము అద్వితీయమగు పరబ్రహ్మ వంటిది. బ్రహ్మ కూడా భూతసృష్టి వల్ల కానీ లయము వల్ల కానీ మారడు’ (ఇక్కడ కాళిదాసు కవిత్వం కొంత ఆ పై తన పైత్యం కొంత – మూలంలో ఉన్నది ఏమిటి -అచ్యుతం అనంతం – బ్రహ్మ ఎవరి సృష్టి? బ్రహ్మకు స్వయం అస్తిత్వం ఉన్నదా? పై అనువాదాలతో పోల్చి చూడండి.)

    ఇంతటితో నా ఆసక్తి పూర్తిగా చచ్చి పోయింది – పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్పూర్ణముదచ్యతే అన్న కప్పదాటు, అక్కడ చెబుతున్న దేమిటి? బోడిగుండుకు మోకాలికి ముడి వేయడమంటే ఇదే. తర్వాత ధర్మ తత్వజ్ఞుని స్వరంతో: “ఉపనిషత్ పూర్ణమా? బౌద్ధ శూన్యమా? ఏది జీరోకి మూలం? ఏది గణితంలో అనంతానికి ఆధారం?”

    భగవంతుడా అని గోచీ సర్దుకొని లేచి పోవలసిన పరిస్థితి! ఇంత దూరం వచ్చిన పాఠకులు ఎవరైనా ఉంటే పుస్తకసారం నాలుగు మాటల్లో ముక్తాయించి బయట పడతాను.

    The Golden Road: How Ancient India Transformed the World అన్న పుస్తకంలో, ప్రాచీన కాలంలో భారతదేశం (250 BC – 1200 AD) యావత్ ప్రపంచాన్ని – తన వైజ్ఞానిక ప్రగతి, సాంస్కృతిక ఘనత, వాణిజ్య సరళితో ఎలా మార్చివేసిందో ఒక అంచనా వేసే ప్రయత్నం చేశాడు భారత దేశంలో స్థిరపడ్డ బ్రిటిష్ చరిత్రకారుడు William Dalrymple. ఇదివరకూ వచ్చిన విలియమ్ డాల్రింపుల్ చారిత్రక గ్రంథాలను చదివిన ఎవరికైనా తెలిసివచ్చేది ఏమంటే, ఈతని పుస్తకాల్లో విషయచర్చ ఎంతో విపులంగా ఉంటుంది.ఒక ధ్యేయంతో విషయసేకరణ చేసి, ఒక పద్ధతికి లోబడి గ్రంథరచన చేస్తాడు కావున ఇష్టంగా చదువుతాము. ఐరోపాకు గ్రీసు ఎలాగో మొత్తం ఆసియా ఖండానికి భారతదేశం ఆలాగు అని ఈ చరిత్రకారుని ఉవాచ. కానీ, జ్ఞానప్రదాయినిగా గ్రీసు గురించి ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ తెలుసు. విజ్ఞానశాస్త్రాలకు కాణాచి ఐన భారతదేశం గురించి పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాల్లో సైన్సు బోధించే ఆచార్యులకే సరిగా తెలియదు. కావున, విజ్ఞాన రంగంలో భారతదేశం ప్రాశస్త్యాన్ని ఉగ్గడిస్తూ ఈ పుస్తకరచనకు పూనుకున్నాడు. దీన్ని కూడా చైనాకు ధీటుగా భారతదేశాన్ని పోటీగా నిలబెట్టే అగ్రరాజ్యాల ప్రయత్నంలో భాగమే అని పాకిస్తాన్ పత్రికా రచయితలు కొందరు చెవులు కొరుక్కున్నారు.

    ఇటీవల పరిశోధనల్లో తేలినదేమిటంటే – అసలు సిల్క్ రోడ్ [జర్మన్‍లో Seidenstrasse అంటారు – కారణం ఆ కూట సృష్టి వారిదే (1877)] అన్నదే లేదు. మంగోల్ దండయాత్రలకు (13వ శతాబ్దం) మునుపు చైనా – పాశ్చాత్య దేశాల మధ్య ప్రత్యక్ష వర్తక వాణిజ్య సంబంధాలు లేవు. చైనా ఉత్పత్తులు – ఇండియా ద్వారానే రోమ్ వెళ్ళేవి. ఇండియా రోమ్‍ల మధ్య సముద్ర వర్తకం చాలా ప్రాచీనమైనది అని చెప్పడానికి అన్ని రకాల ఆధారాలు ఉన్నాయి. ఐనా కూడా, ఘనతరమైన మన భారతదేశం కథ ఎవరికీ తెలియదు. ఇదీ ఈ పుస్తక నేపథ్యం. పుస్తకంలో బౌద్ధం ఏ రకంగా చైనా, మంగోలియా, జపాన్ కొరియా తదితర దేశాలకు పాకిందో, ఏ విధంగా హిందూ ధర్మం ఆగ్నేయాసియా మొత్తం వ్యాపించిందో అనేకాధారాలతో మనముందుకు తీసుకువస్తాడు డాల్రింపుల్. తర్వాత, భారతీయ గణిత ఖగోళ విజ్ఞానం ఎల్లలు దాటి అరబ్బువర్తకుల ద్వారా ఐరోపాకు పాకి చివరికి యావత్ ప్రపంచాన్ని ఎలా ప్రభావితం చేసిందో తెలుపుతాడు.

    ఈ పుస్తకాన్ని లోతుగా సమీక్షించాలి అంటే History of Science మరీ ముఖ్యంగా History of Mathematics బాగా చదువుకుని ఉండాలి. మరీ ముఖ్యంగా – దశాంశమాన పధ్ధతి, శూన్య భావపరిణామం, అనంత భావనతో దానికి గల సంబంధం; కనీసం ఆర్యభట, బ్రహ్మగుప్త, భాస్కరాచార్యుల రచనలు మూలంలోనో, అనువాదంలో చదివి అర్థం చేసుకోగల ఓపిక, ఆసక్తి -వెరసి ఆధునిక గణిత శాస్త్ర పద్ధతుల్లో కనీస ప్రవేశం, అప్పుడు గాని ఈ గ్రంథ నేపథ్యం అర్థం కాదు.

    8వ శతాబ్దానికే బ్రహ్మగుప్తుని రచనలు అరబ్బీలోకి వెళ్లాయి. తర్వాత అరబ్బులు వైద్య, గణిత శాస్త్ర గ్రంధాలను సంస్కృతం నుండి విరివిగా తర్జుమా చేసుకున్నారు. క్రమేణా భారతీయ విజ్ఞానం అరబ్బు వర్తకుల ద్వారా ఇటలీ, స్పెయిన్ చేరుకుని ఐరోపా పునరుజ్జీవనానికి (Renaissance) దోహదపడిన వైనం రేఖామాత్రంగా నైనా తెలియాలి. ఎడారి మతాల, కొత్త మతాల గొడవలు, పరిమితులు, భారత దర్శనాల ప్రత్యేకత తెలిస్తే సమీక్షకుని పని మరింత సులువవుతుంది. సమీక్షకునికి ఇవేవీ తెలియనప్పుడు ఉపరితల స్పర్శజేసే సమీక్షతో ‘మమ’ అని బయట పడాలి. అలవాటు లేని ఔపోసనం జేస్తే మీసాలు తెగ కాలినవి తరహాలో ఉన్నది సమీక్ష వ్యవహారం. సమీక్ష చేయవలసిన విషయమే ఘనమైనది అయినప్పుడు, అది తనకు సరిగా తెలియనప్పుడు – తా దూర కంత లేదు మెడకో డోలు అన్నట్టు -హిందుత్వ, ముస్లింలు, నవ బౌద్ధులు, మూల వాసులు, మార్క్సు అని నానా చెత్తను తలకెత్తుకున్నారు. అసలు ఈ పుస్తక సమీక్షకు, వ్యాస శీర్షికకు ఏమైనా సంబంధం ఉన్నదా? నిజంగా భారతీయతను నిర్వచించవలసిన సందర్భం ఇదేనా? సమీక్షకుడు పుస్తకపరిధికి లోబడి సాము చేసి ఉంటే సమీక్ష ప్రయోజనం నెరవేరేది. వ్రతం చెడింది, ఫలం దక్కలేదు అని చెప్పక తప్పదు.

    ఇంకొక విషయం రచయిత తరచూ మాతృభాషకాని ఆంగ్లంలో ఆలోచించి తెలుగులో రాస్తున్నట్టు తోస్తుంది- ఆ ప్రక్రియలో నుడికారం పూర్ణానుస్వారం కావడంతో వ్యాసరచనలో అనవసరంగా అయోమయం చోటు చేసుకొంటోంది.

    “చరిత్ర అంటే గతం కాదు, పూర్తిగా వర్తమానం. వర్తమానం గతంతో చేసే సంభాషణ కూడా కాదు చరిత్ర. వర్తమానం గతంపై చేసే వ్యాఖ్యానమే చరిత్ర.”

    ఇదేదో వచనకవిత్వంలో గందరగోళానికి పేరెన్నిక గన్న సీనియర్ కవి శివారెడ్డి వచనంలా ఉంది. ‘అర్థం కాలేదు’ అంటే, ‘మహార్థమును నిక్షేపించితిని’ అని బుకాయించడం కవులకు జన్మహక్కు. కనీసం, వ్యాసరచయితలైనా స్పష్టతకు కట్టుబడాలి కదా. పై పేరాకు ఆంగ్ల తర్జుమా:

    “History is not the past, but the present in its entirety. History is not even the conversation of the present with the past. History is the present’s commentary on the past.”

    వాక్యనిర్మాణం ఆంగ్లానికి దగ్గరగా ఉంది కాబట్టి, ఆంగ్లంలో చదివితే సులభంగా అర్థమవుతోంది. కానీ, తెలుగులో ‘దాగుడుమూత దండాకోర్’ స్థాయికి దిగజారి పాఠకుడిని దారితప్పిస్తోంది. కావున, ఈ సమీక్ష – రచయిత మాటల్లో చెప్పాలి అంటే ‘వలసవాద సామ్రాజ్యవాద ప్రతిధ్వనుల్లో’ భాగమే.

  3. నల్ల గాలి గురించి రాణి శివ శంకర శర్మ అభిప్రాయం:

    12/20/2024 5:02 pm

    ప్రత్యేకమైన కథ. తరుముకువచ్చే కథ.

  4. భారతీయతను ఎలా నిర్వచించాలి? గురించి Gujjula Dattathreya అభిప్రాయం:

    12/17/2024 11:10 am

    మీ ప్రాబ్లమ్‌ ఏంటంటే… మీరింకా బ్రాహ్మిణిజం నీడ నుంచి బయట పడలేదు. నలంద లేదా తక్షశిల వంటి విశ్వ విద్యాలయాలలో (ఆర్యభట్ట వంటి వారు హెడ్‌ ఆఫ్ ద డిపార్ట్‌మెంట్‌గా పని చేసిన) బోధనా భాష సంస్కృతం కాదు.

  5. మాధుర్యానికి మరో పేరు: ఏ. ఎం. రాజా గురించి Tadepalli అభిప్రాయం:

    12/14/2024 5:42 am

    A small faux pas. Music director in Telugu sri gaali penchala narasimharao surname is gaali and full name is penchala narasimharao and not గాలిపెంచల narasimharao.

  6. కృత్రిమ మేధ, ప్రజ్ఞానం, నోబెల్ బహుమానాలు గురించి రవిచంద్ర ఇనగంటి అభిప్రాయం:

    12/09/2024 9:32 am

    కంప్యూటర్ సైన్సు ఒక గొప్ప Inter-disciplinary ఫీల్డు. ఈ రోజుల్లో ఇబ్బడి ముబ్బడిగా కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ఒక్కటే చదువుకుని బయటకి వచ్చేస్తున్న వారే ఎక్కువ. ఏదైనా డొమైన్ లో సమస్యలు తీసుకుని ప్రోగ్రామింగ్ ఉపయోగించి దానిని సులభంగా ఎలా పరిష్కరిస్తామో తెలుసుకుంటే ఆవిష్కరణలు మరింత వేగవంతం అవుతాయి. రావుగారు చెప్పిన ఈ శాస్త్రవేత్తలు సరిగ్గా అదే చేశారు. వారిని స్ఫూర్తిగా తీసుకుని మరింత మంది శాస్త్రవేత్తలు తమ కొరకరాని కొయ్యల లాంటి సమస్యలకు కంప్యూటర్ పరిజ్ఞానంతో పరిష్కారాలు వెతుకుతారని ఆశిస్తున్నాను. మంచి వ్యాసం రాసిన రావుగారికి కృతజ్ఞతలు.

  7. డిసెంబర్ 2024 గురించి వెంకట రాజారావు . లక్కాకుల అభిప్రాయం:

    12/09/2024 3:09 am

    ‘ఈమాట’ కొక లేఖ
    —————–
    నే బంపిన ప్రతి రచనా
    పూబంతులు జేసి తిప్పి మొత్తుట జూడన్
    కాబోలు నన్ను కనుగొన
    బాబు లిటుల తలచి రనెడి భావన కల్గెన్.

    “రాజాగారూ ! తమకృతి
    తాజా ప్రచురణకు తగదు, తప్పదు మాకున్
    రాజీపడ లేని నియమ
    రాజి కలదు, మము క్షమించ ప్రార్థింతు, మిగో…

    మొదటిది బ్రహ్మర్షి పథము,
    తదుపరి పాశ్చాత్య రీతి తప్పని సరి, ఆ
    తదుపరి అస్మద్ జనులకు,
    ముదురులకును చోటు నిత్తుము, వరసిది యగున్.

    తమకీ యర్హత లేవీ?
    గమకించుచు రాసి పంప కార్యంబగునా?
    మము నుంకించకు, రచనలు
    రమణీయములయ్యు తమకు రాదిట, చనుమం-

    చనురాగ మొలుక పలికెద
    రని ‘ఈమాట’ కొక లేఖ రాస్తి, నిదైనన్
    పనివడి ప్రచురణ పొందున?
    ఘనముగ మీ చెత్తబుట్ట గతమై చనునా?

    -వెంకట రాజారావు లక్కాకుల

  8. భాగఫలము గురించి Shanthi Ishaan అభిప్రాయం:

    12/09/2024 12:12 am

    చాలా బావుంది. నోరు మెదపలేని మధ్యతరగతి వాడి బాధను కళ్ళకు కట్టారు. కథనం గొప్పగా ఉంది. చివరి వరకు చదివించింది.

  9. 1-1. సంయమనం ఈమాటకూనా? గురించి తమ్మినేని యదుకుల భూషణ్ . అభిప్రాయం:

    12/08/2024 9:30 am

    బ్రాహ్మణవాద భావజాల పత్రిక అన్న ఆరోపణ చెడ్డది. సంపాదకీయం నచ్చక పోతే ఎక్కడ నచ్చలేదో చెప్పవచ్చు. అంతేగాని సంపాదకులకు లేనిపోని ఉద్దేశాలు అంటగట్టడం తప్పు. నాకు ఈ మాట సంపాదకీయాలు పెద్దగా నచ్చవు. నచ్చక పోవడానికి కారణం శైలికి సంబంధించినది – నా దృష్టిలో సంపాదకీయాలు గురిపెట్టిన బాణంలా ఉండాలి. ఒక్క పదం, ఒక్క వాక్యం అటూ యిటూ ఐతే సొంత రచనలైనా నేను మెచ్చలేను. వాక్యానికి వాక్యానికి మధ్య ఉన్న అంతరం రచయిత ఊహాశక్తిని సూచిస్తుంది. ఊహాశక్తి కవికే కాదు, గద్య రచయితకు కావాలి. ఆ తరహా గీటురాళ్ళు నావి – వాటి మీద గోకి చూసి రంగు రాకపోతే రచనను గిరవాటు వేసే అలవాటు నాది.

    రచనలో అందరి ప్రమాణాలు ఒక రీతిలో ఉండవు. మనకు నచ్చని వన్నీ బ్రాహ్మణవాదమని, దళితవాదమని బ్రాండ్ వేసి చర్చను పక్కదారులు పట్టించరాదు. అసలు ఇక్కడ కుల,వర్గ, ప్రాంత ప్రస్తావనలు ఎందుకొస్తున్నాయో నాకు అర్థం కాని విషయం. చర్చలో మాధవ్‍గారు ప్రస్తావించిన రచయిత వేణుగోపాల్‍గారి వచన శైలి పరమ దరిద్రమని నా నిశ్చితాభిప్రాయం. దానికి గల కారణాలు శైలీ సంబంధం – ఆయన కులవర్గప్రాంత ప్రస్తావనలు మనకు అప్రస్తుతం. అలా ఆలోచించడమే ప్రజాస్వామ్య వైఖరికి గొడ్డలి పెట్టు. నాగరిక సమాజంలో మనకు ఏది నచ్చలేదో, ఎందుకు నచ్చలేదో స్పష్టంగా చెప్పగలగాలి. మనం రాసినవన్నీ అందరికీ నచ్చాలి అనుకోవడం, నచ్చకపోతే తూలనాడతాను అంటే అది ఒక రకమైన శఠత్వ ప్రకోపమే (Narcissistic Rage) గాని, మరొకటి గాదు. మన రాతలే కొంత కాలం పోయాక మనకు నచ్చకపోవచ్చు. రచనను బేరీజు వేసే విషయంలో స్వపరాలకు తావు లేదు. కావలిసిందల్లా నిద్రాణం కాని తార్కిక శక్తి , అనితరసాధ్యం కాని అభిరుచి- అవి ఉండవలసిన మోతాదులో ఉంటే గొడవే లేదు.

    మన ఆలోచనలు ఒక్క క్షణంలో పక్కదారి పడతాయి. రచయితకు నిరంతర సాధన కావాలి – మెరిసి పోయే ప్రతి ఊహను ఒక వాక్యంలో ఒడిసి పట్టలేము. సంపాదకుడు చక్కని రచనలతో సంచికను నింపాలని కోరుకోవడంలో తప్పు లేదు. చక్కని రచనలు ఎలా సంపాదించాలి అన్న విషయంలో చర్చకు ఆస్కారం ఉంది. ముందు నుంచి పీర్ రివ్యూ పద్ధతి మీద నాకు అభ్యంతరాలున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో, పత్రికా సంపాదకుడు వీలైనంతవరకు copy editingకు (వ్యాకరణ దోషాలు, అచ్చుతప్పులు సవరించడం గట్రా) పరిమితమైతే అపార్థాలకు తావు ఉండకపోవును. Content editingలో (విషయం అటుదిటు చేయమని చెప్పడం, అసంపూర్తిగా ఉన్న, అసంబద్ధంగా ఉన్నవి మార్చమనడం వగైరాలు) పత్రికా సంపాదకులు వేలు పెట్టకపోవడమే మేలు, కారణం అది జీతం భత్యం లేని సంపాదకుడికి శక్తికి మించిన పని. రచయితలను తప్పులు చేయనివ్వండి, సదసద్వివేచన గలిగిన పాఠకులు వాటిని ఎత్తి చూపుతారు. సంపాదకులు బరువు దించుకోవాలే గాని, లోడీలు (dumbbells) పట్టుకుని తిరగరాదు. సంపాదకులు తమ సమయాన్ని వెచ్చించవలసింది సత్తా ఉన్న రచయితలతో లేదా నిరంతరాధ్యయనంలో మునిగితేలే వ్యక్తులతో. అప్పుడు నాలుగు కొత్త విషయాలు/ ఊహలు తెలిసి వచ్చి అవి పత్రికలో చోటు చేసుకుని పత్రికా ప్రమాణాలు మరింత మెరుగు పడతాయి.

    ముందు నుండి నేను చెబుతున్నది – సంపాదకులకు కావలసినది ఆలోచనల పెను తుఫాను. (Brainstorming) నలుగురి ఆలోచనలు రాపాడనిదే అది సాధ్యం కాదు. ఆ మార్గంలో ఏమి చేయగలమో ఆలోచించాలి. గతంలో నేను ఒకసారి ప్రస్తావించినట్టు – Ploughshares పత్రిక వారి సంపాదకీయ పద్ధతులు పరిశీలించండి. వారి అతిథి సంపాదకుల పద్ధతి పీర్లు ఫకీర్ల పద్ధతి కన్నా మెరుగైనది అని నా అభిప్రాయం.

    “Guest editors are invited to solicit up to half of their issues, with the other half selected from manuscripts submitted to the journal and screened for them by staff editors. This guest-editor policy, which we have used since our founding in 1971, is designed to introduce readers to different literary circles and tastes, and to offer a fuller representation of the range and diversity of contemporary letters than would be possible with a single editorship.”

    ఇంకొకటి, సంవత్సరం పొడవునా రచనలు పరిశీలించడం – అమెరికా పత్రికా రంగంతో ఏమాత్రం పరిచయం ఉన్నా అది ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇక్కడ సాహిత్య పత్రికల్లో సంపాదకులు సాధారణంగా జూన్ -డిసెంబర్ మధ్యకాలంలో వచ్చిన రచనలు మాత్రమే చదువుతారు. ఆ పద్ధతి రచయితలూ, సంపాదకులూ ఉభయులకూ మంచిది.

    ఇంకొక విషయం, ఈమాట లాంటి పత్రికలు అమెరికా పత్రికా రంగంలోని మంచిని గ్రహించడంతో ఇప్పటికీ వెనుకబడి ఉన్నాయి. ముఖ్యంగా పత్రికా నిర్వహణలో ఇక్కడ సాహిత్య పత్రికలు నడిచే తీరును అధ్యయనం చేయాలి. ఇక్కడి వదాన్యులు విశ్వవిద్యాలయాల వెంటపడి తెలుగును అధ్యాపన విషయంగా చేయడం మంచి పనే- దానికి ముందు తెలుగు సాహిత్యభాషగా నిలబడాలి కదా, అంటే వారు పెద్ద మనసు చేసుకొని పత్రికా రంగం కోసం ఒక ఫండ్ లాంటిది ఏర్పాటు చేయాలి. రచయితలకు, సంపాదకులకు, సమీక్షకులకు, నిర్వాహకులకు – ఎంత చిన్నదయినా పారితోషికం ఇచ్చి తీరాలి, ‘భారతి ఇచ్చే పారితోషికంతో నా ఖర్చులు వెళ్ళి పోయేవి’ అని ఒకసారి నార్ల గారు అన్నారు- భారతి పాత సంచికలు తిరగేసి చూస్తుంటే రచనల నాణ్యత తెలిసిపోతుంది. దాని వెనుక ఉన్న రహస్యం రచయితలు సంపాదకుల మధ్య ఉన్న సగౌరవ సంబంధం. ‘ఒంటి కాయ శొంఠి కొమ్ము’ ధోరణులు ఏనాటికి సంపాదకుల వంటికి సరిపడవు. వారికి మంచి network ఉండవలసిందే. ఒంటి స్తంభం మేడలు దీర్ఘకాలం నిలవడం కష్టం.

    పోతే, ఇక మన సాహిత్యంలో పేరుకు పోయిన చెత్త ఈ నాటిది కాదు, Isuzu వారి పెద్ద ట్రక్కులతో ఒక దశాబ్దం తోలినా అధికభాగం మిగిలే ఉంటుంది. సాహిత్య పత్రికను ఉన్నత ప్రమాణాలతో ఇంత కాలం నడపటం గొప్ప విషయం. తొలినాళ్ళలో ఈమాట పల్లకీ మోసిన బోయీల్లో ఒకడిగా మీరు చేస్తున్న కృషిని అభినందిస్తూ – మిత్రధర్మంగా ఏవో నాలుగు సూచనలిచ్చాను. సెలవు.

  10. యూలియా నవాల్‍న్యా గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:

    12/06/2024 11:43 am

    >> నీ నీలి కన్నుల దైన్యాన్ని

    ఈ ప్రయోగం ఎలా స్ఫురించిందో, ఏ వార్త చూసాక రాసారో రచయిత అనేది అనుమానమే. మొదట్నుండీ కూడా నవాల్నీలు (అలెక్సీ, యూలియా, వారి పెద్దలు, పిన్నలూ) భయం కానీ దైన్యం కానీ చూపించినట్టు ఎక్కడా చదవలేదు. మొదట్లో ఆయన మీద విషప్రయోగం జరిగినపుడు జర్మనీలో కళ్ళు తెరిచాక ఆయన అన్న మొదటిమాట – నేను రష్యా ఎప్పుడు వెళ్ళిపోవచ్చు? పూర్తిగా కోలుకున్నాక కూడా ఏనాడూ ఎవరికీ భయపడలేదు. వాళ్ళావిడ కూడా ఆయన రష్యా వెళ్తాను అంటే “తప్పకుండా వెళ్దాం,” అనే చెప్పారు కానీ ఎక్కడా భయపడలేదు. ఆవిడ కళ్ళలో కానీ ఇక్కడ ఇచ్చిన అలెక్సీ నవాల్నీ ఫోటోలో కళ్ళలో కానీ ఎక్కడా భయం దైన్యం అనేవి నాకు కనబడలేదు. వార్తల ప్రకారం ఆయన ఏనాడూ చావు గురించి భయపడనూ లేదు. సైబీరియా జైల్లో పెట్టినప్పుడు కూడా ఛాతీ విరుచుకుని ధైర్యంగా వెళ్ళాడు. అక్కడ చనిపోతాననే భయం ఏనాడూ చూపించలేదు, ఎవరితోనూ చెప్పినట్టూ లేదు. ఇదంతా నేను వార్తలలో చదివినది. ఆయన జైల్లో చనిపోయాక కూడా వాళ్ళావిడా, తల్లీ తండ్రీ కూడా ఎక్కడా భయపడ్డట్టు కానీ దైన్యం చూపించినట్టూ వార్తలలో రావడం నేను చూడలేదు. ఈ పుస్తకం ప్రస్తుతం నేను చదువుతున్నాను.

    “ఈ నీలి కన్నుల దైన్యం” అనేది ప్రతీ నాలుగు లైన్లకోమారు చొప్పించడం యదుకుల భూషణ్‍గారు వెనక ఒకసారి వెక్కిరించినట్టూ దండుగ గణం లేదా దండుగ ప్రయోగం అనుకోవాలి తప్ప నవాల్నీగారికి, వారి కుటుంబంలో ఎవరికీ నప్పదు. ఏం చూసి, తెలుసుకుని ఇలా రాసారో యదుకుల భూషణ్‍గారికే తెలియాలి.