పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16473

  1. తెలుగులో గ్రంథ పరిష్కరణ గురించి కొన్ని ఆలోచనలు గురించి బొల్లోజు బాబా అభిప్రాయం:

    09/04/2014 3:44 pm

    శ్రీనివాస్ గారికి, వెల్చేరు వారికి

    చాలా గొప్ప వ్యాసం అందించారు. ఇలాగా ఆలోచించాలా అని ఆలోచింపచేసేలా ఉంది మీ వ్యాసం.

    ఆంధ్రదేశం ఇంతటి బృహత్తరమైన ఆత్మపరిశీలనకు, పునర్విచారణకు సిద్దంగా లేదేమోనన్న అనుమానం నాకు బలంగానే ఉంది. పోనీ కొత్తనీరన్నా ఆ దిశగా ఉందా అంటే… మొన్నో ఎమ్మె లిటరేచర్ విద్యార్ధిని షేక్స్ పియర్ నవలారచయిత, మంచి కొటేషన్స్ అవీ రాస్తాడు అని చెప్పింది. డిగ్రీ క్లాసు విద్యార్ధులను మీకు నచ్చిన కవుల పేర్లు చెప్పమంటే యండమూరి, పట్టాభిరాం ల పేర్లు చెప్పి షాకిచ్చారు. బహుశా అన్నిచోట్లా పరిస్థితి అలాగే ఉందని నా భావన. సమాచార మాద్యమ ఉదృతిలో ప్రస్తుత సమాజం ఒక రకమైన ఉక్కిరిబిక్కిరిలో ఉంది.

    మీ వ్యాసం మీ అభిరుచిని, నిబద్దతను తెలియచేస్తుంది. స్వీకరించే అర్హత మాకు ఉన్నా లేకపోయినా, మీరు ఇలాగే వ్రాయాలి. ఇటువంటి వ్యాసాలు భవిష్యత్తు పరిశోధకులకు మార్గదర్శనం చేస్తాయి. అందులొ సందేహం లేదు.

    ధన్యవాదాలు.
    భవదీయుడు
    బొల్లోజు బాబా

    పి.ఎస్. మీరిద్దరూ బ్రౌన్ పై అధారిటీ అని తెలుసు. బ్రౌన్ గురించి నాకన్న వందల రెట్లు ఎక్కువ చదివుంటారనీ తెలుసు. కానీ ఈ వ్యాసంలో బ్రౌన్ పై విసుర్లు ఆశ్వాదించలేకపోతున్నాను. (నేను బ్రౌన్ భక్తుడనని చెప్పుకోవటానికి సంకోచించను :-))

  2. మనిషికెంత భూమి? గురించి Ayyavaru Sivalenka అభిప్రాయం:

    09/04/2014 9:10 am

    మంచి కధ. అనువాదం చాల బాగుంది. తెలిసిన ముగింపే అయిన కధనం చాల నచ్చింది.

    మరిన్ని మంచి అనువాదాలతో వస్తారని ఆశిస్తూ

    అయ్యవారు శివలెంక

  3. తెలుగులో గ్రంథ పరిష్కరణ గురించి కొన్ని ఆలోచనలు గురించి Pavan Santhosh.S అభిప్రాయం:

    09/03/2014 10:28 am

    ఆ మధ్య పరుచూరి శ్రీనివాస్ గారు తెలుగు ముద్రణ సంస్థల, ముద్రణ శాలల చరిత్ర పరిశోధిస్తున్నారని విన్నాను. ఇదేంటి ప్రచురణ సంస్థల గురించి కాక ముద్రణ సంస్థల గురించి పరిశోధన అనుకున్నాను. ఇప్పుడు ఆ ప్రయత్నం వెనుక ఉన్న పరమార్థం తెలిసింది. చాలా మంచి వ్యాసం రాశారు. గతంలో బ్రౌన్ గురించి రాసిన వ్యాసానికి కొనసాగింపుగా భావించవచ్చనుకుంటాను.

  4. శ్రీశ్రీ కవితకు బాపూ బొమ్మ గురించి shekhar అభిప్రాయం:

    09/03/2014 6:21 am

    మీ రుణం తీర్చలేనిది.

  5. భక్తకవి బొప్పన గంగనామాత్యుని శ్రీ మహాభాగవత పంచమ స్కంధం గురించి భాగవత గణనాధ్యాయి అభిప్రాయం:

    09/02/2014 11:33 pm

    పూజ్యులు ఆచార్యవరేణ్యులు శ్రీ మురళీధర రావు గారికి, ఈమాట వారికి ధన్యవాద సమేత నమస్కారాలు. గంగనామాత్యుని పంచమ స్కంధ విశ్లేషణ బహు విశిష్టంగా, మనోవికాసంగా, విజ్ఞానదాయకంగా అందించిన తీరు బహుధా ప్రశంసనీయము.

  6. ఉండు గురించి V. R. Veluri అభిప్రాయం:

    09/01/2014 11:54 pm

    కనకప్రసాద్ గారూ:

    చక్కని పాట! మిలరెప రాసిన పాట కూడా ఇచ్చి ఉంటే బాగుండేది. మీకు తెలిసే ఉంటుంది. మిలరెప లక్ష పాటలు రాశాడు. ఉదాహరణకి ఇదిగో ఇదొకటి! నేను దీన్ని ఎక్కడో వాడుకున్నాను.

    Devoid of form and color,
    Excelling the sense of realms,
    Is this wondrous mind
    Out-reaching words and phrases.

    From: Hundred Thousand Songs of Milarepa (2 Volumes), Translated by Garna C.C. Chang, University Books, New Hyde park (1962).

    వీలు చూసుకొని మిలరెప రాసిన మరికొన్ని పాటలు అనువదించండి.

  7. ఎడబాటు గురించి రాధ మండువ అభిప్రాయం:

    09/01/2014 12:40 pm

    నాన్నని గుర్తుకు తెచ్చారు. కవిత చాలా బావుంది. అభినందనలు

  8. బాపూ గురించి Siddineni Bhavanarayana అభిప్రాయం:

    09/01/2014 12:23 pm

    వేలూరి వేంకటేశ్వర రావు గారూ,

    సృజనాత్మకంగా ఊహించడం లోనూ,ఊహని కళాత్మకంగా ఆవిష్కరించడం లోనూ ఆయన ఈ యుగానికి ఒక్కడే. తెలుగు అక్షరానికి ఒయ్యారం, తూపూ, సొగసూ ఒనగూర్చడం లోనూ అంతే. ఎంతొ ప్రత్యేకమైన ఆయన set of tastes ని తెలుగు సినీమా కూడా corrupt చెయ్యలేక పోయింది. ఈ జాతి నష్థం తీరేది కాదు.

  9. ఎడబాటు గురించి రవి వీరెల్లి అభిప్రాయం:

    09/01/2014 9:57 am

    simply superb! Awesome expressions!

  10. నిప్పులు గురించి రవి వీరెల్లి అభిప్రాయం:

    09/01/2014 9:53 am

    మానస గారు,
    కవిత చాలా బాగుంది. శ్రద్దగా పెయింటింగ్ వేసినట్టు ఉంది.

    “ఎత్తుపళ్ళు దాచలేని నవ్వుల్తో
    ఏవో ఆశల్ని పరుస్తాడతను.”

    “కంటి చికిలింపుల్లో కథలు దాచుకుంటాయి” భలే!